Топ-100
Back

ⓘ సమాజసేవ. చెరువు కానీ, సరస్సు కానీ, బావి కానీ, కాలువ అయినా సరే తవ్విస్తే అమితమైన పుణ్యఫలాలు దక్కుతాయంటోంది నారద పురాణం. స్వయంగా నిర్మించినా, లేదంటే ఇంకొకరు నిర్మ ..
                                               

రాజ్యోత్సవ ప్రశస్థి

రాజ్యోత్సవ ప్రశస్థి అనేది కర్ణాటక రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రతియేటా నవంబర్ 1వ తేదీన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేత ప్రదానం చేసే పురస్కారాలు. వివిధ రంగాలలో ప్రముఖులను ఈ పురస్కారంతో సత్కరిస్తారు. ఈ పురస్కారాలను ప్రతి యేటా నవంబర్ 1వ తేదీన బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహూకరిస్తారు. ఈ పురస్కారం క్రింద ఒక లక్ష రూపాయల నగదు, 20-25 గ్రాముల బరువు ఉన్న స్వర్ణపతకం, ప్రశంసాపత్రం, జ్ఞాపిక, శాలువాను ఇస్తారు. ఇవి కాకుండా అర్హులైన పురస్కార గ్రహీతలకు ప్రభుత్వం తరఫున ఇంటి స్థలాలను కూడా ఇస్తారు.

                                               

వినోబా భావే

ఆచార్య వినోబా భావే గా పేరొందిన చెందిన వినాయక్ నరహరి భావే స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది, మహాత్మా గాంధీ యొక్క ఆధ్యాత్మిక వారసుడు.

                                               

రుద్రవీణ (సినిమా)

సంగీత ప్రావీణ్యుడైన గణపతి శాస్త్రి జెమిని గణేశన్ కి గౌరవప్రథమైన బిళహరి బిరుదు ఉంటుంది. గణపతి శాస్త్రికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు ప్రసాద్ బాబు మూగవాడు, కానీ సన్నాయి నాదంలో దిట్ట. చిన్న కుమారుడు సూర్యనారాయణ శాస్త్రి చిరంజీవి తండ్రి వద్దే సంగీతంలో శిక్షణ పొందుతున్నా అభినవ భావాలు గల వ్యక్తి. కుమార్తె తంబూరా వాయిద్యంలో ప్రావీణ్యురాలు. లలిత శివజ్యోతి శోభన నాట్యంలో ప్రావీణ్యం ఉన్నా, కేవలం అధమ సామాజిక వర్గానికి చెందినది కావటం వలన, గుడిలోకి తన ప్రవేశం నిషిద్ధం కావటం వలన, గుడికి దూరంగా, కొండపై నటనమాడుతూ ఉంటుంది. లలిత నాట్యానికి ముగ్ధుడైన సూర్యం తనతో పరిచయం పెంచుకొంటాడు. లలితకు జర ...

                                               

బాలభటులు

బాల బాలికలలో దేశభక్తిని, క్రమశిక్షణను పెంపొందించి వారిని సమాజ సేవకులుగా తీర్చిదిద్దడానికి ప్రారంభించబడిన ఉద్యమం బాలభట ఉద్యమం. ఈ ఉద్యమంలో బాలుర బృందాలను "స్కౌట్స్", బాలికల బృందాలను "గైడ్స్" అని అంటారు. ఈ ఉద్యమాన్ని సర్ రాబర్ట్ బెడన్ పవల్ 1907 సంవత్సరం దక్షిణాఫ్రికా లో జరిగిన బోయర్ యుద్ధాలలో గాయపడిన వారికి సేవచేయడానికి ప్రారంభించాడు. అయితే పిల్లలలోని సహనం, స్నేహశీలత, ఉత్సాహం, పట్టుదలలను చూచిన పవల్ ఈ ఉద్యమాన్ని యుద్ధాల తర్వాత కూడా కొనసాగించాడు. ఉద్యమంలో చేరిన పిల్లలకు సేవా పద్ధతులను అనుసరించి శిక్షణ Training ఇస్తారు. వీరికి ఈతకొట్టడం, వంతెనలు, రోడ్ల నిర్మాణం, ప్రథమ చికిత్స పద్ధతులను నేర్పుతార ...

                                               

మురళీధర్ దేవదాస్ ఆమ్టే

బాబా ఆమ్టే, సంఘసేవకుడు. అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే. ప్రముఖ సంఘసేవకుడిగా ప్రసిద్ధిగాంచిన బాబా ఆమ్టే ముఖ్యంగా కుష్టు రోగుల పాలిట దేవుడిగా మారినాడు. కుష్టురోగుల సేవలకై చంద్రాపూర్ జిల్లాలో ఆనంద్‌వన్ ఆశ్రమాన్ని స్థాపించి అతను కూడా వారితోపాటే అక్కడే జీవితాన్ని గడిపి 2008, ఫిబ్రవరి 9న తన ఆశ్రమంలోనే మృతి చెందిన మహనీయుడు. ఉన్నత కుటుంబంలో జన్మించి భోగభాగ్యాలను వదిలి అణగారిన వర్గాల మేలు కొరకై జీవితాంతం కృషిసల్పిన అతని కృషి మరవలేనిది. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అతడు చేసిన సేవలకు గుర్తింపుగా లభించాయి.

