Топ-100
Back

ⓘ నమ్మకాలు ..
                                               

అంజనం వేయడం

అంజనం అంటే కాటుక అని సాధారణ అర్థం. ఇంకొక అర్ధంలో దూరంగా ఉన్న వస్తువులనో, వ్యక్తులనో ఉన్నచోటనే ఉండి చూడటానికి అవకాశం కలిగించే ఒక మంత్ర/ తంత్ర విద్య. దీనిని తెలుగు పాత సినిమాలలో చూడవచ్చు. ఎక్కడో జరుగుతున్న సంఘటనల గురించి గానీ, జరిగినవీ, జరగబోయేవీ సంఘటనల గురించి గానీ దృశ్యరూపంగా చూపించే పద్ధతిని అంజనం వేయడం అంటారు. క్రిస్టల్‌ గేజింగ్‌ అంటే ఒక గాజు గోళం లో చూడదలచుకొన్న దృశ్యాలను చూడటం. పాశ్చాత్యదేశాలలోనూ, ఆఫ్రికా ఖండంలోనూ, ముఖ్యంగా ఈజిప్టులో, ఈ విద్య గురించి చాలా చోట్ల మాట్లాడు కొంటారు. ఐతే ఎవరికైనా క్రిస్టల్‌లో చూడదలచుకొన్న దృశ్యాలను చూపించిన దాఖలాలు లేవు. గోళంలో ఎవరైనా ఒక వ్యక్తి తనకు ఫలానా ...

                                               

అదృష్టం

అదృష్టం అంటే కొంతమందికి చాలా నమ్మకం. ఒక వ్యక్తి యొక్క ఊహను మించి జరిగే నమ్మలేని నిజాల్ని మంచిదైతే అదృష్టంగా భావిస్తారు. అయితే ఇలాగే చెడు జరిగినప్పుడు దురదృష్టం అంటారు. లాటరీలు, జూదం మొదలైన అదృష్టాల్ని నమ్మేవాళ్ళని చేతకాని వారిగా కొందరు భావిస్తారు. జ్యోతిషం లోని జన్మ నక్షత్రం, జాతక చక్రం ప్రకారం కొందర్ని అదృష్ట జాతకునిగా భావిస్తారు.

                                               

జీవపరిణామంపై హిందూ దృక్కోణం

జీవ పరిణామం జరిగిందని హిందూ ధర్మం విశ్వసిస్తుంది. ఈ వాదాన్ని డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం బలపరుస్తుంది. పూర్ణావతారములు, డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం పోలి ఉంటాయి. మత గ్రంథాలలో సృష్టి గురించి చెప్పిన వివరణకు విరుద్ధంగా ఏదైనా శాస్త్రీయ పరిశోధనా ఫలితాలు వెలువడినప్పుడు, కఠోర సృష్టివాదులు ఆ ఫలితాలను తిరస్కరించటం గానీ, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ సిద్ధాంతాలను, /లేదా వాటి నిర్వహణా పద్ధతులను తప్పుపట్టడం కానీ చేస్తుంటారు ఈ కారణాల వల్ల, సృష్టివాద విజ్ఞానాన్ని, ఇంటెలిజెంట్ డిజైన్ సిద్ధాంతాన్ని ప్రధానస్రవంతిలోని శాస్త్రీయ సముదాయం మిథ్యా విజ్ఞానముగా ముద్రవేస్తున్నది.

