Топ-100
Back

ⓘ బ్రహ్మ సమాజం బ్రహ్మసిద్ధాంతపు సామాజిక రూపం. నవభారతంలో తన ప్రగాఢ ప్రభావాన్ని చూపిన ఈ సమాజం, సామాజిక-ధార్మిక ఉద్యమంగా భావింపబడుతుంది. 19వ శతాబ్దంలో బెంగాల్ లో ఒక ..
                                               

బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము

బ్రిటిష్ ఇండియాలో 1911 వరకూ కలకత్తా భారత రాజధాని కావడము చేత బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము యొక్క ప్రభావము దేశము మొత్తము పై ఉంది. 19వ శతాబ్దము, 20 వ శతాబ్దపు మొదటి భాగములలో బ్రిటిష్ ఇండియాలో బెంగాల్ ప్రస్తుత పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతములో జరిగిన సామాజిక విప్లవాలను కలిపికట్టుగా బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము ఆంటారు. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనము రాజా రామ్మోహన్ రాయ్ 1775-1833 తో మొదలై రవీంద్రనాథ్ టాగోర్ 1861-1941 తో అంతమైనది అని చెప్పవచ్చు. టాగోర్ తరువాత కూడా దిగ్గజాల వంటి మహానీయులు పుట్టి కళలను, సృజనాత్మకతను ప్రోత్సహించారు. 19వ శతాబ్దపు బెంగాల్ మత, సామాజిక ఉద్దారకులు, పండితులు, సాహిత ...

                                               

ప్రతాప్ చంద్ర ముజుందార్

ప్రతాప్ చంద్ర ముజుందార్ Protap Chunder Mozoomdar) హిందూ సంస్కరణా ఉద్యమమైన బ్రహ్మ సమాజము యొక్క సభ్యుడు, కేశవ చంద్ర సేన్ యొక్క అనుయాయి. ఈయన యేసుక్రీస్తు యొక్క బోధనలలో ప్రాచ్య దర్శనాల ప్రభావంపై పరిశోధనలకుగాను ప్రసిద్ధుడైనాడు. భారతదేశంలో హిందూ, క్రైస్తవ దర్శనాల మధ్య జరిగిన పరస్పర సంభాషణలకు ఈయన చక్కని ఉదాహరణ. ముజుందార్, ఓరియంటల్ క్రైస్ట్ అనే గ్రంథాన్ని రచించాడు.

                                               

రామ్మోహన్ రాయ్

రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్, భారతదేశంలో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించాడు. అతని విశేషమైన ప్రభావం రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్యా రంగాలలోనే కాకుండా హిందూమతం పైన కూడా కనపడుతుంది. ఇతడు గొప్ప సంఘసంస్కర్త. బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పటి సతీసహగమన సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి చాలా కృషిచేశాడు. వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చాడు. స్త్రీవిద్యకై పాటుపడ్డాడు. బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు.ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి, దేశంలో ఆంగ్ల విద్యావిధానానికి కృషిచేశాడు. 1828 లో ఇంగ్లాండుకు వెళ్ళక ముందు ద్వారకా నాథ టాగూర్తో కలసి బ్రహ్మసమాజ్ ను స్థాపించాడు. బ్రహ్మసమాజ్ ఒక ముఖ్యమైన ఆధ్యాత్ ...

                                               

భక్త ప్రహ్లాద (నాటకం)

భక్త ప్రహ్లాద ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన నాటకం. తెలుగు నాటకరంగంలో 19 భక్త ప్రహ్లాద నాటకాలు ప్రదర్శన చేయగా, వాటిల్లో ఆంధ్ర నాటక హితామహులుగా పేరుగాంచిన ధర్మవరం రామకృష్ణాచార్యులు రాసిన ఏడొవది భక్త ప్రహ్లాద నాటకం బాగా జనాదరణ పొందింది.

                                               

వితంతు వివాహం

వితంతు వివాహం అనగా భర్త మరణించిన ఆడవారికి మళ్ళీ పెళ్ళి చెయ్యటము. కొంతమంది చిన్న వయసులోని బాలికలను కన్యాశుల్కం మీద ఆశతో వృద్ధులకిచ్చి వివాహం జరిపించే వారు. అందువల్ల ఆ బాలికలు తొందరగా వితంతువులు అయ్యేవారు. అప్పటి సాంఘిక పరిస్థితుల ప్రకారం వారు వివక్షను ఎదుర్కొనే వారు. వారికి పునర్వివాహం చేయడం ద్వారా వారి జీవన విధానాన్ని మెరుగుపరచడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం.

