Топ-100
Back

ⓘ ఫిబ్రవరి, సంవత్సరంలోని ఆంగ్లనెలలులో రెండవ నెల.ఫిబ్రవరి నెలను రోమన్ క్యాలెండర్‌లో సా.శ.పూ.713 లో చేర్చబడింది. నెల పొడవు కాలక్రమేణా మారిపోయింది.ఒక సమయంలో దీనికి 2 ..




                                     

ⓘ ఫిబ్రవరి

ఫిబ్రవరి, సంవత్సరంలోని ఆంగ్లనెలలులో రెండవ నెల.ఫిబ్రవరి నెలను రోమన్ క్యాలెండర్‌లో సా.శ.పూ.713 లో చేర్చబడింది. నెల పొడవు కాలక్రమేణా మారిపోయింది.ఒక సమయంలో దీనికి 23 రోజులు మాత్రమే ఉన్నాయి.భారతదేశంలో, ఫిబ్రవరి నెల శీతాకాలపు చివరి చల్లని నెల. జూలియస్ సీజర్ రోమన్ క్యాలెండర్‌ను పునర్నిర్మించినప్పుడు, సాధారణ సంవత్సరాల్లో ఈనెలకు 28 రోజులు,ప్రతి నాలుగు సంవత్సరాలకు వచ్చే లీపు సంవత్సరాల్లో 29 రోజులు ఉంటాయి.

                                     

1. చరిత్ర

కొన్నివేల యేండ్లకుముందు ఫిబ్రవరినెల కడపటి నెలగా ఉండేది. ఆతరువాత కొంతకాలనికి రెండవనెలగా మారింది. సా.శ. 450 పూర్వం అది తిరిగి కడపటినెలగా మారి, మరల కొంత కాలానికి రెండవనెలగా మారిందట. రోమనులు లూపర్కస్ Lupercus అనే ఒక దేవత పేరిట ఒక పండుగ చేసుకుంటారు. ఆ పండుగ పేరు ఫెబ్రువా Februa. అది ఈనెలలోనే జరుగుతూ ఉంటుంది గాబట్టి ఈనెలకు ఫెబ్రువరి అని పేరువచ్చింది.ఈనెల అంతా ఆదేశీయులు రాత్రిళ్ళు ఉపవాసం ఉండి పూజలు చేస్తూ ఆత్మశుద్ధి చేసుకుంటారు.

                                     

2. ఫిబ్రవరి మాసం ప్రాముఖ్యత

వారోత్సవాలు

  • ఫిబ్రవరి 2 నుండి ఫిబ్రవరి 8 వరకు - అంతర్జాతీయ అభివృద్ధి వారం
  • 1 ఫిబ్రవరి నుండి 9 ఫిబ్రవరి వరకు - కాల ఘోడా పండుగ
  • 18 ఫిబ్రవరి నుండి 27 ఫిబ్రవరి వరకు - తాజ్ మహోత్సవ్
                                     

2.1. ఫిబ్రవరి మాసం ప్రాముఖ్యత జాతీయ,అంతర్జాతీయ దినోత్సవాలు

ఫిబ్రవరి మాసంలో దిగువ వివరింపబడిన తేదీలలో కొన్ని ముఖ్యమైన దినోత్సవాలుగా,వారోత్సవాలుగా పరిగణింపబడుతున్నాయి.

  • ఫిబ్రవరి 27: ప్రపంచ ఎన్జీఓ దినోత్సవం
  • ఫిబ్రవరి 14: ప్రేమికుల రోజు
  • ఫిబ్రవరి 1: ఇండియన్ కోస్ట్ గార్డ్ డే
  • ఫిబ్రవరి 12: అబ్రహం లింకన్ పుట్టినరోజు
  • ఫిబ్రవరి 12: డార్విన్ డే
  • ఫిబ్రవరి 5: సురక్షిత ఇంటర్నెట్ దినం ఫిబ్రవరి రెండవ వారం, రెండవ రోజు
  • ఫిబ్రవరి 1: సూరజ్‌కుండ్ వృత్తి పనిముట్లు మేళా దినోత్సవం.
  • ఫిబ్రవరి 4: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం
  • ఫిబ్రవరి 13: ప్రపంచ రేడియో దినోత్సవం,
  • ఫిబ్రవరి 20: ప్రపంచ సామాజిక న్యాయం దినోత్సవం
  • ఫిబ్రవరి 21: అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం
  • ఫిబ్రవరి 24: సెంట్రల్ ఎక్సైజ్ డే
  • ఫిబ్రవరి 28/29: అరుదైన వ్యాధుల దినోత్సవం
  • ఫిబ్రవరి 11: అంతర్జాతీయ మహిళా, బాలికల దినోత్సవం
  • ఫిబ్రవరి 6: స్త్రీల జననేంద్రియ వైకల్యానికి అంతర్జాతీయ జీరో టాలరెన్స్ డే
  • ఫిబ్రవరి 4: శ్రీలంక జాతీయ దినోత్సవం
  • ఫిబ్రవరి 20: అరుణాచల్ ప్రదేశ్ ఫౌండేషన్ డే
  • ఫిబ్రవరి 10: జాతీయ డి-వార్మింగ్ డే
  • ఫిబ్రవరి 13: జాతీయ మహిళా దినోత్సవం సరోజిని నాయుడు పుట్టిన తేదీ
  • ఫిబ్రవరి 28: జాతీయ విజ్ఞాన దినోత్సవం
  • ఫిబ్రవరి 22: ప్రపంచ స్కౌట్ దినోత్సవం
  • ఫిబ్రవరి 12: జాతీయ ఉత్పాదకత దినం
  • ఫిబ్రవరి 2: ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినం