Топ-100
Back

ⓘ శాంతి స్వరూప్ భట్నాగర్ శాస్త్ర సాంకేతిక పురస్కారం. శాంతి స్వరూప్ భట్నాగర్ శాస్త్ర, సాంకేతిక పురస్కారం భారతదేశంలో ప్రతీ సంవత్సరం కౌన్సిల్ ఆఫ్ సెంటిఫిక్ అండ్ ఇండస ..
                                               

శాంతి స్వరూప్ భట్నాగర్

శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రసిద్ధిగాంచిన భారతీయ శాస్త్రవేత్త. భట్నాగర్ ను భారత పరిశోధన శాలల పితామహుడిగా అభివర్ణిస్తారు. బ్రిటీష్ ఇండియాలోని షాపూర్ లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి బొమ్మలు, యంత్ర పరికరాలు చేయటంలో ఆసక్తి కనబరిచేవాడు. వీరి పరిశోధనలు ఎక్కువగా పారిశ్రామిక రసాయనాలపై జరిగింది. ఆయన శాస్త్రీయ పరిశోధనకు 1941లో బ్రిటన్ ప్రభుత్వం సర్ బిరుదును ప్రదానం చేసింది. భారత స్వాతంత్యం తరువాత కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ సంస్థకు తొలి డైరెక్టర్ జనరల్ పదవి అలంకరించాడు. మన దేశంలో మొత్తం 12 పరిశోధన శాలలను ఈయన స్థాపించాడు. ఈతని జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్ ...

                                               

యమునా కృష్ణన్

యమునా కృష్ణన్ 25 మే 1974 న జన్మించిన ఒక భారత రసాయన శాస్త్రవేత్త. ఈమె బెంగుళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (NCBS, లో సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

                                               

బ్రహ్మ ప్రకాష్

బ్రహ్మ ప్రకాష్ పాకిస్తాన్‌లోని లాహోరులో జన్మించాడు. రసాయన శాస్త్రంలో డిగ్రీ పుచ్చుకుని, పంజాబ్ యూనివర్సిటీలో పరిశోధన చేసాడు 1942. మరింత ఉన్నత పరిశోధనల సందర్భంగా శాంతి స్వరూప్ భట్నాగర్‌తో కలిసి పనిచేసాడు. 1940-45 కాలంలో అసిస్టెంట్ మెటలర్జిస్టుగా పనిచేసాడు. 1946 లో రెండవ ప్రపంచ యుద్ధం ముగియగానే అమెరికా వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించాడు. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెటలర్జీ విభాగంలో చేరాడు. మినరల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ థెర్మోడైనమిక్స్ లో పి.హెచ్.డి తీసుకున్నాడు. భారత్ తిరిగి రాగానే ముంబైలో అణుశక్తి విభాగంలో మెటలర్జిస్టుగా చేరి 1948 నుండి 1950 వరకూ పనిచేసాడు.

                                               

రొద్దం నరసింహ

రొద్దం నరసింహా ఒక భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, ఫ్లూయిడ్ డైనమిక్స్‌లో నిపుణుడు. ఇతడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా, నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ కు డైరెక్టర్‌గా, బెంగుళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ కేంద్రంలోని ఇంజనీరింగ్ మెకానిక్స్ యూనిట్‌కు ఛైర్మన్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఇతడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో గౌరవ ఆచార్యునిగా, ప్రాట్ & విట్నీ పీఠాధిపతిగా ఉన్నాడు. భారత ప్రభుత్వం ఇతడిని 2013లో దేశపు రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ తో సత్కరించింది.