                                               

దెయ్యం

దెయ్యం Ghost చనిపోయిన వ్యక్తిని పోలినవి. దెయ్యాలు వాటికి సంబంధించిన, చనిపోయిన ప్రదేశాలలో కనిపిస్తాయి లేదా వానికి సంబంధించిన వ్యక్తులకు కనిపిస్తాయి. దెయ్యాలు చనిపోయిన వ్యక్తుల ఆత్మలకు సంబంధించినవిగా కూడా భావిస్తారు. ఇవి ఎక్కువగా కనిపించే ప్రదేశాల్ని హాంటెడ్ Haunted ప్రదేశాలు అంటారు. ఇవి కొన్ని వస్తువుల్ని ప్రేరేపిస్తాయి; కానీ ఇలాంటివి ఎక్కువగా యువతులలో కనిపించే మానసిక ప్రవృత్తికి సంబంధిచిన విషయాలుగా కొందరు భావిస్తారు. దెయ్యపు సైన్యాలు, జంతువులు, రైళ్ళు, ఓడలు కూడా ప్రచురించబడ్డాయి. అయితే దెయ్యాలు ఉన్నది లేనిదీ చాలా సంధిగ్ధంగా ఉన్నాయి. ఇవి ఉన్నాయని నమ్మేవాళ్ళు, నమ్మనివాళ్ళూ ప్రపంచమంతా ఉన్నారు ...

                                               

పల్లెల్లో మూడ నమ్మకాలు

మూడ నమ్మకాలకు పల్లెలని, పట్నాలని తేడాలేదు. కాక పోతే పల్లెల్లో కొంచెం ఎక్కువ. ఆ విధంగా పరిశీలిస్తే మూడ నమ్మకాలలో ముఖ్యంగా చెప్పు తగినవి: ____ మనిషికి దెయ్యం పట్టడం, వంటి మీదకు దేవుడు రావడం, దెయ్యాలు, భూతాలు, మిత్తవలు, గాలి శోకడం వంటివవి ఎక్కువగా వుండేవి. స్త్రీలాకు మాత్రమే దెయ్యం పట్టేది. దానికి మంత్రగాన్ని పిలిపించి ముగ్గులు వేసి, నిమ్మకాయలు కోసి వేప మండలతో చావ బాదేవారు. ఈ తతంగం అంతా చాల కౄరంగా వుండేది. మాంత్రికుడు వేప మండలతో కొడుతూ. దిగతావా దిగవా. అని అరుస్తూండగా ఆస్త్రీ దిగుతా. దిగుతా. అని కొంత సేపటికి స్వాదీనంలోకి వచ్చేది. ఆతర్వాత ఆమెకు తగిలిన దెబ్బలకు కాపడం పెట్టే వారు. అందుకే అన్నారు ...

                                               

పాగనిజం

లాటిన్ భాషలో paganus అంటే పల్లెటూరివాడు అని అర్థం. పశ్చిమ దేశాలలో యూదా, క్రైస్తవ, ఇస్లాం మతాలు కాకుండా ఇతర విగ్రహారాధక మతాలని నమ్మేవారిని పాగన్లని అంటారు. పశ్చిమ దేశాలలోని గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు కూడా కొన్ని గణాల ప్రజలు విగ్రహారాధక మతాలని నమ్ముతారు. వీరిని ఇంగ్లిష్ భాషలో పాగన్ లేదా హీదెన్ అని అంటారు.

                                               

బలి

జంతు బలులు వైదిక ప్రామాణికాలు, బలులకు చాలా ప్రాధాన్యం ఉంది.కానీ ఇప్పటి వైదిక పురోహితులు బౌద్ధ, క్రైస్తవ ప్రభావంలో పడి బలులు ఆచరించడం లేదు.ఏయే క్రతువుల్లో జంతు బలి అవసరమో ఆయా క్రతువుల్లో ఏయే దేవతలకి ఏబలి అవసరమో ఆయా దేవతలకు ఆయా జంతుమాంసాలని ఇప్పటికీ సమర్పిస్తూనే ఉన్నారు.కొన్ని దేవతల్ని సంతృప్తిపఱచడానికి నరబలి కూడా చెయ్యాలి. మన దృష్టిలో మనం మనుషులం.కానీ దేవతల దృష్టిలో మనం అన్ని జంతువుల లాంటివాళ్ళమే. మన దృష్టిలో జంతువులు ఏ విధంగానైతే తినదగినవో, అదే విధంగా ఆ దేవతల దృష్టిలో మన ప్రాణశక్తి కూడా హరించదగినదే. ప్రాజెక్టులూ, సినిమాహాళ్ళూ, ఫ్యాక్టరీలూ వంటి పెద్దపెద్ద కట్టడాలు కట్టినప్పుడు ఇప్పటికీ నరబల ...

