Топ-100
Back

ⓘ భారతీయ దుస్తులు ..




                                               

చీర

చీర అంటే వస్త్రము. వాడుకలో స్త్రీలు మాత్రం కట్టుకునే బట్టకు పర్యాయపదంగా చీర వాడబడుతూంది. భారతదేశంలో స్త్రీలు ధరించే దుస్తులలో ముఖ్యమైనది చీర. చీర అత్యంత పొడవైన వస్త్రము; ఇది నాలుగు నుండి తొమ్మిది మీటర్లుంటుంది. చీరను ఎక్కువమంది నడుంచుట్టు కట్టుకొని ఒక చివర భుజం మీదనుండి వెనుకకు వేసుకుంటారు. చీరలోపల క్రిందభాగంలో లంగాను పైభాగంలో రవికె ధరించడం సరైన పద్ధతి.

                                               

తలపాగా

తలపాగా అనునది తలని చుట్లతో కప్పే ఒక వస్త్రము. దీనిని ధరించే విధానాలు వేర్వేరుగా ఉంటాయి. తలపాగా, పైపంచ అనేవి గ్రామీణప్రాంత ఆంధ్రులకు తప్పనిసరి. తలపాగా అనేది రోజువారీ పనులలోనే కాకుండా శుభకార్యాలలోను, ఉత్సవాలలోను తప్పనిసరిగా ధరిస్తారు. ఆంధ్రుని ఆహార్యమంటే పంచకట్టు, లాల్చీలాంటి చొక్కా, పైపంచ, తలపాగా.

                                               

పంచె

పంచె భారతదేశంలో కొన్ని రాష్ట్రాలతో బాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్లో పురుషులు ధరించే సాంప్రదాయక వస్త్రము. కుట్టకుండా, దీర్ఘ చతురస్రాకారంలో సాధారణంగా 4.5 మీటర్లు పొడవు ఉండే ఈ వస్త్రాన్ని నడుము చుట్టూ చుట్టి ముడి వేయటం వలన ఒక పొడవు స్కర్టు వలె ఉంటుంది. భారతదేశంలో ఆంధ్ర,తెలంగాణా, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా లలో పంచె విరివిగా ధరించబడుతుంది. ఉత్తర గుజరాత్, దక్షిణ రాజస్థాన్ లలో కేడియా అనే ఒక పొట్టి కుర్తాతో బాటు ధరిస్తారు. భారతదేశం సర్వత్రా ప్రత్యేకించి బీహార్, పశ్చిమ బెంగాల్, శ్రీలంక లలో పంచెను కుర్తాతో ధరిస్తారు. వీటిని ధోవతి-కుర్తా అని స ...

                                               

రవికె

రవికె లేదా చోలీ భారతదేశంలో స్త్రీలు శరీరం పై భాగాన్ని అనగా వక్ష స్థలమును కప్పుకోవడానికి వారికి తగిన విధముగా వస్త్రముతో కుట్టబడి ఉపయోగించేది. దక్షిణ నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, చీరలు ధరించే ఇతర ప్రదేశాలలో ధరిస్తారు. దీని మీద చీర యొక్క పైట భాగం కప్పుతుంది. ఆధునిక కాలంలో దీనిలోపల బ్రా కూడా ధరిస్తున్నారు. భారతదేశంలో ధరించబడే గాగ్రా ఛోళీలో కూడా ఇది ఒక భాగము. శరీరానికి హత్తుకునేంత బిగుతుగా చిన్న చేతులతోలో నెక్ తో చోళీని రూపొందిస్తారు. వక్ష స్థలము క్రింద నుండి నాభి వరకు బహిర్గతం అయ్యేలా కత్తిరించబడటం వలన దక్షిణాసియా వేసవులలో సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి దక్షిణాసియా దేశాలలో స్త్రీలు ప్రధా ...

                                               

లంగా ఓణి

లంగా, ఓణి దక్షిణ భారతదేశంలోని స్త్రీలు ధరించే సాంప్రదాయక దుస్తులు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో యుక్తవయస్సులోని అవివాహితులైన స్త్రీలు ధరిస్తారు. దీనిని తమిళులు ధావనిగా పిలుస్తారు. ఓణి లేదా లంగా ఓణి లేదా పైట పావడ, అవివాహిత యువతులు ధరించే దక్షిణ భారత సాంప్రదాయిక దుస్తులు. ఓణి చీర అంత పెద్దగా ఉండదు. కాబట్టి ఇది నడుము నుండి పాదాల వరకు/ముందు వైపు సింహ భాగం, వెనుక కొంత భాగం ఆచ్ఛాదన నివ్వదు. అందుకే దీని క్రింద లోపలి లంగా పైన పై లంగా వేసుకొంటారు. చీర వలె దీనికి కుచ్చిళ్ళు కట్టరు. ఉదరం నుండి నడుము మీదుగా ఒకే ఒక చుట్టుగా వెళ్ళి మరల ఉదరం నుండి వక్షోజాలను కప్పుతూ ...