Топ-100
Back

ⓘ సంస్కృతి - ఇజ్రాయిల్ సంస్కృతి, బంజారాల చరిత్ర సంస్కృతి, భారతదేశ జాతీయ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి, ప్రభల సంస్కృతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము ..
                                               

ఇజ్రాయిల్ సంస్కృతి

ఇజ్రాయిల్ దేశపు సంస్కృతి వైవిధ్యభరితమైన, క్రియాశీలకమైన సంస్కృతి. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో పాటు, తూర్పు జాతి, మతపరమైన సంప్రదాయాల సంశ్లేషణగా ఇజ్రాయిల్ సంస్కృతిని పరిగణించవచ్చు. ఇజ్రాయిల్ దేశానికి స్వాతంత్ర్యం 1948లో వచ్చినా, ఇజ్రాయిల్ సంస్కృతి వేళ్ళూనింది చాలా కాలం క్రితమే. ప్రవాసీ యూదులు, 19వ శతాబ్ది మొదట్లో ఆవిర్భవించిన జియోనిస్ట్ ఉద్యమం, అరబ్ ఇజ్రాయిలీల అలాగే ఇతర మైనారిటీ జనాభాల చరిత్ర, సంప్రదాయాలు ఇప్పటి ఇజ్రాయిల్ సంస్కృతిలో ప్రతిబింబిస్తాయి. టెల్ అవీవ్, జెరూసలెంలను ఇజ్రాయెల్ యొక్క ప్రధాన సాంస్కృతిక కేంద్రాలుగా భావిస్తారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక టెల్ అవీవ్‌ని "capital of Mediterran ...

                                               

బంజారాల చరిత్ర సంస్కృతి

లింగాల లంబాడీ ప్రజలతో పాటు తెలంగాణాలోని సంస్కృతి సంప్రదాయాలు బంజారాలు, సుగాలీలు, లంబాడాలు, ఇలా అనేక రకాలుగా పిలువ బడే వీరు రాజస్థాన్ కు చెందిన రాజ వంశీయులు. వెయ్యేండ్ల క్రితం మహమ్మదీయుల అరాచకాలకు బలై దేశంలో నలు దిక్కులకు పోయి సంచార జీవులుగా జీవనం సాగిస్తున్నారు. లంబాడీల సంస్కృతి సంప్రదాయాలు తలపై ముసుగు టుక్రీ లంబాడీ భాషలో, ముక్కు పుడకకు నాకెమా భురియా, చెవిలో కమ్మలుకానెమా కమ్మల్ ఘాగ్రోఫేటీయా లంగ, రవిక కాళీ కాళ్ళకు పట్టీలతో పాటు బట్టతో కూడీనది టాంగేమా కస్సే& టాంగేమా వాంక్డీ, మాతెమా చోట్లా తలవెంట్రుకలకు రెండు జడలకు క్రిందికి వేలాడే విధంగా అలంకరణ వుంటు౦ది. వీటీతో పాటు ఇంకా కొన్ని అలంకరించుకుంట ...

                                               

భారతదేశ జాతీయ సంస్కృతి

భారతదేశ జాతీయ సంస్కృతి ఆచార్య వి. రామకృష్ణ రచించిన అనువాద తెలుగు రచన. దీనికి మూలం డాక్టర్ ఎస్. ఆబిద్ హుస్సేన్ యొక్క రచన. మూలరచన ఉర్దూలో 1946లో మూడు సంపుటాలుగా రచించబడినది. రెండవ ముద్రణకు మూడింటిని కుదించి ఒకే సంపుటంగా విడుదలచేయబడింది. మూడవ ముద్రణ నేషనల్ బుక్ ట్రస్టు, ఢిల్లీ వారు సమాచారానికి మరికొన్ని జాతీయభావాలను జోడించడం జరిగింది. దీనికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ముందుమాటను రచించారు.

