Топ-100
Back

ⓘ అనువాదం. వైయాయికులు వేదవాక్యములను మూడు విధములుగ విభజించిరి. విధివాక్యము, అర్థవాదవాక్యము, అనువాద వాక్యములు. విధి యనగా విధాయక మని గౌతమాచార్యులవారు న్యాయసూత్రములో ..
                                               

యాంత్రిక అనువాదం

ఒక భాషకు చెందిన వచనాలను లేదా ప్రసంగాన్ని మరొక భాషలోకి యంత్రం ద్వారా అనువాదం చేయటాన్ని యాంత్రిక అనువాదం అంటారు. ప్రస్తుతం వచనాల అనువాదం ప్రాథమిక స్థాయిలో నున్నను త్వరలో ఊపందుకోనున్నది, ప్రస్తుతం యంత్ర అనువాదాలు కొంత గందరగోళ పరుస్తున్నాయి. పదాల పరంగా కొన్ని భాషలను యాంత్రిక అనువాదానికి అనువుగా అనువాదకులు మార్చగలిగారు. అయితే యాంత్రిక అనువాద వాక్య నిర్మాణంలో వ్యాకరణ దోషాలు ఎదురవుతున్నాయి, వ్యాకరణ దోషాలు సరిచేసేందుకు అనేకమంది అనువాదకులు కృషి చేస్తున్నారు. గూగుల్ అనువాదం అనే కంప్యూటర్ అధారిత అనువాద వ్యవస్థ ద్వారా ప్రస్తుతం అనేకమంది యాంత్రిక అనువాద సేవలను పొందటమే కాక అందులోని లోపాలను స్వచ్ఛందంగా స ...

                                               

గూగుల్ అనువాదం

గూగుల్ ట్రాన్స్లేట్ కంప్యూటర్ అధారిత అనువాద వ్యవస్థ. దీనికి హిందీతో పాటు భారతీయ భాషల తోడ్పాటు జూన్ 21, 2011 న లభ్యమైంది దీనివలన ఇంగ్లీషు లేక ఇతర భాషల విషయాన్ని తెలుగులో చదువుకోవచ్చు అలాగే తెలుగులో విషయాన్ని ఇతర భాషలలో చదువుకోవచ్చు.

                                               

ఇందుకూరి రామకృష్ణంరాజు

వీరు ఆగష్టు 31, 1934 సంవత్సరం విజయనగరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఇందుకూరి అప్పలరాజు, నారాయణమ్మ. వీరు విజయనగరం మహారాజా కళాశాల నుంచి బి.ఎస్సీ. పట్టా పొందారు. వీరు తొలినుంచి నాటక సాహిత్యాభిలాషి. వీరి వదిన, ఆంధ్రశ్రీ నాటకాలు రాఘవ స్మారక కళాపరిషత్తులో ఉత్తమ రచనలుగా ఎన్నుకోబడ్డాయి. విశాఖ జిల్లా బోర్డు కార్యాలయంలో స్టెనో టైపిస్టుగా కొంతకాలం పనిచేశారు. చలనచిత్ర రంగానికి తరలి వెళ్ళి పినిశెట్టి శ్రీరామమూర్తి, మానాపురం అప్పారావు వద్ద సహాయ దర్శకునిగా చేరారు. తరువాత తమిళ చిత్రసీమ వీరిని కథకునిగా పరిచయం చేసింది.

                                               

జగన్నాధ సామ్రాట్

జగన్నాధ సామ్రాట్ భారత దేశంలో జయ సింహ II అస్థానంలోని ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త. ఆయన ఇస్లామిక్ ఖగోళ శాస్త్రాన్ని అభ్యసించుటకు అరబిక్, పర్షియన్ భాషలను నేర్చుకున్నారు. ఆయన "రేఖాగణితం", అరబిక్ భాషలో "నాసిర్ ఆల్-దిన్ ఆల్-తుసి" చే అనువాదం చేయబడ్డ యూక్లిడ్ యొక్క రచన "యూక్లిద్ మూలకాలు" అనువాదం, సిద్ధాంతాసరకౌస్తుభ, ఖగోళ పరికరాలపై కృషి, సిద్ధాంత-సామ్రాట్, యంత్రప్రకార", వంటి వాటిపై కృషి చేసారు.

