Топ-100
Back

ⓘ బ్రహ్మ సమాజం బ్రహ్మసిద్ధాంతపు సామాజిక రూపం. నవభారతంలో తన ప్రగాఢ ప్రభావాన్ని చూపిన ఈ సమాజం, సామాజిక-ధార్మిక ఉద్యమంగా భావింపబడుతుంది. 19వ శతాబ్దంలో బెంగాల్ లో ఒక ..




                                               

బ్రహ్మ సమాజం

బ్రహ్మ సమాజం బ్రహ్మసిద్ధాంతపు సామాజిక రూపం. నవభారతంలో తన ప్రగాఢ ప్రభావాన్ని చూపిన ఈ సమాజం, సామాజిక-ధార్మిక ఉద్యమంగా భావింపబడుతుంది. 19వ శతాబ్దంలో బెంగాల్ లో ఒక సామాజిక-ధార్మిక సంస్కరణల ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ ఉద్యమం బెంగాల్ లో బయలుదేరింది కావున ఈ ఉద్యమానికి బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం అనికూడా గుర్తిస్తారు. రాజారాం మోహన్ రాయ్ ఈ బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పితామహుడిగా పిలువబడుతాడు, ఇతడ ..

                                               

ముట్నూరి కృష్ణారావు

ముట్నూరి కృష్ణారావు పాత్రికేయుడు, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు, కృష్ణా పత్రిక సంపాదకుడు. ఈయన 1907 నుండి 1945లో మరణించేవరకు నాలుగు దశాబ్దాల పాటు కృష్ణా పత్రిక సంపాదకునిగా తెలుగు సాహితీ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు.

                                               

అనీ బిసెంట్

అనీ బిసెంట్, బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మ జ్ఞానవాది, మహిళాహక్కుల ఉద్యమవాది, రచయిత. ఆమె వాక్పటిమ కలిగిన స్త్రీ. అనీ వుడ్ బిసెంట్ ఐరిష్ జాతి మహిళ. లండను లోని క్లఫామ్ లో, 1847 అక్టోబరు 1 న జన్మించింది. 1933 సెప్టెంబరు 20 న తమిళనాడు లోని అడయారులో మరణించింది. ఈమె దివ్యజ్ఞాన తత్వజ్ఞి, మహిళల హక్కుల ఉద్యమకారిణి, రచయిత, వక్త. ఈమె ఐర్లాండ్, భారతదేశాల స్వాతంత్ర్యం, స్వయంపాలన కొరకు పోరాడింది. స్వయం పాలన ఉద్యమం స్థాపించింది. తల్లి ధార్మిక స్వభావి. తండ్రి డా. విలియం ఫేజ్ గొప్ప విద్వాంసుడు. 1867 డిసెంబరులో తన 19 వ ఏట, తల్లి కోరికమేరకు ఫాదర్ ఫ్రాంక్ బిసెంట్ ని అనిబిసెంట్ పెళ్ళి చేసుకుంది. అంతవరకూ అనీగా పిలవ ...

                                               

భాగ్యరెడ్డివర్మ

దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడు. జగన్మిత్రమండలి, మన్యసంఘం, సంఘసంస్కార నాటకమండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరాబాదు ప్రాంతంలో సంఘసంస్కరణలకై కృషిచేశాడు.

                                               

చిట్టమూరు రామయ్య

చిట్టమూరు రామయ్య తెలుగు అనువాదకులు, అనీ బిసెంట్ అనుచరులు. ఇతడు చిట్టమూరు శ్రీరాములు కుమారుడు. వీరు సాహిత్యంలో డిగ్రీ పూర్తిచేసి, అడయార్ లోని థియోసాఫికల్ సొసైటీ ద్వారా అనీ బిసెంట్తో పనిచేశారు. వీరు థియోసఫీ గురించి చాలా పుస్తకాలు రచించారు. వీటిలో "The Essence of Theosophy" అనగా దివ్య జ్ఞాన సారము, ముఖ్యమైనది. దీని యొక్క రెండవ ముద్రణ వసంత ఇన్ స్టిట్యూట్ మేనేజర్ సి.సుబ్బారాయుడు 1937లో మద్రాసులో ముద్రించారు. వీరిదే మరొక ప్రచురణ, బ్రహ్మ విద్యా దర్పణము ("Hinduism in Light of Theosophy", ను 1941 ముద్రించి అనీ బిసెంట్ కు అంకితమిచ్చారు. ఇతడు జిడ్డు కృష్ణమూర్తి గారి రచన At the Feet of the Master ను తె ...

                                               

చిత్రపూర్ సరస్వత బ్రాహ్మణులు

భారతదేశంలోని హిందూ బ్రాహ్మణుల యొక్క కొంకణి-మాట్లాడే చిన్న సమాజం చిత్రపూర్ సరస్వత బ్రాహ్మణులు. వీరు సాంప్రదాయకంగా కనరా తీరంలో కనిపిస్తారు, కొంకణి భాషలో వీరిని భానప్స్ అని పిలుస్తారు.