Топ-100
Back

ⓘ మతము. మరణానంతరం సకల చరాచర జగత్తుకు సృష్టి, స్థితి, లయ కర్త అయిన సర్వేశ్వరుడిని చేరే మార్గాలుగా ప్రచారంచేస్తూ, మానవులను మంచి మార్గములో నడిపించుటకు తార్కిక ఆలోచనా ..
మతము
                                     

ⓘ మతము

మరణానంతరం సకల చరాచర జగత్తుకు సృష్టి, స్థితి, లయ కర్త అయిన సర్వేశ్వరుడిని చేరే మార్గాలుగా ప్రచారంచేస్తూ, మానవులను మంచి మార్గములో నడిపించుటకు తార్కిక ఆలోచనాపరులు సృష్టించిన విధానాలు అని ఒక భావన.

మతం అంటే యేమిటో నిర్వచించటం కష్టం. మతం అంటే ఏమిటో వివరించవచ్చు గాని నిర్వచించటం అసాధ్యం. ఎందుకంటే నిర్వచనం జ్ఞానానికి ఆది, తుది. పైగా అన్ని మతాలకు సమానంగా అనువర్తించే నిర్వచనం అసలు సాధ్యమే కాదు. "అతి ప్రాకృతిక శక్తులపై విశ్వాసం, ఆ విశ్వాసాన్ని ప్రదర్శించే ఆచరణే మతం" అన్నారు కొందరు. ఆ అతి ప్రాకృతిక శక్తులు దేవత కావచ్చు, దయ్యం కావచ్చు, మరేదైనా కావచ్చు. అయితే ఈ దేవత దయ్యాలు అన్ని మతాలకు సామాన్యం కావు. ఉదాహరణకు భౌద్ధానికి, మానవవాద మతానికి ఇది లేదు.

                                     

1. మతాలు - రకాలు

మతాలలో రకాలున్నాయి. అధికారిక మతాలు, మానవవాద మతాలు. అధికారిక మతాలు తమ అధికారాన్ని ప్రశ్నిస్తే సహించలేవు. పవిత్ర గ్రంథం ఏమి చెబితే అది ఎదురాడక శిరసావహించవలసిందే. మానవవాద మతం పరిస్థితి వేరు. దేనినైనా ఎవరైనా ప్రశ్నించవచ్చు. హేతువుకు నిలబడిన వాటినే స్వీకరించమంటాయి మానవతా వాద మతాలు.

అసలు మతం అనగానే మామూలుగా మనకు గుర్తుకు వచ్చేవి దేవుడు - దయ్యం, గుడి - గోపురం, పూజ - పూజారి, పవిత్ర గ్రంథం, ఉపవాసాలు మొదలైనవి. మరి ఇవన్నీ గూడ అన్ని మతాలకు లేవు. అలాగే వివిధ మతాలకు వాటి వాటి సిద్ధాంతాలు, సంస్థలు, ఆకృతులు, ప్రతీకలు ఉన్నాయి. ఇవి కాలాను గుణంగా మార్పులకు లోనవుతాయి. కాలానుగుణంగా మారని మతం లేదు. మారక పోతే అది విస్మృతమవుతుంది. అయితే దీని అర్థం మతం నిరంతరం మారుతుందని కాదు. ఇలాంటి వైవిధ్యాలున్న అనెక మతాలను కలుపుకొనే నిర్వచనం సాధ్యమా?

                                     

2. మతం - సైన్సు

మతం కూడా సైన్సు లాగే మానవ జీవితాన్ని సుకరం చేయాలనే తలంపుతోనే బయలుదేరింది. అయితే ముఖ్యమైన మతాలు ఇహ జీవితాన్ని సుకరం చేయటం కంటే, పర జీవితాన్ని సుఖమయం జేయ తలపెట్టాయి. విజ్ఞానశస్త్రం ఈ జీవితాన్ని ఇప్పుడే, ఇక్కడే సుఖమయం చేయాలంటుంది. ఇది సాధ్యం కావాలంటే మతంగాని, సైన్సు గాని విశ్వాన్ని, దాని స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. దానిని వివరించాలి. రెండింటి లక్ష్యం విశ్వాన్ని అర్థం చేసుకోవటమే అయినా, సైన్సు ఇహాన్ని ఇహంలో వివరిస్తే, మతం ఇహాన్ని పరంలో అర్థం చేసుకుంటుంది. ప్రపంచంలో జరిగే సంఘటనలకు కారణాలను సైన్సు ఈ లోకపు సంఘటనలను కారణాలుగా జేస్తుంది.

మతం,సైన్సు రెండింటి లక్ష్యం మానవునికి ఉన్న అభద్రతను తొలగించడమే. జ్ఞానం అభద్రతను, వ్యాకులతను తొలగిస్తుంది. ఏ జ్ఞానం ఈ అభద్రతను తొలగిస్తుంది? పార లౌకిక జ్ఞానం అంటుంది మతం. లౌకిక జ్ఞానం అంటుంది సైన్సు.