                                               

బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు

బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు ప్రముఖ తెలుగు రచయిత, సంపాదకులు, ఉపన్యాసకులు. వీరు 1920 జూన్ 28 తేదీకి సరియైన రౌద్రి నామ సంవత్సరం, ఆషాఢ శుద్ధ త్రయోదశి నాడు పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు: అళహా సింగరాచార్యులు, సుభద్రమ్మ. వీరు తెలుగు, సంస్కృత భాషలలో విద్వాన్ పట్టాలను, తెలుగులో ఎం. ఏ. పట్టాను పొందారు. వీరు నూజివీడులోని ఎస్.ఆర్.ఆర్. కళాశాల, ఆగిరిపల్లి ఎస్.ఎం.ఓ. కళాశాలలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. వీరు తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వం ప్రచురణలో సంగ్రాహకులుగా; శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీకి సహాయ సంపాదకులుగా; దక్షిణ భ ...

                                               

గద్దె లింగయ్య

గద్దె లింగయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. బహు గ్రంథకర్త. అనువాదకుడు. ఇతడు కృష్ణా జిల్లా, పెదపారుపూడి మండలానికి చెందిన ఎలమర్రు గ్రామంలో నివసించాడు. 1931లో ఆదర్శ గ్రంథమండలిని నెలకొల్పాడు. ఇతడు స్వాతంత్ర్య సంగ్రామంలో అరెస్టు కాబడి రాజమండ్రి, కడలూరు జైళ్లలో ఆరునెలలు శిక్ష అనుభవించాడు. ఇతడు పడవలపై అచ్చుయంత్రాలను అమర్చి రహస్యంగా పుస్తకాలు, కరపత్రాలు ప్రచురించి స్వాతంత్ర్యోద్యమానికి ఎంతగానో పాటుపడ్డాడు. ఇతడు ప్రభ అనే మాసపత్రికను 1935లో ప్రారంభించి దానికి సంపాదకుడిగా వ్యవహరించాడు. ఈ పత్రిక ఆంధ్రప్రాంతంలో తొలి కమ్యూనిస్టు ఉద్యమ పత్రిక. ఇతని జ్ఞాపకార్థం విజయవాడలో ఒక గ్రంథాలయానికి గద్దెలింగయ్య గ్రం ...

                                               

ఆర్వీయార్

ఆర్వీయార్ గా ప్రసిద్ధుడైన ఇతని పూర్తిపేరు రాళ్లబండి వేంకటేశ్వరరావు. ఇతడు శతాధిక గ్రంథకర్త. అభ్యుదయ సాహిత్య ఉద్యమకారుడు, విమర్శకుడు, ప్రముఖ అనువాదకుడుగా పేరు గడించాడు. మాస్కోలోని రాదుగ ప్రచురణాలయంలో చాలా కాలం పనిచేశాడు. తరువాత విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకమండలిలో సభ్యుడిగా పనిచేశాడు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షవర్గంలో సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు. ఇతని అనువాద రచనలకు కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు లభించింది.

                                               

ఇలపావులూరి పాండురంగారావు

ఇతడు ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలం, ఇలపావులూరు గ్రామంలో 1930, మార్చి 15వ తేదీన సరస్వతి, వెంకటసుబ్బయ్య దంపతులకు జన్మించాడు. ఎం.ఏ. బి.ఇడి చదివాడు. ఇలపావులూరు గ్రామంలో గణిత ఉపాధ్యాయుడిగా కొన్ని రోజులు పనిచేశాడు. హిందీ భాషా సాహిత్యాంశాలలో డాక్టరేటు సాధించి రాజమండ్రిలో హిందీ లెక్చరరుగా పనిచేశాడు. భారత భాషా పరిషత్, యు.పి.ఎస్.సి, భారతీయ జ్ఞానపీఠ్‌కు డైరెక్టరుగా పనిచేశాడు. ఇతనికి సంస్కృతం, తెలుగు, హిందీ, బెంగాలీ సహా అనేక భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఇతడు హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు.సంస్కృతం నుండి ఈశ్, కేన, మాండూక్య, ఐతరేయ, కఠోపన ...

                                               

అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్

"అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్"‌ అన్నది 1936 లో బి.ఆర్‌. అంబేడ్కర్‌ రాసిన పుస్తకం పేరు. నిజానికి ఇది మొదట ఒక సభలో ఇవ్వాల్సిన ప్రసంగానికి పాఠం. తరువాత ఆ సభ జరుగనందున అంబేడ్కర్ దీనిని ఒక పుస్తకంగా ప్రచురించాడు. ఈ రచనలో అంబేడ్కర్ భారతదేశంలోని కులవ్యవస్థ పుట్టుపూర్వత్తరాలను గురించి, దానికి పూర్వపు స్థితిగా చెబుతున్న చాతుర్వర్ణ వ్యవస్థ లోని మంచి చెడుల గురించి విశ్లేషించి, ఈ వ్యవస్థ దేశ సమైక్యతకు హానికారకమని తీర్మానించాడు. స్వతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉన్న ఆధునిక సామాజిక వ్యవస్థ నిర్మితమవ్వాలంటే హిందూ మత గ్రంథాలని ధిక్కరించాలని సూచించాడు. అంబేడ్కర్ చేసిన అనేక రచనల మధ్య చాలా పేరొందిన రచన ఇది. మరాఠీ, ...

