Топ-100
Back

ⓘ బౌద్ధ మతము ..
                                               

14 వ దలైలామా

దలైలామా పేరు చెబితే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది బౌద్ధుల హృదయాలు పూజ్య భావంతో బరువెక్కుతాయి. దలైలామా బుద్ధుల మత గురువే కాదు ప్రవాస టిబెట్ ప్రభుత్వానికి అధినేత కూడా. అహింసాయుతంగా టిబెట్ స్వాతంత్ర్యం కోసం ఏభై ఏళ్ళుగా పోరాడుతున్నాడు. 1933 లో 13వ దలైలామా నిర్యాణం తరువాత ఈయన 1935 జూలై 6 తేదీన ఉత్తర టిబెట్ లోని థక్సర్ లో పుట్టాడు. ఈయన అసలు పేరు లామోస్ తొండప్. నాలుగేళ్ళకే బౌద్ధ సన్యాసిగా మారిన తొండప్ తరువాత 14 వ దలైలామాగా అవతరించాడు. చైనా టిబెట్ ని ఆక్రమించి, అక్కడ నుంచి దలైలామాని వెళ్ళగొట్టడంతో 1959 నుంచీ ఈయన భారతదేశంలో శరణార్ధిగా ఉంటున్నాడు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని ధర్మశాలకి తొమ్మిది క ...

                                               

అట్ఠంగిక మగ్గ

నిర్వాణం చేర్చే బౌద్ధ మార్గం. ఇందులో ఎనిమిది అంశాలు ఉన్నాయి. బుద్ధుడు చేసిన తొలి ఉపదేశాలలో ఒకటిగా ఇది ప్రసిద్ధం. గౌతముడు జ్ఞానిగా పరిణామం చెంది, సారనాధ్‌ చేరి, అక్కడ పూర్వం తనతో తపస్సు చేసిన ఐదుగురు పరివ్రాజకులకు మొదటి సారిగా చేసిన ధర్మబోధలో ఇది భాగం. 1. సమ్మా దిట్ఠి సమ్యక్‌ దృష్టి, 2. సమ్మా సంకప్ప సమ్యక్‌ సంకల్పం, 3. సమ్మా వాచా సమ్యక్‌ వాక్కు, 4. సమ్మా కమ్మంత సమ్యక్‌ కర్మ, 5. సమ్మా ఆజీవ సమ్యక్‌ ఆజీవిక, 6. సమ్మా వాయామ సమ్యక్‌ కృషి, 7. సమ్మా సతి సమ్యక్‌ స్మృతి, 8. సమ్మా సమాధి సమ్యక్‌ సమాధి. ఈ ఎనిమిది అంగాలతో కూడిన మార్గం అత్యున్నత స్థితిని నిర్వాణాన్ని పొందడానికి ఉపయోగపడేది. సమ్మా దిట్ఠి సమ ...

                                               

ఆమ్రపాలి

ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలో ది స్పీకింగ్ ట్రీ శీర్షికతో వ్యాసం ప్రచురించబడింది. దీని ఆధారంగా పువ్వాడ తిక్కన సోమయాజి 2007 సంవత్సరంలో ఆమ్రపాలి అనే పద్య కావ్యాన్ని రచించారు. దీనిని అయిదు ఖండాలుగా సుమారు 160 పద్యాలుగా రూపొందించారు. ఆమ్రపాలి కథ రసభరితమయినది. దీన్ని సినిమాలుగా కూడా తీశారు. ఇంకా తీస్తున్నారు. ఆ కథలో అంత ఆకర్షించిన అంశాలేమిటి? ఇలా ఆలోచిస్తూ మన తెలుగులో ఎవరైనా ఆమ్రపాలి కథను రాశారా? తెలుగులో చాలామంది బౌద్ధ మతేతివృత్తంతో వివిధ కావ్యాలను రాశారు. గౌతమబుద్ధుని బోధనలకు ఆకర్షితులైన వాళ్ళలో వేశ్యలు కూడా ఉన్నారు. వేశ్యగా మారడానికి కారణాలెన్ని ఉన్నా, మరలా సాధారణ స్త్రీగా ఆమె తన జీవితాన ...

