Топ-100
Back

ⓘ క్రైస్తవ మతము ..
                                               

666 (సంఖ్య)

666 అనునది బైబిలు గ్రంథంలోని సాతాను ను సూచించే సంఖ్య. ఈ సంఖ్య గురించి క్రొత్త నిబంధన గ్రంథములో ప్రకటన గ్రంథము 13:18 లో చెప్పబడింది. ప్రకటన గ్రంథం లో ఈ సంఖ్య కలిగియున్న సాతాను 7 తలలు, 10 కొమ్ములు ఉన్న మృగముగా కనిపిస్తాడు. ఈ మృగము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి జాతిని, మనుష్యులను, నాలుకను, దేశమును పాలించు రాజనీతికి సాదృశ్యము. Revelation 13:7. బైబిలులో 6 అనే సంఖ్య అసంపూర్ణతకు, దేవుని కంటికి అబద్దముగానూ, దేవుని శత్రువుగానూ గుర్తుగా ఉంది. More than a label. Names given by God have meaning. For example, God gave the man Abram, which means" Father Is High Exalted,” the name Abraham, which means" Fat ...

                                               

అపోస్తలుల విశ్వాస ప్రమాణం

మొదటి అంశం భూమ్యాకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రియైన దేవుని నేను నమ్ముచున్నాను దీని కర్థ మేమి? నన్ను, సమస్త జీవరాశుల్ని దేవుడే కలుగజేశాడని, నాకు శరీరాన్ని, ఆత్మను, కళ్ళను, చెవుల్ని ఇంకా అవయువాలన్నింటినీ బుద్ధినీ, జ్ఞానేంద్రియాల్ని ఆయనే ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఇంకా నేను బ్రతకడానికి కావాల్సినవన్నీ - అంటే వస్త్రాలు, అన్నపానాలు, ఇల్లు, ఆస్తి, భార్యపిల్లలు, భూమి, పశువులు మొదలైనవన్నీ నా కిచ్చి, ప్రతీ రోజూ దేవుడు నా అవసరాలు తీరుస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఇంకా దేవుడు నన్ను అన్ని అపాయాలనుండి తప్పిస్తూ, కీడంతటినుండి కాపాడి, సం రక్షిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఇవన్నీ కూడా నా మంచితనం ...

                                               

గార్డెన్ ఆఫ్ ఈడెన్

గార్డెన్‌ ఆఫ్‌ ఈడెన్‌ బైబిల్‌ ప్రకారం దైవం మొదట మనిషిని సృష్టించి ఉంచిన వనం ఈడెన్‌. జెన్సిస్‌ రెండవ అధ్యాయంలో ఈ వివరాలు ఉన్నాయి. పదిహేనవ వచనంలో ఈడెన్‌ గార్డెన్‌ ప్రస్తావన ఉంది. దైవం మొదట ఒక పురుషుడిని సృష్టించాడు. ఆ ఆది పురుషుడి పేరు ఆదం. వనంలో ఏ చెట్టుకు కాసిన ఫలాన్నయినా తినవచ్చును గానీ, మంచి చెడుగుల జ్ఞాన వృక్షం చాయలకు మాత్రం పోవద్దని దైవం హెచ్చరించాడు. తరువాత జంతు జాలాన్ని, విహంగ జాలాన్ని కూడా సమకూర్చాడు. ఆదమ్‌కు తోడు ఉండాలని ఒక స్త్రీని కూడా సృష్టించాడు. ఆదమ్‌కు గాఢ నిద్ర కలిగించి, అతడి పక్కటెముక ఒకటి తీసుకొని దానితోనే ఆమెను సృష్టించాడు. ఆదమ్‌ అన్ని జంతువులకి, పక్షులకి పేర్లు పెట్టాడు. ...

                                               

చర్చి

చర్చి): క్రైస్తవులు సమూహమును చర్చి అని అంటారు. ప్రతి ఆదివారం క్రైస్తవులుసమూహ సంఘముగా చేరి సామూహిక ప్రార్థనలు గావిస్తారు. ప్రార్థనలు చేపట్టు ధార్మిక నాయకుడిని bodhakudu పాస్టర్ అని వ్యవహరిస్తారు. చర్చిలలో చాలా రకాలు ఉంటాయి. చర్చిలలో క్రిస్మస్ పండుగ చాలా కన్నుల పండుగగా జరుగుతుంది.కానీ ఇది బైబిల్ లో చెప్ప లేనిదీ చర్చి బోధకుడు పవిత్ర గ్రంథమైన బైబిలును చదివి దానిలోని అర్ధమును వివరించి చెప్పును.