                                               

ఎవరికీ తలవంచకు (పుస్తకం)

ఎవరికీ తలవంచకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి మానసిక వ్యక్తిత్య పుస్తకం. ఈ పుస్తకాన్ని వాడ్రేవు చినవీరభద్రుడు తెనుగీకరించారు. దీన్లో తన అనుభవాలను అనేకం చెప్తూ విద్యార్థులకు ఉపయోగపడు అనేక విశేషాలను జతచేసారు రచయిత.

                                     

ⓘ బ్రహ్మ సమాజం

బ్రహ్మ సమాజం బ్రహ్మసిద్ధాంతపు సామాజిక రూపం. నవభారతంలో తన ప్రగాఢ ప్రభావాన్ని చూపిన ఈ సమాజం, సామాజిక-ధార్మిక ఉద్యమంగా భావింపబడుతుంది. 19వ శతాబ్దంలో బెంగాల్ లో ఒక సామాజిక-ధార్మిక సంస్కరణల ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ ఉద్యమం బెంగాల్ లో బయలుదేరింది కావున ఈ ఉద్యమానికి బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం అనికూడా గుర్తిస్తారు. రాజారాం మోహన్ రాయ్ ఈ బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పితామహుడిగా పిలువబడుతాడు, ఇతడే ఈ బ్రహ్మ సమాజ స్థాపకుడు. ఈ సమాజం ప్రత్యేకంగా, హిందూ సమాజంలో మతపరమైన, విద్యాపరమైన సంస్కరణలు తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశంగా పనిచేసింది. భారతదేశంలో ఈ ఉద్యమాన్ని చట్టపరమైన ధర్మంగా కూడా గుర్తింపు ఉంది. బెంగాల్ లోనే గాక, పొరుగుదేశమైన బంగ్లాదేశ్ లోనూ దీని ప్రభావం స్ఫూర్తిదాయకమైనది. ఈ సమాజపు సిద్ధాంతాలలో హిబ్ర్యూ, ఇస్లామీయ సిద్ధాంత సాంప్రదాయలను జోడించడం కానవస్తుంది.

                                     

1. అర్థాలు, పేర్లు

బ్రహ్మో ব্রাহ্ম bramho సాహితీపరంగా అర్థం "బ్రహ్మన్ ను పూజించేవాడు", సమాజ్ সমাজ shômaj అనగా "మానవ సంఘం".

ఆగస్టు 20 1828 న, బ్రహ్మసమాజానికి చెందిన మొదటి సమావేశం, ఉత్తర కలకత్తాలోని ఫిరంగీ కమల్ బోస్ ఇంట్లో జరిగింది. ఈ దినాన్ని, భద్రోత్సబ్ ভাদ্রোৎসব లేదా తెలుగులో "భద్రోత్సవం" అనే పేరుతో జరుపుకుంటారు.

                                     

2. సమాజ స్థాపన

7వ పౌస్ 1765 శకము 1843 న దేవేంద్రనాథ్ టాగూర్, ఇతర 20 మంది తత్వబోధిని అనుయాయులు సమావేశమైనారు. బ్రహ్మ సభ ట్రస్టుకు పండిట్ విద్యాబగీష్, వీరిని ఆహ్వానించారు. శాంతినికేతన్ లో పౌస్ మేళా ఇదే రోజున ప్రారంభమవుతుంది. ఈ సమావేశాన్నే, బ్రహ్మ సమాజపు ఆరంభం అని భావింపవచ్చు. ఈ సమాజం కలకత్తా బ్రహ్మ సమాజం అనికూడా పిలువబడుతుంది. ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర బ్రాహ్మణులు:-