                                               

ఎర్రవరం గుహలు

ఎర్రవరం గుహలు ఏలేరు నదికి ఎడమవైపు తీరంలో రాజమహేంద్రవరం నుండి విశాఖపట్నం వెళ్ళేదారిలో రాజమహేంద్రవరంకి 45 కి.మీ దూరంలో ఉన్నాయి. ఈ గుహలు ధన్ల దిబ్బ కొండ మీద ఉన్నాయి.

                                               

ఖగ్గవిసాణ సూత్రం

ఖగ్గవిసాణ సూత్రం బౌద్ధమతం తొలినాళ్ళలో వ్రాయబడిన సూత్రం. సంఘం లో సన్యాసులు సంఘంగా ఉంటూ సన్యసించడం కంటే ఒంటరిగా సన్యసించడంలో ఉన్న లాభాన్ని నిరూపిస్తుంది.ఈ సూత్రం ముఖ్య ఉద్దేశం ప్రతి భిక్కుని కూడా ప్రత్యేకబుద్ధుడిగా మలచడం. ప్రత్యేకబుద్ధుడు అడవిలో ఒంటరిగా ఒక ఖడ్గమృగంలా సంచరించే వాడు.

                                               

థేరవాదం

థేరవాదం అనేది బౌద్ధమతంలో ఒక శాఖ. థేరవాదం అనగా పెద్దల సిద్ధాంతం. ఈ వాదాన్ని అనుసరించే థేరవాదులు గౌతమ బుద్ధుడు స్వయంగా బోధించినట్లుగా తాము నమ్ముతున్న సూత్రాలను పాళీ భాషలో గ్రంథస్తం చేశారు. థేరవాదులు ఒక సహస్రాబ్ది పాటు ఈ సూత్రాలు అలాగే కాపాడుతూ వచ్చారు. మహాయానం, వజ్రయానంతో పోలిస్తే థేరవాదం సిద్ధాంతాల పరంగా, సన్యాసి ధర్మాల పరంగా కఠినమైన నియమ నిబంధనలు కలిగిఉంది. ఈ ధర్మము త్రిపిటకములను ఆధారముగా చేసుకొని రూపుదిద్దుకొనినది. మిగతా బౌద్ధ విభాగ పాఠశాలతో పోల్చితే థేరవాదమే బుద్ధుని బోధనలకు దగ్గరగా ఉంటుందని ప్రతీతి. బుద్ధుని బోధనలు తప్పక పాటించే ఈ ధర్మములో సృష్టికర్త దేవుడు అనే అపోహలు ఉండవు. బౌద్ధములో స ...

                                               

వజ్ర సూత్రం

మహాయాన బౌద్ధానికి చెందిన ప్రజ్ఞాపారిమిత సూత్రాల వర్గ రచనలలోని "వజ్రచ్ఛేదిక ప్రజ్ఞాపారిమిత సూత్రాని"కి ఉన్న సంక్షిప్తనామం వజ్ర సూత్రం. క్రీ.శ 868 నాటి చైనీయ వజ్ర సూత్రాల దున్‌హువాంగ్ ప్రచురణలు 20వ శతాబ్దంలో లభ్యమయ్యాయి. బ్రిటీషు గ్రంథాలయం వారి ఉద్దేశ్యం ప్రకారం, ఇది పూర్తిగా దొరుకుతున్నవాటిలో అత్యంత ప్రాచీన సాహిత్యం.

                                               

హృదయ సూత్రం

హృదయ సూత్రం అనునది ఒక మహాయాన బౌద్ధ సూత్రం. ప్రజ్ఞాపారిమిత హృదయం అనే సంస్కృత నామానికి అర్థం "మానవాతీతమైన జ్ఞానాన్ని పొందిన హృదయం" అని అర్థం. హృదయం సూత్రం, వజ్ర సూత్రం అనేవి ప్రజ్ఞాపారిమిత వర్గానికి చెందిన రచన.