Топ-100
Back

ⓘ విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం. కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం ఒకటి. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన ..
                                     

ⓘ విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం

కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం ఒకటి. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో తూర్పు నియోజకవర్గం అత్యంత కీలకమైనది. గతంలో ఉన్న విజయవాడ తూర్పు నియోజకవర్గానికి పునర్విభజన తర్వాత కొత్తగా అదే పేరుతో ఏర్పాటైన కొత్త నియోజకవర్గానికి ఏ మాత్రం పొంతన లేదు. కొత్తగా ప్రస్తుత నియోజకవర్గంలోని ప్రధాన ప్రాంతాలుగా ఉన్నవి గతంలో కంకిపాడు నియోజకవర్గంలో ఉండేవి. బందరురోడ్డు, ఆటోనగర్‌, జాతీయ రహదారులు, అత్యధికమైన కాలనీలు, హెల్త్‌ యూనివర్సిటీ, గుణదల లోని మేరిమాత పుణ్యక్షేత్రం తదితర కీలక ప్రాంతాలు ఈ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం ఉన్నాయి.

                                     

1. జాతీయ రహదారులు

రెండు జాతీయ రహదారులు ఈ నియోజకవర్గం మీదుగా వెళ్ళుతున్నాయి. నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి, ధనిక అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాణిజ్య, వ్యాపార, విద్యా కూడలిగా ఈ ప్రాంతం బాగా ప్రసిద్ధి చెందింది.

                                     

2. నైసర్గిక స్వరూపం

తూర్పు నియోజకవర్గంలో ఆటోనగర్‌, పటమట, పటమటలంక, రామలింగేశ్వరగనర్‌, మొగల్రాజపురం, గుణదల, కృష్ణలంక ప్రాంతాలు ఉన్నాయి.

 • తూర్పు నియోజకవర్గానికి ఆటోనగర్‌ బస్‌స్టాండ్‌ సరిహద్దు. అటుపైన అంతా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.
 • కృష్ణలంక బస్‌స్టాండ్‌ ఇవతల ప్రాంతమంతా ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.
 • గుణదల మాచవరం ఆంజనేయ స్వామి గుడి వరకు తూరు నియోజకవర్గం సరిహద్దు ఉంది.
 • బెంజిసర్కిల్‌ నుంచి రామవరప్పాడు రింగ్‌ వరకు వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి అత్యధిక కాలనీలన్నీ తూర్పు నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. అత్యధిక కాలనీలు ఉన్న నియోజకవర్గం ఇదే.
                                     

3. నిర్మాణ దశలలో ఉన్న ప్రాజెక్టులు, పెద్ద పథకాలు

 • గుణదల ప్రాంతంలో పేదల కోసం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభదశలో ఉన్నాయి. ఇక్కడ 500 కుటుంబాలకు పైగా జి+3 అంతస్తుల్లో భవనాలను నిర్మించి అందజేస్తారు. వీటి నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతోంది.
 • ఈ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో యూజీడి పనులు జరుగుతున్నాయి. తదుపరి ఆయా ప్రాంతాల్లో రోడ్లు వేయాల్సి ఉంది.
 • గుణదల గంగిరెద్దుల దిబ్బపై రూ.6 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న రక్షిత నీటి రిజర్వాయర్‌, నీటి శుద్ధిచేసే ప్లాంట్‌ పనులు మొదటి దశలో ఉన్నాయి. రైవస్‌ కాలువ నీటిని ఇక్కడకు పంపింగ్‌ చేసి వాటిని శుద్ధి చేసి కొండప్రాంత వాసులకు అందిచేస్తారు. కొన్ని సాంకేతిక కారణాలతో పూర్తి చేయుటకు మరికొంత సమయం పట్టే వీలుంది.
                                     

4.1. ముఖ్యమైన ప్రదేశాలు ఆటోనగర్‌

దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పరిశ్రమలు రెండు ఉండగా, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 200 వరకు ఉంటాయి. ఆసియాలో అతి పెద్ద ఆటోనగర్‌గా పేరుగాంచింది. 275 ఎకరాల్లో ఆటోనగర్‌ విస్తరించి ఉంది. 53 ఎకరాల్లో ఆటోనగర్‌ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ను ఏర్పాటు చేశారు. ఆటోమొబైల్‌కు సంబంధించి వివిధ వర్క్‌షాపులు, ఫౌండ్రీలు కూడా ఉన్నాయి. ఆటోనగర్‌లో సుమారు 80 వేల మంది ఉపాధి పొందుతున్నారు.

                                     

4.2. ముఖ్యమైన ప్రదేశాలు బెంజిసర్కిల్‌

విజయవాడలోనే అత్యంత రద్దీ కూడలి ప్రదేశం. అటు చెన్నై, ఇటు కోలకత్తాను కలిపే జాతీయ రహదారి. గతంలో ఇక్కడ బెంజ్‌ వాహనాల కంపెనీ ఉండడంతో ఆ పేరుతోనే ఈ జంక్షన్‌కు పేరు వచ్చింది. నిజానికి బెంజ్‌సర్కిల్‌ కూడలిలో ఉంది కాకాని వెంకటరత్నం విగ్రహం ఉన్నదన్న విషయం చాలా మందికి తెలియదు.

 • వేంకటేశ్వరస్వామి గుడి, లబ్బీపేట
 • సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల,
 • ప్రభుత్వ దంత వైద్య కళాశాల,
 • ప్రభుత్వ ఆస్పత్రి
 • ఈ.ఎస్‌.ఐ. కార్మిక బీమా ఆస్పత్రి
 • గణపతి సచ్చిదానంద ఆశ్రమం, పటమట
 • కృష్ణలంక త్రిశక్తిపీఠం
 • గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం: ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 నెలలో మేరీమాత ఉత్సవాలు నిర్వహిస్తారు. లూర్థు నగరంలో ఉన్న మేరీ మాత పుణ్యక్షేత్రం తరహాలోనే గుణదల కొండ పై మేరీ మాత పుణ్యక్షేత్రాన్ని నిర్మించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కులమతాలకు అతీతంగా అనేకమంది భక్తులు హజరవుతుంటారు.