Топ-100
Back

ⓘ సంత అంటే అంగడి. వారంలో ఏదో ఒక రోజు పెద్ద గ్రామాల్లో, పట్టణాల్లో సంత జరుగుతుంది. సంతలో వివిధ రకాలైన వస్తువులు అమ్మకానికి లభిస్తాయి. ఇది ఊరి వెలుపల బహిరంగ ప్రదేశం ..
                                               

సంత నేరెడుపల్లి

సంత నేరెడుపల్లి, విశాఖపట్నం జిల్లా, గూడెం కొత్తవీధి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన గూడెం కొత్తవీధి నుండి 44 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 162 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 26 ఇళ్లతో, 125 జనాభాతో 18 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 53, ఆడవారి సంఖ్య 72. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 125. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 585382.పిన్ కోడ్: 531133.

                                               

సంత పైడిపాల

సంత పైడిపాల, తూర్పు గోదావరి జిల్లా, రౌతులపూడి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 533 446. ఇది మండల కేంద్రమైన రౌతులపూడి నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తుని నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 591 ఇళ్లతో, 2196 జనాభాతో 433 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1080, ఆడవారి సంఖ్య 1116. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 82 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 596. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587003.పిన్ కోడ్: 533446.

                                               

పాపయ్య సంత పాలెం

పాపయ్య సంత పాలెం, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన అనకాపల్లి నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 252 ఇళ్లతో, 960 జనాభాతో 488 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 467, ఆడవారి సంఖ్య 493. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 62 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 4. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 586177.పిన్ కోడ్: 531021.

                                               

కొమ్ముచిక్కాల

కొమ్ముచిక్కాల, పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం పాలకొల్లు నుండి సుమారు ఏడు కిలోమీటర్ల దూరములో ఉంది. ఈ ఊరు చుట్టు ప్రక్కల గల కొన్ని పల్లెలకు కేంద్రం. ఊరిలో ఎక్కువగా కాపులు, రాజులు కలరు. ఇక్కడ ప్రతి సోమవారం సంత జరుగుతుంది. దీనికి చుట్టుప్రకక్ల పల్లెల నుండి అనేక మంది వస్తారు.

                                               

కడలెకాయి పరిశే

కడలెకాయి పరిశే, సంవత్సరానికి ఒక సారి బెంగుళూరులో జరుపుకునే వేరుశనగకాయల సంత. ఈ రెండు రోజుల సంత బసవన్గుడి లోని దొడ్డ గణపతి ఆలయం వద్ద జరుగుతుంది. వేరుశనగలే కాకుండా ఈ సంతలో గాజులు, సాంప్రదాయ బొమ్మలు, మట్టి వస్తువులు, ప్లాస్టిక్ గాజుతో చేసిన బొమ్మలు, గోరింటాకు పెట్టే అంగళ్ళు ఉంటాయి. బజ్జీ, బోండా, పంచదార చిలకలు, చక్కర తో చేసిన కొన్ని మిఠాయిలు, రంగు రంగు సోడా నీళ్ళు అమ్ముతారు. ఈ సంతని ప్లాస్టిక్ రహితంగా పర్యావరణానికి హాని కలగకుండా ఉండటం కోసం 2015లో బీఎంఎస్ కళాశాల విద్యార్థులు 50.000 వస్త్రపు సంచులని అమ్మకపుదారులకి పంచారు.

                                               

సదుం

సదుం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లా, సదుం మండలం లోని గ్రామం. సదుం అనె ఒక బ్ర్రితిషర్ ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టడం వలన ఈ పేరు వచ్చింది. తక్కువ వర్ష పాత ప్రాంతం అవటం వలన ఇక్కడ మామిడి తోటలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ నివసించే ప్రజలు ఎక్కువగా రైతులు, చిన్న వ్యాపారులు. ఇక్కడ ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. ఇందులో చుట్టుపక్కల ప్రాంతాల నుండి రైతులు పండించిన కూరగాయలు ఇతరాత్ర సరుకులు కొనటం అమ్ముగోలు చేయటం పరిపాటి. ఇక్కడికి దగ్గరలో గొంగివారిపల్లె అనే గ్రామంలో ప్రసిద్ధి గాంచిన పీపల్ గ్రోవే అనే అంతర్జాతీయ పాఠశాల ఉంది. ఈ పాఠశాల ప్రారంభోత్సవంలో మాజీ రాష్ట్రపతి శ్రీ ఏ.పి.జె. అబ్దుల ...

