Топ-100
Back

ⓘ చరిత్ర - చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, కాశీయాత్ర చరిత్ర, హిందూ మత చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర - పూర్వమధ్య యుగం, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, శాతవాహన అనంతరీకులు ..
                                               

చరిత్ర

గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఒక శాస్త్రముగా నిర్వచించినప్పుడు ప్రాథమికముగా రాతల ద్వారా భద్రపరచబడిన, జరిగిన కాలములోని మనుషుల, కుటుంబాల, సమాజాల యొక్క పరిశీలన, అధ్యయనమే చరిత్ర అని చెప్పవచ్చు. ఈ విధముగా చరిత్రను పూర్వ చరిత్రతో భేదిస్తారు. చరిత్ర యొక్క జ్ఞానము సాధారణంగా జరిగిన సంఘటనల యొక్క జ్ఞానముతో పాటు చరిత్ర ఆలోచనా సాధనాల యొక్క జ్ఞానమును కూడా పరిగణలోకి తీసుకుంటుంది. మనిషి చరిత్రను తెలుగుసుకొనుటవల్ల పూర్వం జరిగిన దురాచారాలను, నష్టాలను భవిష్యత్తులో నివారించడానికి తోడ్పడుతుంది. సాంప్రదాయకంగా చరిత్ర అధ్యయనము మానవీయ శాస్త్రములలో భాగముగా పరిగణిస్తారు. అయితే ఆధునిక విద్యావర్గ ...

                                               

ఆంధ్రప్రదేశ్ చరిత్ర

ఆంధ్రప్రదేశ్ లిఖితమైన చరిత్ర వేద కాలంనాటినుండి ప్రారంభమవుతుంది. క్రీ.పూ 8 వ శతాబ్దపు ఋగ్వేద కృతి ఐతరేయ బ్రాహ్మణ లో ఆంధ్రస్ అనే వ్యక్తుల సమూహం ప్రస్తావించబడింది. ఆంధ్రులు ఉత్తర భారతదేశం లో యమునా నది ఒడ్డున నుండి దక్షిణ భారతదేశానికి వలస వచ్చినట్లుగా తెలియవస్తుంది. ఈ ప్రాంతంలోని ప్రజలు విశ్వామిత్ర సంతతి వారని, అస్సాక మహాజనపదం ఆగ్నేయ భారతదేశంలోని గోదావరి మరియు కృష్ణ నదుల మధ్య ఉన్న ఆంధ్రుల పురాతన రాజ్యమని రామాయణం, మహాభారతం, పురాణాల ద్వారా తెలుస్తుంది. అంధ్ర ప్రదేశ్ లేక తెలుగునాటి చరిత్ర తొలుత చరిత్ర పూర్వయుగము, చారిత్రకయుగము అను రెండు భాగములుగా విభజింపవచ్చును. ఇందు చరిత్ర పూర్వయుగకథనానికి లిఖిత ...

                                               

కాశీయాత్ర చరిత్ర

కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్యానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. eతని యాత్ర 18 మే, 1830 నుండి 3 సెప్టెంబరు, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.

                                               

హిందూ మత చరిత్ర

హిందూ మతం యొక్క చరిత్ర అనేక హిందూ సంప్రదాయాల, బిన్న సంస్క్రతుల మీద ఆదారపడింది.ప్రధానంగా ఇవి భారత ఉపఖండంలో ప్రత్యేకంగా నేపాల్, భారతదేశం పై ఆదారితమైనవి.హిందూ మతం చరిత్ర భారతదేశ రాతి యుగం నుండి ఉనికిచాటుతుంది. హిందూ మతం ప్రపంచంలోనే అతి పురాతన మతంగా విరసిల్లుతుంది. పండితులు హిందూ మతాన్ని భారతదేశం యొక్క అనేక సంప్రదాయాలు, బిన్న సంస్క్రతుల సమన్వయంగా అనేక పునాదులతో ఏ ఒక్క స్థాపకుడు లేకుండా ఏర్పపడిందిగా పరిగణిస్తారు. హిందూ మతం యొక్క చరిత్ర అనేక దశలుగా విభజించబడింది ఇందూలో మొదటిది వేద కాలం అంటే సుమారు సా.శ.పూ 2000 సంవత్సరములు.సుమారు సా.శ.పూ 800, 200 సంవత్సరములు సమయంలో హిందూ మతాన్ని వేదకాలనికి, హిందూ ...