                                               

మైనంపాడు

సంతనూతలపాడు 6.7 కి.మీ, చీమకుర్తి 9.1 కి.మీ, మద్దిపాడు 9.1 కి.మీ, ఒంగోలు 13.1 కి.మీ.

                                     

ⓘ సమాజసేవ

చెరువు కానీ, సరస్సు కానీ, బావి కానీ, కాలువ అయినా సరే తవ్విస్తే అమితమైన పుణ్యఫలాలు దక్కుతాయంటోంది నారద పురాణం. స్వయంగా నిర్మించినా, లేదంటే ఇంకొకరు నిర్మించేటప్పుడు అందుకు సహకరించినా, తల్లి వైపు, తండ్రి వైపు ఉన్నవారంతా లక్ష కోట్ల తరాల వరకూ, మూడు కల్పాల కాలం వరకూ విష్ణులోకంలో నివసించొచ్చు. చెట్లు పెంచితే దివ్యదేహాన్ని ధరించి ఉత్తమ విమానాన్ని అధిరోహించి, మూడు కల్పాల పాటు విష్ణులోకంలో ఉండి బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చు. అక్కడ రెండు కల్పాల పాటు నివసించి, అక్కడి నుంచి స్వర్గానికి చేరి ఒక కల్పం పాటు ఉండి అనంతరం యోగులలో జన్మించి చివరగా ముక్తిని పొందేంత పుణ్యం లభిస్తుంది. చివరకు వేతనం తీసుకొని అయినా సరే అలా సేవ చేసిన వ్యక్తికి కూడా పుణ్యఫలమే ప్రాప్తిస్తుంది. సరస్సును నిర్మిస్తే ఒక చెరువును నిర్మించినందు వల్ల కలిగే పుణ్యఫలంలో సగం పుణ్యం లభిస్తుంది. బావిని నిర్మిస్తే చెరువును నిర్మించిన దానిలో నాలుగో భాగం పుణ్యఫలం లభిస్తుంది. దిగుడు బావిని నిర్మిస్తే పద్మాలు నిండిన మంచి సరస్సును నిర్మించిన పుణ్యఫలితం దక్కుతుంది. అదే చక్కగా నీరు ప్రవహించేందుకు అనువుగా ఉండే కాలువను తవ్వించిన వ్యక్తికి బావిని నిర్మించినందువల్ల కలిగే పుణ్యఫలం కన్నా నూరు రెట్ల పుణ్యఫలం దక్కుతుంది.

ధనవంతుడు వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే వచ్చే పుణ్యఫలం, పేదవాడు పుణ్యకార్యం కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా దక్కే పుణ్యఫలం సమానంగానే ఉంటుంది. ధనవంతుడు ఒక నగరాన్ని దానం చేసినా పేదవాడు ఒక మూర భూమిని దానం చేసినా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలమే లభిస్తుంది. అలాగే ధనవంతుడు చెరువును నిర్మించినా, పేదవాడు చిన్న బావిని తవ్వించినా ఒకే పుణ్యం కలుగుతుంది. దారిన పోయే బాటసారుల కోసం లేదంటే ఇతర ప్రాణులకు నీడనిచ్చేలా ఉండేందుకు సత్రాలను, ఆశ్రమాలను నిర్మించిన వాడు మూడు తరాల వరకూ బ్రహ్మలోకార్హతను పొందుతాడు. ఆ ఆశ్రమాల వద్ద పెంచిన చెట్ల నీడలలో ఒక ఆవు కానీ, ఒక పేద పండితుడు కానీ అరక్షణం విశ్రాంతి తీసుకొన్నా చాలు అవి నిర్మించిన వ్యక్తి దేహాంతంలో స్వర్గాన్ని పొందుతాడు. ఆరామం, చెరువు, గ్రామం లాంటి వాటిని నిర్మించిన వారు శ్రీహరితో సమానంగా పూజలందుకొనేంత పుణ్యఫలాన్ని పొందుతారు. ప్రజలకు ఉపకరించేందుకు పూలతోటను ఏర్పాటు చేసిన వారు ఆ తోటలోని చెట్ల ఆకులు, పండ్ల సంఖ్యతో సమానమైనంత కాలం పాటు స్వర్గంలో ఉండగలుగుతారు. అలాంటి పూలతోను శుభ్రం చేస్తూ చెట్లకు పాదులు చేసిన వారు, ఆ తోటకు చుట్టూ గోడను నిర్మించిన వారు డెభ్బై ఒక్క యుగాల పాటు బ్రహ్మలోకంలో నివసిస్తారు. నీడనిచ్చే మొక్కను నాటిన వారు ఏడుకోట్ల తరాల వరకు తన తల్లి, తండ్రి వైపున ఉండేవారందరూ నూరు కల్పాల పాటు నారాయణ లోకంలో ఉండేందుకు తగినంత పుణ్యఫలాన్ని సంపాదించుకొంటారు. చారెడు నీళ్లు పాదులో పోసినా సూర్యచంద్రులున్నంత వరకూ విష్ణువుతో ఉండే పుణ్యం లభిస్తుంది.