Топ-100
Back

ⓘ సంస్కృతి - గ్రామ దేవత, గ్రామదేవతలు-శిష్ఠదేవతలు-తులనాత్మక విశ్లేషణ-సాంస్కృతిక పరిశీలన, ఢిల్లీ తెలుగు అకాడమీ, నాల్గవ గుండయ, నిజాం పాలనలో విద్య-విజ్ఞానం-సంస్కృతి ..
                                               

గ్రామ దేవత

ఇదే పేరుతో 1968లో వచ్చిన సినిమా గురించి గ్రామదేవతలు సినిమా చూడండి. గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుండే దేవత - గ్రామదేవత గ్రామదేవతల పూజావిధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సంప్రదాయం. మానవుడు నిత్య జీవితంలో యెన్నో జయాపజయాల్ని చవి చూస్తున్నాడు. మరో వైపు తన లక్ష్య సాధనకోసం యెన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్ఠికి మూల కారకురాలు మాతృదేవత అని గ్రహించిన పురాతన మానవుడు, ఆమెను సంతృప్తి పరచేటందుకు యెన్నో మార్గాలను ఆశ్రయించాడు. అందులో ప్రార్థన, మ ...

                                               

గ్రామదేవతలు-శిష్ఠదేవతలు-తులనాత్మక విశ్లేషణ-సాంస్కృతిక పరిశీలన

మాతృస్వామిక వ్యవస్ధకు చెందిన గ్రామ దేవతలు దళిత దేవతలు. బహుజన సంస్కృతి పరిరక్షకులు. సమాజంలోని బడుగు కులాల వారు కూడా అగ్రకులాలతోపాటు సమానంగా సామాన్య, సాంస్కృతిక ఆచార వ్యవహారాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవటం ఈ గ్రామదేవతల జాతర ల వల్ల సాధ్యమయ్యింది. ప్రాచీనకాలంలో పురాతన మానవునిచే పూజింపబడ్డ దుష్ట గ్రామ దేవతలు కూడా కాలక్రమేణ శిష్ఠ దేవతల్లో కలిసి పోవడం జరిగింది. అయితే పూజా విధానంలో, గుళ్ళ నిర్మాణంలో గ్రామ దేవతలకు, శిష్ఠ దేవతలకు తేడాలు స్పష్ఠంగా కనిపిస్తున్నాయి. నిశితంగా పరిశీలిస్తే గ్రామ దేవతల పూజా విధానంలో కొన్ని శిష్ఠ దేవతల పూజా విధానాలు సమ్మిళితమై పోయాయని చెప్పక తప్పదు. అదే విధంగా శిష్ఠ దేవతల పూజా ...

                                               

ఢిల్లీ తెలుగు అకాడమీ

1990 లో స్థాపించబడిన ఢిల్లీ తెలుగు అకాడమీ తెలుగు భాషా సంరక్షణ, తెలుగు సంస్కృతి వ్యాప్తికి కృషి చేసే ఒక జాతీయ సాంస్కృతిక సంస్థ. ఢిల్లీ, ఆ చుట్టుప్రక్కల నగరాలలో నిత్యం పెరుగుతున్న తెలుగు ప్రజలకి ఈ సంస్థ వినోద కార్యక్రమాలను అంద జేస్తుంది. తెలుగు భాషను, విభిన్నమైన తెలుగు సంస్కృతిని, తెలుగు ప్రజల గుర్తింపును ఈ సంస్థ వృద్ధి చేస్తుంది. దేశ రాజధానికి, రాష్ట్ర రాజధానికి సాంస్కృతిక వారధి లా పనిచేయటానికి హైదరాబాదు లో కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ముఖ్యమైన పండుగలను జరుపుతుంది. సంగీత/నృత్య/రంగస్థల రంగాలలో గుర్తించిన ప్రాంతీయ ప్రతిభను వెలికితీయటంతో బాటు ఇతర ప్రదేశాల నుండి అనుభవము కలవారిని పిలిపిస్తుంది. ...

