Топ-100
Back

ⓘ ముక్తి. పునర్జన్మ లేకపోవటం. స్వర్గప్రాప్తి కలగటం. మోక్షం.జన్మరాహిత్యం మళ్ళీ పుట్టకుండా ఉండటం.జననమరణాల పరంపరనుండి విముక్తి కలగటం. దైవసన్నిధికి చేరుకోవటం.ఈ ముక్తి ..
                                               

ముక్తి

పునర్జన్మ లేకపోవటం. స్వర్గప్రాప్తి కలగటం. మోక్షం.జన్మరాహిత్యం మళ్ళీ పుట్టకుండా ఉండటం.జననమరణాల పరంపరనుండి విముక్తి కలగటం. దైవసన్నిధికి చేరుకోవటం.ఈ ముక్తికోసమే కాశీలోనో కాశీయాత్రలోనో మరణించాలని శివభక్తులు కోరుకుంటారు. మక్కాయాత్రలో చనిపోతే ముక్తి కలుగుతుందని ముస్లిముల నమ్మకం. ఈ ముక్తికోసమే ముస్లిములు క్రైస్తవులు ప్రపంచంలోని వివిధ మతాల ప్రజలు దైవాన్ని వేడుకుంటారు. ఇహ లోకం పట్ల వైరాగ్యంతో దైవ సాయుజ్యం ..

                                               

విద్యారణ్యుడు

విద్యారణ్యుడు లేదా మాధవాచార్యుడు శృంగేరి శారదా మఠానికి 12వ పీఠాధిపతి. శంకరాచార్యుల తరువాత ఐదు శతాబ్ధాలకు శారదా పీఠాన్ని అధిరోహించాడు. విజయనగర సామ్రాజ్య స్థాపనకు మూల ప్రేరకునిగా ప్రసిద్ధి చెందాడు. ప్రజలలో అధ్యాత్మిక భావాలు పెంపొందించడానికి అవతరించిన మూర్తిగా విద్యారణ్యుడిని భావిస్తారు.

                                               

అష్టగురువులు

వివిధ రకాలైన జ్ఞానాన్ని అందించే వారు గురువులు. ఆ గురువులు వారు అందించే జ్ఞానం ఆధారంగా ఎనిమిది రకాలుగా వర్గీకరించబడతారు. అష్టగురువులు: శాస్త్రాభ్యాసం చేయించినవారు టక్కుటమార గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాలాది విద్యలు నేర్పినవారు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించినవారు పురాణాదికాలను చెప్పినవారు అక్షరాభ్యాసం చేయించినవారు శైవ, వైష్ణవ సంప్రదాయాలను బోధించినవారు ఉపనయనంలో గాయత్రీ మంత్రము ఉపదేశించినవారు వేదాధ్యయనం చేయించినవారు

                                               

కేశవదేవ ఆలయం

ఈక్షేత్రము ముక్తి ప్రద క్షేత్రములలో ఒకటి. డిల్లీకి దక్షిణమున 140 కి.మీ. దూరమున గల "మధురా" స్టేషన్ సమీపమున యమునానదీ తీరమున శ్రీకృష్ణుని అవతార స్థలము ఉంది. దీనికి ఉత్తరము 10 కి.మీ.దూరములో గోవర్థనము పర్వతం ఉంది. ఆళ్వార్లు కీర్తించిన క్షేత్రమిపుడు కనిపించదు. మధురానాథ, ద్వారకానాథ సన్నిధులు ప్రసిద్ధిచెందినవి. ఇచట ఉ.వే. శ్రీమాన్ గోవర్థనం రంగాచార్యస్వామి వారిచే నిర్మింపబడిన సప్త ప్రాకారములు గల రంగమందిరం దాక్షిణాత్య సంప్రదాయముతో పాంచరాత్రాగ మోక్తముగా నిర్వహింపబడు చున్నది. ఇచట అన్ని సన్నిధులు ఉన్నాయి. సర్వ సౌకర్యములు ఉన్నాయి.ఈ క్షేత్రమున గల ముఖ్యమైన స్నానఘట్టము విశ్రాంత్ ఘాట్. ఇచటనొక సన్నిధి నిర్మిం ...

                                               

గురుపౌర్ణమి

గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది.ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం మ ...

                                               

దేవరకొండ

దేవరకొండ, తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన జనగణన పట్టణం. ఈ పట్టణానికి సంబంధించిన చర్చ ముఖ్యంగా కాకతీయుల కాలం నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది.ఈ పట్టణానికి దగ్గరలోనే ఒక ప్రాచీన దుర్గము ఉంది.ఆ దుర్గం పేరుతోనే దేవరకొండ అని పిలువబడుతుంది.