Топ-100
Back

ⓘ భారతదేశంలో ఇస్లాం ..




                                               

ఖ్వాజా బందా నవాజ్

ఖ్వాజా బందా నవాజ్ లేదా ఖ్వాజా బందేనవాజ్, ఇతని బిరుదు గేసూ దరాజ్ ; గేసూ=కేశాలు, దరాజ్=పొడవాటి, అనగా పొడవాటి కేశాలు గల సూఫీ. జననం క్రీ.శ. 1321 మరణం 1422, భారతదేశానికి చెందిన ఒక ప్రసిద్ధ సూఫీ సంతుడు, సహనం, సర్వమానవ ప్రేమ, సూఫీ తత్వము బోధించిన జ్ఞాని. చిష్తియా తరీఖాకు చెందిన సూఫీ. తనపూర్వీకులైన సయ్యద్ అబుల్ హసన్ జుంది, ఖురాసాన్ నుండి భారత్ వచ్చి స్థిరపడ్డాడు. గేసూ దరాజ్, తన తండ్రి సయ్యద్ ముహమ్మద్ హుసేనీకి రెండవ కుమారుడు. గేసూ దరాజ్ క్రీ.శ. జూలై 30 1321 / హి.శ. 4 రజబ్ నెల, 721 న ఢిల్లీలో జన్మించారు. గేసూ దరాజ్ తన జీవితమంతా సర్వమానవ సౌభ్రాతృత్వం బోధించే ఇస్లామీయ తత్వాన్ని బోధిస్తూ జీవించారు. అంద ...

                                               

చార్ బైత్

చార్ బైత్ - s 400 సంవత్సరాల చరిత్ర గల ఈ కళారూపం, ఓ కళాకారుల గుంపుతో ప్రదర్శింపబడే కళ. ఈ గుంపులో దఫ్ కళాకారులు, గాయకులు వుంటారు. ఈ కళా రూపంలో చార్ బైత్ లేదా నాలుగు వాక్యాలతో కూడిన కవిత ముఖ్య భూమిక వహిస్తుంది. ఈ కళారూపం నేటికినీ రాంపూర్, టోన్క్, భోపాల్, హైదరాబాదు లో సజీవంగా ఉంది.సంగీత నాటక అకాడమీ ఈ కళారూపాన్ని జానపద కళారూపంగా గుర్తించింది.

                                               

మదార్ సాహేబ్ దర్గా

మదార్ సాహేబ్ దర్గా తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లా, ఆలేరులోని రామసముద్రం సమీపంలో ఉన్న దర్గా. 2009లో వెలసిన దర్గాకు ప్రతి శుక్రవారం దర్గాకు వివిధ గ్రామాల నుంచి భక్తులు వచ్చి, ప్రార్థనలు చేస్తుంటారు.

                                               

యూసుఫైన్ దర్గా

యూసుఫైన్ దర్గా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాంపల్లి బజార్ ఘాట్ చౌరస్తాలో ఉన్న దర్గా. మత బోధకులు యూసుఫుద్దీన్, షరీఫుద్దీన్ అనే ఇద్దరు స్నేహితుల స్మారకంగా ఈ దర్గా నిర్మించబడింది.

                                               

హైదరాబాదులోని దర్గాల జాబితా

దర్గాహ్ అనే పదానికి మూలం పర్షియన్ భాషా పదం దర్గాహ్, అర్థం గృహం లేదా నివాసం లేదా గృహద్వారం. సాధారణంగా తవస్సుల్ ప్రకారం, సమాధులలో నిదురించేవారి ఆశీస్సులు పొందడం కోసం, వారి సమాధుల వద్ద జియారత్ చేయడం ఓ ఆనవాయితీ. ఈ దర్గాహ్ లు భారతదేశంలోనే గాక ప్రపంచంలోని పెక్కు ముస్లిం దేశాలలోనూ, ముస్లింలు గల ఇతరదేశాలలోనూ కానవస్తాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అనేక ప్రాంతాలలో దర్గాలు ఉన్నాయి.