Топ-100
Back

ⓘ వాస్తు శాస్త్రం: వాస్తు అంటే నివాసగృహంప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి ..
                                               

ఈశాన్యం

గృహనిర్మాణంలో ఈశాన్య మూలకు విశేష ప్రాముఖ్యం ఉందని వాస్తు నిపుణులు అంటున్నారు. ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిదని. ఈ మూల పెరిగడం ద్వారా శుభఫలితాలుంటాయని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. ఈశాన్యం పెరిగిన స్థలంలో నివసించే వారికి సకలసంపదలు, విద్య, వినోద పాండిత్యాలు చేకూరుతాయి. ఈశాన్య మూల స్థలం తగ్గితే అరిష్టం. ఈశాన్యం దిశ పవిత్రమైన దిశగా వాస్తు పేర్కొంటోంది. అందుకే ప్రధాన గృహానికి ఈశాన్య భాగంలో పూజగదిని నిర్మించడం సంప్రదాయం. ఈశాన్య మూలను పూర్తిగా మూసివేసినట్టు గదులుగాని, శాలలు గానీ ఏవిధమైన కట్టడాలు నిర్మించకూడదు. ఈశాన్యంలో మరుగుదొడ్ల ఏర్పాటు అసలు కూడదు. అంతేగాకుండా చెట్లు, పూలమొక్కలు గానీ ఈశాన్యదిశల ...

                                               

ఆగ్నేయం

తూర్పు, దక్షిణ దిక్కుల మధ్య ఉండే మూల దిక్కు అనేగాక, వివాహంలో నూతన దంపతులు అరుంధతీ నక్షత్ర దర్శనం చేసిన తరువాత వారు యజుశ్శాఖాధ్యాయులైతే వారి చేత చేయించే ఒక యజ్ఞమనీ, దశాహ శ్రాద్ధం అని అర్థాలు ఉన్నాయి. ఆగ్నేయం - అగ్నిదేవతాకము, నేయి, నెత్తురు, బంగారము, కృత్తికానక్షత్రం, ఆగ్నేయాస్త్రము, భస్మస్థానము, ఒకానొక వ్రతము. అని అర్థాలు కూడా ఉన్నాయి.

                                               

నైఋతి

నైఋతి లేదా నిరృతి, అనగా పశ్చిమానికి దక్షిణానికి మధ్యసగం దక్షిణాన 45 ° పడమర వైపు చూపించే దిశను అంటారు.దీనిని నావికులు వాడే దిక్సూచిపై ఎటువంటి తేడాలేకుండా ఏ ప్రాంతంనైనా చూపిస్తుంది.దీనికి అధిపటి నివృత్తి అనే రాక్షసుడు. అధిపతి నిరృతి. అతని భార్య దీర్ఘాదేవి. ఇతని వాహనం గుర్రం. నివాసం కృష్టాంగన. ఆయుధం కుంతం.

                                               

గొడే జానకమ్మ

గొడే జానకమ్మ రచయిత్రి, సంఘ సంస్కర్త. ఆమె అనకాపల్లి సంస్థానాధీశుడు గొడే సూర్యప్రకాశరావు భార్య. ఆమెను "విద్యా విశారద" అని సమకాలీన కవులు మెచ్చుకొనేవారు. ఆమె స్త్రీ విద్య కోసం పాటుపడింది. విశాఖపట్టణంలో ఆడపిల్లల కొరకు ఒక పాఠశాలను నెలకొల్పింది. జానకమ్మ కొన్ని గ్రంథాలను వ్రాయించింది. మరిగంటి వెంకటాచార్యులు అనే కవి "మల్లారి చరిత్ర" అనే కులపురాణం వ్రాశాడు. దీనిలోని కొన్ని నచ్చని విషయాలు వుండడం వలన ఎర్రమిల్లి పేర్రాజు గారిచేత సవరణలు చేయించింది. అమె భర్త సూర్యప్రకాశరావు గొప్ప సాహిత్య పోషకుడు.అతను సంస్కృతాంద్రములందే కాక ఆంగ్లం నందు గొప్ప పాండిత్యం కలవాడు. పాశ్చాత్య సీమలలో ప్రచలితమైన వాస్తు శాస్త్రం, వ ...

