Топ-100
Back

ⓘ ఆరావళీ పర్వత శ్రేణులు. ఆరావళి పర్వతాలు వాయవ్య భారతదేశంలోని పర్వత శ్రేణి. ఈ పర్వత శ్రేణి ఢిల్లీ వద్ద మొదలై నైరుతి దిశలో సుమారు 692 కి.మీ. పాటు, దక్షిణ హర్యానా రా ..
ఆరావళీ పర్వత శ్రేణులు
                                     

ⓘ ఆరావళీ పర్వత శ్రేణులు

ఆరావళి పర్వతాలు వాయవ్య భారతదేశంలోని పర్వత శ్రేణి. ఈ పర్వత శ్రేణి ఢిల్లీ వద్ద మొదలై నైరుతి దిశలో సుమారు 692 కి.మీ. పాటు, దక్షిణ హర్యానా రాజస్థాన్ గుండా వెళ్ళి, గుజరాత్‌లో ముగుస్తుంది. ఈ పర్వత శ్రేణిలో ఎత్తైన శిఖరం గురు శిఖర్ - ఎత్తు 1.722 మీటర్లు.

                                     

1. మానవ చరిత్ర

ఆరావళి శ్రేణిలో మానవ చరిత్ర మూడు దశలలో ఉంది. ప్రారంభ రాతి యుగం ఫ్లింట్ రాళ్ళను ఉపయోగించింది; 20.000 ఏళ్ళ క్రితం నుండి ప్రారంభమయ్యే మధ్య రాతి యుగం వ్యవసాయం కోసం పశువుల పెంపకాన్ని చూసింది; 10.000 ఏళ్ళ క్రితం నుండి ప్రారంభమైన రాతి యుగానంతర కాలం కలిబంగన్ నాగరికత, 4.000 సంవత్సరాల పురాతన అహార్ నాగరికత, 2.800 సంవత్సరాల పురాతన గ్నేశ్వర్ నాగరికత, ఆరాయన్ నాగరికత, వేద యుగ నాగరికతల అభివృద్ధినీ చూసింది.

                                     

1.1. మానవ చరిత్ర తోషం కొండలు సింధు నాగరికత గనులు

తోషామ్ కొండలకు చుట్టుపక్కల అనేక సింధు లోయ నాగరికత ప్రదేశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది రాగి దొరికే ప్రాంతం.

హరప్పా వద్ద లభించిన అత్యంత సాధారణమైన గ్రైండింగ్ రాయి ఢిల్లీ క్వార్ట్జైట్ రకానికి చెందినదని తెలుస్తోంది. దక్షిణ హర్యానాలోని ఆరావళి శ్రేణి యొక్క పశ్చిమ దిశలో కలయానా, భివానీల్లోని మకాన్వాస్ గ్రామాలకు సమీపంలో కనుగొన్నారు. ఈ క్వార్ట్జైట్ ఎరుపు-గులాబీ నుండి గులాబీ బూడిద రంగులో ఉంటుంది.

బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన రవీంద్ర నాథ్ సింగ్ అతని బృందం, ఏఎస్ఐ ఆర్థిక సహాయంతో 2014 - 2016 కాలంలో, సింధు లోయ నాగరికత స్థలమైన ఖానక్ లోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో తవ్వకాలు జరిపారు. వారు ప్రౌఢ హరప్పన్ దశకు చెందిన వస్తువులు, కుండలు, లాపిస్ లాజులి, కార్నెలియన్, ఇతర పూసలనూ కనుగొన్నారు. క్రూసిబుల్స్ కరిగిన లోహాన్ని పోయడానికి ఉపయోగిస్తారు, కొలిమి లైనింగ్, కాలిన నేల, బూడిద, ముడిఖనిజపు స్లగ్స్ వంటి లోహ కార్యకలాపాల ఆధారాలను కూడా వారు కనుగొన్నారు. సిరామిక్ పెట్రోగ్రఫీ, మెటలోగ్రఫీ, స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, ఎనర్జీ డిస్పర్సివ్ ఎక్స్-రే స్పెక్ట్రోస్కోపీ, ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ TEM, విధ్వంసక పద్ధతి వంటి అధునాతన పద్ధతుల్లో పరిశోధన చేసిన మీదట, సింధు నాగరికత నాటి లోహ కార్మికులు ఖానక్ స్థలంలో నివసించి, పనిచేసేవారని తేలింది. రాగి, కాంస్యంతో మెటలర్జికల్ పని గురించి కూడా వారికి తెలుసు. స్థలం యొక్క కనీస స్థాయి తేదీ పూర్వ-హరప్పా యుగానికి చెందిన సోతి-సిస్వాల్ సంస్కృతి నాటిదని సా.పూ. 4600 తాత్కాలికంగా లెక్కవేసారు.

