Топ-100
Back

ⓘ పరువు కోసం మనుషులు ఎన్నో సాహసాలు, దానధర్మాలు చేస్తారు. కులగౌరవం వంశప్రతిష్ఠ పెద్దపేరున్న కుటుంబం అంటూ కొన్నిసార్లు చేయకూడని అమానుషమైన పనులు చేస్తారు. పరువు హత్య ..
                                               

పరువు హత్యలు

పరువు హత్యలు అనేవి మత సమాజాల్లో వ్యక్తిగత కుటుంబ పరువు, గౌవరవం, మర్యాద వంటి పేర్లతో జరిగే హత్యలు. ఈ హత్యలు ఎక్కువగా ఇస్లామిక్ దేశాలలో జరుగుతుంటాయి. హిందూ దేశాలైన ఇండియా, నేపాల్ లోనూ, కొన్ని క్రైస్తవ దేశాలలోనూ కూడా ఈ హత్యలు కనిపిస్తుంటాయి. ప్రేమ, పెళ్ళికి ముందు సెక్స్, మతాంతర వివాహం, జాత్యాంతర వివాహం లాంటివి చేసుకున్న వారిని పరువు పేరుతో హత్య చెయ్యడం జరుగుతోంది.

                                               

పరువు ప్రతిష్ఠ (1963 సినిమా)

పరువు ప్రతిష్ఠ మానాపురం అప్పారావు దర్శకత్వంలో జూపూడి వెంకటేశ్వరరావు నిర్మాతగా ఎన్టీ రామారావు, అంజలీదేవి ప్రధానపాత్రల్లో నటించిన 1963నాటి తెలుగు చలన చిత్రం.

                                               

మే 10

1972: అమెరికా అణుబాంబును నెవడా అనే చోట పేల్చి పరీక్షించింది. 1969: అపోలో-10 వ్యోమ నౌక, రోదసీ నుంచి భూమి ఎలా కనిపిస్తోందో చూసి, మొట్టమొదటి సారిగా, రంగుల చిత్రాలను, తీసి పంపింది. 1967: అమెరికా అణుబాంబును నెవడా అనే చోట పేల్చి పరీక్షించింది. 1933: నాజీలు జర్మనీలో బహిరంగంగా పెద్ద ఎత్తున పుస్తకాలను తగులబెట్టారు. 1984: ఇథియోపియాకి అత్యవసర సహాయంగా యూరోప్ ఉదారంగా సహాయం చేసింది. 1964: జాంబియా దేశపు అధ్యక్షుడుగా కెన్నెత్ కౌండా అధికారం చేపట్టాడు. 1976: బ్రిటిష్ రాణి లండన్ లోని నేషనల్ థియేటర్ని ప్రారంభించింది. 1994: నెల్సన్ మండేలా దక్షిణ ఆఫ్రికా మొట్ట మొదటి నల్లజాతి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసాడు. ...

                                               

పరువు ప్రతిష్ఠ (1993 సినిమా)

పరువు ప్రతిష్ఠ 1993 లో వి. సి. గుహనాథన్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో సుమన్, సురేష్, మాలాశ్రీ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. ఎం. వి. ఎస్. హరనాథ రావు మాటలు రాశాడు. రాజ్ - కోటి సంగీత దర్శకత్వం వహించారు. సి. నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామ్మూర్తి, భువనచంద్ర, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర పాటలు పాడారు.

                                               

తెలుగు సినిమాలు 1993

చిత్రరంగం నుండి నిష్క్రమించిన దశాబ్దం తరువాత యన్టీఆర్‌ మళ్ళీ నటించిన సాంఘిక చిత్రం శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ మేజర్‌ చంద్రకాంత్‌ సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్‌గా నిలిచింది. అల్లరి ప్రియుడు సూపర్‌ హిట్టయి, ద్విశతదినోత్సవం జరుపుకుంది. మాయలోడు మంచి విజయం సాధించి, హైదరాబాదు‌లో 250 రోజులకుపైగా ప్రదర్శితమైంది. "అబ్బాయిగారు, అల్లరి అల్లుడు, ఏవండీ ఆవిడ వచ్చింది, కొండపల్లి రాజా, పరువు - ప్రతిష్ఠ, పోలీస్‌ లాకప్‌, రక్షణ, బావా బావమరిది, మనీ, మాతృదేవోభవ, ముఠామేస్త్రీ, వారసుడు" శతదినోత్సవాలు జరుపుకోగా, "ఇన్‌స్పెక్టర్‌ ఝాన్సీ, చిన్నల్లుడు, తొలిముద్దు, దొంగల్లుడు, మిస్టర్‌ పెళ్ళాం, రాజేంద్రుడు - గజేం ...

