Топ-100
Back

ⓘ ప్రకటన అనేది సాధారణంగా ఒక వ్యాపారాత్మకరాజకీయసైద్ధాంతిక సమర్పణకి సంబంధించి వీక్షకులని ఒక చర్యని చేపట్టటానికి లేదా అప్పటికే చేపట్టిన చర్యనే కొనసాగించటానికి ఒప్పిం ..




                                               

తాష్కెంట్ ప్రకటన

తాష్కెంట్ ప్రకటన అనేది భారత దేశము, పాకిస్తాన్ మధ్య 1966 జనవరి 10 న జరిగిన శాంతి ఒప్పందం. తాష్కెంట్ ప్రకటన భారత్ పాకిస్తాన్‌ యుద్ధాన్ని పరిష్కరించింది. రెండు దేశాల మధ్య ఏప్రిల్ 1965 నుండి సెప్టెంబరు 1965 వరకు చిన్న తరహా, క్రమరహితమైన పోరాటమ్ 1965 లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధనికి దారితీసింది. ఇది జమ్మూ, కాశ్మీర్ రాచరిక రాష్ట్రాల యొక్క వనరులు, జనాభాపై నియంత్రణను కోసం జరిగింది.

                                               

బేగం హజరత్‌ మహల్‌ ప్రకటన

1858 నంవంబరు 1న ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనను రద్దుచేసి, ఇండియా ప రి పాలనా బాద్య తను స్వీకరించిన విక్టోరియ రాణి దేశీ పాలకులను, సంస్థానాధీశులను మంచి చేసుకోడనికి ఒక ప్రకటన విడుదాల చేసింది. ఆ ప్రకటనకు ప్రతిగా అవధ్‌ మహారాణి బేగం హజరత్‌ మహల్‌, అవధ్‌ రాజుగా ప్రకంచబడితన కుమారుడెన బిర్జిస్‌ ఖదిర్‌ పేరిట ఒక చారిత్రాత్మక ప్రకటన విడుదాల చేశారు. ఈ ప్రకటనలో స్వదేశీయుల పట్ల, స్వదేశీ సంస్థానాధీశుల పట్ల, స్వదేశీ పాలకుల స్వదేశీయుల మత విశ్వాసాల పట్ల ఆంగ్లేయులు ఎంత మోసపూరితంగా. ప్రవర్తిస్తున్నారో ప్రశ్నిస్తూ విక్టోరియా ప్రకటనకు దీటుగా తాను 1858 డిసెంబరు 31న ఒక ప్రకటన విడుదాల చేశారు. ఆ చారిత్మ్రాక ప్రకటన పూర్తి ...

                                               

మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన

మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ఐక్యరాజ్యసమితి ఆమోదించిన చారిత్రాత్మక పత్రం. 1948 డిసెంబరు 10 న ఫ్రాన్స్‌లోని పారిస్‌లోని పలైస్ డి చైలోట్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం మూడవ సెషన్‌లో తీర్మానం-217 గా దీన్ని ఆమోదించింది. ఐక్యరాజ్యసమితిలో అప్పటి 58 మంది సభ్యులలో, 48 మంది అనుకూలంగా ఓటు వేశారు. ఎవరూ వ్యతిరేకించలేదు. ఎనిమిది మంది వోటింగుకు దూరంగా ఉన్నారు. ఇద్దరు ఓటు వేయలేదు. ఈ ప్రకటనలో, వ్యక్తి హక్కులను ధృవీకరించే 30 అధికరణాలు ఉన్నాయి. వాటికవే చట్టబద్ధమైనవి కాకపోయినా, తదుపరి చేసిన అంతర్జాతీయ ఒప్పందాలు, ఆర్థిక బదిలీలు, ప్రాంతీయ మానవ హక్కుల సాధనాలు, జాతీయ రాజ్యాంగాలు తదితర చట్టాలలో వీటికి ...

                                               

భారతదేశ ప్రధానమంత్రి

ప్రధానమంత్రి భారత ప్రభుత్వ అధినేత. ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన స్థానం. పదవి రీత్యా రాష్ట్రపతి స్థానం దీనికంటే ఉన్నతమైనదైనా, రాష్ట్రపతి అధికారాలు కేవలం అలంకారప్రాయము, నామమాత్రము కాగా, వాస్తవంలో అధికారాలన్నీ ప్రధానమంత్రి వద్దే కేంద్రీకృతమై ఉంటాయి. భారత్ అనుసరిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి లో లోక్‌సభలో అత్యధిక బలం కలిగిన రాజకీయ పక్షానికి గాని, కూటమికి గాని నాయకుడై, సభలో మెజారిటీ పొందగలిగి ఉండాలి. ప్రధాన మంత్రి లోక్‌సభ లోగాని, రాజ్యసభ లోగాని సభ్యుడై ఉండాలి, లేదా ప్రధానమంత్రిగా నియమితుడైన ఆరు నెలల లోపు ఏదో ఒక సభకు ఎన్నికవ్వాలి.

                                               

డిసెంబర్ 9

1966: ఐదవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్లో ప్రారంభమయ్యాయి. 2009: అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటన చేశారు.