                                               

తెలంగాణ సంస్కృతి

తెలంగాణ సుమారు 5.000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్రను కలిగివుంది. ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజవంశానికి చెందిన హిందూ రాజులచే, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ రాజవంశాలకు చెందిన ముస్లిం పాలకులు పాలించారు. భారత ఉపఖండంలో మొట్టమొదటి సంస్కృతి కేంద్రంగా ఈ ప్రాంతం ఆవిర్భవించింది. కళలు, సంస్కృతిలపై ఆసక్తి కలిగిన పాలకులు, ఇతరులు తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక బహుళ సాంస్కృతిక ప్రాంతంగా మార్చారు. ఇక్కడ రెండు వేర్వేరు సంస్కృతులు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో "కాకతీయ పండుగ" తోపాటుగా బోనాలు, బతుకమ్మ, దసరా, ఉగాది, సంక్రాంతి, మీలాద్-ఉన్-నబి, రంజాన్ వంటి మతపరమైన పండుగలు, డెక్కన్ ఫెస్టివల్ వంటి ఇతర వేడుకలను కూడ ...

                                               

ప్రభల సంస్కృతి

ప్రభల సంస్కృతి గుంటూరు జిల్లా, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో కనిపించే ఒక గొప్పసంస్కృతీ. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహా శివరాత్రి నాడు గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ, క్వారీ బాలకోటేశ్వరస్వామి, సత్రశాల ప్రాంతాలలో ఈ ప్రభల సంస్కృతి కనిపిస్తుంది.

                                               

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఇది డిసెంబరు 2 1985 సంవత్సరంలో ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా హైదరాబాదులో స్థాపించబడింది. తరువాత 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడింది. ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాలలో తెలుగు భాష అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది. ఈ ధ్యేయం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న సాహిత్య, సంగీత, నాటక, నృత్య, లలిత కళా అకాడమీలను, అంతర్జాతీయ తెలుగు సంస్థ, తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది. ఈ విధంగా తెలుగు విశ్వ ...

                                               

అలయ్ బలయ్

తెలంగాణలో పర్వ దినాల సందర్భంగా బంధు మిత్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసే కార్యక్రమం అలయ్ బలయ్.ముఖ్యంగా దసరా సందర్భంగా నిర్వహిస్తారు పండుగనాడు సాధారణంగా అందరూ ఇంట్లో ఉంటారు. తర్వాత రోజు బంధుమిత్రులను కలుసుకున్న సందర్భంగా పరస్పర ఆత్మీయాభిమానాలు చాటుకుంటూ కౌగిలించుకోవడం ద్వారా అలయ్ బలయ్ చెప్పుకుంటారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని అద్దం పట్టేలా ఈ ఉత్సవం జరుగుతుంది తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక పేరుతో 29.9.2009 న అలయ్ బలయ్‌ అంటే స్నేహసమ్మేళనం బి.జె.పి.నేత బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేశారు.ఈ సందడిలో ఏర్పాటు చేసిన వివిధ కళారూపాలను చూసి ముగ్ధుడైన అప్పటి గవర్నర్ ఎన్‌డీ తివారీ పాటలు పాడారు. ...

                                               

కోవై కోరా కాటన్

కోవై కోరా కాటన్ భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రము లోని కోవై కోరా పత్తితో చేసిన ఒక కాటన్ చీరకు ప్రసిద్ధిగా ఉంది. ఇది 2007-08 సంత్సరములో జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనగా భౌగోళిక గుర్తింపు సంకేతం హోదాను పొందింది.

                                               

గంగరాజు డెయిరీ

గోదావరి తీరం ఆతిధ్యానికి పెట్టింది పేరు. పాడిపంటలకు కొదవలేదు. అటువంటి గోదావరి తీరాన రాజమండ్రి లో ఆతిధ్యం తో కూడిన పాల కేంద్రం అరవై ఏళ్లకు ఫైగా సేవలందిస్తూ, పాల ఉత్పత్తుల కేంద్రంగా వర్ధిల్లుతోంది.

                                               

గోదావరి నిత్య హారతి

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్నగోదావరి నదిని ఆరాధించే కార్యక్రమమే గోదావరి నిత్య హారతి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వపు దేవాదాయ ధర్మాదాయ శాఖ, బుద్ధవరపు చారిటబుల్ ట్రస్టులు సంయుల్క్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. తొలుత ప్రతి పున్నమికీ హారతి ఇవ్వడంతో ట్రస్టు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం, ఆ తర్వాత గోదావరి పుష్కరాల సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ భాగస్వామ్యంతో నిత్య హారతిగా మారింది.