                                               

పచ్చా రామచంద్రరావు

పచ్చా రామచంద్రరావు ప్రపంచ ప్రఖ్యాత లోహ శాస్త్రజ్ఞుడు. 1942 మార్చి 21 న కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో నారాయణస్వామి, లక్ష్మీబాయి దంపతులకు జన్మించాడు. కాశీ హిందూ విశ్వవిద్యాలయములో విద్యార్థిగా, ఆచార్యునిగా, ఉపకులపతిగా చేసిన ఎకైక వ్యక్తి రామచంద్రరావు. 1992 నుండి 2002 వరకు జంషెడ్ పూర్ లోని జాతీయ లోహశాస్త్ర పరిశోధనాశాల నిర్దేశకునిగా పనిచేశాడు. పిమ్మట 2005 నుండి 2007 వరకు Defence Institute of Advanced Technology తొలి ఉపకులపతిగా పనిచేశాడు. పదవీ విరమణ తరువాత హైదరాబాదు లోని అంతర్జాతీయ లోహశాస్త్ర, నూతన పదార్థ పరిశోధనా సంస్థ లో రాజా రామన్న ఫెలోగా చేశాడు.

                                               

రమ గోవిందరాజన్

రమ గోవిందరాజన్, భారతీయ శాస్త్రవేత్త. ఆమె భౌతిక శాస్త్ర విభాగమైన ప్రవాహి గతిశాస్త్రం లో కృషి చేసింది. జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ లోని ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసారు. ప్రస్తుతం హైదరాబాదు లోని టి.ఐ.ఎఫ్.ఆర్ సెంటర్ ఫర్ ఇంటర్ డిసిఫ్లినరీ సైన్సెస్ నందు ప్రొఫెసర్ గా పనిచేయుచున్నారు. ఆమెకు 2007 లో శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం లభించింది.

                                               

పల్లె రామారావు

డాక్టర్ పల్లె రామారావు భారత దేశ అత్యుత్తమ శాస్త్రవేత్తలలో ఒకరు. ఇతడు అణుభౌతిక శాస్త్రంలోను, మెటలర్జీ విభాగంలో విశేషమైన కృషి చేశాడు. భారత ప్రభుత్వం ఇతనిని పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.ఇతడు డి ఆర్ డి ఓ, కేంద్ర అణు ఇందన సంస్థలలో కీలక పాత్ర నిర్వహించాడు. అమెరికన్ సొసైటీ ఆఫ్ మెటీరియల్స్, ఇతనికి "విశిష్ట జీవిత సభ్యత్వ" పురస్కారం అందించింది. ఇతడు ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయుడు.

                                               

అయ్యగారి సాంబశివరావు

ఎ.యస్.రావు గా ప్రసిద్ధుడైన అయ్యగారి సాంబశివరావు భారతదేశ అణు శాస్త్రవేత్త. హైదరాబాదు లోని ఈ.సి.ఐ.ఎల్ సంస్థ వ్యవస్థాపకుడు, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. ఈయన పేరు మీదుగానే హైదరాబాదులో ఈ.సి.ఐ.ఎల్ ఉద్యోగులు నివసించే కాలనీకి ఎ.యస్.రావు నగర్గా నామకరణం చేశారు.

                                               

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ, Roorkee, హిందీ भारतीय प्रौद्योगिकी संस्थान रुड़की) ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ పట్టణంలో ఉంది. ఆసియాలోని మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల ఇదే. 1847లో స్థాపించబడిన ఈ సంస్థ, 1949లో విశ్వవిద్యాలయ హోదాని పొంది రూర్కీ విశ్వవిద్యాలయంగా మారింది. 2001లో దీనికి ఐఐటీ హోదా ఇవ్వబడింది. ఇందులో ఇంజనీరింగ్, మానవ, సామజిక శాస్త్రాలకు చెందిన 18 విభాగాలు ఉన్నాయి.