                                               

గ్రామ పంచాయతీ

మూడంచెలుగల పంచాయితీరాజ్ వ్యవస్థలో తొలి స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థనే గ్రామ పంచాయితీ అంటారు. ప్రభుత్వ ప్రకటన ద్వారా గ్రామ పంచాయితీలను నిర్ణయిస్తారు. వీటికి ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

                                               

క్రిప్టాన్

క్రిప్టాన్ ఒక రసాయనిక మూలకం. మూలకాల ఆవర్తన పట్టికలో 18 వ సముదాయం/సమూహం అనికుడా అంటారు.వాతావరణం లోని వాయువులలో అల్ప ప్రమాణంలో క్రిప్టాన్ మూలకం ఉంది. క్రిప్టాన్ మూలకాన్ని, ద్రవీకరించినగాలి నుండి పాక్షిక స్వేదన క్రియ ద్వారా వేరు చేయుదురు. దీనిని అరుదైన వాయువుల తోపాటుగా ఫ్లోరెసెంట్ దీపాలలో ఉపయోగిస్తారు. మిగతా జడవాయువు/నోబుల్ వాయువులవలె అలంకరణ విద్యుత్ దీపాలలో, ప్రకటన బోర్డులలో, ఫోటోగ్రఫిలలో ఉపయోగిస్తారు.క్రిప్టాన్ కాంతి అధిక/పెద్ద సంఖ్యలో వర్ణపటగీతలను spectral lines కలిగియున్నది.

                                               

సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం

బాలసాహిత్యం అభివృద్ధి చేసేందుకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నది. ఈ పురస్కారాన్ని 2010నుండి అమలు చేస్తున్నారు. ప్రతీ ఏడాదీ గుర్తించిన భాషల్లో వచ్చిన అత్యున్నత స్థాయి బాల సాహిత్యానికి ఈ పురస్కారం లభిస్తుంది. కొన్ని సందర్భాలలో రచయిత బాలసాహిత్యానికి చేసిన సేవ, బాలసాహిత్యరంగంలో వారి కృషిని మొత్తంగా పరిగణనలోకి తీసుకుని పురస్కారాన్ని అందిస్తున్నారు. ఈ పురస్కారం పొందే బాలసాహిత్య పుస్తకం ఆ అవార్డును ఇచ్చే సంవత్సరానికి ముందు సంవత్సరానికన్నా ఐదేళ్ల కాలంలో వెలువడిఉండాలి. ఉదాహరణకు 2016లో అవార్డుకు పరిగణించే పుస్తకం 2011-2014 సంవత్సరాల మధ్యకాలంలో ప్రచురింపబడి ఉండాలి. ...

                                               

కుక్కునూరు మండలం

కుక్కునూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. ఈ మండలంలో 34 గ్రామాలు ఉన్నాయి. జూన్ 2, 2014 న తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ఆర్డినెన్స్ వలన ఈ మండలం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో కలుపబడింది. పిన్ కోడ్ నం. 507 114., ఎస్.టి.డి.కోడ్ = 08746.OSM గతిశీల పటము

                                               

మార్చి 5

1931: రాజకీయ ఖైదీ ల విడుదల ఒపందంపై బ్రిటిష్ ప్రతినిధులు, మహాత్మా గాంధీ సంతకం. 2010: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1824: బర్మా పై బ్రిటన్ యుద్ధం ప్రకటన.

ప్రకటన
                                     

ⓘ ప్రకటన

ప్రకటన అనేది సాధారణంగా ఒక వ్యాపారాత్మక/రాజకీయ/సైద్ధాంతిక సమర్పణకి సంబంధించి వీక్షకులని ఒక చర్యని చేపట్టటానికి లేదా అప్పటికే చేపట్టిన చర్యనే కొనసాగించటానికి ఒప్పించే విపణీకరణలో భాగమైన ఒక రకమైన భావప్రకటన.

ప్రకటన అనగా ఒక సంస్థ లేదా ప్రభుత్వము, అధికారికంగా ప్రజలవద్దకు చేర్చే సమాచారం. ఏ సంస్థ అయినా ప్రజలకు తెలియజేయవలసిన విషయాన్ని కొన్ని మాధ్యమాల ద్వారా ప్రజలవద్దకు తీసుకుపోయే ప్రక్రియ ప్రకటనా ప్రక్రియ. ప్రకటన ముఖ్య ఉద్దేశం, విషయ పరిజ్ఞానాన్ని ప్రజలకు తెలియజెప్పడం. పూర్వపుకాలంలో ప్రభుత్వపరమైన, లేదా అధికారిక పరమైన విషయాలను, ప్రజలకు తెలియజేసేందుకు "దండోరా" వేయించేవారు. ఇదొక ప్రకటనా మాధ్యమం. మనం తరచూ వార్తాపత్రికల్లోనూ లేక టీవిలోను ఈ ప్రకటనలను చూస్తూ ఉంటాము.

