Топ-100
Back

ⓘ కామశాస్త్రం: భారతీయ సాహిత్యంలో కామం గురించి, శాస్త్రీయ దృక్ఫదంతో రచించబడిన సాహిత్యం. చాణక్యుడు ఆర్థికశాస్త్రం గురించి రచించిన అర్థశాస్త్రం లాగానే, కామశాస్త్రంకూ ..
                                               

కామం

సి.పి.బ్రౌన్ నిఘంటువు ప్రకారము కామము అనగా kāmamu. సంస్కృతం n. Love, lust. Wish, desire, concupiscence. ఇచ్ఛ. కామనుడు kāmanuḍu. n. A lustful man. కామాంధకారము kām-āndhakāramu. n. Blindness of lust. కామసూత్ర మానవుల సంభోగం గూర్చి, శృంగార శాస్త్రంగా వాత్సాయనుడు సంస్కృతంలో రచించిన గ్రంథము. కామచారి kāma-chāri. adj. Sensual, selfish; following ones own pleasure. కామగము kāmagamu. adj. Wish-guided; going at will as an enchanted car. తలచిన చోటికి పోయే. కామాంకుశము kām-ānkuṣamu. n. A stimulant or aphrodisiac. A finger nail గోరు. కామరూపి. kāma-rūpi. adj. Protean, plastic, able to assume any shape. The h ...

                                               

నాట్య శాస్త్రం

ఈశ్వరుడు ఆదిప్రవక్త. నందికేశ్వరుడు ఈశ్వరుని సన్నిధిలో నాట్యమును గ్రహించాడు. ఆతడే శివుని ఆజ్ఞపై బ్రహ్మకుపదేసించాడు. అటుపై బ్రహ్మ నాట్యమును ఉదయహరించాడు. భరతుడు దానిని గ్రహించి నాట్యశాస్త్రం రచించాడు. దానికే నాట్యవేదం అని పేరు. శాండిల్య వాత్సల్య కోహాదులు భరత శిష్యులు, వారు నాట్య విద్యను ప్రచారం చేసారు. లోక సంగ్రహాన్ని ఆపేక్షించిన మనువు సూర్యుడుని లోకసముద్ధరణోపాయమును చెప్పమని అడిగాడు. సూర్యుడు చెప్పిన ఉపాయములను బట్టి భరతుని దగ్గర మనువు నాట్యవిద్య తెలుసుకున్నాడు. దీనినే కొందరు వాగ్దేవీ సాంప్రదాయమని అంటారు.

                                               

కొత్త సత్యనారాయణ చౌదరి

చౌదరి గుంటూరు జిల్లా తెనాలి తాలూకా అమృతలూరు గ్రామంలో బుచ్చయ్య చౌదరి, రాజరత్నమ్మ దంపతులకు డిసెంబరు 31, 1907 సంవత్సరంలో జన్మించాడు. స్వగ్రామం లోని సంస్కృత పాఠశాలలో కంభంపాటి స్వామినాధ శాస్త్రి పర్యవేక్షణలో చదివి ప్రవేశ పరీక్ష పూర్తి గావించారు. ఇతడు ప్రాథమిక విద్య అమృతలూరు సంస్కృత పాఠశాలలో గావించాడు. అక్కడ భాషా ప్రవీణ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై, చిట్టిగూడూరులోని నరసింహ సంస్కృత కళాశాలలో చేరి 1929లో ఉభయ భాషా ప్రవీణ పట్టా ప్రథమ శ్రేణిలో పొందినాడు. ఆయన విద్యాభ్యాసం అంతా సంస్కృతాంధ్రాల్లోనే సాగింది.1930 లోభాషా పోషక గ్రంథమండలిని స్థాపించారు.డెబ్బై గ్రంథాలు ప్రచురించారు. తిరుమల గుదిమెళ్ళ వరదాచారి, ద ...

