Топ-100
Back

ⓘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ప్రపంచంలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న అతి పెద్ద రోడ్డు రవాణా సంస్థగా గిన్నిస్ ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
                                     

ⓘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ప్రపంచంలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న అతి పెద్ద రోడ్డు రవాణా సంస్థగా గిన్నిస్ బుక్ 1999 నమోదైనది. 1932లో 27 బస్సులతో ప్రారంభమైన ఈ రవాణా సంస్థ ఇప్పుడు 11.678 బస్సులతో ప్రతి రోజు 72 లక్షల మందిని, 55.628 సిబ్బంది సహాయముతో రవాణా చేస్తుంది.

రాష్ట్రములోని జిల్లాలు, పట్టణాలు, గ్రామాలను అనుసంధానించడమే కాక పెద్ద నగరములలో సిటీ బస్సు సేవలను, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఒడిషా, చత్తీస్‌ఘడ్, గోవా, కర్ణాటక, తమిళనాడు పాండిచ్చేరి, తెలంగాణాలకు కూడా బస్సులు నడుపుతున్నది.14 మే 2015న అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ నుండి సంస్థ కొత్త ఆంధ్రప్రదేశ్ కు పరిమితమైంది. కొత్తగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది.

                                     

1. రాష్ట్రంలో ఆర్.టి.సి. ప్రాముఖ్యత

ఆర్.టి.సి. ఒక ప్రభుత్వ యాజమాన్యంలో నడచే వ్యాపార సంస్థ అయినా గాని ప్రజలు దీనిని ప్రభుత్వం ముఖచిత్రంగా భావిస్తారు. కనుకనే ఆర్.టి.సి. ఛార్జీలు పెరిగితే ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఏవయినా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు జరిగితే అందులో భాగంగా ఆర్.టి.సి. ఆస్తులకు నష్టం జరగడం చాలా సార్లు సంభవించింది. ఆర్.టి.సి. ఇంతటి ప్రాముఖ్యాన్ని పొందడానికి కొన్ని కారణాలు:

 • పెరుగుతున్న ప్రయాణావసరాలకు అనుగుణంగా ఆర్.టీ.సీ. అనేక మార్పులను ప్రవేశపెట్టింది.
 • స్థానికీకరణ, అనేక వ్యాపార సంస్థలకు అసాధ్యమైన నెట్‌వర్క్. పల్లెటూరులోని జనులకు ఆర్.టి.సి. ఉద్యోగులు పరాయివారిలా అనిపించరు.
 • ప్రత్యేక అవసరాలకు ప్రత్యేక బస్సులు - జాతరలు, పెళ్ళిళ్ళు, రాజకీయ పార్టీ సమావేశాలు వంటివాటికి
 • మూల మూల గ్రామాలకూ ప్రయాణ సదుపాయాలు
 • సామాన్యులకు అందుబాటులో ఉన్న ఛార్జీలు
                                     

2.1. చరిత్ర ఎర్ర బస్సు పుట్టుక

తెలంగాణాను నైజాం ప్రభువులు పాలించే రోజులలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు రాష్ట్రంలో ఉండేవి. నైజాంలో అప్పటికే "నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ" అనే సంస్థ రైళ్ళు నడుపుతోంది. అందులో భాగంగానే 1932 జూన్‍లో "రోడ్ ట్రాన్స్‌‍పోర్టు" ప్రారంభించారు. మూడులక్షల తొంబైమూడువేల రూపాయల మూల పెట్టుబడితో, మూడు డిపోలు, 27 బస్సులు, 166 మంది కార్మికులతో అది ప్రారంభమైనది. నవంబరు 1వ తారీఖు 1951 నుండి 1958 వరకు హైదరాబాదు రాష్ట్ర రవాణా సంస్థగా ఉండేది.

                                     

2.2. చరిత్ర బస్సు స్టేషన్లు

 • పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ
 • ద్వారకా బస్ స్టేషన్
 • భీమిలి బస్ స్టేషన్ భీమునిపట్నం
                                     

3. సంస్థ లక్ష్యాలు

ఆర్.టి.సి. సంస్థ క్రింది బాధ్యతలను నిర్వహించాలని వారి అధికారిక వెబ్‌సైటులో ఇవ్వబడింది.