ల్యాటిన్ లో ad vertere అనగా "ఒక వైపుకి తిరగటం". ప్రకటన వీక్షకులని తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆంగ్లంలో దీనికి Advertisment అనే పేరు వచ్చింది. సంస్థ యొక్క నమ్మకాన్ని పెంపొందించుకొనటానికి, దాని యొక్క విజయాలు ఉద్యోగుల, వాటాదారుల కంటబడటానికి కూడా ప్రకటనలని వాడుకొనవచ్చును. వార్తాపత్రికలు, వారపత్రికలు, టెలివిజన్, రేడియో, బహిరంగ ప్రదేశాలు, ఈ-మైయిల్ వంటి సాంప్రదాయిక ప్రసార మాధ్యమాలతో బాటు, బ్లాగులు, వెబ్ సైట్లు, సోషల్ నెట్వర్కింగ్ వంటి ఆధునిక ప్రసార మాధ్యమాలలో కూడా ప్రకటనల సందేశాలని మనం నిత్యం చూస్తూ ఉంటాము.

బ్రాండింగ్ ఒక ఉత్పత్తి యొక్క పేరు లేదా చిత్రానికి వినియోగదారులలో కావలసిన లక్షణాలని ఆపాదించటం ద్వారా వాణిజ్య ప్రకటనలు తమ ఉత్పత్తుల లేదా సేవల వినియోగాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తాయి. రాజకీయ పార్టీలు, ప్రత్యేక ఆసక్తి సమూహాలు, మత సంబంధ సంస్థలు, ప్రభుత్వ మంత్రాంగాలు వాణిజ్యేతర ప్రకటనదారులుగా పరిగణించవచ్చును. వాణిజ్యేతర ప్రకటనదారులు చాటింపులు, లాభాపేక్ష లేని సేవలని అందించటం ద్వారా ప్రకటనలు చేస్తూ ఉంటారు.

భారతదేశం లోని కొన్ని ప్రముఖ ప్రకటన సంస్థ Advertising agency లు

  • రీడిఫ్యూజన్ డి వై ఆర్ Rediffusion DYR
  • హవాస్ వర్ల్డ్ వైడ్ Havas Worldwide
  • ఆర్ కే స్వామి బి బి డి ఓ RK Swamy BBDO
  • ఒగిల్వీ అండ్ మాథర్ Ogilvy & Mather
  • డిడిబి ముద్ర గ్రూప్ DDB_Mudra
  • లియో బర్నెట్ Leo Burnett
  • జే వాల్టర్ థాంప్సన్ JWT
  • లోవ్ లింటాస్ Lowe Lintas
                                     

1. చరిత్ర

గోడల పై బొమ్మలని వేసి ప్రకటనలు చేయటం భారతదేశంలో క్రీ.పూ. 4000 నుండే ప్రారంభమైనది. ఆసియా, ఆఫ్రికా దక్షిణ అమెరికా లలో ఇప్పటికీ ఈ తరహా ప్రకటనలు చెలామణిలో ఉన్నాయి. చైనాలో మిఠాయిలని అమ్మటానికి పిల్లనగ్రోవులని ఊదుతూ ప్రకటనలు చేసేవారు. తర్వాత కాలంలో ఒక చతురస్రాకార కాగితం పై తాము రూపొందించే సూదులని వాడమని ప్రకటించే కాంస్య పతకం చైనాలో కనుగొనబడింది. ఐరోపాలో మధ్య యుగాలలో నిరక్షరాస్యత వలన లిఖితపూర్వక ప్రకటనలకి బదులుగా చిత్రాలు వాడబడేవి. పాదరక్షల ప్రకటనలు బూట్లతో, తిరగలి విసరే వారి ప్రకటనలు పిండి బస్తాతో, దర్జీల ప్రకటనలు దుస్తులతో, కమ్మరి ప్రకటనలు గుర్రపు లాడాలతో సూచించబడేవి.

భారతదేశంలోనే మొట్టమొదటి వారపత్రిక 1780లో కలకత్తాలో జేమ్స్ అగస్టస్ హికీ ఒక ఆంగ్లేయుడు నెలకొల్పాడు. శనివారాలు మాత్రమే అచ్చయ్యే ఈ పత్రిక హికీస్ బెంగాల్ గజెట్ పేరుతో విడుదలయ్యేది. ఈ పత్రిక అమ్ముడుపోయే ఖర్చు కంటే ముద్రణకి అయ్యే ఖర్చే ఎక్కువగా ఉండటంతో హికీకి నష్టాలేదురయ్యాయి. అప్పుడే ఆయన పత్రికలో కొంత భాగాన్ని ప్రకటనలకి వదిలివేశాడు. అప్పట్లో ప్రకటకనలు వర్గీకరణ Classifieds చేయబడి, కేవలం సాధారణ సందేశాలతో, ఒక ఉత్పత్తి కావాలంటే ఏ తపాలా అడ్రసుని సంప్రదించాలో తెలుపబడి ఉండేవి. ఈ నాటి క్లాసిఫైడ్ లకి కూడా ఇదే నాంది. వివిధ వ్యాధులకి అప్పట్లో వాడబడే పేటెంట్లుగల లేపనాలు, కషాయాలు ఈ పత్రికలో ప్రకటించబడేవి. తపాలా ద్వారా ఉత్పత్తులని బట్వాడా చేయించుకోవటం అదివరకే తెలిసిన, భారతదేశంలో జీవించే బ్రిటీషు వారిని, ఐరోపా జాతియులని లక్ష్యంగా చేసుకొని మద్రాసు లోని స్పెన్సర్స్ Spencers, కలకత్తాకి చెందిన వైట్వేస్ & లెయిడ్లా Whiteways & Laidlaw వంటి డిపార్ట్ మెంటల్ స్టోర్ లు, నౌకాదళ, రక్షణ దళ ప్రకటనలు కూడా ఇందులో కనబడేవి.

