Топ-100
Back

ⓘ దివ్యజ్ఞాన సమాజం. దివ్యజ్ఞాన సమాజము అమెరికా లోని న్యూయార్క్ నగరంలో 1875 లో హెలీనా బ్లావట్‌స్కీ, హెన్రీ స్టీల్ ఆల్కాట్, విలియం క్వాన్ జడ్జ్, ఇతరుల చే స్థాపించబడి ..
                                               

బెసెంట్ థియొసాఫికల్ కాలేజి(దివ్యజ్ఞాన కళాశాల)

బెసెంట్ థియొసాఫికల్ కాలేజి - దక్షిణాంధ్రంలో మొదటి కళాశాల. డా.అనీ బిసెంట్ స్థాపించారు. మద్రాసు లోగల బిసెంట్ థియోసాఫికల్ సొసైటీ చే స్థాపింపబడి నడుపబడుతోంది. మదనపల్లె పట్టణంలో చారిత్రక కళాశాల. బి.టి. కాలేజి గా ప్రసిధ్ధి.

                                               

జి.ఎస్.అరండేల్

జార్జ్ సిడ్నీ అరండేల్ 1878, డిసెంబర్ 1వ తేదీన ఇంగ్లాండులోని సర్రే అనే ప్రాంతంలో జన్మించాడు. ఇతని చిన్నతనంలోనే ఇతని తల్లి మరణించింది. ఇతని పినతల్లి మిస్ ఫ్రాన్సెస్కా అరండేల్ ఇతడిని పెంచి పెద్దచేసింది. ఫ్రాన్సెస్కా 1881లో థియొసాఫికల్ సొసైటీలో చేరింది. ఆ సమాజం స్థాపకులలో ఒకరైన హెలీనా బ్లావట్‌స్కీ తరచూ వారింటికి అతిథిగా వస్తుండడం వల్ల బాలుడైన అరండేల్‌కు ఆమెను కలుసుకునే అవకాశం దక్కింది. ఇతడు కొంతకాలం జర్మనీలోను, మరికొంత కాలం ఇంగ్లాండులోను విద్యను అభ్యసించాడు. 1900లో కేంబ్రిడ్జిలోని సెయింట్ జాన్స్ కాలేజీ నుండి ఎం.ఎ. పట్టాను పొందాడు.

                                               

రాయచోటి గిరిరావు

వీరు 1865, ఆగష్టు 25 తేదీన బెంగుళూరు నగరంలో వినాయక చవితి పర్వదినాన జన్మించారు. వీరి తల్లిదండ్రులు నాగేశ్వరరావు, నాగమ్మ. వీరు 1881లో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులైనారు. తర్వాత మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరి ఎఫ్.ఎ. పరీక్షలో ప్రథములుగాను పిదప 1887లో బి.ఎ. పరీక్షలోను ఉత్తీర్ణులయ్యారు. వీరు తన జీవితాన్ని దేశ సేవకై అంకితం చేయదలచి మొదటి మెట్టుగ విద్యావ్యాప్తికై కృషి చేశారు. అందుకోసం మదనపల్లిని తన కార్యక్షేత్రంగా ఎన్నుకొన్నారు. అక్కడ కొందరు వ్యక్తులతో ఒక సంఘంగా ఏర్పడి 1888న ఆ గ్రామంలోని వేంకటేశ్వరాలయంలో ఒక పాఠశాలను నెలకొల్పారు. దానికి కాంగ్రస్ హై స్కూలు అని పేరు ఉండేది. తరువాత 1891లో ...

                                               

మూలాపేట

మూలాస్థానేశ్వరస్వామి ఆలయం ఉండడం వల్ల మూలాపేట అనే పేరు ఏర్పడింది.

                                               

ఆగష్టు 12

1936: ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, ఏ.ఇ.ఎస్.ఎఫ్. - అఖిల భారత విద్యార్థిసమాఖ్య, ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో స్థాపించబడింది. 2010: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని బాలికలకు యవ్వనం తొందరగా వస్తున్నదని, అందుకని, ఆ బాలికల ఆరోగ్యం ప్రమాదకరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. 2009: ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడగల సాంకేతిక పరిజ్ఞానం భువన్ ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. 1978: ఆంధ్రప్రదేశ్ లో రంగారెడ్డి జిల్లా అవతరించింది. 2011: విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2011-12 సంవత్సరానికి, శుక్రవారం ఎన్నికలు జరిగాయి. 2788 ఓటర్లు ఉండగా 1791 మంది ఓట్లు వేసారు. 997మంది ఓట్లు వేయలేదు. 2010: రంజాన్ భారతదేశంలో ...