ముఖ్య బాధ్యతలు
 • సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని, గౌరవాన్ని సాధించడం
 • ప్రయాణీకులకు పరిశుభ్రమైన, అనుకూలమైన, సమయానుగుణమైన ప్రయాణ సదుపాయాలను, సరసమైన ఛార్జీలతో అందించడం
 • ఆర్థికంగానూ, మానవతా యుతంగానూ ఉద్యోగులకు సంతృప్తి కలిగే విధానాలు
 • ఆర్థిక స్వయంసమృద్ధితో నిర్వహణ, ప్రగతి
విధానాలు
 • వ్యాపారాన్ని నిజాయితీగా, ప్రావీణ్యంగా, సత్ఫలితాలనిచ్చేలా నిర్వహించడం
 • రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పెట్టుబడికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తూ, స్వయం సమృద్ధిని సాధించడం
 • వ్యాపారంలో ప్రభుత్వ విధానాలను సంపూర్ణంగా అనుసరించడం
 • సంస్థ ఉద్యోగుల, వారి కుటుంబాల శ్రేయస్సుకై కృషి చేస్తూ సంస్థకు వారి తోడ్పాటును పెంపొందించుకోవడం
 • ప్రణాళికాబద్ధంగా, తగు శిక్షణతోను, సహకారంతోను ఉద్యోగుల ఉత్పాదకతను, నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం
 • సాంకేతికంగాను, ఆర్థికంగాను నూతన విధానాలను పరిశీలించి అనుసరించడం
 • పర్యావరణానికి, సమాజానికి అవసరమైన విషయాలపట్ల ప్రత్యేక శ్రద్ధ. కాలుష్య నివారణ
 • తమ వ్యాపారానికి పట్టుకొమ్మలైన వినియోగదారులను ప్రయాణీకులను గౌరవిస్తూ వారికి సంతృప్తి కలిగేలా నాణ్యమైన సేవలను అందించడం
 • బస్సు రావాణా వ్యవస్థ నిర్వహణలో ఉన్నతమైన స్థాయిని సాధించి సమాజంలో సముచితమైన గౌరవమైన స్థానాన్ని పొందడం


                                     

4. ప్రధాన గణాంకాలు

1958లో ప్రారంభమైన ఆర్.టి.సి. సంస్థ వనరులు 2017 జూలై నెల నాటికి ఇలా ఉన్నాయి

వనరులు
 • మొత్తం డిపోలు: 128
 • మొత్తం రూట్లు: 3764
 • సగటు రోజు ప్రయాణీకులు: 72 లక్షలు
 • బస్సు స్టేషన్లు: 426
 • బస్సు షెల్టర్లు: 790
 • వాహనాలు: 11.678
 • విభాగాలు: 12 రీజియన్లు, 4 జోనులు
 • కలుపుతున్న గ్రామాలు: 14.123
 • సగటు రోజు ఆదాయం 1289 లక్షల రూపాయలు
 • ఇంకా చేరని గ్రామాలు: 3.669
 • సగటు రోజు ప్రయాణ మార్గం: 44 లక్షల కిలోమీటర్లు
 • ఉద్యోగులు: 55.628

నిర్వహణా గణాంకాలు 2017 జూలై నాటికి

 • ప్రతి లక్ష కిలోమీటర్లకు ప్రమాదాలు: 0.07
 • ఉద్యోగుల ఉత్పాదకత Employees Productivity: 1 కి.మీ.
 • ప్రతి కిలోమీటరుకు ఖర్చు: 37.34 పైసలు
 • టైరు ఉపయోగ కాలం: 2.04 లక్షల కి.మీ.
 • ఫ్లీటు వినియోగం: 99.57 %
 • ప్రతి 10.000 కి.మీ.కు బ్రేక్-డౌన్ రేటు: 0.04
 • Crew Utilization: 191 కి.మీ.
 • ఇంధనం ఎఫిషియన్సీ: లీటరుకు 5.20 కి.మీ.
 • సమయ పాలన Punctuality - ఏప్రిల్ 2007: 94.37 %
 • ఇంజిన్ ఆయిల్ ఎఫిషియన్సీ: లీటరుకు 1517 కి.మీ.
 • ప్రతి కిలోమీటరుకు ఆదాయం: 3549 పైసలు
                                     