18వ శతాబ్దానికి ఇంగ్లాండులో ప్రకటనలు వారపత్రికలలో ముద్రితమయ్యేవి. పుస్తకాలని, ఇతర పత్రికలని ప్రకటించటంతో మొదలయ్యి రోగాల బారిన పడిన ఖండం కావటం వలన ఔషధాల ప్రకటనల వరకూ ప్రకటనా రంగం విస్తరించింది. బూటకపు ఔషధాలు కూడా ప్రకటించబడటంతో, సమస్యలని అధిగమించటానికి ప్రకటనలని నియంత్రించవలసి వచ్చింది.

                                     

1.1. చరిత్ర 19వ శతాబ్దం

థామస్ జె బారాట్ "ఆధునిక ప్రకటన పితామహుడి"గా కొనియాడబడ్డాడు. పియర్స్ సబ్బుకి ఆయన చేసిన ప్రకటనలు విపరీతమైన జనాదరణకి నోచుకొన్నవి. చూడచక్కని చిత్రాలు, వినసొంపైన ఉపశీర్షికలతో ఆయన ప్రకటన రంగాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. Good morning. Have you used Pears soap? శుభోదయం. మీరు పియర్స్ సబ్బుని వాడారా? అనే ఉపశీర్షిక నాటికీ, నేటికీ అదే జనాదరణతో వాడబడుతోన్నది. మధ్య తరగతికి చెందిన చిన్న పిల్లలని చక్కగా అలంకరించి వారి చిత్రాలని ప్రకటనలలో పొందు పరచటం, పియర్స్ సబ్బుని వాడేవారు గొప్పింటి ఆశయాలు కలవారని సందేశాత్మకంగా తెలపటం వంటి కిటుకులని ఉపయోగించటమే పియర్స్ సబ్బు యొక్క ప్రకటనల విజయానికి రహస్యమైనది. ఆ నాటి శాస్త్రవేత్తలని, ఇతర రంగాలలో ప్రముఖులని తన ప్రకటనలని బలపరిచేందుకు వినియోగించుకొన్నాడు. ఇంతటి విజయవంతమైన ప్రకటనలని రూపొందించిన బారాట్ పద్ధతులు -

  • పియర్స్ కి విశిష్టమైన దాని బ్రాండ్ ఇమేజ్ యొక్క ప్రాముఖ్యతని నిత్యం నొక్కి వక్కాణించటం
  • వినియోగదారునికి ఎల్లప్పుడూ పియర్స్ సబ్బు లభ్యమయ్యేలా అందుబాటులో ఉంచటం
  • విపణిలో మారుతున్న అభిరుచులని నిరంతరం తెలుసుకొనటం

అందుకే కాబోలు 1907 లో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. అభిరుచులు మారుతూ ఉంటాయి, ఫ్యాషన్ లు మారుతూ ఉంటాయి, వాటితో బాటు ప్రకటనదారు కూడా మారుతూ ఉండాలి. పాతతరపు ఆలోచనా పద్ధతులు ఈ తరానికి పని చేయవు, పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తాయి, వాటి వలన లాభమూ ఉండదు. ఈ నాటి ఆలోచన పాత తరపు ఆలోచన కంటే మెరుగైనది అని కాదు గానీ, ఇది కొత్తగా ఉంటుంది - ఇప్పటి నాడిని పడుతుంది.

                                     

1.2. చరిత్ర భారతదేశం

19వ శతాబ్దానికి గానీ భారతదేశంలో వినియోగదారులని ఆకర్షించటానికి సరియైన పత్రిక ద్వారా సరియైన పాఠకులకి ఎంచుకోవాలని, ప్రకటనలకి ఆకర్షణీయమైన కాపీ అవసరమని ఎవరూ గుర్తించలేకపోయారు. భారతదేశపు మొట్టమొదటి ప్రకటన సంస్థ బి. దత్తారాంస్ లాభాల పట్టటంతో 1920 కల్లా గుజరాత్ అడ్వర్టైజింగ్, విదేశీ సంస్థలైన ఆల్లీడ్ అడ్వర్టైజింగ్, ఎల్. ఏ. స్ట్రోనాచ్, డి. జె. కైమర్ లు స్థాపించబడ్డాయి. 1926 లో జనరల్ మోటార్స్ ప్రకటనల కొరకు మొదటి బహుళ జాతీయ ప్రకటన సంస్థ జె వాల్టర్ థాంప్సన్ స్థాపించబడింది. ఎల్. ఏ. స్ట్రోనాచ్ ని నార్విక్సన్ అడ్వర్టైజింగ్ సొంతం చేసుకోగా, కీమర్ ని బెన్సన్ కైవసం చేసుకొని బోమాస్ గా మారినది. చివరకు ఇదే ఒగిల్వీ అండ్ మాథర్ గా అవతరించింది. లీవర్ తన ఉత్పత్తులని ప్రకటించటానికి సొంత ప్రకటన సంస్థ లింటాస్ Levers International Advertising Service ని స్థాపించింది.