                                               

శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు

శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు అనునది 1942 స్థాపించబడిన స్వయంప్రతిపత్త సంస్థ, 39 పరిశోధనాశాలలు, 50 క్షేత్ర స్థానాలు, విస్తరణా కేంద్రాలతో, 17000కి మించిన సిబ్బందితో కూడిన భారతదేశపు అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి సంస్థ. శా.పా.ప.ప కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖచే పోషింపబడినప్పటికీ, స్వయంప్రతిపత్తితోనే వ్యవహరిస్తుంది. దీని ప్రధాన పరిశోధనా రంగాలలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, నిర్మాణ ఇంజనీరింగ్, సముద్ర శాస్త్రాలు, పరమాణు జీవశాస్త్రం, లోహ సంగ్రహణ, రసాయనాలు, గనుల త్రవ్వకం, ఆహారం, ముడి చమురు, తోలు, వాతావరణం వంటి ముఖ్యమైనవి కూడా ఉన్నాయి. 20వ శతాబ్దపు ఆఖరి పదేళ్లలో 1376 నూతన ఆవిష్కరణలు వాటి దత ...

                                     

ⓘ శాంతి స్వరూప్ భట్నాగర్ శాస్త్ర సాంకేతిక పురస్కారం

శాంతి స్వరూప్ భట్నాగర్ శాస్త్ర, సాంకేతిక పురస్కారం భారతదేశంలో ప్రతీ సంవత్సరం కౌన్సిల్ ఆఫ్ సెంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ద్వారా ప్రముఖ శాస్త్ర పరిశోధకులకు అందజేయబడుతున్న శాస్త్ర పురస్కారం. ఈ పురస్కారాలను శాస్త్ర రంగాలైన జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, పర్యావరణ శాస్త్రం, ఇంజనీరింగ్, గణితశాస్త్రం, వైద్యరంగం, భౌతిక శాస్త్రాలలో అసమాన ప్రతిభ కనబరచిన వారికి అందజేస్తారు. ఈ పురస్కారం భారతీయ శాస్త్ర, సాంకేతిక రంగాలలో మంచి గుర్తింపు తెచ్చిన వారికి అంజజేయబడుతుంది. ఇది భారతదేశంలోని శాస్త్ర రంగంలో అతి గౌరవనీయమైన పురస్కారం. ఈ పురస్కారానికి భారతదేశ కౌన్సిల్ ఆఫ్ సెంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ స్థాపకుడైన శాంతిస్వరూప్ భట్నాగర్ పేరును పెట్టారు. ఈ పురస్కారం మొదటిసారి 1958 లో యివ్వబడింది.

భారతదేశ పౌరినిగా ఉన్న వ్యక్తి తన 45 సంవత్సరాల వయసు వరకు శాస్త్ర, సాంకేతిక రంగాలలో పరిశోధన చేస్తూ ఉంటే ఈ పురస్కారానికి అర్హత పొందుతాడు. ఈ పురస్కారాన్ని పొందవలసిననాటి నుండి ముందు ఐదు సంవత్సరాలపాటు ఆయన చేసిన కృషి ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఈ పురస్కారం ఒక పతకం, నగదు బహుమతి ₹ 5 lakh US$7.000. అందజేయబడుతుంది. అదనంగా ఆ పురస్కార గ్రహీత 65 వ సంవత్సరం వరకు ప్రతీ నెలా రూ. 15.000 అందజేయబడుతుంది.

గోవిందరాజన్ పద్మనాభన్
                                               

గోవిందరాజన్ పద్మనాభన్

బెంగుళూరులో తన పాఠశాల పూర్తి చేసిన తర్వాత, అతను ఒక ఇంజనీరింగ్ కాలేజిలో చేరారు. అయితే, అతను ఇంజనీరింగ్ రసహీనమైన దొరకలేదు, అతను రసాయన శాస్త్రంలో బాచిలర్స్ డిగ్రీ మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో పూర్తి చేసారు. అతను ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, న్యూఢిల్లీ నుండి కెమిస్ట్రీలో తన మాస్టర్స్, Ph.D. 1966 లో బయోకెమిస్ట్రీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి, బెంగుళూర్ నుండి పూర్తి చేసారు.