5. వనరులు

ఇతర వనరులు

ఆర్టీసీకి ప్రస్తుతమున్న అప్పులు రూ.1250 కోట్లు. వీటిపై ఏటా రూ.80 కోట్లకు పైబడి వడ్డీ కింద చెల్లిస్తోంది. ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా 1500 ఎకరాల వరకు ఖాళీ స్థలాలున్నాయి. వీటిలో వెయ్యి ఎకరాలకు పైబడి జిల్లా, మండల కేంద్రాల్లో ఉన్నాయి. ఈ స్థలాల్ని బీవోటీ ప్రాతిపదికన లీజుకు ఇస్తే రూ.500 కోట్లకు పైబడి ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

                                     

6. సేవలు

ప్రయాణ సదుపాయాలు

 • దేశంలో ఏ ప్రాంతంలోని రోడ్డు రవాణాకు సంబంధించి అయినా,దేశంలో ఏ ప్రాంతంలోని బస్సైనా, అది ఏ రాష్ట్ర రవాణాసంస్థకు చెందినదైనా సరే ఆ బస్సు ఎప్పుడు బయలుదేరింది. ప్రస్తుతం ఎక్కడ ఉంది. ఎంతసేపట్లో ఫలానా బస్సుస్టాప్‌/స్టేషను‌కు చేరుకొంటుంది. టిక్కెట్‌ రుసుం ఎంత? ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి వంటి వివరాలన్నీ ఇకపై కేవలం ఒక్క ఫోన్‌కాల్‌తో తెలుసుకునే సౌకర్యం త్వరలో రాబోతోంది. ఇందుకోసం ఒక యూనిఫైడ్‌ యాక్సెస్‌ నంబరు 155220ను కేంద్ర టెలీకమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ కేటాయించింది. ఇందుకోసం కేవలం లోకల్‌కాల్‌ ఛార్జీ మాత్రమే వసూలుచేస్తారు.
 • ఆర్టీసీ బస్సులు ఇక ప్రయాణికులు నిర్దేశించినట్టు, ప్రయాణికుల సూచనలు, కోరికల ప్రకారం సర్వీసులను నడపటానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
                                     

7. సమస్యలు-లాభమార్గాలు

 • డీజిల్‌పై అమ్మకం పన్ను,టోల్ టాక్స్, వాహనపన్నులు,ఎక్సైజ్ డ్యూటీ, స్పేర్‌పార్ట్స్, ఆస్తి పన్నులు మినహాయించటం.
 • వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసే ప్రాజెక్టు చేపట్టటం
 • ఖాళీ స్థలాలను బీఓటీ కింద లీజుకివ్వటం
 • ప్రైవేటు ఆపరేటర్లకు ముకుతాడు వేయటం
 • సరుకు రవాణా రంగంలోకి దిగటం
 • పల్లెలకు బస్సులు తిప్పటం వల్ల,బస్సు పాస్ ల వల్ల వస్తున్న నష్టాన్నిసబ్సిడీగా ఇవ్వటం

కార్మికుల అసంతృప్తి, సమ్మె లు,బందు లు

బందులు, ఉద్యమాల సమయంలో రాజకీయ పార్టీలు గానీ, సంస్థలు గానీ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేస్తే వారి నుంచే నష్టపరిహారాన్ని రాబట్టాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఇటీవలే ఆమోదం తెలిపింది. నష్ట పరిహారం వసూలును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన నేపథ్యంలో.బస్సుల ధ్వంసం కారణంగా ఆర్టీసీకి రూ.200 కోట్ల వరకు నష్టం జరిగింది. ఈనాడు 4.2.2010