Топ-100
Back

ⓘ అలయ్ బలయ్. తెలంగాణలో పర్వ దినాల సందర్భంగా బంధు మిత్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసే కార్యక్రమం అలయ్ బలయ్.ముఖ్యంగా దసరా సందర్భంగా నిర్వహిస్తారు పండుగనాడు సాధారణ ..




                                               

బండారు దత్తాత్రేయ

భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన బండారు దత్తాత్రేయ జూన్ 12, 1946న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా పొందినారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. 3 సార్లు సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికైనారు. అటల్ బిహారీ వాజపేయి హయంలో కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. నరేంద్ర మోడి ప్రభుత్వంలో కేంద్ర కార్మికశాఖ మంత్రి గా పనిచేశారు. 2019 సెప్టెంబర్ 1న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ను కేంద్రప్రభుత్వం నియమించింది. 2019 సెప్టెంబర్ 11న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర 27వ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చ ...

                                     

ⓘ అలయ్ బలయ్

తెలంగాణలో పర్వ దినాల సందర్భంగా బంధు మిత్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసే కార్యక్రమం అలయ్ బలయ్.ముఖ్యంగా దసరా సందర్భంగా నిర్వహిస్తారు పండుగనాడు సాధారణంగా అందరూ ఇంట్లో ఉంటారు. తర్వాత రోజు బంధుమిత్రులను కలుసుకున్న సందర్భంగా పరస్పర ఆత్మీయాభిమానాలు చాటుకుంటూ కౌగిలించుకోవడం ద్వారా అలయ్ బలయ్ చెప్పుకుంటారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని అద్దం పట్టేలా ఈ ఉత్సవం జరుగుతుంది తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక పేరుతో 29.9.2009 న అలయ్ బలయ్‌ అంటే స్నేహసమ్మేళనం బి.జె.పి.నేత బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేశారు.ఈ సందడిలో ఏర్పాటు చేసిన వివిధ కళారూపాలను చూసి ముగ్ధుడైన అప్పటి గవర్నర్ ఎన్‌డీ తివారీ పాటలు పాడారు. ప్రజాకవి గోరటి వెంకన్న తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని వివరిస్తూ పాటలు పాడారు. లయబద్ధంగా చిందేస్తూ అందర్నీ ఉర్రూతలూగించారు. తెలంగాణ జానపద కళారూపాలైన ఒగ్గుకథ లు, గోండు నృత్యం, పీర్లు, గొర్లకాపరులు, పోతరాజులు, సాధ్యశూరులు, బోణాలు, బంతిపూల బతుకమ్మ లు, గంగిరెద్దులు, సీతమ్మ జడకొప్పులు వంటి వాటితోపాటు, కోలాటాలు, భజనకీర్తనలు, సన్నాయి బాజాలు, జమిడిక మోతలు, బోనాలు, ఘటాలు, వంటివి విశేషంగా ఆకట్టుకుంటాయి.తెలంగాణా వంటకాలు సద్దఅప్పలు, జొన్నరొట్టెలు, మక్కగారెలు, మాలీదా, యాటవేపుడు, కోడిపులుసు, పొట్టురొయ్యలు, గుడాలు, బుడాలు, అటుకుల చుడువా వడ్దించారు.