ఏది ఏమైనా జ్ఞానం పెరిగిన కొలదీ సమస్యల గురుత్వమూ, సంశ్లిష్టతా పెరుగుతుంది. ఫలితంగా అభద్రత పెరుగుతుంది. అభద్రత ఉన్నంత కాలం మతానికీ సైన్సుకూ పని ఉండనే ఉంటుంది.అభద్రత, దాని నుంచి జనించే వ్యాకులతా, భీతులను పరిహరించటం మానవుని అంతర్గత అవసరం. మానవునికి ఈ అంతర్గతావసరం సార్వకాలీనంగా ఉంటుంది. అందుకని మతానికి చావు లేదు. అందుకనే మానవుడు అనివార్యంగానే "మతవాది" అంటారు. అందుకే బహుశ మతం లేని మానవుడు లేడేమో. అభద్రత పోవాలంటే ఆలంబనం ఉండాలి. ఈ ఆలంబనాన్ని దేవుడిలో, ధనంలో, హేతువులో, ఈ విశ్వంలో, ప్రేమలో - ఎక్కడైనా చూడవచ్చు. ఆ ఆలంబన సాధనలో అతడికి అనేక అనుభవాలు కలుగుతాయి. అవే మాతానుభవాలు. ఈ అనుభవాల వ్యక్తీకరనం అనేక రూపాలు తీసుకొంటుంది. ఈ రూపాలు దేశ కాల వ్యవస్థలను బట్టి మారతాయి. ఇవి సంస్థాగత రూపాలు పొందిన తరువాత స్థిరపడిపోయి తన జీవితంలో కలసి, వారి నాటి మతావసరాలను తీరుస్తాయి. కాలంలో వచ్చే మార్పులతో అవి మారవు. అవి తరువాత అర్థ రహిత, అంధ ఆధారాలుగ కనిపిస్తాయి. "అసలు మతం" ఈ బాహ్య రూపాలలో లేదు.

                                     

3.1. మతము- విలువలు పారిమార్థిక విలువ

మతానికీ అంతర్గత విలువలకూ అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. ప్రతి మతానికి "పారమార్థిక విలువ" వుంటుంది. దీనిని సాధించటం, సాధించిన దానిని అట్టే పెట్టుకోవడం, దానిని అనుభవించడంలో మతం ఉంది. ప్రత్యేక మత సిద్ధాంతాలు, ఆచారాలు, సంస్థలు, విధానాలు దీనికి సంబంధించి ఆవిర్భవించినవే. అయితే వచ్చే పేచీ అంతా "పారిమార్థిక విలువ" దగ్గర వస్తుంది.

ఏది పారిమార్థిక విలువ? అంటే వచ్చే సమాధానాలు కోకొల్లలు. ఒకరికి దేవుడు పారిమార్థిక విలువ అయితే, మరొక్రికి ధనం, వెరొకరికి ప్రేమ, వేరొకరికి వేరొకటి. ఇ విలువలలో ఏది గొప్పది అంటే సమాధానం వివిధమే. విలువలను పోల్చడం సాహసమే అవుతుంది.

                                     

3.2. మతము- విలువలు పారిమార్థిక విలువ సాధించె విధానాలు

మరో విషయం ఏమిటంటే, ఆ పారమార్థిక విలువను సాధించే విధానాలు మత విధానాలనీ, పారిమార్థిక విలువలను అవి సాధించి పెట్టగలవనే నమ్మకం కలగాలి. మనం పుట్టిన సమాజాలు అటువంటి నమ్మకాన్ని కలిగించే రెడీమేడ్ విధానాలను మనకు అందిస్తాయి. "ఆ విధానాలు విలువలను సాధించి పెట్టగలవనే విశ్వాసం వేరు, సాధించి పెట్టడం వేరు." అనే సంగతిని విస్మరించరాదు. నమ్మకం నమ్మకమే. ఆ నమ్మకం యథార్థం కావలసిన పనిలేదు. దురదృష్టం ఏమిటంటే ఈ విధానాలు పారమార్థిక విలువలను సాధించి పెట్టలేక పోయినా, వాటినే పట్టుకు జనం వేళ్ళాడతారు. దానితో "విధానాలు" ప్రధానమై "విలువలు" మరుగున పడతాయి. ఈ విధంగా "మిధ్యా" పూజ పెరిగి, తరువాత అది అంధ విశ్వాసమై పోతుంది.

                                     