విదేశీ బ్రాండ్ లైన లక్స్, పియర్స్ సబ్బులు మొట్టమొదట భారతదేశంలో స్థానీకరించబడినవి. సినీ తారల సబ్బుగా ముద్ర వేయబడ్డ లక్స్ సబ్బు 1941 లో లీలా చిట్నిస్ ని తమ ప్రకటనలో మాడల్ గా వినియోగించుకొన్నది. ఈ నాటికి కూడా లక్స్ ని వినియోగదారులు సినీ తారల సబ్బుగానే చూడటంలో వారిపై ప్రకటనల ప్రభావం ఎంతగా ఉందో తెలియజేస్తుంది. లింటాస్ వనస్పతికి చేసిన డాల్డా బ్రాండింగ్ ప్రకటనల చరిత్రలోనే చిరస్మరణీయమైనది. ఒక వ్యానులో అందరికీ కనబడేంత పెద్ద డాల్డా క్యానుని ఉంచి బొంబాయి, కలకత్తా, మద్రాసు, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలలో చక్కర్లు కొట్టించారు. పసుపుపచ్చని క్యాను పై ఆకుపచ్చ రంగులో తాటి చెట్టు యొక్క బొమ్మ భారతీయుని హృదయాంతరాలలో నాటుకు పోయింది. వనస్పతి అంటే డాల్డా నే అనేంతగా దేశ ప్రజలలో ఇమిడి పోయింది.

అటు తర్వాత ప్రసార మాధ్యమాలలో విప్లవాలు తెచ్చిన రేడియో, టీవీ, ఇంటర్నెట్ లలో కూడా ప్రకటనలు చోటు చేసుకొన్నాయి.

80వ దశకంలో రేడియోలో చార్మినార్ సిమెంటు రేకుల ప్రకటనలో ఇద్దరి సంభాషణ:

  • రామయ్య: ఏం లేదు, మా ఇంటి పైకప్పుకి ఏ రేకులు వేద్దామా అని?
  • మొదటి వ్యక్తి: ఏమిటి రామయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?
  • మొ.వ్య: ఇందులో ఆలోచించవలసినది ఏముంది? చార్మినార్ రేకులనే వేయించు. నమ్మికకీ, నాణ్యతకీ చార్మినార్ రేకులనే వాడండి.

90వ దశకంలో కేబుల్ టీవీ వచ్చేవరకు, యావత్ భారత్ దేశం వీక్షించే ఏకైక ఛానెల్, దూరదర్శన్. ప్రతి బుధవారం ప్రసారమయ్యే హిందీ చిత్రగీతాల కార్యక్రమమైన చిత్రహార్, ప్రతి శనివారం సాయంత్రం ఒక హిందీ చిత్రం, ప్రతి ఆదివారం ప్రొద్దుటే వచ్చే రామాయణ, మహాభారతాలు, సాయంత్రం ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రసారం చేసే ప్రాంతీయ భాషా చలనచిత్రాల కొరకు మొత్తం దేశం ఎదురు చూసేవారు. ఈ కార్యక్రమాల ముందు, మధ్యలో, తర్వాత ప్రకటనలు చొప్పించబడేవి. కొన్ని ప్రకటనలు ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉండేవి.

  • లెహర్ 7 అప్ కి కనబడే తమాషా ఫైడో డైడో కార్టూన్ పాత్ర
  • లిరిల్ సబ్బు జలపాతాలలో పరవశంతో స్నానం చేసే ఒక యువతి
  • విమల్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ ఒన్లీ విమల్
  • సియారామ్స్
  • తాజ్ మహల్ టీ వాహ్ ఉస్తాద్, వాహ్! అరె హుజూర్ వాహ్ తాజ్ బోలియే!!!
  • లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది
  • రస్నా ప్రతి వేసవిలో పిల్లలతో చిత్రీకరించబడే ప్రకటన, పిల్లలు అందులో ఉపయోగించే ఉపశీర్షిక I love you Rasna
  • రెనాల్డ్స్ - ప్రపంచం కోరే పెన్ను
  • నిర్మా
  • బాంబే డైయింగ్ ప్రకటనలు
  • విక్కో టర్మెరిక్, విక్కో వజ్రదంతి
  • డాబర్ చ్యవన్ ప్రాశ్, డాబర్ ఎర్ర పళ్ళపొడి
  • మ్యాంగో ఫ్రూటీ - ఫ్రెష్ అండ్ జ్యూసీ

స్వతంత్ర భారతంలో ప్రకటన కాలావధులని నాలుగుగా విభజించవచ్చునని విల్లియం మాజెరెల్లా అనే నృశాస్త్రవేత్త పేర్కొన్నాడు.