                                               

వేదుల సూర్యనారాయణ శర్మ

వేదుల సూర్యనారాయణ గారు పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు లో జన్మింవారు.కాకరపర్రులో జన్మించిన వారిలో ఎందరెందరో గొప్ప పండితులుగా ప్రసిద్ధి చెందారు. వీరిలో ‘పండిత కవి’గా వాసికెక్కిన ‘కాకరపర్రు ముద్దుబిడ్డ’ వేదుల సూర్యనారాయణ శర్మగారు సాహిత్య, వ్యాకరణ శాస్త్రాల్లో నిష్ణాతునిగా తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 1911 ఫిబ్రవరి 4 న జన్మించిన ఈయన సంస్కృతం, పాళీ, ఆంగ్ల భాషల్లో మంచి పట్టు సాధించారు. వివిధ భాషల్లో ప్రావీణ్యాన్ని సాధిస్తూనే మరో వైపు రచనలకు శ్రీకారం చుట్టారు. శర్మగారు 1936లో ‘శృంగార నళీయం’ అనే మాలికా రచన చేశారు. ఇందులో మూడు వందల చంపక మాలికా పాదాలున్నాయి. ఇది ‘ల’కార ప్రాసతో ఉం ...

                                               

అనంగరంగ

భారతీయ కామశాస్త్రంలో ఒక ప్రముఖమైన రచన - అనంగరంగ. దీన్ని 16 వ శతాబ్దంలో కళ్యాణ మల్లుడు అనే కవి రచించాడు. ఈ కవి 1451 నుండి 1526 వరకూ న్యూఢిల్లీని రాజధానిగా చేసుకొని పాలించిన లోడి సామ్రాజ్యానికి చెందిన వాడు. అహ్మద్ ఖాన్ లోడి కుమారుడైన లాడ్ ఖాన్ కోసం అనంగరంగ గ్రంథాన్ని రచించాడు కళ్యాణ మల్లుడు. అనంగరంగ గ్రంథం వాత్సాయనుడు రచించిన కామసూత్ర గ్రంథంతో పోల్చబడుతుంది. 1885 లో ఈ గ్రంథాన్ని కామశాస్త్ర సొసైటీ అనువదించింది. ఇందులో స్వభావాలను బట్టి స్త్రీ జాతులు, శరీర ఆకృతిని బట్టి స్త్రీ పురుష జాతులు, ప్రాంతాలబట్టి స్త్రీల రకాలు, వశీకరణం, స్త్రీ పురుషుల్లో వివిధ గుర్తులు, బాహ్య, అంతరంగిక సంతోషాలు, వివాహ స ...

                                               

ఒగ్గు కథ

ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం. ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం. ఒగ్గు అనే పదానికి ‘జెగ్గు’, ‘జగ్గు’ అని నామాంతరాలున్నాయి. శివుని చేతిలోని ప్రత్యేక వాయిద్యం ఢమరుకం. మన ప్రాచీన లాక్షణికులు, వైయాకరణులు ఢమరుకం నుంచి మహేశ్వర సూత్రాలు ఉద్భవించాయని చెప్పారు. అలా మొత్తం అక్షరాల పుట్టుకకి కారణమైన ఢమరుకాన్ని ఒక కళారూపానికి పేరుగా పెట్టి దానికి పూజార్హతని కల్పించిన కళారూపం ఒగ్గు కథాగానం మాత్రమే. రాగ బావ యుక్తంగా ఒక కథను అల్లడం, చెప్పడం కథాగానం అని వ్వవహరించ వచ్చు. ఈ కథాగాన కళా ప్రదర్శనంలో ఒకరు ప్రధాన కథకులు, అయితే ఇద్దరూ ...

                                     

ⓘ కామశాస్త్రం

కామశాస్త్రం: భారతీయ సాహిత్యంలో "కామం" గురించి, శాస్త్రీయ దృక్ఫదంతో రచించబడిన సాహిత్యం. చాణక్యుడు ఆర్థికశాస్త్రం గురించి రచించిన అర్థశాస్త్రం లాగానే, కామశాస్త్రంకూడా ఒక శాస్త్రీయ గ్రంథము. కామశాస్త్రం, నాగరికుల కొరకు సశాస్త్రీయ జ్ఞానంతో, శారీరక ఇచ్ఛను పొందే మార్గాలను సూచించే సాహిత్యం.

ప్రాచీన సాహిత్యాలలో ఇప్పటికీ లభ్యమవుతున్న గ్రంథం కామసూత్ర. దీనిని వాత్స్యాయనుడు రచించాడు. వాత్స్యాయనుడి తరువాత, అనేకులు అనేక గ్రంథాలు వ్రాశారు, వాటిలో లభ్యమవుతున్నవి, ముఖ్యమైనవి;

 • కళ్యాణమల్లుడు రచించిన అనంగరంగ 16వ శతాబ్దం.
 • జయమంగలుడి వ్యాఖ్యానాలు వాత్స్యానుడిపై 13వ శతాబ్దం.
 • కొక్కాకుడు రచించిన రతి రహస్యం 13వ శతాబ్దం
                                     

1. ఎటైమాలజీ

కామ ఆంగ్లం: Kama సంస్కృతం: काम కామ ఒక సంస్కృత పదజాలము. అర్థం, కోరిక, వ్యామోహం, కాంక్ష, మరీ ముఖ్యంగా శారీరక కాంక్ష. హిందూ సంస్కృతిలో మన్మథుడు కామదేవుడు.

