Топ-100
Back

ⓘ కాలమానాలు ..
                                               

కరణం

హిందూ జ్యోతిష శాంస్త్రంలో పంచాంగంలో ఒక అంశం కరణం. పంచాంగం అనగా తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం - ఈ ఐదు భాగముల కలయిక. పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. పంచాంగములు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం, సూర్యమాన పంచాంగం. చంద్రగతిని అనుసరించి బవాది 11 కరణాలు వరుసగా తిథిలో సగ భాగాన్ని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం అవుతుంది. పంచాంగం ప్రకారం కరణములు 11. నాగవము భద్ర కౌలవ శకునే = శకుని గరజి తైతుల కీమస్తుఘ్నము భాలవ చతుష్పాతు పణజి బవ చంద్రగతిని అనుసరించి బవాది 11 కరణాలు వరుసగా తిధిలో సగభాగంగా లెక్కిస్తారు. శుభతిథిని ఎన్నుకుని పని - ప్రారంభిస్తే సంపద, వారం వల్ల - ఆయుషు, నక్షత్రం వల ...

                                               

కలియుగం

కలి యుగం హిందూ పురాణాలననుసరించి మహాయుగములోని చివరి, నాలుగవ యుగం. ఇది ప్రస్తుతం నడుస్తున్న యుగం. వేదాల ననుసరించి యుగాలు నాలుగు, ద్వాపరయుగం కలియుగము త్రేతాయుగం సత్యయుగం కలి యుగం కాల పరిమాణం 432000 సంవత్సరములు, అందు సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి. హిందూ, బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంత ప్రకారం సా.శ.పూ. 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి 00:00 కలియుగం ప్రారంభమైంది. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారంను చాలించాడని హిందువులు భావిస్తారు. కలియుగాంతంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తాడు.

                                               

కాలమానం

ఆరోహణ క్రమంలో సాధారణ కాలమానాలు గంట = 60 నిమిషాలు 75 సంవత్సరాలు = అమృత వర్షం 100 సంవత్సరాలు = శత వర్షం లేదా శతాబ్దం నిమిషం = 60 సెకనులు 50 సంవత్సరాలు = స్వర్ణ వర్షం 25 సంవత్సరాలు = రజత వర్షం నెల = 30 రోజులు 40 సంవత్సరాలు = కెంపు వర్షం వారం = 7 రోజులు రోజు = 24 గంటలు పక్షం = 15 రోజులు 1000 సంవత్సరాలు = సహస్రాబ్ధి 10 సంవత్సరాలు = దశాబ్ధం సంవత్సరం = 12 నెలలు సెకను అతి చిన్న ప్రమాణం 60 సంవత్సరాలు = వజ్ర వర్షం

                                               

గాంధీ శకం

1919 నుండి 1948 వరకు భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ ఆధిపత్యం చెలాయించాడు. అందుకే ఈ కాలాన్ని భారత చరిత్రలో గాంధీ యుగం అని పిలుస్తారు. ఈ సమయంలో, మహాత్మా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ పై ఆధిపత్యం చెలాయించాడు. అతను సహాయ నిరాకరణోద్యమం ద్వారా భారత రాజకీయాల్లో ప్రభావం చూపాడు. హిందూ-ముస్లిం ఐక్యతకు అవకాశాన్ని గ్రహించిన గాంధీ తెలివిగా ఖిలాఫత్ నాయకులతో పొత్తు పెట్టుకుని బ్రిటిష్ వలసరాజ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. భాభారతీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా, జాతీయ ప్రధాన స్రవంతిలో సమాజంలోని దాదాపు అన్ని వర్గాల చురుకైన భాగస్వామ్యాన్ని నిర్ధారించడంలో ఆయన విజయం సాధించాడు. గ ...