                                               

జోషినందివాలా

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా.ఏ.గ్రూపులోని 36వ కులం. జోతిష్యం హస్తసాముద్రికం. చిలుక జో "స్యం వీరి వృత్తి. అల్లం మురబ్బా డబ్బా పట్టుకుని వీధివీధికి వెళ్లి అమ్ముతారు. బట్టలు, పాత్రలు అమ్ము కోవటం వంటి చిరు వ్యాపారా లు చేస్తున్నారు. సంచార జీవులు. ఐదు కాళ్లు, ఆరు కాళ్ల ఎద్దులను వెంటపెట్టుకుని ఊరూరా తిరుగుతుంటారు. కనుక నందివాలాలు అయ్యారు. జోతిష్యం చెప్పటంవల్ల జోషి నందివాలాలు అయ్యారు. వీరు ఏ గ్రామానికైనా వెళ్లేముందు ముందుగా అక్కడి పోలీస్‌ పటేలునో, గ్రామపెద్దనో కలిసి తమ వివరాలు తెలియజేస్తారు. కుటుంబాన్ని ఆ గ్రామంలోనే ఉంచి చుట్టుపక్కల మూడు నాలుగు గ్రామాలు తిరిగి వీరు జోతిష్యం చెప్పి వస్తారు. ...

                                               

గొడే సూర్యప్రకాశరావు

గొడే సూర్యప్రకాశరావు గోడె సంస్థానం లోని పెదజగ్గరాయని కుమరుడు. అతను అనకాపల్లి జమీందారు. అతను గొప్ప సాహిత్య పోషకుడు.అతను సంస్కృతాంద్రములందే కాక ఆంగ్లం నందు గొప్ప పాండిత్యం కలవాడు. పాశ్చాత్య సీమలలో ప్రచలితమైన వాస్తు శాస్త్రం, వృక్షలతాది దోషదశాస్త్రములు విశేషాభినివేశముతో పరిశీలించినవాడు. ఆంగ్లభాషా నిఘంటు మర్యాదల ప్రకారం సంస్కృతాంధ్రములకు చక్కని నిఘంటువును కూర్చవలసినదిగా అతను తమ అధ్యాపకుడైన శ్రీనివాసాచార్యులకు అభ్యర్తించాడు. దేశ భాషోద్ధారకుడైన, శిష్యుడైన, పోషకుడైన అతని కోర్కెను మన్నించి నిఘంటువునందలి చాలా భాగములను పూతి చేసి చివరి నాలుగయి దక్షరములు రాయవావలసి ఉండగా శ్రీనివాసాచార్యులు మరణించిరి. శ ...

వాస్తు శాస్త్రం
                                     

ⓘ వాస్తు శాస్త్రం

వాస్తు శాస్త్రం: వాస్తు అంటే నివాసగృహం/ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది / రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. భారతీయులు, చైనీయులు తమ ఇంటి నిర్మాణాల్లో పాటిస్తారు. వాస్తు శాస్త్రంలో ప్రధానం గా నాలుగు భాగాలు ఉన్నాయి.

 • హర్మ్య వాస్తు
 • శయనాసన వాస్తు.
 • యాన వాస్తు.
 • భూమి వాస్తు.
                                     

1. వాస్తు శాస్త్ర పురాణం

పూర్వ కాలంలో అంధకాసురడనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పతిప్పలు పెట్టుచుండెను. అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలిన ఒక చమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళవదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమ క్రమంగా భూమి, ఆకాశాలను ఆవరించసాగింది. ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు. బ్రహ్మదేవుని శరణువేడారు. సమస్త భూతములను సంభవించువాడు, సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ దేవతలను ఊరడించి ఆ భూతమును అధోముఖంగా భూమి యందు పడవేసే విధానం చెప్పాడు. బ్రహ్మ దేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా క్రిందకు పడవేశారు.

ఆ భూతం భూమిపై ఈశాన్య కోణమున శిరస్సు, నైరుతి కోణమున పాదములు, వాయువ్య, ఆగ్నేయ కోనాలందు బాహువుల వుండునట్లు అధోముకంగా భూమిపై పండింది. అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై ఈ విధంగా కూర్చున్నారు.