                                     

2.1. కామశాస్త్ర పుస్తకాల జాబితా పోగొట్టబడిన పుస్తకాలు

 • కామశాస్తం - గోనికపుత్ర
 • కామశాస్తం - గోనర్దీయ
 • కామశాస్తం - దత్తక. ఓ కథనం ప్రకారం రచయిత కొద్దికాలంకొరకు స్త్రీగా మారాడు.
 • కామశాస్తం - చారాయణ
 • కామశాస్తం - ఘోటకముఖ
 • కామశాస్తం లేదా బభ్రవ్యాకరిక
 • కామశాస్తం - అద్దులాకి శ్వేతకేతు 500 అధ్యాయాలు
 • కామశాస్తం - నంది లేదా నందికేశ్వరుడు. 1000 అధ్యాయాలు
 • కామశాస్తం లేదా రాతినిర్యాణ - సువర్ణనాభ
                                     

2.2. కామశాస్త్ర పుస్తకాల జాబితా మధ్యకాలం, నవీన కాలపు పుస్తకాలు

 • దత్తకసూత్ర: 2వ మహదేవుడు గంగా సామ్రాజ్యపు రాజు
 • కళ్యాణమల్ల: అనంగరంగ
 • సమయమాతృక - క్షేమేంద్ర
 • స్మార ప్రదీపిక - గుణకర, వాచస్పతి కుమారుడు
 • కుచోపనిషద్ లేదా కుచుమార తంత్రం - కుచుమార 10వ శతాబ్దం
 • రసమంజరి - భానుదత్తుడు
 • రతికల్లోలిణి - దీక్షిత సమారాజ.
 • నాగర సర్వస్వం - బిక్షు పద్మశ్రీ బౌద్ధుడు 10వ/11వ శతాబ్దం
 • జయ: దేవదత్త శాస్త్రి హిందీ వ్యాఖ్యానం కామసూత్రపై వ్యాఖ్యానం 20వ శతాబ్దం.
 • శృంగారదీపిక - హరిహర
 • జయమంగల, - యశోధర.
 • రతిమంజరి - జయదేవుడు
 • కందర్ప చూడామణి
 • వాత్స్యాయన సూత్రసారము - క్షేమేంద్ర, కాశ్మీరీ రచయిత, కామసూత్రపై వ్యాఖ్యానం 11వ శతాబ్దం
 • రతిరహస్య - కొక్కోకుడు
 • పంచశయాక - జ్యోతిరీశ్వర కవిశేఖర పంచశాక్య 14వ శతాబ్దం
 • శృంగారరస ప్రబంధ దీపిక - కుమార హరిహర
 • కామసూత్ర
 • మనసోల్లాస లేదా అభిలషితార్థ చింతామణి - రాజు సోమదేవ III చాళుక్య రాజ్యం
 • స్మారదీపిక - మీననాధ
 • సూత్ర వృత్తి - నారింఘ శాస్త్రి 18వ శతాబ్దం, కామసూత్రపై వ్యాఖ్యానం.
 • రతిరత్నప్రదీపిక - ప్రౌఢ దేవరాజ విజయనగర రాజు, 15వ శతాబ్దం
 • కుట్టనిమాత - దామోదర గుప్త, కాశ్మీరీ కవి 8వ శతాబ్దం.
 • కామసమూహ - అనంత 15వ శతాబ్దం
 • జనవశ్య: కల్లారస, కొక్కాకుడు రచించిన "రతిరహస్యం" ఆధారంగా.


                                     

3. కామశాస్త్రం, కావ్యాలు

కామశాస్త్రానికీ, కామశాస్త్ర రచనలకూ, కవిత్వానికీ చాలా దగ్గర సంబంధాలు కానవస్తాయి. సంస్కృత కవులు కామశాస్త్రం గురించి తమ కావ్యాలు రచించడానికి ప్రముఖ కారణం, ఆయా శాస్త్రాలలో ప్రావీణ్యాలు క్షుణ్ణమైన అధ్యయనాలు ఉండడమే.