  • 60 నుండి 80 వ దశకం వరకు: మునుపటి శైలికి పూర్తి విరుద్ధంగా ఇందులో బ్రిటీషు వాసన ఏ మాత్రం లేని సృజనాత్మకత పాళ్ళు ఎక్కువగా ఉండే ప్రకటనలు ఈ దశలో ఉండేవి.
  • 80 వ దశకం నుండి: ఇందులో రెండు శైలులు ఉన్నవి
  • స్వాతంత్ర్య సిద్ధి నుండి 60వ దశకం వరకు: భారతీయ ప్రకటనలపై బ్రిటీషు ప్రభావం తీవ్రంగా ఉండేది. వాస్తవికతకి దగ్గరగా, ఏ మాత్రం సృజనాత్మకత లేనివిగా ఈ దశలో ప్రకటనలు ఉండేవి.
  • యావత్ దేశాన్ని ప్రభావితం చేయగలిగే విపణీకరణ ప్రసారమార్గాలని Marketing Channels ని నెలకొల్పటం
  • ప్రస్తుత కాలావధి విపణీకరణ యంత్రీకరణలని Marketing Mechanisms క్రోడీకరించి సృజనాత్మక తారాస్థాయిగా ఉంటున్న ప్రకటనల దశ


                                     

2. ప్రకటనలలో రకాలు

ప్రకటనలను మూడు రకాలుగా విభజించ వచ్చును. అవి

  • ఇతర ప్రకటనలు
  • వ్యాపార ప్రకటనలు
  • ప్రభుత్వ ప్రకటనలు,

వ్యాపార ప్రకటనలు

వీటి యొక్క ముఖ్య ఉద్దేశం వినియోగదారులను ఆకట్టుకోవడం. వ్యాపార ప్రకటనలను ప్రసారం చేయుటకు మీడియా ఎంతో సహకరిస్తుంది. ఉదాహరణ: సబ్బులు, చాక్లెట్లు ప్రకటనల వంటివి.

                                     

2.1. ప్రకటనలలో రకాలు వ్యాపార ప్రకటనలు

వీటి యొక్క ముఖ్య ఉద్దేశం వినియోగదారులను ఆకట్టుకోవడం. వ్యాపార ప్రకటనలను ప్రసారం చేయుటకు మీడియా ఎంతో సహకరిస్తుంది. ఉదాహరణ: సబ్బులు, చాక్లెట్లు ప్రకటనల వంటివి.

                                     

3.1. వాణిజ్యేతర ప్రకటనలు భిన్నత్వంలో ఏకత్వం

80 వ దశకంలో భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని పుణికిపుచ్చుకొన్నదని తెలియజేయటానికి రెండు ప్రకటనలు జరిగాయి.

  • ప్రముఖ క్రీడాకారులు పరుగెత్తుతూ ఒకరికొకరు కాగడా అందించుకొంటుండగా నేపథ్యంలో సంగీతం వినిపిస్తూ ఉంటుంది. చివరిలో జాతీయ గీతం అంతిమ భాగమైన "జయహే జయహే జయహే జయ జయహే" ఇందులో వినిపిస్తుంది.
  • ప్రముఖ కళాకారులు వివిధ భాషలలో మిలే సుర్ మేరా తుమ్హారా తెలుగులో ఇదే నా స్వరము నీ స్వరము సంగమమై మన స్వరంగా అవతరించే అని పాడుతూ సందడి చేశారు.
                                     

3.2. వాణిజ్యేతర ప్రకటనలు ఇతర ప్రకటనలు

ఇటు వ్యాపార వర్గం నుండి గాని, అటు ప్రభుత్వం నుండి కాకుండా స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ప్రచురించే ప్రకటనలను ఈ వర్గం కిందకు చేర్చవచ్చు. ఎవరైనా పెద్ద మనిషి విదేశయానానికి వెళ్తున్నప్పుడుగాని, తిరిగి వస్తున్నాప్పుడుగాని, లేదా షష్టిపూర్తి, జన్మ దినం వేడుకలకు గాని వ్యక్తిగత ప్రకటనలు వెలువడటం మనం చూస్తుంటాము. అలాగే స్వచ్ఛంద సంస్థలు, రక్త దానం గురించి, కన్ను దానం గురించి, కంటి బాంకు గురించి, సమాజంలోని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగాను ప్రకటనలు ఇస్తూ ఉంటాయి.

వ్యక్తిగత ప్రకటనలు

స్వచ్ఛంద సంస్థల ప్రకటనలు

న్యాయస్థానాల ప్రకటనలు న్యాయ స్థానాలు ప్రభుత్వంలో విభాగాలైనప్పటికికీ, వీరు ఇచ్చే ప్రకటనలు ప్రభుత్వ ప్రకటనల కిందికి రావు. వివాదంలో ఉన్న ఆస్తుల గురించి, ఆస్తుల అమ్మకం, వేలం గురించి, తెరిగొచ్చిన కోర్టు సమన్ల గురించిన ప్రకటనలు, న్యాయస్థానాలు వార్తా పత్రికలలో ప్రకటిస్తాయి.

బ్యాంకుల ప్రకటనలు న్యాయ స్థానాల లాగానే, బాంకులు కూడా కొన్ని ప్రకటనలు ఇస్తూ ఉంటాయి. తమకు తనఖా పెట్టబడి, ఋణం తీర్చని కారణాన, తాము స్వాధీన పరుచుకున్న ఆస్తుల గురించి, కనపడకుండా పోయిన ఋణగ్రస్తుల గురించి, న్యాయస్థానంలో వ్యాజ్యం వెయ్యబొయ్యే ముందు, ఇంకా అనేక ఇటువంటి సందర్భాలలో ప్రకటనలు ఇస్తూ ఉంటాయి. బాంకులు తమ ఋణ లావాదేవీలు, వాటిలో వచ్చే వివాదాలు/వ్యాజ్యాల గురించిన ప్రకటనలు ఇతర ప్రకటనలకింద వస్తాయి. ఇవే బ్యాంకులు, వారి డిపాజిట్ పథకాలు, వారి ఋణ పథకాలగురించి ప్రకటనలు ఇస్తే అవి వ్యాపార ప్రకటనలు అవుతాయి.



