Топ-100
Back

ⓘ 11 వ శతాబ్దం ..




                                               

1017

షియా మతానికి చెందిన జిరిద్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సున్నీ శాఖ వారి తిరుగుబాటు జరిగింది. త్వరితంగానే నగరం తిరిగి తీసుకున్నారు. సి. మే – బారీ యొక్క మెలెస్ తిరుగుబాటును ప్రారంభించారు. ఈ తిరుగుబాటు నార్మన్ వ్యాపారులు సమర్థించారు. బైజాంటైన్ సామ్రాజ్యపు సైన్యాన్ని మూడు వేర్వేరు ప్రాంతాల్లో అతని సైన్యాలు గెలుపొందాయి. ఉమయ్యద్ ఖలీఫా పదవిని సులేమాన్ వారసునిగా అబద్ అర్-రహమాన్ IV చేపట్టారు. రాజేంద్ర చోళుడు శ్రీలంక ద్వీపాన్ని తన రాజ్యంలో కలుపుకున్నారు. కీవ్ నగరం తగలబెట్టారు. సెయింట్ సోఫియా కాథెడ్రల్, కీవ్ ప్రారంభించినట్టుగా భావిస్తున్నారు.

                                               

1025

సుమత్రా లోని శ్రీవిజయ అనే బౌద్ధ రాజ్యంపై మొదటి రాజేంద్ర చోళుడు దాడి చేసాడు. ఆగ్నేయాసియాలో వాణిజ్య హక్కుల విషయంలో వచ్చిన వివాదమే ఈ దాడికి కారణం. ఈ దాడిని శ్రీవిజయ రాజ్యం తట్తుకుంది గానీ దాని ప్రాముఖ్యత తగ్గిపోయింది. జనవరి 8: సుల్తాన్‌ మహ్మద్‌ ఘజనీ సోమనాథ్ దేవాలయాన్ని దోచుకొని నేలమట్టం చేయించాడు. స్వయంగా తానే ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశాడు. డిసెంబరు 15: బైజాంటైన్ చక్రవర్తి బాసిల్ II, 50 యేళ్ళ పరిపాలన తరువాత కాన్‌స్టంటినోపుల్‌లో మరణించాడు. అతడు పెళ్ళి చేసుకోలేదు. అతడి తరువాత అతడి సోదరుడు కాన్‌స్టంటైన్ VIII బైజాఅంటైన్ చక్రవర్తి అయ్యాడు. డిసెంబరు 25: బోలెస్లావ్-I కుమారుడు మీజ్కోII లాం ...