                                               

దశాదేశాలు

టెన్ కమాండ్‌మెంట్స్ లేదా పది దైవాదేశాలు నిర్గమ కాండము 20: 2-17 లోనూ, బైబిల్‌ ఐదవ పుస్తకం ద్వితియోపదేశ కాండము 5:6-21లోనూ ఉన్నాయి. ఐతే రెండు చోట్లా ఇవి పది కంటే ఎక్కువే కనిపిస్తాయి. ఇవి గాక నిర్గమ కాండము 34వ అధ్యాయంలో రెండవ సారి శిలా ఫలకాలను ఇచ్చిన ఘట్టంలోనూ దైవం తన ఆజ్ఞలను తెలియజేయడం కనిపిస్తుంది. సాధారణంగా టెన్‌ కమాండ్‌మెంట్స్‌ అని తటస్థపడే అంశాలు ఈ రెండు బైబిల్‌ పుస్తకాలలోనివే. పది దైవాజ్ఞలు ఇవీ: 1. నేనే భగవంతుడిని. నన్ను తప్పించి మరో దేవుడెవరినీ కొలవకండి. 2. విగ్రహారాధన చేయకండి. 3. దేవుడి పేరును వృధాగా వాడకండి. 4. శాబ్బత్‌ను సబ్బాత్‌ అని కూడా వ్యవహరిస్తున్నారు మరవకండి/ పాటించండి. శాబ్బత్ ...

                                               

దావీదు

దావీదు: బైబిల్ లో సమూయేలు గ్రంధములో వ్రాయబడిన ప్రకారము దావీదు ఇశ్రాయేలు, యూదా సమైఖ్య రాజ్యానికి 2వ రాజు. దావీదు ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని 1040–970 BC మధ్య పరిపాలించాడు. మత్తయి సువార్త, లూకా సువార్త ప్రకారం యేసు క్రీస్తు యొక్క వంశావళికి మూలపురుషుడు. సౌలు మరణించిన తరువాత మొదట యూదా వారి మీద రాజుగా ఉండి తరువాత ఇశ్రాయేలు రాజు ఇష్బోషెతుసౌలు కుమారుడు మరణానంతర పరిణామములలో సమైఖ్య పరచబడిన రెండు రాజ్యములకు రాజుగా ఉండెను. బైబిల్ లో వ్రాయబడిన ప్రకారము, యౌవన కాలములో గొర్రెల కాపరిగా ఉన్న దావీదు తరువాత సంగీతకారునిగాను, ప్రత్యర్ధి గొలియాతును చంపడము వలన బహు కీర్థి గడించెను. రాజైన సౌలుకు ఇష్టుడుగాను, సౌలు కుమ ...

అబ్రక్సాస్‌
                                               

అబ్రక్సాస్‌

క్రైస్తవులలో బాసిలిడియన్లు అనే ఒక తెగ ఉంది. జీసస్‌ను శిలువ వేసారని నమ్మకపోవడం లాంటి ప్రత్యేకతలు ఉన్న వర్గం ఇది. వారు ఉపయోగించే ఒక పదం ‘అబ్రక్సాస్‌’. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ పదం విలువ 365. సర్వేశ్వరుడు ఇన్ని స్వర్గాలను ఒక క్రమం ప్రకారం సృష్టించాడని వారు నమ్ముతారు. ‘అబ్రక్సాస్‌’ అనే పదాన్ని ఒక రత్నం మీద చెక్కించి తాయెత్తులాగా వాడుకొనే ఆచారం ఈ వర్గంలో ఉంది. ‘అబ్రకదబ్ర’, ‘కబ్బలా’ పదాలను రత్నాల మీద చెక్కించి తాయెత్తులలోనూ, ఉంగరాల లోనూ వాడుకొనే సంప్రదాయమూ ఉంది.

