Топ-100
Back

ⓘ మరణం. పుట్టిన ప్రతి జీవికీ తప్పని సరిగా వచ్చేది చావు లేదా మరణం. తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేదీ తెలియనిది మరణం. దీనిని సంస్కృతంలో మృతి లేదా మృత్యువు అని అంటారు ..
                                               

బందా పరదేశి

భార్య కమలాంబ వివాహం తో జరిగింది. భార్య కమలాంబ కూడా చక్కగా సహకరించేది. నిత్య అన్నదానంతో దంపతులు తరించేవారు.ఈ వంశం వారు ఇప్పటికీ చీరాల, వేటపాలెంలో ఉన్నారు.వీరిలో బందా వెంకట నరసయ్యగారు ఒకరు.

మరణం
                                     

ⓘ మరణం

పుట్టిన ప్రతి జీవికీ తప్పని సరిగా వచ్చేది చావు లేదా మరణం. తప్పించుకోలేనిది ఎప్పుడు వచ్చేదీ తెలియనిది మరణం. దీనిని సంస్కృతంలో మృతి లేదా మృత్యువు అని అంటారు. హిందూ పురాణాలలో అమృతం సేవించిన దేవతలు మరణం లేకుండా చిరావుయువులుగా ఉన్నారు. మరికొంతమంది చిరంజీవులుగా పేర్కొనబడ్డారు.

                                     

1. నిర్వచనం

నిర్ధిష్టంగా మరణాన్ని నిర్వచించడం చాలా క్లిష్టమైనదిగా మారింది. ఒకప్పుడు గుండె లేదా ఊపిరి ఆగిపోవడాన్ని మరణంగా భావించేవారు. కృత్రిమ శ్వాస ప్రక్రియలు, డిఫిబ్రిల్లేషన్ వంటి ప్రక్రియలు కొంతమందిని తిరిగి బ్రతికించగలుగుతున్నాయి. అందువలన ఆధునిక కాలంలో మరణాన్ని ధ్రువీకరించడానికి నిర్ధిష్టమైన ప్రమాణాలు అవసరమైనవి.

ఈనాడు వైద్యులు, న్యాయవాదులు ఎక్కువగా మెదడు మరణం "Brain Death" లేదా జీవసంబంధమైన మరణం "Biological Death"ని ప్రాతిపదికగా భావిస్తున్నారు. ఒక వ్యక్తి యొక్క మెదడు సంబంధించిన ఇ.ఇ.జి. ద్వారా రికార్డు చేయబడిన ఎలక్ట్రికల్ ఏక్టివిటీ పూర్తిగా ఆగిపోయినప్పుడు ఆ వ్యక్తి మరణించినట్టుగా భావిస్తారు.

                                     

2. కారణాలు

అభివృద్ధి చెందుతున్న దేశాలలో మరణానికి ప్రధాన కారణాలు అంటు వ్యాధులు. అదే అభివృద్ధి చెందిన దేశాలలో గుండె, మెదడుకు సంబంధించిన రక్తనాళాల వ్యాధులు, క్యాన్సర్, వార్ధక్యం మొదలైనవి ముఖ్యమైనవి. కారణమేదైనా చివరికి అన్నీ గుండె ఆగిపోవడానికి దారితీసి తద్వారా ఆక్సిజన్ సరఫరాను నిలిపివేస్తాయి. అందుమూలంగా మెదడు, ఇతర అవయవాలు దెబ్బతిని వ్యక్తి మరణిస్తాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు సుమారు 150.000 మంది చనిపోతున్నారని అంచనా.

                                     

3. చనిపోయేహక్కు

ప్రశాంతంగా చనిపోనివ్వండి, ఏ చికిత్స వద్దు అని కొందరు న్యాయ పోరాటం చేసి నెగ్గుతున్నారు కూడా. లుకేమియా వ్యాధితో బాధపడుతున్న హన్నా ఆరునెలలు మించి బతకదని తేల్చిచెప్పారు. అయితే ఊహ తెలిసినప్పటి నుంచి శస్త్రచికిత్సలు, అనారోగ్యంతోనే గడిపిన ఆ బాలిక. మళ్లీ శస్త్రచికిత్స చేయించుకోవడానికి నిరాకరించింది. తనకు ఇక ఎలాంటి శస్త్రచికిత్సా చేయించుకునే ఓపిక లేదని, బతికినన్ని రోజులు ఇంట్లోనే ఆనందంగా గడపాలనుకుంటున్నట్లు కోర్టులో వాదించి గెలిచింది.

                                     

4. మరణాల రేటు

మరణాల సూచి Death or Mortality rate అనగా ఒక నిర్ధిష్టమైన జనాభాలో నిర్ణీతకాలంలో జరిగిన మరణాలు. ఇవి సామాన్యంగా 1000 మందికి ఒక సంవత్సర కాలంలో జరిగిన మరణాలుగా సూచిస్తారు. ఇది ఒక ప్రాంతంలో లేదా దేశంలోని ఆరోగ్యం, మరణాలపై అధ్యయనానికి ముఖ్యమైన సూచిక.