                                               

ఆంధ్రప్రదేశ్ చరిత్ర - పూర్వమధ్య యుగం

చాళుక్యులకెల్ల మూలమైనది బాదామి రాజవంశము. క్రీస్తు శకము 6వ శతాబ్దమధ్యమున మొదటి పులకేశి బాదామి కోట జయించి చాళుక్యరాజ్యము స్థాపించాడు. చాళుక్యుల పుట్టుపూర్వోత్తరాలు వివాదాస్పదమైనవి. వీరు తొలుత విజయపురి ఇక్ష్వాకు రాజులకడ సామంతులుగా వుండి రాయలసీమ ప్రాంతములోని చాళుక్యవిషయమును పరిపాలించారు. 2వ శతాబ్దినాటి ఒక శాసనములో కండచిలికి రెమ్మనక అనువాడు ఇక్ష్వాకుల సామంతుడని ఉంది. వీరు తూర్పుననున్న పల్లవుల ధాటికి తాళలేక కర్ణాట రాజ్యము ప్రవేశించి కదంబులనోడించి ఒకమహాసామ్రాజ్యసంభూతులైరి. 624సంవత్సరములో పులకేశి వేంగి, కళింగ రాజ్యములు జయించి తనతమ్ముడైన కుబ్జవిష్ణువర్ధనుని వేంగిలో పట్టాభిషిక్తుని గావించి కమ్మనాటివ ...

                                               

ఆంధ్రుల సాంఘిక చరిత్ర

ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథాన్ని సంపాదకుడు, చరిత్ర కారుడు, రచయిత సురవరం ప్రతాపరెడ్డి సుమారు 20 సంవత్సరాల పాటు చేసిన పరిశోధన చేసి రచించాడు. రెండు వేలయేళ్ళుగా వివిధ సాహిత్య ఆకరాలను ఆధారం చేసుకుని కొంతవరకూ పురావస్తువులతో సరిచూసుకుని రచించిన సాంఘిక చరిత్ర ఇది. రాజుల చరిత్ర కాక ప్రజల చరిత్రకు ఇది ప్రాధాన్యం ఇస్తుంది.

ఆంధ్రప్రదేశ్ చరిత్ర - ఉత్తరమధ్య యుగం
                                               

ఆంధ్రప్రదేశ్ చరిత్ర - ఉత్తరమధ్య యుగం

విజ్ఞాన సర్వస్వము, మొదటి సంపుటము, దేశము-చరిత్ర, 1983, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు. ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ఏటుకూరి బలరామమూర్తి - ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ Sir V Ramesam retired Judge of Madras High Court- Andra Chronology 90-1800 A.C. - Published 1946 -

                                               

శాతవాహన అనంతరీకులు

శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నం కాగా ఈ ప్రాంత రాజకీయ సమైక్యత ముగిసింది.ఆ సామ్రాజ్యం పెక్కు చిన్న స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది.ఈ చిన్న రాజ్యాలు పదో శతాబ్దం వరకు వేర్వేరు ప్రాంతాలను పాలించాయి.శాతవాహన రాజ్య తీరాంధ్ర దేశాన్ని ఇక్ష్వాకులు పాలించగా, దక్షిణ ప్రాంతాన్ని చాళుక్యులు,వాయువ్య ప్రాంతాన్ని శాతవాహనులు పాలించగా, కృష్ణానది కి దిగువగా ఆగ్నేయ భాగంలో పల్లవులు రాజ్యం స్థాపించారు.