 • శ్రీధర్ భట్టాచార్య
 • తారకనాథ్ భట్టాచార్య.
 • బ్రజేంద్రనాథ్ టాగూర్
 • గిరీంద్రనాథ్ టాగూర్, ఇతను దేవేంద్రనాథ్ టాగూరుకు అన్న, గణేంద్రనాథ్ టాగారుకు తండ్రి.
 • హరదేవ్ చటోపాధ్యాయ
 • శ్యాంచరణ్ భట్టాచార్య
 • ఆనందాచార్య భట్టాచార్య.
 • శ్యామచరణ్ ముఖోపాధ్యాయ
 • శశిభూషణ్ ముఖోపాద్యాయ
 • రామనారాయణ్ చటోపాధ్యాయ
                                     

3. సామాజిక & మతపర సంస్కరణలు

సామాజిక సంస్కరణల మైదానాలైనటువంటి, కుల సిద్ధాంతం, వరకట్నం, స్త్రీ విమోచన ఉద్యమం, విద్యావిధానాలను మెరుగుపరచడం లాంటివి, బ్రహ్మ సమాజం బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం నుండి గ్రహించింది. బెంగాల్ పునరుజ్జీవన ప్రభావం దీనిపై ఎక్కువగా వుండినది. వరకట్న నిషేధాల విషయాలపై చర్చలు శరత్ చంద్ర చటోపాధ్యాయ బెంగాలీ భాషలో రచించిన నవల పరిణీత నుండి సంగ్రహించారు.

బ్రహ్మ సమాజ నవీన సంస్కరణలు

క్రింది విషయాలు నవీన సంస్కరణలు బ్రహ్మ సమాజం వెబ్‌సైటు

 • లంచగొండితనం రూపుమాపడం, త్రాగుడు, టెలివిజన్, దేవదాసి విధానం, రాజకీయాలను త్యజించడం.
 • వ్యక్త్గగత, సెక్యులర్ చట్టాలలో చట్టపర సంస్కరణలు తీసుకురావడం.
 • సతీసహగమనాన్ని రూపుమాపటం.
 • బహుఈశ్వరవాదాన్ని త్యజించడం.
 • విద్యావిధానాల సంస్కరణలు.
 • వితంతువుల పునర్వివాహాలు.
 • స్త్రీ విమోచనం.
 • కులవిధానాలను రూపుమాపడం.
 • జ్ఞానాన్ని విశ్వవ్యాపితం చేయడం.
 • కట్నకాలుకలను రూపుమాపడం.
 • వైయక్తిక, సామాజిక జీవితాలలో సాదాజీవనం, సచ్ఛీలత.


                                     

4. సిద్ధాంతము

క్రింద నుదహరించిన సిద్ధాంతాలు, "హిందూత్వ పునరుజ్జీవనం" లోని భాగాలు, ఈ సిద్ధాంతాలే బ్రహ్మ సమాజ సిద్ధాంతాలకు ఆయువుపట్టు లాంటివి.

 • బ్రహ్మసమాజానికి, దేవుని అవతారాలపై విశ్వాసంలేదు.
 • బ్రహ్మసమాజానికి, గ్రంథాలపై వాటి అధికారికతపై విశ్వాసంలేదు.
 • బ్రహ్మసమాజం, బహుఈశ్వరవాదాన్నీ, విగ్రహారాధనను ఖండిస్తుంది.
 • బ్రహ్మసమాజంలో కర్మసిద్ధాంతాలు, పునర్జన్మ సిద్ధాంతాలు ఐచ్ఛికం.
 • బ్రహ్మసమాజం, కుల సిద్ధాంతానికి వ్యతిరేకం.
                                     

5. బయటి లింకులు

 • Brahmo Samaj in the Encyclopædia Britannica
 • Brahma Sabha in the Banglapedia
 • brahmosamaj.org
 • Brahmo Samaj of Delhi
 • "The Tagores & Society" from the Rabindra Bharati Museum at Rabindra Bharati University
                                               

బ్రహ్మ (అయోమయ నివృత్తి)

బ్రహ్మ త్రిమూర్తులలో సృష్టికర్త. బ్రహ్మ, 1992లో విడుదలైన తెలుగు సినిమా. బ్రహ్మ సమాజం, ప్రసిద్ధిచెందిన సామాజిక సేవాసంస్థ. బ్రహ్మ వైవర్త పురాణం, అష్టాదశ పురాణాలలో ఒకటి. బ్రహ్మ పురాణము, అష్టాదశ పురాణాలలో ఒకటి.