సంత
                                     

ⓘ సంత

సంత అంటే అంగడి. వారంలో ఏదో ఒక రోజు పెద్ద గ్రామాల్లో, పట్టణాల్లో సంత జరుగుతుంది. సంతలో వివిధ రకాలైన వస్తువులు అమ్మకానికి లభిస్తాయి. ఇది ఊరి వెలుపల బహిరంగ ప్రదేశంలో జరుగుతుంది. ఎందరో వ్యాపారులు తమ సామగ్రిని ఎడ్లబళ్ళమీద, లారీల్లో లేదా స్వయంగా మోసుకొని సంతకు తెస్తారు. ఉదయాన్నే డేరాలు వేసుకొని దుకాణాలు తెరుస్తారు. వ్యవసాయదారులు తాము పండించిన ధాన్యాలు, కూరగాయలు, పండ్లు మొదలైనవి అమ్మకానికి తెస్తారు. కొందరు వ్యాపారులు చిన్న పిల్లలకోసం ఆట వస్తువులు, తినుబండారాలు కూడా తెచ్చి అమ్ముతారు. సంతలో సామాన్యంగా రోజూ గ్రామంలో దొరకని వస్తువులు కూడా కొనుక్కొనే అవకాశం కలుగుతుంది.

ఆ గ్రామానికి చెందినవారే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాలవారు కూడా ఉత్సాహంగా సంతకు వస్తారు. తాము తెచ్చిన వస్తువులను అమ్మివేసి తమకు కావలసిన వస్తువులను కొనుక్కొంటారు. ప్రాచీనమైన వస్తు మార్పిడి పద్ధతి దీని నుంచే మొదలయ్యంది. దూర ప్రాంతాలకు వెళ్ళి కొనుక్కొనే వాటి కంటే సంతలో దొరికే వస్తువుల ధర తక్కువగా ఉంటుంది. ఆవులు, గేదెలు, ఎడ్లు, దున్నలు మొదలైన పెంపుడు జంతువుల అమ్మకాలు, కొనుగోలు జరుగుతాయి.

సంత నిర్వహణకు ఆ గ్రామ పంచాయితీ కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. గుడారాలకు స్థలాలు కేటాయిస్తుంది. ఇందుకోసం కొంత రుసుం వసూలు చేస్తుంది. సంతలో చెట్లు నాటి నీడ కల్పిస్తుంది. ఇలా నాటిన చెట్లు ఒక తోట లాగా కనిపిస్తుంది. దీనిని సంతోట సంత+తోట అంటారు. వర్షం వస్తే సరుకులు తడిసిపోకుండా కొన్ని షెడ్డులు కూడా నిర్మిస్తుంది. సంతలో దొంగతనాలు, అక్రమ వ్యాపారాన్ని నిరోధించడానికి పోలీసులకు గ్రామ యువజన సంఘం సభ్యులు తోడ్పడతారు.

ఇన్ని విధాలుగా గ్రామంలో అందరికీ ఉపయోగపడే సంత గురించి అందరూ ఎదురుచూస్తుంటారు.

                                     

1. రకాలు

  • సంతలో దొరికే ప్రధాన వస్తువును బట్టి సంతకు పేరు రావచ్చు. ఉదాహరణకి చేపల సంత, పశువుల సంత
  • సంత జరిగే ఊరు లేక స్థలాన్ని బట్టి, ఉదాహరణకి లింగంపల్లి సంత
  • సంత జరిగే వారాన్ని బట్టి, ఆదివారం సంత, శుక్రవారం సంత.