శిరస్సున - శిఖిఈశ

దక్షిణ నేత్రమున - సర్జన్య

వామనేత్రమున - దితి

దక్షిణ శోత్రమున - జయంతి

వామ శోత్రమున - జయంతి

ఉరస్సున వక్షమున - ఇంద్ర, అపవత్స, అప, సర్ప

దక్షిణ స్తనమున - అర్యమా

వామ స్తనమున - పృధ్వీధర

దక్షిణ భుజమున - ఆదిత్య

వామ భుజమున - సోమ

దక్షిణ బాహువున - సత్య, భృశ, ఆకాశ, అగ్ని, పూషా

వామ బాహువున - పాప యక్ష, రోగ, నాగ, ముఖ్య, భల్లాట

దక్షిణ పార్శ్వమున - వితధి, గృహక్షత

వామ పార్శ్వకామున - అసుర, శేష

ఉదరమున - వినస్వాన్, మిత్ర

దక్షిణ ఊరువున - యమ

వామ ఊరువున - వరుణ

గుహ్యమున - ఇంద్ర జయ

దక్షిణ జంఘమున - గంధర్వ

వామ జంఘమున - పుష్పదంత

దక్షిణ జానువున - భృంగరాజ

వామ జానువున - సుగ్రీవ

దక్షిణ స్పిచి - మృగబు

వామ స్పిచి - దౌవారిక

పాదములయందు - పితృగణము

ఇంతమంది దేవతల తేజస్సముదాయంతో దేదీప్య మానంగా వెలుగొందుతున్న ఆ భూతకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దాన్నే వాస్తు పురుషుడుగా సృష్టి గావించాడు.

                                     

2. వాస్తుశాస్త్ర సంబంధ గ్రంధాలు

 • సంహితా గ్రంధాలు ;బృహత్సహిత,గార్గసంహత,కాశ్యప సంహిత
 • పురాణాలలో-మత్స్య, అగ్ని, విష్ణు ధర్మొత్తరం, భవిష్య పురాణాలలో వాస్తు ప్రకరణలు ఉన్నాయి.
 • మానుషాలయ చంద్రిక
 • మనసార శిల్ప శాస్త్రము రచన: మనసారా,
 • మాయామతం రచన: మాయా,
 • శిల్పరత్నం
 • సమారంగణ సూత్రధార రచన: రాజా భోజ,
 • ఆగమ గ్రంధాలు:శైవాగమాలు,వైష్ణవాగమాలు
 • అర్ధ శాస్త్రం
 • అపరాజిత పృచ్చ విశ్వకర్మ అతని కుమారుడు అపరాజిత మధ్య సంవాదము, రచన భువనదేవాచార్య
 • విశ్వకర్మ వాస్తుశాస్త్రము రచన: విశ్వకర్మ,
                                     

3. వాస్తు పురుష మండలాలు

ఎనిమిది దిక్కులకు పరిపాలించే అష్టదిక్పాలకులు ప్రధాన మండలాధిపతులు:

 • ఆగ్నేయము - అగ్ని
 • ఈశాన్యము - ఈశానుడు
 • ఉత్తరము - కుబేరుడు
 • దక్షిణం - యముడు
 • కేంద్రము - బ్రహ్మ
 • పడమర - వరుణుడు
 • తూర్పు - ఇంద్రుడు-
 • నైఋతి - పిత్రు/నైరుత్య,
 • వాయువ్యం - వాయు
                                     

4. అభిప్రాయాలు

ఎంత పకడ్బందీగా వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకున్నా మనిషికి కేవలం సుఖాలే కాక కష్టాలు కూడా కలుగుతాయని, మనిషి నమ్మకానికే శక్తి ఉందని, మనిషికి కలిగిన ఓటమికి, అనారోగ్యాలకు, బాధలకు వాస్తుతో సంబంధం లేదని, మనిషిలో ఏవో తెలియని భయాలే వాస్తుని నమ్మేలా చేస్తాయని పలువురి లౌకిక వాదుల అభిప్రాయం. ఇటీవల టివి 9 చానెల్ వారు "వాస్తు నమ్మకం వెనుకబాటుతనం" అని డిస్ప్లే చేయడం జరుగుతున్నది

                                     

5. మూలాలు

 • D. N. Shukla, Vastu-Sastra: Hindu Science of Architecture, Munshiram Manoharial Publishers, 1993, ISBN 978-81-215-0611-3.
 • Vibhuti Chakrabarti, Indian Architectural Theory: Contemporary Uses of Vastu Vidya Routledge, 1998, ISBN 978-0-7007-1113-0.
 • B. B. Puri, Applied vastu shastra in modern architecture, Vastu Gyan Publication, 1997, ISBN 978-81-900614-1-4.