                                     

2.1. పర్యావరణం శీతోష్ణస్థితి

ఢిల్లీ, హర్యానాల్లోని ఉత్తర ఆరావళి శ్రేణిలో తేమతో కూడిన ఉపఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. వేసవిలో బాగా వేడి గాను, శీతాకాలాల్లో చల్లగానూ ఉంటుంది. హిసార్లో వాతావరణం యొక్క ప్రధాన లక్షణాలు పొడిదనం, అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం. వేసవిలో గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత 40 -46 ° C మధ్య ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 1.5 - 4 ° C మధ్య ఉంటాయి.

రాజస్థాన్ లోని మధ్య ఆరావళి శ్రేణిలో బెట్ట, పొడి వాతావరణం ఉంటుంది.

గుజరాత్‌లోని దక్షిణ ఆరావళి శ్రేణి ఉష్ణమండల తడి, పొడి వాతావరణం ఉంది

                                     

2.2. పర్యావరణం నదులు

మూడు ప్రధాన నదులు, వాటి ఉపనదులూ ఆరావళి నుండి ప్రవహిస్తున్నాయి. అవి, యమునకు యొక్క ఉపనదులైన బానస్, సాహిబి నదులు, అలాగే రాన్ ఆఫ్ కచ్ లోకి ప్రవహించే లూని నది.

 • ఉదయపూర్ జిల్లాలో, ఆరావళి శ్రేణి పశ్చిమ వాలులలో ఉద్భవించిన సబర్మతి నది, అరేబియా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ కాంబేలో కలుస్తుంది.
 • సఖి నది, రాన్ ఆఫ్ కచ్ యొక్క చిత్తడి భూములలో ముగుస్తుంది.
 • అజ్మీర్ సమీపంలోని పుష్కర్ లోయలో ఉద్భవించిన లూని నది, రాన్ ఆఫ్ కచ్ యొక్క చిత్తడి భూములలో ముగుస్తుంది. ఇది సరస్వతి నది యొక్క ఛానెళ్ళలో ఒకటిగా ఉండేది. ఫలితంగా ఈ నదీ తీరాన, లోథల్ వంటి అనేక సింధు లోయ నాగరికత ప్రదేశాలు ఉన్నాయి.
 • ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహించే నదులు రాజస్థాన్‌లోని ఆరావళి శ్రేణి యొక్క పశ్చిమ వాలుల నుండి ఉద్భవించి, థార్ ఎడారి యొక్క ఆగ్నేయ భాగం గుండా వెళ్లి గుజరాత్‌లోకి ముగుస్తాయి.
 • కృష్ణావతి నది గతంలో సాహిబీకి ఉపనది. రాజస్థాన్, రాజసమంద్ జిల్లాలోని దారిబా రాగి గనుల సమీపంలో ప్రారంభమై దౌసా జిల్లా పటాన్ గుండా, అల్వార్ జిల్లా మొథూకా గుండా ప్రవహించి, సాహిబీ నదిని చేరుకోకముందే అదృశ్యమవుతుంది.
 • సీకర్ జిల్లాలోని మనోహర్‌పూర్ సమీపంలో ఉద్భవించిన సాహిబీ నది హర్యానా గుండా ప్రవహిస్తుంది. ఢిల్లీవద్ద యమునా నదిలో కలుస్తుంది. దీనిని నజాఫ్‌గఢ్ కాలువ అని పిలుస్తారు.: దాని కింది ఉపనదులున్నాయి
 • సాహిబీ నదికి ఉపనది అయిన దోహన్ నది సీకర్ జిల్లాలోని నీమ్ కా ఠానా సమీపంలో ఉద్భవించింది.
 • పశ్చిమ నుండి వాయవ్యానికి ప్రవహించే నదులు రాజస్థాన్ లోని ఆరావళి శ్రేణి పశ్చిమ వాలుల నుండి ఉద్భవించి, చారిత్రక షేఖావతి ప్రాంతం గుండా దక్షిణ హర్యానాలోకి ప్రవహిస్తాయి. సింధు లోయ నాగరికత యొక్క చివరి హరప్పన్ దశగా గుర్తించబడిన అనేక కావిరంగు కుండల సంస్కృతి ప్రదేశాలను ఈ నదుల ఒడ్డున కనుగొన్నారు.
 • అల్వార్ జిల్లాలోని బెహ్రోర్ వద్ద సాహిబీ నదిలో సంగమించే దాని ఉపనది, సోటా నది.
 • ఒరాయ్ నది, బెరాచ్ నది యొక్క కుడి వైపు ఉపనది.
 • గంభీరి నది, బెరాచ్ నదికి కుడి వైపు ఉపనది.
 • బెరాచ్ నదికి కుడి వైపున ఉన్న ఉపనది వాగ్లి నది.
 • బనాస్ నదికి దక్షిణం వైపున ఉన్న బెరాచ్ నది ఉదయపూర్ జిల్లాలోని కొండలలో ఉద్భవించింది.
 • చంబల్ నది, యమునా నదికి దక్షిణం వైపు ఉపనది.
 • వాగన్ నది, బెరాచ్ నది యొక్క కుడి వైపు ఉపనది.
 • పశ్చిమ నుండి ఈశాన్యంగా ప్రవహించే నదులు, రాజస్థాన్ లోని ఆరావళి శ్రేణి తూర్పు వాలుల నుండి ఉద్భవించి, ఉత్తరాన యమున లోకి ప్రవహిస్తున్నాయి.
 • బెరాచ్ నదికి కుడి వైపున లేదా తూర్పు వైపు ఉపనది అయిన అహర్ నది ఉదయపూర్ జిల్లాలోని కొండలలో ఉద్భవించింది, ఉదయపూర్ నగరం గుండా ప్రవహిస్తుంది, ఇది ప్రసిద్ధ పిచోలా సరస్సును ఏర్పరుస్తుంది.
 • చంబల్ రివర్ యొక్క ఉత్తరాన ఉపనది అయిన బనాస్ నది.