క్రిష్టడెల్ఫియన్
                                               

క్రిష్టడెల్ఫియన్

క్రిస్తాదేల్ఫియన్లు ­ అనగా గ్రీకు భాషలో క్రీస్తు లో బ్రదర్స్, సిస్టర్స్.ఇది ఒక ప్రొటెస్టంట్ చర్చి. దీనిలో 60.000 సభ్యులు ఉన్నారు. ఈ సంస్థ బ్రిటన్, ఆస్ట్రేలియాలో తమ కార్యకలపాలను కొనసాగిస్తుంది.

క్రైస్తవమతం పై వ్యతిరేకత
                                               

క్రైస్తవమతం పై వ్యతిరేకత

క్రైస్తవ మతంపై వ్యతిరేకత అది ప్రారంభమైన రోమన్ సామ్రాజ్య కాలం నుంచే ఉంది. విమర్శకులు వారి నమ్మకాలను, బోధనలను, క్రూసేడులు, మత ఉగ్రవాదం లాంటి చర్యలను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ మతం హింసను, అవినీతిని, మూఢనమ్మకాలనూ ప్రేరేపించిదిగా ఉందని కొంతమంది అభిప్రాయం. పాశ్చాత్య దేశాల్లో ముప్ఫై శాతం ప్రజలు కూడా చర్చీలకు వెళ్ళటం లేదు. మతంపై విశ్వాసం సడలిపోయిందని అన్ని దేశాలు హిందు ధర్మంపై ఆసక్తిగా చూస్తున్నారన్న విషయాన్ని పరిశోధకులు తేల్చిచెప్పారు

                                               

ద్వితీయోపదేశ కాండము

ద్వితియోపదేశ కాండం ఒకటి నుండి ముప్పై మూడు అధ్యాయాలు మోషేచే రాయబడ్డాయి. ముప్పైనాలుగో అధ్యాయాన్ని యెహోషువ రాశాడు. ఇది క్రీ.పూ. 1446-1406 లో రాయబడింది. ఇందులో ఇశ్రాయేలు ప్రజలు కనాను ప్రవేశించే ముందు మోషే గత 40 ఏండ్ల ప్రయాణాల్లో దేవుడు చేసిన మహాక్రియలు, అనుగ్రహమూ, వాత్సల్యమూ, విశ్వసనీయత వారికి జ్ఞాపకానికి తేవడం, దేవుని శాసనాలను తిరిగి ఇవ్వడం, అవిధేయత విషయం హెచ్చరించడం, చివరి అధ్యాయాల్లో మోషే తుదిపలుకులు, మోషే మృతిచెందడం, మొదలగు విషయాలు చెప్పబడినవి.

                                               

యెహూషువ

యెహోషువ గ్రంథ రచయుత యెహోషువ. రాయబడిన కాలం క్రీ. పూ. 1406. దీనిలో మోషే స్థానంలో యెహోషువ నాయకత్వం, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకిచ్చిన గొప్ప విజయం, వారు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకున్న విషయం, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు వచ్చిన వాటా భూములు, యెహోషువ తుదిపలుకులు, మొదలగు విషయాలు రాయబడ్డాయి.

                                               

లేవియ కాండము

లేవీయ కాండం రచయిత మోషే. ఇది క్రీ.పూ. 1446-1406 లో రాయబడింది. ఇందులో పవిత్రుడైన దేవుడు పాపాల్ని క్షమించే విధానం, పవిత్ర అర్పణలు, యాజకుని పవిత్ర చర్య, పవిత్ర ప్రవర్తన కోసం చట్టాలు, పవిత్రమైన పండుగలు, మహోత్సవాలు, పవిత్ర ప్రవర్తనకు, అపవిత్ర ప్రవర్తనకు ప్రతిఫలాలు, మొదలగు విషయాలు చెప్పబడినవి.

                                               

సంఖ్యా కాండము

సంఖ్యా కాండం రచయిత మోషే. ఇది క్రీ.పూ. 1446-1406 లో రాయబడింది. ఇందులో జనాభాలెక్కలు, వివిధ శాసనాలు, సినాయి పర్వతము నుంచి కనాను సరిహద్దువరకు ప్రయాణం, గూఢచారులు కనాను దేశాన్ని చూసిన విధం, ఇశ్రాయేలు ప్రజల అవిశ్వాసం, వారి తిరుగుబాటు, ఎడారిలో నలభైఏండ్ల సంచారం, మొదలగు విషయాలు చెప్పబడినవి.