Топ-100
Back

ⓘ గార్గి హిందూ పురాణాలలో యోగిని. బ్రహ్మజ్ఞానం పొందింది. సకల వేదాలు, శాస్త్రాలు అవగతం చేసుకొన్న జ్ఞాని. వచక్నుడి కుమార్తె. బ్రహ్మచారిణి. పరబ్రహ్మ యొక్క ఉనికిని ప్ర ..
                                               

ఆదర్శ వనితలు

"యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" అన్నారు పెద్దలు. ఆడవాళ్ళకు గౌరవం ఉన్నచోట దేవతలు విహరిస్తారు అని దీని అర్థం. వేద కాలం నాడు మహిళకే అగ్రస్థానం. ఇంటి పెత్తనం ఆమెది. అన్ని విషయాలలో ఆమె మాటే వేదం. ఆనాడు పురుషులతో సమంగా చదువుకున్న వారూ ఉన్నారు. శాస్త్ర విషయాలు వాదించి నెగ్గినవారూ ఉన్నారు. మధ్యలో కొన్ని మూఢ నమ్మకాలు, చాదస్తాలు వారి స్థానాన్ని కిందికి దించాయి. ఆడవారికి చదువుకోవడం తగదన్నారు. ఇంకా ఎన్నో నిర్బంధాలు. ఈ విధంగా సంకెళ్ళలో చిక్కుకున్న అతివ అబల అన్నారు. ఆడవాళ్ళు అంటే ఇంట్లో వంట చేయడము వరకే అని హద్దులు గీచారు. దీని ఫలితంగా ఆడవాళ్ళు వంటింటికే పరిమితమైనారు. అనేకమైన దురాచారాలకు బలిపశ ...

                                               

జ్ఞానాంబ

ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ గారి" ”ఆంధ్రకవయిత్రులు”” లో ఈ రచయిత్రిగురించి ఇచ్చిన వివరాలు – ఈమెకి తల్లిదండ్రులు కనకదుర్గా వరప్రసాదిని అని పేరు పెట్టేరు. తొమ్మిదేళ్ళ వయసులో తనకు తానై చదువుకుంటానని అడిగితే, తల్లి ఆమెకి విద్య నేర్పేరు. అక్షరాభ్యాసమైన పదునైదు దినములకే ఆమె చక్కగా చదువను, వ్రాయను నేర్చినది. చిన్నతనమునుండి సహజములైన ఏకసంధాగ్రాహిత్వము, ధారణాశక్తి, ప్రకృతిపరిశీలనము, అన్నింటను మించిన పరమేశ్వర భావము నొండొంట తోడుపడి, ఆమెను ఉత్తమకవయిత్రిని జేసినవి. పన్నెండవ యేట శ్రీ సీతారామావధూతగారిని గురువులుగా స్వీకరించి, సంసారజీవనం త్యజించి, సన్యాసం పుచ్చుకున్నారు. గురువు ఆమెపేరు జ్ఞానాంబ అని మార్చేరు. చి ...

                                               

సోనాల్ చౌహాన్

సోనాల్ చౌహాన్ ఒక భారతీయ ఫ్యాషన్ మోడల్, గాయకురాలు, నటి, ప్రధానంగా తెలుగు సినిమా, హిందీ సినిమాల్లో పనిచేస్తున్నారు. ఆమె అనేక అందాల పోటీలను గెలుచుకుంది, ఆమె "జన్నత్" అనే హింది చిత్రంలో తొలిసారిగా నటించింది.

                                               

ఉపనిషత్తు

హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు. ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు. ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు ...

                                               

ఉమాశంకర్ జోషి

ఉమాశంకర్ జేతాలాల్ జోషి గుజరాతీ కవి, పండితుడు, రచయిత. గుజరాతీ సాహిత్యానికి అతని రచనల ద్వారా చేసిన సేవకు గుర్తింపుగా 1967లో జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నాడు.