                                               

చాంద్రమానం

మానం అంటే కొలిచేది అని ఒక అర్థం. చాంద్రమానం అంటే భూమికి అనుగుణంగా చంద్రుడి గమనాన్ని బట్టి తిధులు, వారాలు, నెలలు లేదా మాసాలు, సంవత్సరాలు నిర్ణయించుకునే విధానం. తెలుగు, కన్నడ వారి క్యాలెండర్లు, పంచాంగాలు చాంద్రమానం ప్రకారం ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా అందరం పాటిస్తున్న గ్రిగెరియన్ క్యాలెండర్ సౌరమానం ప్రకారం ఉంటుంది. అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కాలాన్ని ఆధారం చేసుకున్నది. భూమి తన చుట్టూ తాను తిరిగే భూభ్రమణం సమయం ఒక రోజు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే భూ పరిభ్రమణం కాలాన్ని 365. 2563666 రోజులు ఒక సంవత్సరం 365 రోజులు గా పరిగణించి, దాన్ని 12 నెలలుగా విభజిస్తారు. ప్రతి సంవత్సరం మిగిలి పోయిన పావు ర ...

                                               

తిథి

తిథి అంటే: వేద సమయ గణితము ప్రకారము చంద్రమాసము లో ఒక రోజును తిథి అంటారు. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి, సూర్యుడు నుండి చంద్రుని కదలికలు తిధులవుతాయి, ఉదాహరణకు సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటే అమావస్య, అదే సూర్యచంద్రులు ఒకరి కి ఒకరు సమాన దూరములో వుంటే పౌర్ణమి అవుతుంది, శాస్త్రీయముగా సూర్యుడు, చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు సూర్యోదయమున ప్రారంభము కావు సూర్యాస్తమయానికి ముగియవు. రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉంది. ఒక్కొక్క తిథి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది.

                                               

కేలండర్ 2012

తెలుగు సంవత్సరం ఉగాది నుండి ఉగాది వరకుగా ఉంటుంది. అంటే, మార్చి 3వ వారం నుండి, మార్చి 3వ వారం వరకు. 2012 ఉగాది మార్చి 23 నుండి "శ్రీ నందన నామ సంవత్సరం" మొదలవుతుంది.

                                               

కేలండర్ 2013

తెలుగు సంవత్సరం ఉగాది నుండి ఉగాది వరకుగా ఉంటుంది. అంటే, మార్చి 3వ వారం నుండి, మార్చి 3వ వారం వరకు. 2013 ఉగాది మార్చి 23 నుండి "శ్రీ నందన నామ సంవత్సరం" మొదలవుతుంది.

                                               

త్రేతాయుగం

వేదాల ననుసరించి యుగాలు నాలుగు.నాలుగు యుగాలలో త్రేతా యుగం రెండవది ఈ యుగంలో భగవంతుడు శ్రీ రామ చంద్రుడుగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు.ఈ యుగం పరిమితి 4.32.000 * 3 = 12.96.000 అనగా పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరాలు. ఇందు ధర్మం మూడు పాదములపై నడుస్తుంది.వైశాఖ శుద్ధ తదియ రోజునుండి త్రేతాయుగం ప్రారంభమైంది.

                                               

విక్రమాదిత్య శకం

విక్రమాదిత్య శకం భారతీయ కాలమానం. ఇది క్రీ.పూ. 58 నుండి దీనిని లెక్కించారు. శాలివాహన శకం ఆరంభానికి 136 సంవత్సరాలకు ముందే ఈ కాలమానం అమలులో ఉండేది. మానవజాతి చరిత్రలో కాలమానాలను చరిత్ర ప్రసిద్ధులైన వారి పేరుతో వాడుట పరిపాటే. ఆవిధంగానే వాడుకలోకి వచ్చిన కాలాలలో ఇదీ ఒకటి. భారతదేశాన్ని పరిపాలించిన చరిత్ర ప్రసిద్ధపురుషుడు విక్రమాదిత్యుడి పేరు మీదుగా ఈ శకం ప్రారంభమైంది.