Топ-100
Back

ⓘ వర్గ సమాజం. డబ్బున్న వాళ్ళు - పేద వాళ్ళు, యజమానులు - కార్మికులు లాంటి తేడాలు ఉన్న సమాజమే వర్గ సమాజం. మార్క్స్ సూత్రీకరణ ప్రకారం ప్రస్తుత సమాజంలో వర్గాలు నాలుగు ..
                                               

కార్ల్ మార్క్స్

కార్ల్ మార్క్స్ జర్మన్ శాస్త్రవేత్త, తత్త్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు. ప్రస్తుత జర్మనీలోని ట్రయర్ పట్టణంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మార్క్స్, రాజకీయ ఆర్థికశాస్త్రం, హెగెలియన్ తత్త్వశాస్త్రం చదువుకున్నారు. యుక్తవయస్సులో మార్క్స్ ఏ దేశపు పౌరసత్వం లేని స్థితిలో, లండన్లో జీవితం గడిపాడు. లండన్లోనే మరో జర్మన్ ఆలోచనాపరుడైన ఫ్రెడెరిక్ ఏంగెల్స్ తో కలిసి తన చింతన అభివృద్ధి చేసుకుంటూ, పలు పుస్తకాలు ప్రచురించాడు. 1848 నాటి కరపత్రమైన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వాటన్నిటిలోకీ సుప్రసిద్ధమైంది. తదుపరి కాలపు మేధో, ఆర్థిక, రాజకీయ చరిత్రను అతని రచన ప్రభావితం చేసి ...

                                               

దర్శని (కావ్యం)

దర్శని ప్రముఖ రచయిత ఛాయరాజ్ వ్రాసిన కావ్యం. ఈ పుస్తకానికి 2000 సవత్సరంలో ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది. ఇది ప్రపంచ జీవశాస్త్రవేత్తల పరిశోధనలను అక్షరాలుగా ఆవిష్కరించిన కావ్యం. ఛాయారాజ్ గతి తార్కిక విశేషణాలతో ప్రకృతి, మానవ సమాజ పరిణామక్రమాన్ని శాస్త్ర విజ్ఞానంతో మేళవించి రాసారు.

                                               

భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు

భారతదేశంలో ప్రాథమిక విధులు 1976 భారత రాజ్యాంగ 42వ సవరణ ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాథమిక విధులు ఇవ్వబడినవి.అధికరణ 51-ఏ, ప్రకారం పది ప్రాథమిక విధులు ఇవ్వబడినవి. పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధులు, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల తమ విద్యుక్త ధర్మాన్ని తెలియజేస్తాయి. 2002 భారత రాజ్యాంగ 86వ సవరణ ప్రకారం 11వ విధి ఇవ్వబడింది. ఈ విధి, "తండ్రి గాని, సంరక్షకుడు గాని, తమ బిడ్డలకు 6-14 వయస్సు వరకు విద్యా బోధన చేపట్టాలి", అని బోధిస్తుంది.పౌరులందరూ తమకు ఇవ్వబడిన విధులను గౌరవించి, దేశం పట్ల, సమాజం పట్ల, పరిసరాల పట్ల తమ వ్యక్తిగత బాధ్యతను గుర్తించి మసలుకోవలెను.

                                               

స్వామి దయానంద సరస్వతి

స్వామి దయానంద సరస్వతి ఆర్యసమాజ్ స్థాపకుడు, అజ్ఙానాంధకారం, దారిద్య్రం, అన్యాయన్ని ఎదురించి పోరాడిన ముని. హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన ఋషి. 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర్య సమర యోధులకు ప్రేరణ అయిన పండితుడు.

                                               

జార్జ్ విలియం ఫ్రెడరిక్ హెగెల్

జోర్గ్ విల్ హెల్మ్ ఫ్రెడ్రిక్ హెగెల్ ఒక ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త. ఇతని ఆలోచనలు ప్రపంచంలోని అనేక మంది తత్వవేత్తలని ప్రభావితం చేశాయి. ప్రతి పదార్థానికి చలనం ఉంటుందన్న హెగెల్ సూత్రం మార్కిస్ట్ గతితార్కిక భౌతికవాదం పై ఎంతో ప్రభావం చూపింది. కానీ కారల్ మార్క్స్ హెగెల్ తత్వశాస్త్రం నుంచి భావవాద కోణాన్ని, జడతత్వ సూత్రాల్ని తొలిగించి భౌతికవాద గతితార్కిక సూత్రాల ఆధారంగా రచనలు చేశాడు.

                                               

రావూరి అర్జునరావు

రావూరి అర్జునరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, హేతువాది. గాంధీ, గోరా సిద్ధాంతాలకు ఆకర్షితుడైన అర్జునరావు కుల, మత రహిత సమాజం కోసం ఎంతో పరితపించేవాడు. అతను భారతదేశంలోనే తొలి కులాంతర వివాహం చేసుకున్నాడు.

                                     

ⓘ వర్గ సమాజం

డబ్బున్న వాళ్ళు - పేద వాళ్ళు, యజమానులు - కార్మికులు లాంటి తేడాలు ఉన్న సమాజమే వర్గ సమాజం. మార్క్స్ సూత్రీకరణ ప్రకారం ప్రస్తుత సమాజంలో వర్గాలు నాలుగు ఉన్నాయి. బూర్జువా వర్గం, పెట్టీ బూర్జువా వర్గం, ప్రోలెటేరియట్, లంపెన్ ప్రోలెటేరియట్. ఫ్రెంచ్ విప్లవ పూర్వపు భూస్వామ్య సమాజంలో మూడు ప్రధాన వర్గాలు ఉండేవి. అవి భూస్వామ్య వర్గం, కౌలు రైతుల వర్గం, వ్యాపారుల వర్గం. బానిస-యజమానుల సమాజంలో ప్రధాన వర్గాలు రెండు. అవి బానిస వర్గం, యజమాని వర్గం.

                                     

1. వర్గం సమాజపు సంప్రదాయ వ్యవస్థ

వర్గ సమాజంలో అన్నిటికంటే డబ్బు సంపాదించడం, వ్యక్తిగత పరువు ప్రతిష్ఠలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణ: వర్గ సమాజంలో డబ్బున్న వాళ్ళు తమ హోదాకి తగని వారిని పెళ్ళి చేసుకోరు, వారితో స్నేహం చెయ్యరు. అంతస్తులో తేడాలు ఏర్పడితే తమ బంధువులని కూడా వేరుగా చూస్తారు.