                                               

తెలుగు సినిమాలు ప

ప్రేమేనాప్రాణం పోకిరిరాజా పెళ్ళిమీద పెళ్ళి పెళ్ళితాంబూలం పొట్టిప్లీడరు పట్నం పిల్ల పల్లెటూరి చిన్నోడు ప్రజా శక్తి పెళ్ళి పీటలు పిల్లనచ్చింది పెళ్ళి నీకు అక్షింతలు నాకు ప్రజా రాజ్యం పెళ్ళికొడుకు అమ్మబడును పెళ్ళాంతో పనేంటి పేదల బ్రతుకులు పెళ్ళి పైరానా పాలు నీళ్ళు ప్రేమ లేఖ పడమటి సంధ్యారాగం పవిత్ర బంధం - 1971 పుత్తడి బొమ్మ పెళ్ళంటే నూరేళ్ళ పంట పచ్చని సంసారం 1970 సినిమా పెద్ద కొడుకు ప్రేమ పంజరం పాడిపంటలు పుణ్యస్త్రీ పెళ్ళాం పిచ్చోడు పృద్వీ రాజ్ పేదరాసి పెద్దమ్మ కథ పరమానందయ్య శిష్యుల కథ పాలమనసులు ప్రేమద్రోహి పోకిళ్ళరాయుడు పన్నెండు సూత్రాలు పైలా పచ్చీస్ పాదుకా పట్టాభిషేకం 1966 సినిమా ప్రయత్నం ప్ ...

                                     

ⓘ పరువు

పరువు కోసం మనుషులు ఎన్నో సాహసాలు, దానధర్మాలు చేస్తారు. కులగౌరవం వంశప్రతిష్ఠ పెద్దపేరున్న కుటుంబం అంటూ కొన్నిసార్లు చేయకూడని అమానుషమైన పనులు చేస్తారు.

పరువు హత్యలు కూడా ఈ వర్గానికి చెందిన క్రూరమైన ప్రక్రియ.

                                     

1. పరువు కోసం కిరాతకం

తమ నెత్తురు పంచుకు పుట్టిన బిడ్డలకు స్వయానా తామే బలిపీఠాల్ని పేర్చే మానవమృగాల ఘాతుకాన్ని"ఆనర్ కిల్లింగ్" అని పిలుస్తున్నారు. అంటే స్వీయ గౌరవ పరిరక్షణ కోసం చంపేయడం! వంశప్రతిష్ఠ అనే ముసుగులోనో, కుటుంబ మర్యాద అనే మిషతోనో, కులగౌరవం అనే సాకుతోనో- ఇలా నెపం ఏదైతేనేం.కిరాతకంగా ఏటా అయిదు వేల మందికి పైగా మహిళల్ని చంపుతున్నారు. కుటుంబ పరువు ప్రతిష్ఠల పరిరక్షణ కోసమంటూ హత్యలకు పాల్పడుతున్నారు. బాయ్ ఫ్రెండ్స్తో యువతులు ఊరు విడిచి పారిపోవడం తమ కుటుంబ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చిందని, ఇష్టపడిన వ్యక్తితో పెళ్ళికి ముందే సహజీవనం సాగించడంవల్ల కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగిందని, ఆ కళంకాన్ని తుడిచి పెట్టడానికి వారిని చంపుతున్నారు. చంపేయాల్సినంతటి ఘోర నేరాలా అవి? పరువు ప్రతిష్ఠల పేరిట పిల్లల ప్రాణాలను నిలువునా తీయటం ఆ కుటుంబానికి ఏ విధమైన గౌరవం? హంతక కుటుంబంగా మారడం ఆ వంశానికి ఏ రకమైన ప్రతిష్ఠ?

విస్తుగొలిపే కారణాలు: మహిళలు తమ పెద్దలు కుదిర్చిన పెళ్ళి సంబంధాన్ని నిరాకరించడం, తాము మనసు ఇచ్చిన మగవాడితో ఇంట్లోవారికి చెప్పకుండా వెళ్లిపోవడం, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవడం, భర్త నుంచి విడాకులు కోరడం, అత్యాచారానికి గురవడం- అవన్నీ కుటుంబ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేవేనట. తల్లిగా, భార్యగా, సోదరిగా, కూతురుగా ఇలా ఏ హోదాలో ఉన్నా కుటుంబంలోని మగసభ్యుల నుంచి వారికి ఇప్పటికీ సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. మగవాళ్ల రక్షణలోనే మహిళలు ఉండాలన్న పితృస్వామిక భావజాలం మగవారిలో పాతుకుపోవడం అందుకు కారణం. తమ చెప్పుచేతల్లో మహిళలు నడుచుకోకపోవడాన్ని కుటుంబప్రతిష్ఠతో ముడిపెడుతూ, దాన్ని కాపాడటం కోసమంటూ మహిళల్ని హతమార్చడం అమానుషం. అత్యంత హేయం.

                                     

2. న్యాయస్థానవైఖరి

ఇలా కుటుంబ గౌరవ ప్రతిష్ఠల పేరిట హత్యలకు ఒడిగట్టడం అనాగరికమని సర్వోన్నత న్యాయస్థానం గతంలో స్పష్టం చేసింది. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న యువతీ యువకుల్ని హింసించేవారిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా పోలీసులను ఆదేశించింది. వివాహాలు ఆమోదయోగ్యం కాని పక్షంలో తల్లిదండ్రులు చేయగలిగింది తమ పిల్లలతో సామాజికంగా తెగతెంపులు చేసుకోవడమే. అంతేతప్ప వారిని వేధించడానికి వీలులేదు అని స్పష్టం చేసింది. ఇచ్ఛాపూర్వకంగా కులాంతర, లేదా మతాంతర వివాహాలు చేసుకున్న వ్యక్తుల్ని కుటుంబగౌరవ పరిరక్షణ పేరిట బంధువులు హతమార్చడం- క్రూరత్వానికి, ఫ్యూడల్ మనస్తత్వానికి దృష్టాంతమనీ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.