Топ-100
Back

ⓘ దేవుడు ..
                                               

ఐరావతం

ఐరావతం అనగా భారీకాయంతో, తెల్లటి మేనిఛాయతో మెరిసిపోయే ఏనుగు. క్షీరసాగర మథన సమయంలో పుట్టిన ఈ ఏనుగును దేవరాజు ఇంద్రుడు తన వాహనంగా చేసుకున్నాడు. దీనిని మేఘాల ఏనుగు, పోరాట ఏనుగు, సూర్యుని సోదరుడిగా కూడా పిలుస్తారు.

                                               

చెన్నకేశవస్వామి

శ్రీకృష్ణుడే చెన్నకేశవస్వామి. చెన్న అంటే అందమైన అని తెలుసు కదా.! మేలయిన కేశములు కలవాడు అని, కేశియను రాక్షసుని సంహరించినవాడు అని పెద్దలు చెప్తారు. కేశులు అనగా బ్రహ్మ, విష్ణు, రుద్రులు. వారిని తన వశమందుంచుకున్నవాడు కేశవుడు. కావున కేశవుడు అనగా త్రిమూర్తులు ఒకటైన ఆనందస్వరూపుడు - కేవలుడు.

                                               

నవవిధ భక్తులు

భక్తి ఒక పవిత్రమైన భావన. మనుషులలో భక్తి భావన కలవారిని భక్తులు అంటారు. వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు, కృష్ణుడు లేదా అతని అవతారాలకు సంబంధించింది. అదేవిధంగా శైవులకు శివుడు, శక్తి లేదా వారి అవతారాలకు సంబంధించింది. భక్తి యోగం గురించి భగవద్గీతలో వేదాంతాల సారంగా పేర్కొన్నది. నారద భక్తి సూత్రాలు పలురకాల భక్తి విధాల గురించి పేర్కొన్నది.

                                               

పరమేశ్వరుడు

ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, భోళాశంకరుడిగా, పరమశివునిగా కీర్తించబడే పరమాత్మయే పరమేశ్వరుడు. ఈయన హిందువులకు అత్యంత ఆరాధనీయ దైవం. లింగ స్వరూపంలో పూజలందుకునే ఈ పరమశివుడే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములను నిర్వహిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా భాసిస్తూ ఉంటాడు. జగన్మాత అయిన పార్వతీదేవి ఈయన అర్ధాంగి. పార్వతీపరమేశ్వరులు ఆదిదంపతులుగా సకలలోకవాసులచేత పూజలందుకుంటూ ఉంటారు. శివ కుటుంబం కూడా చాలా చిత్రమైనది. శివుడు త్రినేత్రుడై, భస్మాంగధారియై, పాములను ఆభరణాలుగా వేసుకుని, గజచర్మాన్ని ధరించి ఉంటే, అమ్మవారు సకలాభరణ భూషితురాలై అలరారుతూ ఉంటుంది. పెద్దకుమారుడైన విఘ్నేశ్వరుడు గజముఖుడు. చిన్నకుమారుడైన కుమార ...

                                               

యహోవా, అల్లాహ్

యెహోవా:- యెహోవా సర్వసృష్టికర్త, సర్వ శక్తిమంతుడు. ఆయన ఒక్కడే దేవుడు. వేరే దేవుడెవరూ లేరు. అల్లాః:- అల్లాహ్ సృష్టికర్త అల్లాహ్ తప్పితే ఇంకెవ్వరు అరాధనకు అర్హులు కారు. క్రైస్తవులు దేవుని త్రితత్వాన్ని నమ్ముతారు. త్రిత్వం అంటే తండ్రి యెహోవా + పరిశుద్ధాత్మ యెహోవా ఆత్మ + కుమారుడు యేసు క్రీస్తు. ముస్లింలు యేసు క్రీస్తుని ప్రవక్తగా మాత్రమే అంగీకరిస్తారు కానీ దేవునిగా గానీ దేవునికుమారునిగా గానీ అంగీకరించరు. కనుక ముస్లింలు దేవుని త్రితత్వాన్ని అంగీకరించరు. ముస్లింలు అల్లాహ్ దేవుడు ని రంగు, రూపం లేనివాడు అంటారు. కాని క్రైస్తవులు యెహోవా దేవుడు మనిషి రూపంలో ఉంటాడు అంటారు. అంటే వారు ఇది ఎలా చెబుతున్నార ...

                                               

టక్‌ జగదీష్‌

టక్‌ జగదీష్ షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన తెలుగు సినిమా. ఈ చిత్రంలో నాని హీరోగా, జగపతిబాబు ప్రధాన పాత్రలో, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. టక్ జగదీష్ కు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించాడు. నాని పుట్టినరోజుకు ఒకరోజు ముందుగానే ఫిబ్రవరి 23న చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. టక్ జగదీష్ సినిమాను ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా వేయాలని నిర్ణయించారు.

పద్మనాభుడు
                                               

పద్మనాభుడు

అనంతపద్మనాభుడు అనగా నాభి యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్థం. పద్మనాభుడు అనంతశయన ముద్రలో దర్శనమిస్తాడు.