                                     

3.1. జీవావరణం భారతదేశం యొక్క ఆకుపచ్చ గోడ

"ది గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆరావళి" గుజరాత్ నుండి ఢిల్లీ వరకు ఆరావళి శ్రేణి వెంట 1.600 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పూ గల హరిత జీవావరణ కారిడార్ ఇది. ఇది శివాలిక్ కొండల శ్రేణిని కలుస్తుంది. ఈ ప్రాంతంలో అడవులను తిరిగి పెంచడానికి 10 సంవత్సరాల కాలంలో 135 కోట్ల కొత్త చెట్లను నాటనున్నారు. ఆఫ్రికాలోని సహారా గ్రేట్ గ్రీన్ వాల్ మాదిరిగానే దీన్ని రూపొందించారు. ఇది కాలుష్యానికి వ్యతిరేకంగా బఫర్‌గా పనిచేస్తుంది. ఈ కాలుష్యాల్లో 51% పారిశ్రామికంగా, 27% వాహనాల ద్వారా, 8% పంట దహనం ద్వారా, 5% దీపావళి బాణసంచా ద్వారా ఏర్పడుతుంది.

                                     

3.2. జీవావరణం ఉత్తర ఆరావళి చిరుత, వన్యప్రాణి కారిడార్

సరిస్కా- ఢిల్లీ చిరుత వన్యప్రాణి కారిడార్ లేదా ఉత్తర ఆరావళి చిరుత వన్యప్రాణి కారిడార్ అనేది, 200 కిలోమీటర్ల పొడవైన ముఖ్యమైన జీవవైవిధ్య, వన్యప్రాణి కారిడార్. ఇది రాజస్థాన్‌లోని సరిస్కా టైగర్ రిజర్వ్ నుండి ఢిల్లీ రిడ్జ్ వరకు ఉంటుంది.

ఈ కారిడార్ ఆరావళి లోని భారతీయ చిరుతపులులకు, నక్కలకూ ముఖ్యమైన నివాస స్థలం. పగ్‌మార్క్‌లు, ట్రాప్ కెమెరాలను ఉపయోగించి, చిరుతల, ఇతర వన్యప్రాణుల సర్వేను తాము చేపట్టనున్నట్లు 2019 జనవరిలో వన్యప్రాణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తదనంతరం, రేడియో కాలర్‌ల ద్వారా చిరుతపులులు, నక్కలను ట్రాక్ చేస్తారు. పట్టణాభివృద్ధితో పాటు, అనేక ప్రదేశాలలో వన్యప్రాణుల కారిడార్‌ గుండా వెళ్ళే రహదారులూ, రైల్వేలూ చాలా ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. ఆరావళి లోని పెద్ద భాగాలకు చట్టబద్ధంగా గానీ, భౌతికంగా గానీ రక్షణ లేదు. ఇక్కడ వన్యప్రాణుల మార్గాలు లేవు. వన్యప్రాణుల సంరక్షణ పనులు తక్కువగా ఉన్నాయి లేదా అసలు లేనే లేవు. దీని ఫలితంగా 2015 జనవరి నుండి 2019 జనవరి మధ్య 4 సంవత్సరాలలో 10 కి పైగా చిరుతపులులు మరణించాయి.