                                     

4. పాశ్చాత్య దేశాలలో ప్రకటనలు

భారతదేశంలోని సంఘసంస్కృతుల వలన, ఇక్కడి ప్రకటనలు ఒక మోస్తరుగా ఉన్ననూ, పాశ్చాత్య దేశాలలో ప్రకటనలలో మాత్రం విచ్ఛలవిడితనం పాళ్ళు ఎక్కువే. ఈ విచ్ఛలవిడితనమే అక్కడి ప్రకటనా రంగాన్ని అనేక విమర్శల వైపు నడిపించినదనటంలో అతిశయోక్తి లేదు. కండోం వంటి లైంగిక ఉత్పత్తులని ప్రకటించటానికి భారత్ లోని ప్రకటన సంస్థలు ఎంతగానో ఆలోచించి, శృంగారం పాళ్ళు మోతాదు మించకుండా జాగ్రత్తపడి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటనలతో వాటి వినియోగాన్ని పెంచటంలో సఫలీకృతులయ్యారు. అయితే పాశ్చాత్య దేశాలలో స్నానపు సబ్బు, పర్ఫ్యూం, జీన్స్ లేదా పత్రికల వంటి సాధారణ ఉత్పత్తులకి కూడా అనవసర లైంగికతని వినియోగించిన సందర్భాలు కోకొల్లలు. ఒక్కోమారు ఈ లైంగికత శృతి మించి అశ్లీలతగా అవతరించింది. వినియోగదారుని అవసరాలు గుర్తించి వారికి సరియైన ఉత్పత్తి/సేవలని సూచించవలసిన ప్రకటనలు, అక్కడి భావప్రకటన స్వేచ్ఛని దుర్వినియోగపరచి లైంగికత/అశ్లీలలత మధ్య ఉన్న సన్నని గీతని చెరిపివేయటం, వినియోగదారుని మానసిక బలహీనతలని కూడా ప్రకటనలలోకి చొప్పించటం మూలాన అక్కడి ప్రజాసంఘాలు వీటిని గుర్తించి ప్రకటన రంగం పై తీవ్రమైన వ్యతిరేకతని సృష్టించారు. స్త్రీ-పురుషుల అర్థనగ్న/నగ్న చిత్రాలని ఒక్కోమారు విడివిడిగా, ఒక్కోమారు ఇరువురినీ కలిపి ప్రదర్శించటం, స్వలింగ సంపర్కుల, అసాధారణ శృంగార పోకడలని చిత్రించటం వంటివి చేశారు. ఇది ఎంతవరకు సబబు అనేది నిర్థారించటం కష్టతరమే. పాశ్చాత్య దేశాలలో ప్రకటన రంగం నిత్యం భావవ్యక్తీకరణ స్వేఛ్ఛకి, ప్రకటనల విపరీత పోకడలకి మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది.

== భారతదేశంలో విమర్శలకు గురైన ప్రకటనలు ==etuuytikoh

హాస్యానికై కిట్ప్లై తాము రూపొందించిన వాణిజ్య ప్రకటనలో శోభనం నాడు కిర్రుమంచాన్ని వేసినందుకు వధువు వరుణ్ణి చెంపదెబ్బ కొట్టటం సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ విమర్శించింది. కారణాలను ఈ విధంగా పేర్కొన్నది:

  • ఏ రకమైన గృహహింసనూ ప్రోత్సహించరాదు, భర్త పై కూడా, కాబట్టి
  • ఇది పురుషులను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బాధిస్తుంది కాబట్టి
  • కిట్ప్లైకు ఇది హాస్యాస్పదం కావచ్చు, కానీ పురుషులకు కాదు, కాబట్టి
  • ఇదే ప్రకటనలో పాత్రల స్థానాన్ని మార్చి దానిని కిట్ప్లై ప్రసారం చేస్తే అది ఒక విప్లవాన్నే సృష్టిస్తుంది కాబట్టి
  • ఇటువంటి ప్రకటనల వలనే, భర్త స్థానంలో ఉన్న పురుషులు, ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి
  • భర్తను చెంపదెబ్బ కొట్టటంలో తప్పేమీ లేదు, అనే సందేశాన్ని ఈ ప్రకటన పంపుతుంది కాబట్టి
  • ఇది గృహహింసను పెంపొందించే విధంగా ఉన్నది

ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు -

There is a big hue and cry if a wife is hurt by her husband, but a blind eye is turned when there’s a public display of a wife hitting her husband. Any sort of violence between the spouses is considered illegal and termed as domestic violence or gender violence across the world. Depicting violence on national TV is unacceptable. భర్త చే భార్య హింసించబడ్డదని తెలిస్తే లబోదిబోమని కొట్టుకొనే వారు, అదే భార్య చే భర్త హింసించబడినట్లు కంటికెదురుగా కనబడుతున్నా చూసీ చూడనట్లు వెళ్ళిపోతారు. జీవిత భాగస్వాముల మధ్య ఏ రకమైన హింస అయినా గృహ హింస గానే ప్రపంచవ్యాప్తంగా పరిగణించబడుతోంది. యావద్దేశం వీక్షించే టీవీ లో హింస ఆమోదయోగ్యం కాదు.