                                               

జాన్ మహేంద్రన్

శ్రీకాంత్ తమ్ముడు అనిల్, మహేశ్వరి హీరోహీరోయిన్స్ గా 1999లో వచ్చిన ప్రేమించేది ఎందుకమ్మా సినిమాకు జాన్ మహేంద్రన్ తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఆ తరువాత దర్శకుడు కె. రాఘవేంద్రరావు కుమారుడైన కోవెలమూడి ప్రకాష్, మెహక్ జంటగా 2002లో వచ్చిన నీతో సినిమాకి కూడా దర్శకత్వం వహించాడు. జాన్ మహేంద్రన్ తమిళంలో 2005లో సచిన్ సినిమా తీశాడు. ఇందులో విజయ్, జెనీలియా, బిపాషా బసు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ తరువాత 2006లో అనివెర్ అనే సినిమా తీశాడు. శ్రీలంక పౌర యుద్ధంలో చిక్కుకున్న డాక్టర్ నేపథ్యంలో రూపొందించిన సినిమా. ఈ చిత్రం సానుకూల సమీక్షలను అందుకుంది. 2013లో ధనుష్, సోనమ్ కపూర్ నటించిన అంబికాపతి సినిమాకు మాటలు ...

అనువాదం
                                     

ⓘ అనువాదం

వైయాయికులు వేదవాక్యములను మూడు విధములుగ విభజించిరి. విధివాక్యము, అర్థవాదవాక్యము, అనువాద వాక్యములు. విధి యనగా విధాయక మని గౌతమాచార్యులవారు న్యాయసూత్రములో జెప్పినారు. ఇట్లు చేయవలసినది యని యాజ్ఞాపించునది విధి. స్వారాజ్యకామో వాజపేయేన యజేత అనునది విధివాక్యము. ఒకానొక కార్యమును స్తుతించి, లేక నిందించి, భయము కలిగించి, పూర్వచరిత వర్ణించి బోధించునట్టివాక్యము అర్థవాదవాక్య మనబడును. పాకకారీ పాపో భవతి అనునది అర్థవాదము. ఇందు నాజ్ఞ స్పష్టముగా నుండదు. విధివాక్యము జెప్పినదానిని మరల జెప్పుట అనువాదం.

                                     

1. అనువాద రకములు

అనువాదము రెండు విధములు

శబ్దానువాదము, అర్థానువాదము. ఇదివరకు జెప్పిన మాటలను మరల జెప్పుట శబ్దానువాదము. ఇదివరకు దెలిసిన విషయమునే మరల నన్యపదములతో జెప్పుట అర్థానువాదము. అనువాదే చరణానాం 2.4.3 అను పాణినీయసూత్రముమీద టీక వ్రాయుచు గాళికాకారుడు ప్రమాణాంతరావగతస్యార్థస్య శబ్దేన సంకీర్తనమాత్ర మనువాదః అని వ్రాసియున్నాడు. వేణుప్రమాణముచే సిద్ధించినయర్థమును సంగతిని శబ్దముచే జెప్పుటమాత్రము అనువాద మనబడును. అగ్ని ర్హి మస్య భేషజం అగ్ని చలికి మందు అనునది యనువాదము. ఏల? ప్రత్యక్ష ప్రమాణముచే నీసంగతి మన మెరుగుదుము. అజ్ఞానమును ఈవాక్య మనువదించింది.

అనువాదము మరల మూడు విధములు.

భూతార్థానువాదము, స్తుత్యర్థానువాదము, గుణానువాదము. సదేవ సౌమ్యేద మగ్ర ఆసిత్ ఓ సౌమ్య! మొదట సత్తే ఉండెను అనునది మొదటి దానికి ఉదాహరణము. వాయుర్వైక్షేపిష్ఠా దేవతా వాయువు క్షేపిష్ఠయైన దేవతసుమా యన్నది స్తుత్యర్థానువాదము. దధ్నా జుహోతి పెరుగుతో హోమము చేయుచున్నాను అనునది గుణానువాదము.