3.3. మతము- విలువలు ఇష్టావ్యాప్తి విధానం

మతంలో ఇష్టావాప్తి విధానం ఉంది. ఇష్టా వ్యాప్తి అంటే తీరని కోరికలు తీరినట్లుగా ఊహించుకోవటం. దీనిని మతంలో అనుమతించవచ్చా?విజ్ఞాన శాస్త్రవేత్త తన శాస్త్రీయ విధానంలో ఈ విశ్వాన్ని ఎప్పటికైనా అర్థం చేసుకోవడాం సాధ్యమేనని అలవాటిగా విశ్వసిస్తాడు. నిజంగా శాస్త్రీయ పద్ధతి ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకోగలమా? శాస్త్రీయ పద్ధతి అలాంటి "ఊహ" నుహేతుబద్దంగా చేయటానికి దోహదం చేస్తుందా? అంటే శాస్త్రీయ పద్ధతి అనుమతించిన దానికంటే శాస్త్రవేత్త అధికంగా, ఆధార రహితంగా కలిగించ వలసిన సత్య విశ్వాసం కంటే ఎంతో ఎక్కువ నమ్మకాన్ని కలిగిస్తున్నారు.న్యాయంగా హేతుబద్దంగా చూస్తే ఆ సిద్ధాంతాలు అంతటి నమ్మకానికి ఆధార రహిత విశ్వాసానికి దారి తీయవు. ఇదంఆ డూ డు బసవన్నల లాగ జనం హృదయ సంబంధ కారణాల"తో తల లూపడమే. ఇష్టావ్యాప్తి లక్ష్యానికి చేరిస్తె మంచిదే. అలాకాక తద్వ్యతిరేకమైతే.

                                     

3.4. మతము- విలువలు విశ్వాసం

విశ్వాసం మతానికి ప్రాతిపదిక. మత పరంగా చేసే చర్యలన్నింటికి మూలం విశ్వాసమే. వాటిని సంతృప్తికరంగా ఇర్వహించాలంటే, ఆ విశ్వాసం ముఖ్యం. ఆ విశ్వాసమే అతనికి మార్గ నిర్దేశం చేస్తుంది. మామూలుగా చెప్పాలంటే, విశ్వాసాలు విశ్వాన్ని గురించి, మనిషిని గురించి,అతని ఆత్మను గురించి, మంచిచెడుల గురించి, ఏదో కొంత చెప్పాలి. విశ్వాసాలు సవివరంగా లేకపోయినా అవి విశ్వసనీయంగా ఉండాలి.

                                     

4. ఇబ్రాహీం అబ్రహామ్ భావనల పై ఏర్పడిన మతములు

ఇబ్రాహీం భావనల ఆధారంగా ఏర్పడిన మతము. ప్రధానంగా ఇది ఏకేశ్వరోపాసక మతము. బహువిగ్రహారాధన, బహుఈశ్వరోపాసన కలిగిన ఆకాలంలో ఇదో క్రొత్త సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని ఏకేశ్వరోపాసన ప్రారంభించిన ఇబ్రాహీంను హనీఫ్ అని అంటారు. ఇతని మార్గంలో నడచి అనేక మతాలు వెలిసి వెలసిల్లుతున్నాయి. వీటికి ఉదాహరణ జుడాయిజం, క్రైస్తవ మతము, ఇస్లాం మతం.

                                     

5. ధర్మము, కర్మ అనే పునాదుల పై ఏర్పడిన భారతీయ మతములు

హిందూ మతము

 • అతి ప్రాచీన మైనది. అనేక మంది ఋషులు ప్రవచించిన విధానము.

బౌద్ధ మతము

 • గౌతమ బుద్ధుడు ప్రవచించిన విధానము. ధార్మిక గ్రంథము త్రిపీటకము.

సిక్కు మతము

 • గురుగోవింద సింగు ప్రవచించిన విధానము. ధార్మిక గ్రంథము గ్రంధా సాహెబ్ లేదా ఆది గ్రంధ్.
                                     

6. తూర్పు దేశాలలోని మతములు

టావో మతములు: టావో అనునది చైనా పదజాలము. టావో అనే కాంసెప్ట్ పై ఆధారపడిన మతములు: వీటిలో టావోఇజం, షింటోయిజం, కోండోగ్యో, కావోడైజమ్, యుగిండావో తత్వములు. కన్ఫ్యూషియానిజం కూడా ప్రజలు అవలంబించే మతము.

                                     

7. ఇరాన్ లోని మతములు

 • యజ్దానీ మతము
 • జొరాస్ట్రియన్ మతము: ప్రాచీన పర్షియా నేటి ఇరాన్ లో జొరాష్టర్ లేదా జరాతుష్ట్ర స్థాపించిన మతము. వీరు భగవంతుణ్ణి అహూరా మజ్దా అని పిలుస్తారు. వీరి పవిత్ర గ్రంథం జెండ్ అవెస్తా, వీరి దేవాలయాన్ని అగ్ని దేవాలయం లేదా ఫైర్ టెంపుల్ లేదా అగియారీ అని అంటారు. ఈ మతాన్నే పార్శీ మతము అని కూడా అంటారు.
                                     

8. వర్గీకరణ

ప్రసిద్ధ మతముల జనాభా విభజన క్రింది పట్టికలో ఇవ్వబడినది:

పైనుదహరించిన ఏ మతములోనూ గుర్తింపు పొందక ప్రత్యేక సమూహాలుగా నివసిస్తున్న సమూహాలు. అఢెరాంట్స్.కామ్, మతములు:

 • స్పిరిటిజం సరైన నియంత్రణ లేని మతము: 15 మిలియన్లు
 • సైంటాలజీ: 500.000
 • యూనిటేరియన్-విశ్వజనీయతత్వము: 800.000
 • నవీన పాగన్లు: 1 మిలియన్
 • రాస్త్రఫారియానిజం: 600.000
 • జూచే ఉత్తర కొరియా: 19 మిలియన్లు