                                               

రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి

వీరు పాలకొండ మండలంలోని గుడివాడ అగ్రహారంలో ముఖలింగేశ్వరుడు, సోదెమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి వద్ద రామాయణ, భారత, భాగవతాలను విని తెలుసుకున్నారు. 13వ ఏట తండ్రి మరణించగా శ్రీహరిపురం లో కొంతకాలం అధ్యాపకునిగా పనిచేశారు

దివ్యజ్ఞాన సమాజం
                                     

ⓘ దివ్యజ్ఞాన సమాజం

దివ్యజ్ఞాన సమాజము అమెరికా లోని న్యూయార్క్ నగరంలో 1875 లో హెలీనా బ్లావట్‌స్కీ, హెన్రీ స్టీల్ ఆల్కాట్, విలియం క్వాన్ జడ్జ్, ఇతరుల చే స్థాపించబడింది. దీన్ని స్థాపించిన కొన్ని సంవత్సరాల తర్వాత బ్లావట్‌స్కీ, ఆల్కాట్ చెన్నై వచ్చి అడయార్ అనే ప్రాంతంలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వారు ఆసియా దేశాలలోని ఇతర మతాలను కూడా అధ్యయనం చేయాలని భావించారు.

                                     

1. లక్ష్యాలు

సుదీర్ఘమైన చర్చలు, పునశ్చరణలు జరిపి ఈ సమాజం యొక్క లక్ష్యాలను ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.

  • వివిధ మతాలని, తత్వశాస్త్రాన్ని, సైన్సు అధ్యయనాన్ని ప్రోత్సహించడం
  • ప్రకృతిలోనూ, మానవునిలోనూ దాగున్న నిగూఢ రహస్యాలను పరిశోధించడం
  • జాతి, లింగ, వర్ణ, మత, కులాలకు అతీతంగా మానవజాతిలో సార్వత్రిక సార్వభౌమత్వాన్ని పెంపొందించడం.

ఇవి కాకుండా 1889లో బ్లావట్‌స్కీ తాను వచ్చే జన్మలో ప్రపంచ గురువుగా జన్మిస్తాననీ, అందుకు మానవాళిని సంసిద్ధులను చేయడమే సంస్థ యొక్క అసలైన ఉద్దేశ్యమనీ కొంతమంది విద్యార్థులతో పేర్కొంది. ఇదే విషయాన్ని అనీబిసెంట్ కూడా బ్లావట్‌స్కీ చనిపోయిన ఐదు సంవత్సరాల తర్వాత 1896 లో పునరుద్ఘాటించింది. బ్లావట్‌స్కీ స్వీయ రచనల్లో తన పునర్జన్మకు కనీసం ఒక శతాబ్ద కాలం పట్టవచ్చని ప్రస్తావించింది.

                                     

2. జిడ్డు క్రిష్ణమూర్తి

1909 సంవత్సరంలో ఈ ఉద్యమంలో ఒక నాయకుడైన లీడ్‌బెల్ట్ జిడ్డు కృష్ణమూర్తిని తమ భవిష్య నాయకుడిగా భావించాడు. కృష్ణమూర్తి కుటుంబం జనవరి 1909 న చెన్నైలోని ప్రధాన కార్యాలయానికి మారారు. 1925 సంవత్సరం నుంచి ఆయన క్రమంగా ఈ ఉద్యమం నుంచి వేరుపడడం ప్రారంభించాడు. 1931 లో దాన్ని పూర్తిగా వదిలిపెట్టేశాడు.

                                               

1878

జూన్ 25: వఝల సీతారామ శాస్త్రి, భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. మ.1964 డిసెంబర్ 1: జి.ఎస్.అరండేల్, దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు, హోమ్‌రూల్ లీగ్ నిర్వాహణా కార్యదర్శి. మ.1945 డిసెంబర్ 10: చక్రవర్తి రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. మ.1972 నవంబరు 17: అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి, పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త. మ.1936 నవంబరు 3: బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి. మ.1952