వేదమును నమ్మని బౌద్ధాది పూర్వపక్షులు వేదమునందు నుండు అనువాదవాక్యములు పిష్టపేషణన్యాయమున బునరుక్తములు గనుక వేదమునకు గౌరవహాని కలుగుచున్నది యని యాక్షేపించిరి. అందులకు గౌతమాచార్యులవారు "అనువాదములు పునరుక్తములు కావు. అవే శబ్దములు మాల వచ్చినను వానికి నర్థభేద ముండును. వ్యవహారమునందు మొదట గచ్ఛా పో అని మరల గచ్ఛ, గచ్ఛా పో, పో అని దానినే అనువదించినప్పటికిని రెంతడవ నుచ్చరించిన గచ్ఛ గచ్ఛా పదములకు శీఘ్రముగా పొమ్మని యర్థ మగుచున్నది. అట్లే వైదికము లగు అనువాదములకును విధి వాక్యముల కంటె భిన్నార్థ ముండును. కావున నవి పునరుక్తములు కావు" అని గౌతముడు చెప్పియున్నాడు.

దీనిమీద వాత్స్యాయను డిట్లు భాష్యము వ్రాసినాడు. విహితమైన యథమును మరల నేల చెప్పవలె నన్న అధికారార్థము చెప్పబోవు విషయ మిది యని తెలియుటకు, విహిత మైనదానిని నిందించుటకుగాని, స్తుతించుటకుగాని, విధి శేషముగ గాని చెప్పబడును. విహితార్థమునము దరువాత వచ్చినదికూడ ననువాదమగును.లోకమునందును అనువాదము కలదు. వండు వండు అని చెప్పుట కలదు. అందులకు ద్వరగ వండు మని కాని, దయచేసి వండు మని కాని అధ్యేషణ, తప్పక వండు మని కాని అవధారణ అర్థ మగుచున్నది.

పైన వర్ణించిన మూడువిధములైన వాక్యములలో విధి వాక్యములే ప్రమాణములు గాని మిగిలిన రెండు విధము లైన వాక్యములును ప్రమాణములు కా వని కొందరు పూర్వపక్షము చేసెదరు.

                                     

2. అనువాద ఎల్లలు

అనువాదం ప్రస్తుతం బాగా పలుకుబడి పొందుతున్న ప్రక్రియ. ఇందులో ఎన్ని అవకాశాలున్నాయో అన్ని ఎల్లలూ ఉన్నాయి.

అనువాదం కొత్త ప్రపంచానికి తెరచే సరికొత్త వాకిలి. అనువాదకుడికి కేవలం రెండు భాషల లిపులతో పరిచయమున్నంతమాత్రాన సరిపోదు. ఆయాభాషల వాడుకదారుల సాంస్కృతిక జీవనంతో పరిచయముండాలి. అనువాదంలోని రకాల జోలికి వెళ్ళకుండా, అనువాదానికున్న ఎల్లల గురించి తెలుసుకోవడం ముఖ్యం. సాధారణంగా వివిధ భాషా, సంస్కృతుల ప్రజల జీవన విధానాన్ని వాటితో ఏ మాత్రం సబంధం లేని అంటే, ఏక దేశ లేదా ఏకీకృత సంస్కృతీ వివరాలు, ఆచార్య వ్యవహారాదుల్లో పూర్తిగా భిన్నమైనవి కాని భాషలమధ్య అనువాదం సులభమని. అయితే, పూర్తిగా వేరు పరిస్థితులుంటే అనువాదం కష్టమనీ, ఒక అభిప్రాయం ఉంది. అయితే, సోదర భాషలైన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడాది భాషల్లో పరస్పర అనువాదంలోనూ చాలా కష్టాలున్నాయి. అందువల్లే అనువాదానికి ఎల్లలున్నాయని చెప్పవచ్చు.

                                               

మరుపూరు కోదండరామిరెడ్డి

వేమన - పాశ్చాత్యులు మాండలిక పదకోశము సంపాదకత్వం హిందూపద్ పాదషాహి అనువాదం. మూలం:సావర్కర్ తిక్కన భారతము: కర్ణ పర్వము సంపాదకుడు షిర్ది సాయిభగవాన్ అనువాదం మూలం:ఆర్థర్ ఆస్‌బోర్న్ ప్రపంచ పరిణామము అనువాదం మూలం:జవహర్ లాల్ నెహ్రూ-జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీకి వ్రాసిన లేఖలు. కంబమహాకవి మోనోగ్రాఫ్ అనువాదం లోకకవి వేమన

కర్ణ పర్వము
                                               

కర్ణ పర్వము

కర్ణ పర్వము, మహాభారతం ఇతిహాసంలోని ఎనిమదవ భాగము. ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు. కర్ణుని నాయకత్వంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం ఈ పర్వం కథాంశం