                                               

ముస్లింలలో అపవిశ్వాసాలు

ముస్లింలలో అపవిశ్వాసాలు: ముస్లింలలో అపవిశ్వాసాలు లేదా విశ్వాసపరంగా "ఫిర్ఖా" లు ఏర్పడ్డాయి. ఇచ్చట గమనించవలసిన విషయాలు రెండు, అవి 1. మూలవిశ్వాసం., 2. ఉ పవిశ్వాసాలు, మూలవిశ్వాసం అన్ని ఫిర్ఖాలది ఒకటే అయినా, ప్రాధాన్యత లేని, ప్రాధాన్యత ఇవ్వకూడని అపవిశ్వాసాల విషయాల పట్ల తమ శక్తియుక్తులంతా ప్రదర్శించి విర్రవీగే సాధారణ ప్రజగూర్చి ప్రవక్త ఇలా అన్నారు: "ఇశ్రాయేలు ప్రజలు 72 తెగలుగా చీలిపోయారు. నా ప్రజలు 73 తెగలుగా చీలిపోతారు. అందులో ఒకటి తప్ప మిగతా తెగలవారంతా నరకానికి పోతారు. ఆ ఒక్క తెగ యొక్క మతం ఏదంటే నేనూ, నా అనుచరులు చెప్పిందే మిష్కాత్ ఎ షరీఫ్ గ్రంథం మొదటి విభాగం 4 వ అధ్యాయం 2 వ వచనంలో ఉంది. 73 తె ...

                                               

సృష్టివాదం

సృష్టివాదం, మానవజాతిని, జీవాన్ని, సమస్త చరాచర జగత్తును, విశ్వాన్నంతటినీ ప్రస్తుతము ఉన్న స్థితిలో దేవుడు సృష్టించాడనే ఒక మత విశ్వాసము. సాధారణంగా ఆ దేవుడు అబ్రాహాం మతాలలో ప్రస్తావించిన దేవునిగా భావిస్తారు. ఈ వాదం శాస్త్రీయంగా నిరూపించలేనిది. ఈ వాదాన్ని డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మత గ్రంథాలలో సృష్టి గురించి చెప్పిన వివరణకు విరుద్ధంగా ఏదైనా శాస్త్రీయ పరిశోధనా ఫలితాలు వెలువడినప్పుడు, కఠోర సృష్టివాదులు ఆ ఫలితాలను తిరస్కరించటం గానీ, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ సిద్ధాంతాలను, /లేదా వాటి నిర్వహణా పద్ధతులను తప్పుపట్టడం కానీ చేస్తుంటారు ఈ కారణాల వల్ల, సృష్టివాద విజ్ఞానాన్ని, ...

                                               

స్వర్గం

అయోమయ నివృత్తికి చూడండి స్వర్గం స్వర్గం ఒక నమ్మకం. స్వర్గం గురించి అనేక మూలాల నుండి వివిధ రకాల నమ్మకాలు ఉన్నా, సాధారణంగా స్వర్గాన్ని విశ్వసించేవారి యొక్క నమ్మకాలు ఆ వ్యక్తి ఏ మతసంప్రదాయానికి లేదా తెగకు చెందినవాడు అన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని మతాలు మరణం తర్వాత ఆత్మలు అమరత్వంతో ప్రశాంత జీవనం గడిపే ఒక ప్రదేశంగా స్వర్గాన్ని సూచిస్తాయి. సాధారణంగా స్వర్గం అనంతంగా సాగే ఒక ఆనందమయ ప్రదేశంగా భావిస్తారు. మంచి పనులు చేసిన వాళ్ళు స్వర్గానికి వెళతారు. చెడ్డ పనులు చేసిన వాళ్ళు నరకంకు వెళతారు.