- అని తెలిపారు.

కొన్ని స్త్రీ సంఘాలు కూడా ఈ వాదనను సమర్థించాయి.

ఇలాగే పాండ్స్, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ ప్రకటనలు కూడా వివాదాస్పదమయ్యాయి. చెన్నయ్ కు చెందిన ఇందియా కుడుంబ పాదుగాప్పు ఇయాకం కు చెందిన సురేష్ రాం -

The Ponds ad terms husbands as wife beaters and the ICICI ad portrays verbal and economical abuse against men.

- అని తెలిపారు.

                                     

5. మాధ్యమాలు

మారుతున్న కాలంతో బాటు ప్రసార మాధ్యమాలు మారుతూ వచ్చాయి. ప్రసార మాధ్యమాలకి అనుగుణంగా ప్రకటన చేసే విధానాలు కూడా మారుతూ వచ్చాయి.

ఉదా:

  • ముద్రణ మాధ్యమమైన దిన, వార, మాస పత్రికలు
  • రేడియో
  • బహిరంగ ప్రదేశాలు హోర్డింగ్/ఫ్లెక్సీలు, డిజిటల్ సైనేజ్ లు
  • టీవీ
  • ఆన్లైన్
                                     

6. ప్రకటనల వల్ల దుష్ఫలితాలు

ప్రకటనలు ఎక్కడ ఉండవచ్చు, ఎంత మేరకు ఉండవచ్చు వంటి అనేక విషయాల పై చర్చ పాశ్చాత్య దేశాలలో చాలా పెద్ద చర్చలే జరిగాయి.

ప్రకటనా కాలుష్యం

ప్రకటనలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ధ్వని/దృశ్య కాలుష్యాలని పెంచుతాయి అనే వాదన ఉంది. ప్రకటనలు ఖాళీ స్థలాలని ఆక్రమించటం వలన, వ్యక్తిగత పరిధిని ముట్టడించటం వలన చాలా మంది ప్రజలు ప్రకటనలపై విసుగు పడే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రపంచంలో ప్రకటన లేని ప్రదేశం లేదంటే అతిశయోక్తి లేదేమో. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, సినిమా హాళ్ళు, అమ్యూజ్ మెంట్ పార్కులు, షాపింగ్ మాల్ లు, ATM లు, వంతెనలు, చివరకు చెత్త డబ్బాలు, మరుగుదొడ్ల పై కూడా ప్రకటనలు ఉన్నాయి.

                                     

7. ఇవీ చూడండి

ప్రకటన పేరుగల కొన్ని విషయాలు:

  • బైబిల్ లోని చివరి గ్రంథం పేరు ప్రకటన. అంత్యదినాల్లో ఏమేమి జరుగుతాయో దైవదూతలు మానవాళికి చేసిన ప్రకటనలు ఈ గ్రంథంలో ఉన్నాయి.
                                     

8. బయటి లింకులు

  • Ad*Access, Duke University Library
  • Bibliography on Web Advertising
  • Advertising Educational Foundation, archived advertising exhibits and classroom resources
  • Online Interactive History of Advertising
  • American print advertising archive 1930 - 1969
  • Archive Advertisements from Old Theatre Programmes
  • The History of Advertising Trust Archive of advertising from c. 1800- to present.
  • The British Library - finding information on the advertising industry
  • On-Line exhibits at William F. Eisner Museum of Advertising and Design
                                     

9. మూలాలు

  • సాధారణ ప్రకటనలకి అనవసరంగా లైంగికత చొప్పించే విదేశీ ప్రకటనా రంగం
  • ప్రకటనలు, సంఘము గురించి తెలిపే
  • భారతదేశంలో అడ్వర్టైజింగ్ ఏజెన్సీల చరిత్ర గురించి తెలిపే
                                               

సాహిత్య అకాడమీ యువ పురస్కారం

కేంద్ర సాహిత్య అకాడమీ గుర్తించిన భాషల్లో ఉత్తమ సాహిత్య సృష్టి చేసిన 35 సంవత్సరాలలోపు సాహిత్యవేత్తలకు ఈ యువపురస్కారన్ని ప్రకటిస్తారు.2011లో ఈ పురస్కారం ప్రారంభించబడింది. ఈ పురస్కారం క్రింద 50.000 రూపాయల నగదు, జ్ఞాపికలను బహూకరిస్తారు.

1776
                                               

1776

ఆగష్టు 2: కాంటినెంటల్ కాంగ్రెస్ కి హాజరు కావటానికి వచ్చిన ప్రతినిధులు అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్ర్య ప్రకటన పై సంతకాలు చేయటం మొదలు పెట్టారు. ఆగష్టు 2: హెన్రీ హడ్సన్ పసిఫిక్ మహాసముద్రం లోని హడ్సన్ బేని కనుగొన్నాడు. హడ్సన్ పేరుతో, ఆ ప్రాంతాన్ని హడ్సన్ బేగా పేరు పెట్టారు.