                                               

నాల్గవ గుండయ

బేతియ కుమారుడు కాకర్త్య గుండ్యన కాలానికి వేంగిలో కలహాలు ఆరంభమయ్యాయి. చాళుక్య దానార్ణవుడు రాష్ట్రకూటుల తోడ్పాటుతో తమ్ముడు రెండో అమ్మరాజును తొలగించి వేంగిని స్వాధీనం చేసుకున్నాడు. దానార్ణవునికి తోడ్పడిన గుండ్యన నతవాడి నేటి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాంతం కి పాలకుడయ్యాడు. 973 లో జరిగిన అలజడుల్లో రాష్ట్రకూటవంశం అంతరించింది. అయితే పశ్చిమ చాళుక్యసేనాని విరియాల ఎఱన సాయంతో ముదిగొండ చాళుక్య బొట్టు బేతడు గుండ్యనను చంపి 900 ప్రాంతాలలో రాజ్యం ఆక్రమించుకున్నాడు;. ఇదేఅవకాశంగా గుండ్యన కుఱవాడిని కైవసం చేసుకున్నాడు. రెండో తైలపుడు చాళుక్య వంశాన్ని తిరిగి ప్రతిష్ఠించాడు. వేంగిలో జటాచోడభీముడుదానార్ణవుని చం ...

                                               

నిజాం పాలనలో విద్య-విజ్ఞానం-సంస్కృతి

హైదరాబాద్ లోని పాఠశాలలను, కళాశాలలను హైదరాబాద్ ప్రభుత్వమే నడిపించేది. విద్యావ్యవస్థపై ప్రభుత్వ గుత్తాధికారం ఉండడమేకాకుండా, ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యాభివృద్ధి చాలా తక్కువగా ఉండేది. ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వ అనుమతి లభించకపోవడంతో చాలా తక్కువగా ప్రైవేట్ విద్యాసంస్థలు నడుపబడుతుండేవి. అంతకుముందున్న పాఠశాలల్లో చినబాలశిక్ష, పెద్ద బాలశిక్ష, ఉత్తరాలు చదువు నేర్పే పాతకాలపు ప్రాథమిక శిక్షణ చాలాభాగం నడిచింది. శతకాల్లోని భాగవతంలోని పద్యాలను నేర్పటం ఈ శిక్షణలో భాగంగా ఉంటుంది. బడి పుస్తకాలు ఉన్నప్పటికీ సామాన్యులు కోరే ఈ శిక్షణను ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయలు కాదనలేకపోయారు. ప్రారంభంలో ఉర్దూలో విద్య ...

                                               

ప్రపంచ సాంస్కృతిక మండలాలు

ఏదైనా ఒక సమాజంలోని ప్రజల జీవనశైలిని ఆ సమాజం యొక్క సంస్కృతిగా అభివర్ణించవచ్చు. సంస్కృతి పరంగా ఒకే విధమైన సజాతీయ లక్షణాలు గల భూప్రాంతాలన్నిటిని కలిపి ఒక సాంస్కృతిక మండలం అని వ్యవహరిస్తారు. అంటే ఒక సాంస్కృతిక మండలం, దాదాపుగా ఒక విలక్షణమైన సంస్కృతిని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. సాంస్కృతిక మండలం అనేది సాంస్కృతిక మానవ శాస్త్రంలో ఒక భావన. ఏదైనా ఒక కాలక్రమంలో పర్యావరణం పరంగాను, సంస్కృతి పరంగాను ఏకరూపకత కలిగివున్న భౌగోళిక ప్రాంతాన్ని సాంస్కృతిక మండలం గా పేర్కొనవచ్చు. సాంస్కృతిక అంశాల సజాతీయత ఆధారంగా గా ప్రపంచంలో వివిధ సాంస్కృతిక మండలాలను గుర్తించడానికి టానీబీ Toynbee, బ్రోక్ వెబ్ Brock Webb, డి-బ్ ...