హర్యానా వైపు ఉన్న గురుగ్రామ్-ఫరీదాబాద్ ఆరావళి కొండ అడవులలో నీటి లభ్యత లేకపోవడం వల్ల అడవి జంతువులు అక్కడ అరుదుగా కనిపిస్తాయి. హర్యానా ప్రభుత్వం 2018 లో డ్రోన్‌లతో సర్వే చేసి, వేసవి నెలల్లో వాడేందుకు గాను వర్షపునీటిని నిల్వ చేయడానికి 22 అశాశ్వత గుంటలను తవ్వించింది. సమీప గ్రామాల నుండి పైప్‌లైను ద్వారా ఈ గుంటల్లోకి నీటిని పంపించి, ఆ గుంటల్లో ఎల్లవేళలా నీళ్ళు ఉండేలా చేసే ప్రణాళికను 2019 జనవరిలో ప్రభుత్వం ప్రకటించింది.

ప్రణాళిక లేని పట్టణీకరణ, పారిశ్రామిక ప్లాంట్లు కలుషితం చేయడం వంటి మానవ కార్యకలాపాలు కూడా గొప్ప ముప్పును కలిగిస్తున్నాయి. చిరుతపులి వంటి వన్యప్రాణుల ఉనికిపై ప్రభుత్వ అధికారుల నుండి విముఖత, తిరస్కరణ కూడా ఉంది. అవి లేకపోతే, అటవీ భూమిని దోపిడీ చేయవచ్చు, మానవ చొరబాట్లకు దారితీసి మానవాభివృద్ధికి తెరదీయవచ్చు అనేది వారి ఉద్దేశం

2019 లో పంజాబ్ ల్యాండ్ అలీనేషన్ యాక్ట్, 1900 పిఎల్‌పిఎ కు సవరణలు చేసి, హర్యానా ప్రభుత్వం తీసుకున్న తప్పుడు చర్యల వల్ల ఈ నివాసానికి తీవ్రమైన ముప్పు ఎదురైంది. ఈ చట్టానికి గవర్నర్ తన అనుమతి ఇచ్చారు, కాని ఇది ఇంకా హర్యానా ప్రభుత్వం నోటిఫై చేయలేదు. అందువల్ల ఇది సందిగ్ధంలో పడింది. అధికారికంగా చట్టంగా మారలేదు. ఈ సవరణ హర్యానా యొక్క సహజ పరిరక్షణ మండలాలను ఎన్‌సిజెడ్ 47% లేదా 60.000 ఎకరాలు - 122.113.30 హెక్టార్ల నుండి 64.384.66 హెక్టార్లకు - తగ్గిపోతుంది. ఇది భారత సుప్రీంకోర్టు యొక్క బహుళ మార్గదర్శకాలతో పాటు దక్షిణ హర్యానాలోని అసలు 122.113.30 హెక్టార్ల భూమి పర్యావరణపరంగా సున్నితమైన అడవి అని పేర్కొన్న ఎన్‌సిఆర్ ప్లానింగ్ బోర్డ్ ఎన్‌సిఆర్‌పిబి నోటిఫికేషన్‌ను కూడా ఉల్లంఘిస్తోంది. "పర్యావరణంగా గుర్తించబడిన ప్రధానమైన సహజ లక్షణాలు - రాజస్థాన్, హర్యానా, ఎన్సిటి-ఢిల్లీ లో ఆరావళి కొండల వరుస; అటవీ ప్రాంతాలు; నదులు, ఉపనదులు. ప్రధాన సరస్సులు, హర్యానా లోని బడ్‌కల్ సరస్సు, సూరజ్ కుండ్, దండమా వంటి నీటి వనరులు". ఉత్తర ఆరావళి చిరుతపులి, వన్యప్రాణి కారిడార్‌లో భాగంగా ఈ ప్రాంతం హర్యానాలోని చిరుతపులికి ముఖ్యమైన నివాస స్థలం.                                     

3.3. జీవావరణం వృక్షజాలం

ఆరావళి శ్రేణి పర్యావరణ వైవిధ్యంతో అనేక అడవులను కలిగి ఉంది.