                                               

పంజాబీ కవులు

పంజాబీ ప్రఖ్యాత కవుల జాబితా‌. గురు గోబింద్ సింగ్ 17వ శతాబ్దం జస్వంత్ సింగ్ రాహీ 20 వ శతాబ్దం సుఖ్ దర్శన్ దలివాల్ 20 వ శతాబ్దం డాక్టర్ హర్భజన్ సింగ్ 20 వ శతాబ్దం సంత్ రామ్ ఉదాసి 20 వ శతాబ్దం మియాన్ ముహమ్మద్ బక్ష్ 19వ శతాబ్దం సాలెహ్ ముహమ్మద్ సఫూరి 17వ శతాబ్దం గురు రామ్ దాస్ 16వ శతాబ్దం షంషేర్ సింగ్ సంధు 3 మార్చి 1937 శర్ధా రామ్ ఫిల్లవూరి షా హుస్సేన్ 16వ శతాబ్దం సుర్జిత్ పాటర్ 20 వ శతాబ్దం బాబు రజబ్ అలీ 19వ శతాబ్దం హషీం 19 వ శతాబ్దం అమృతా ప్రీతమ్ 20 వ శతాబ్దం షరీఫ్ కుంజాహీ 20 వ శతాబ్దం మునీర్ నియాజి చమన్ లాల్ చమన్ 20 వ శతాబ్దం భాయ్ వీర సింగ్ 20 వ శతాబ్దం ఫార్రుఖ్ హుచ్మయౌన్ 20 వ శతాబ్దం బల్వంత ...

                                     

ⓘ గార్గి

గార్గి హిందూ పురాణాలలో యోగిని. బ్రహ్మజ్ఞానం పొందింది. సకల వేదాలు, శాస్త్రాలు అవగతం చేసుకొన్న జ్ఞాని. వచక్నుడి కుమార్తె. బ్రహ్మచారిణి. పరబ్రహ్మ యొక్క ఉనికిని ప్రశ్నిస్తూ సూక్తాలను రచించింది. జనకుని సభలో యాజ్ఞవల్క్య ని ఆత్మ, పరమాత్మ ల గురించి గార్గి వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు, చెప్పలేని ప్రశ్నలడుగుతున్నావు అంటాడు.

గార్గి వేదకాలం నాటి మహాయోగిని.ఈమె బ్రహ్మజ్ఞానం పొందిన సాధ్వి.ఈమె సకల వేదాలు,శాస్త్రాలు అవగతం చేసుకొన్న జ్ఞానిగా పేరు పొందినది.ఆ కాలంలోని మహా జ్ఞానులలో ఈమె ఒకరు.

ఈమె వచక్నుడు అనే మహాముని యొక్క కుమార్తె.చిన్నప్పటి నుండే గార్గి యొక్క విద్యాభిలాష ప్రస్ఫుటంగా కనిపించేది.ఈమె బ్రహ్మచారిని.పరబ్రహ్మం యొక్క ఉనికిని అన్వేషిస్తూ ఈమె అనేక సూక్తాలను రచించింది.జనక మహారాజు యొక్క సభలోని నవరత్నాలలో ఈమె కూడా ఒకరు.ఈమె యొక్క పేరు జనకమహారాజు నిర్వహించిన బ్రహ్మజ్ఞానుల సభ ద్వారా వ్యాప్తి చెందినది.ఆ సభలో ఆ కాలంలో అందరికన్నా గొప్పవాడైన "యాజ్ఞవల్క్య ముని"ని ఆత్మ,పరమకారణమైన పరమాత్మ ల గురించి గార్గి వేసిన ప్రశ్నలు అతడిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి.

ఉపనిషత్తులలో గార్గి యొక్క ప్రస్తావన వస్తుంది. ముఖ్యంగా బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్నవల్క్యముని తో సంభాషణలలో ఈమె జ్ఞానపు వెలుగులు మనలను,అందరిని నిశ్చేష్టులను చేస్తాయి. ఉపనిషత్తులలో ఆమెను ఒక గొప్ప సహజ వేదాంతజ్ఞాని గా పేర్కొన్నారు.

మహాతల్లి గార్గి వేదకాలం నాటిదైనందున ఇంతకన్నా ఎక్కువ వివరాలు దొరకడం లేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.