                                               

భాగల్పురి పట్టు

భాగల్పురి పట్టు లేదా టస్సర్ పట్టు ఒక అద్దకం శైలితో నేసిన చీరలు, ఇతర దుస్తులు భారతదేశం లో బీహార్ రాష్ట్రములోని భాగల్పూర్ నుండి తయారు అవుతాయి. చీరలు తయారు చేయడానికి ఉపయోగించే భాగల్పూర్ పట్టు ముడిపదార్థాన్ని భాగల్పురి సారి అని అంటారు. ప్రకృతి యొక్క సారాన్ని నుండి లభించిన ఉత్తమమైన సిల్క్ యొక్క ఆకృతిని బయటకు కనిపించడం వలన పట్టు ను అన్ని బట్టలు రాణి గా పిలుస్తారు. భాగల్పూర్ పట్టు సిల్క్ బాగా దానికదే ఏకైక ప్రసిద్ధి చెందింది, అద్భుతమైన ఒత్తిడిలను ఎదుర్కునే సామర్థ్యాన్ని, ఉన్నతమైన నాణ్యతను కలిగినది. స్వభావసిద్ధ భావన కళాత్మకత దాని స్వచ్ఛమైన, దోషరహిత రూపంలో భాగల్పూర్ అసలు సారము చూపుతాయి. ఇవి భారతీయ స ...

                                               

రవి పరస

రవి పరస ప్రముఖ నఖచిత్ర కళాకారుడు. ఈయన గోటితో చిత్రాలు గీయడంలో దిట్ట. ఎన్నో వేల చిత్రాలు అవలీలగా ఈయన గోటితో గీసారు. ఇంకా గీస్తున్నారు. ఒక్క వినాయకుడి మీదే 999చిత్రాలు గీసి చరిత్ర సృష్టించారు. అంతేకాదు,1.503 గణపతులను గోటితో గీసిన నఖ చిత్రకారునిగా రికార్డు కెక్కారు. చేతిరాత నిపుణుడిగా, వ్యక్తిత్వ వికాశ నిపుణుడిగా,పలు విషయాలపై అవగాహన కల్పించే కౌన్సిలర్ గా రాణిస్తున్నారు. ఎన్నో అవార్డులు,రివార్డులు, బిరుదులు,సత్కారాలు అందుకున్నారు.

                                               

రాక్షస గూళ్లు

కొత్త రాతియుగంలో మనిషి గుంపులు గుంపులుగా సంచారం జీవనం సాగించేవాడట. ఆ ఆదిమ తెగలు తమలో ఎవరైన చనిపోతే తమకు పునర్జన్మ ఉంటుందని భావించి చనిపోయిన శవాన్ని పెద్ద మట్టి కుంట తయారు చేసి అందులో పెట్టి ఆకులు, నారలతో చుట్టి దాన్ని భూమిలో పాతి పెట్టేవారు. ఆ తరువాత ఆ శవాన్ని ఏదీ పీక్క తినకుండా పెద్ద పెద్ద రాళ్లను చుట్టూ పెట్టేవారట. వీటిని పురావస్తు శాస్త్రవేత్తలు పాండవ గుళ్లు లేదా రాక్షస గూళ్ళు గా వ్యవహరిస్తారు. రాక్షస గూళ్లు బయల్పడటం, ఆయా ప్రాంతంలో పురాతన మానవ ఆవాసానికి ఆనవాళ్ళు. చనిపోయినవారిని సమాధి చేసి పెద్దపెద్ద ప్రాకారాలు నిర్మించేవారు. ఆ సమాధుల్ని రాక్షస గుళ్లు అంటారు. ఈ భారీ అంత్యక్రియకు సంబంధించ ...

                                               

సేలం పట్టు

సేలం సిల్క్ యొక్క మరొక పేరు సేలం వెంపట్టు లేదా వెన్ పాట్టు అని కూడా పిలుస్తారు. దీనినే తెలుగులో సేలం పట్టు అని అంటారు. ఇది తమిళనాడు లోని సేలం నందు తయారు చేసిన సిల్క్ దుస్తులకు ప్రతీక. ఇది మేధో సంపత్తి హక్కుల రక్షణ లేదా జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనగా భౌగోళిక గుర్తింపు సంకేతం హోదాను పొందింది.