                                     

3.4. జీవావరణం జంతుజాలం

ఆరావల్లి శ్రేణి వన్యప్రాణులతో సమృద్ధిగా ఉంది. వన్యప్రాణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా WII హర్యానాకు చెందిన ఐదు జిల్లాల్లోని 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 2017 లోమొట్టమొదటిగా చేసిన వన్యప్రాణి సర్వేలో చిరుతపులులు, చారల హైనా 7 వీక్షణలు, బంగారు నక్క 9 వీక్షణలు, సర్వే ప్రాంతమంతా 92% ఆక్యుపెన్సీతో, నీల్గాయ్ 55 వీక్షణలు, పామ్ సివెట్ 7 వీక్షణలు, అడవి పంది 14 వీక్షణలు, రీసస్ మకాక్ 55 వీక్షణలు, పీఫౌల్ 57 వీక్షణలు, ఇండియన్ క్రెస్టెడ్ పోర్కుపైన్ 12 వీక్షణలు కనిపించాయి. ఈ సర్వేతో ఉత్సాహం వచ్చిన వన్యప్రాణుల విభాగం, రేడియో, కాలర్ ట్రాకింగ్‌తో సహా మొత్తం ఆరావల్లి శ్రేణిలో వన్యప్రాణుల సమగ్ర అధ్యయనం, జనాభా గణన కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. బాగా తెలిసిన చిరుతపులి, హైనా నివాసాలు -ఫిరోజ్‌పుర్ జిర్కా -నుహ్ అరవాలి శ్రేణితో పాటు ఢిల్లీ సౌత్ రిడ్జ్ ఫరీదాబాద్- గురుగ్రామ్ నుండి ఢిల్లీ -హర్యానా సరిహద్దులోని ఫరూఖ్‌నగర్ ప్రాంతం. KMP ఎక్స్‌ప్రెస్‌వే దగ్గర్లోని సైద్‌పూర్, లోక్రీ, ఝుండ్ సారాయ్ విరాన్ గ్రామాలలో కూడా కనిపించినట్లు వార్తలున్నాయి.

                                     

3.5. జీవావరణం ఆందోళన

1992 మే లో, రాజస్థాన్, హర్యానాలోని ఆరావళి కొండలలోని కొన్ని ప్రాంతాలు భారత చట్టాల ద్వారా మైనింగ్ నుండి రక్షించబడ్డాయి. 2003 లో, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలను నిషేధించింది. 2004 లో, భారత సుప్రీంకోర్టు ఆరావళి రేంజ్ యొక్క నోటిఫైడ్ ప్రాంతాలలో మైనింగును నిషేధించింది. 2009 మే లో, సుప్రీంకోర్టు, హర్యానాలోని ఫరీదాబాద్, గుర్గావ్, మేవాట్ జిల్లాల్లో ఆరావళి శ్రేణి ఉన్న 448 కి.మీ 2 ప్రాంతంలో మైనింగు నిషేధాన్ని పొడిగించింది.

ఆరావళి శ్రేణిలోని గనుల ఉనికిని, పరిస్థితిని నిర్ణయించడానికి 2013 లో హై-రిజల్యూషన్ కార్టోసాట్ -1 & లిస్- IV ఉపగ్రహ ఇమేజింగ్‌ను ఉపయోగించారు. గురు గ్రామ జిల్లాలో, ఆరావళి కొండలు 11.256 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి, వీటిలో 491 4.36% హెక్టార్లలో గనులు ఉన్నాయి, వీటిలో 16 హెక్టార్లలోని 0.14% గనులు నీటితో నిండిపోవడంతో వదిలివేశారు. ఫరీదాబాద్, మేవాట్ జిల్లాల్లో, మొత్తం 49.300 హెక్టార్లలో 3610 హెక్టార్లు మైనింగ్ పరిశ్రమలో భాగం. ఈ గనులు ప్రధానంగా భారతదేశ నివాస, రియల్ ఎస్టేట్ నిర్మాణాలకు అవసరమైన గ్రానైట్, పాలరాయిల క్వారీలు. మధ్య రాజస్థాన్ ప్రాంతంలో, కొన్ని మైనింగ్ కార్యకలాపాల వలన పొరుగున ఉన్న వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థలపై కొంత సానుకూల, కొంత ప్రతికూల ప్రభావాలను చూపించిందని శర్మ పేర్కొన్నాడు. వర్షం-కలిగించే కోత, పోషకాలతో పాటు సంభావ్య కలుషితాలనూ తెస్తుంది.