Топ-100
Back

ⓘ విషయాలు - బ్రహ్మవైవర్త పురాణము, ఔరవ మహర్షి, అథర్వణ వేదం, ఆర్యభట్ట II, యాజ్ఞవల్క్య మహర్షి, పింగళి దశరధరామ్ ..




                                               

బ్రహ్మవైవర్త పురాణము

బ్రహ్మవైవర్త పురాణము లో 18 వేల శ్లోకాలు ఉన్నాయి అని మత్స్య పురాణములోను, నారద పురాణము లోను చెప్పబడింది. కాని ఇప్పుడు 12 వేల పై చిలుకు శ్లోకాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇది ముఖ్యముగా పరబ్రహ్మ వ్యాప్తము గురించి చెప్పుచున్నది గనుక దీనిని బ్రహ్మవైవర్త పురాణము అన్నారు. ఈ పురాణము నాలుగు భాగాలుగా విభజింపబడింది. శ్రీకృష్ణ ఖండము - పరబ్రహ్మమే కృష్ణునిగా అవతరించి చేసిన చర్యలు ప్రకృతి ఖండము - ఆదిశక్తి గురించి, ఆమె అంశన ప్రభవించిన దేవతల గురించి బ్రహ్మ ఖండము - బ్రహ్మాండోత్పత్తి గిరించి, సృష్టి గురించి గణేశ ఖండము - గణపతి జననవృత్తాంతము, జమదగ్ని పరశురాముల వృత్తాంతము ఈ పురాణములో శ్రీకృష్ణుడే పరాత్పరుడుగా వ్య ...

                                               

ఔరవ మహర్షి

భృగువు కుమారుడు చ్యవనుడు. చ్చవనుని పుత్రుడు అప్రవానుడు.అప్రవానునకు బుచి యగు భార్య వలన ఔర్వ మహర్షి జన్మించాడు. బుచి యూరువు మరుగున పుట్టిన బిడ్డడగుటచే అతడు ఔర్వువయాడు. ఔర్వుడు బాల్యము నుండియు తపస్సులో మునిగి యుండెడివాడు. అతని తపశ్శక్తి అనలముగా మారినది. ఆ అగ్ని వలన ఉపద్రవము కలుగునని అతని పితృదేవతలు ఔర్వుని చేరి కుమారా?నీ తపోశ్శక్తిచే జనించిన అగ్నిని సముద్రమున విడిచిపెట్టు.అది సముద్రమును దహించును.లేకున్న ఉపద్రవములు కలుగును అని పలకగా ఔర్వుడు దానిని సముద్రమున విడిచిపెట్టాడు. అది ఔర్వానలమై గుర్రం ముఖంతో సముద్ర జలమును త్రాగనారంభించెను. అదే బడబానలం. అనంతరం ఔర్వుడు బ్రహ్మచర్యవ్రత పరిపాలనము చేయసాగాడు ...

                                               

అథర్వణ వేదం

అధర్వణ వేదం హిందూ మతంలో పవిత్ర గ్రంథాలైన చతుర్వేదాలలో నాలుగవది. అధర్వణ ఋషి పేరు మీదుగా దీనికాపేరు వచ్చింది. సాంప్రదాయం ప్రకారం ఇది రెండు వర్గాల ఋషులచే సంకలనం చేయబడింది. ఒకటి అధర్వణులు, రెండు అంగీరసులు. అందుకనే దీని ప్రాచీన నామం అధర్వాంగీరస వేదం. ఋగ్వేదంలానే ఇది కూడా స్తోత్రాల చే కూర్చబడింది కానీ ఇందులో కొన్ని మంత్ర విద్యకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ఇందులో ఆత్మలు, ప్రేతాత్మలు, మొదలైన వాటిని గురించి వివరించబడి ఉంటాయి కాబట్టి అధర్వణ వేదాన్ని చాలామంది గుప్త విజ్ఞానంగా భావిస్తారు. ఇందులో వేదకాలంలో సామాన్య మానవులు ఎలా ఉండేవారన్న విషయాలు కూడా ఉటంకించబడ్డాయి. వైద్యశాస్త్రాన్ని గురించిన మొట్ ...

                                               

ఆర్యభట్ట II

ఆర్యభట్ట II భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రవేత్త, మహా సిద్ధాంతం రచయిత. ఇతని కంటే పూర్వుడు, మరింత ప్రసిద్ధుడూ ఐన ఆర్యభట్ట I నుండి వేరు చేయడానికి ఇతనిని రెండవ ఆర్యభట్టు అంటారు.

                                               

యాజ్ఞవల్క్య మహర్షి

అది కురు పాంచాల దేశము. అందు గంగ ప్రవహించెడిది. ఆ నదీ తీరమున చమత్కార పురమను నగరము ఉంది. ఆ నగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. యజ్ఞవల్కుడను సార్థక నామధేయుడు. అతని భార్య సునంద. ఆ దంపతులకు ధనుర్లగ్నమున ఒక కుమారుడు జన్మించాడు. అతడే యాజ్ఞవల్క్యుడు. తన కుమారునకు అయిదవ ఏట అక్షరాభ్యాసమూ, ఎనిమిదవ ఏట ఉపనయనము చేశాడు. ప్రాతఃస్మరణీయులైన ఋషిపరంపరలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరు. ఇతను భాష్కలుని వద్ద ఋగ్వేదము, జైమిని వద్ద సామవేదము అరుణి దగ్గర అధర్వణవేదమును అభ్యసించాడు. వైశంపాయనుని వద్ద యజుర్వేదాధ్యయనము కూడా చేసాక విద్యాహంకారము కలిగి గురుశాపానికి గురై తాను నేర్చుకున్న వేదజ్ఞానమంతా రుధిర రూపములో గక్కి శాపాన్ని బాపుకున ...

                                               

పింగళి దశరధరామ్

పింగళి దశరధరామ్, పత్రికా సంపాదకుడు. దశరధరామ్ తన స్వీయ సంపాదకత్వంలో విజయవాడ సత్యనారాయణపురం నుండి ఎన్‌కౌంటర్ అనే పత్రిక నడిపేవాడు. ఈ పత్రిక 1980లో వందకు లోపల కాపీలతో మొదలు పెట్టబడింది. ఈ పత్రికలో పింగళి దశరధరామ్ ఎన్నో సంచలాత్మకమైన విషయాలను, ముఖ్యంగా మంత్రుల వ్యక్తిగత విషయాలు, వారికుటుంబ విషయాలు ప్రచురించి పేరు తెచ్చుకున్నాడు. భయమంటే ఎరుగని వ్యక్తి. ఆవతలి వ్యక్తి ఎంత పై స్థాయిలో ఉన్నప్పటికి తాను వ్రాయదలుచుకున్నది వ్రాసి తీరేవాడు. అతని భాషా శైలి దాదాపుగా మాట్లాడుకునే భాషగా ఉండేది. భాషలో సభ్యతాలోపం గురించి చాలా మంది ఫిర్యాదు చేసేవారు. ఇతని సంచలాత్మకమైన సంపాదక శైలి అనేక ఇతర పత్రికలకు స్ఫూర్తినిచ ...