Топ-100
Back

ⓘ ఏలూరు లోకసభ నియోజకవర్గం. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది కైకలూరు అసెంబ్లీ నియ ..
                                               

వీరమాచనేని విమల దేవి

డా. వీరమాచనేని విమలా దేవి భారత పార్లమెంటు సభ్యురాలు. ఈమె 1928 లో కృష్ణా జిల్లాలోని వరాహపట్నంలో జన్మించింది. ఈమె తండ్రి కె. పట్టాభిరామయ్య. ఈమె ఋషి వాలీ పాఠశాల, ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల, స్కాటిష్ చర్చి కళాశాలలలో విద్యాభ్యాసం చేసింది. ఆమె విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాల నుండి వైద్యవిద్యలో పట్టా పొందినది. ఈమె డా. వి.వి.జి. తిలక్ ను వివాహం చేసుకున్నది. వీరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఈమె సాంఘిక సేవలో చురుకుగా పాల్గొని, ఏలూరు మునిసిపాలిటీకి ఉప సభాపతి గాను తర్వాత కౌన్సిలర్ గాను సేవలందించారు. ఈమె 1962లో ఏలూరు లోకసభ నియోజకవర్గం నుండి 3వ లోకసభకు భారత కమ్యూనిష్టు పార్టీ సభ్యురాలిగా పోటీచేసి గెలుపొంద ...

                                               

నూజివీడు పురపాలక సంఘం

నూజివీడు పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,కృష్ణా జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం ఏలూరు లోకసభ నియోజకవర్గం లోని,నూజివీడు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                               

జూలై 15

1941: రావెల సాంబశివరావు, నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా పనిచేశారు. కవిరాజు విజయం రూపకం రాశారు. 1942: నేదురుమల్లి రాజ్యలక్ష్మి, వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం నుండి రెండు సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిణిగా పనిచేసింది. 1895: చేబియ్యం సోదెమ్మ, ఆంధ్రరాష్టం గర్వపడే స్వాతంత్ర్య సమరయోధురాలు. సంఘసేవకురాలు 1928: వీరమాచనేని విమల దేవి, భారతీయ కమ్యూనిష్టు పార్టీ నాయకురాలు, ఏలూరు లోకసభ నియోజకవర్గం నుండి 3వ లోకసభ సభ్యురాలు. 1922: లియోన్‌ లెడర్‌మాన్, భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత 1964: వాసిరెడ్డి వేణుగోపాల్, సీనియర్ పాత్రికేయుడు. 1885: పి.ఏ.థాను పిళ్లై ...

                                               

కొండ్రు సుబ్బారావు

కొండ్రు సుబ్బారావు భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 1వ లోకసభకు ఏలూరు లోకసభ నియోజకవర్గం నుండి బయ్యా సూర్యనారాయణ మూర్తితో కలిసి ఎన్నికయ్యాడు. ఇతడు దెందులూరు సమీపంలోని అప్పారావు పాలెం గ్రామంలో 1918లో జన్మించాడు. వృత్తిరీత్యా వ్యవసాయదారుడైన సుబ్బారావు ఏలూరులోని మునిసిపల్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. 1942 నుండి హరిజనోద్ధరణ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని జిల్లా హరిజన సంఘానికి అధ్యక్షునిగా సేవచేశాడు. ఇతను కమ్యూనిష్టు భావజాలాలకు ఆకర్షితులై జిల్లా కమ్యూనిష్టు సంఘం సభ్యునిగా చేరి భారతీయ కమ్యూనిస్టు పార్టీ తరపున పోటీచేశాడు. ఇతని వివాహం భిక్షమ్మతో 1942లో జరిగింది; వీరికి 3 కుమారులు, ఒక కుమార్తె.

                                               

ఏలూరు మండలం

ఏలూరుమండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం. ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల ప్రధాన కార్యాలయం ఏలూరు నగరంలో ఉంది. OSM గతిశీల పటం

                                               

మాగంటి వెంకటేశ్వరరావు

మాగంటి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో ఏలూరు లోకసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున లోక్‌సభ సభ్యునిగా గెలుపొందాడు. ఆయన సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రసిద్ధుడు. ఆయన కొల్లేరు ప్రాంత గ్రామాలకు త్రాగునీటిని ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేస్తూంటాడు. పేద, వికలాంగ ప్రజలకు ట్రై సైకిళ్ళను కూడా అందజేశాడు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉపకార వేతనాలను కూడా అందిస్తుంటాడు. ఎం.ఆర్.సి ట్రస్టు ద్వారా వైద్య క్యాంపులు నిర్వహిస్తుంటాడు.

                                     

ⓘ ఏలూరు లోకసభ నియోజకవర్గం

  • పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది
  • చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది
  • కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం
  • ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం
  • నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం
  • ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం
  • దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం
                                     

1. 2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ కావూరి సాంబశివరావు పోటీ చేశారు. ఆయన సమీప తెలుగుదేశం ప్రత్యర్థి అయిన మాగంటి వెంకటేశ్వరవారుపై విజయం సాధించారు.

                                               

మోతే వేదకుమారి

మోతే వేదకుమారి భారత పార్లమెంటు సభ్యురాలు, గాయని. ఈమె ఏలూరులో 1931 సెప్టెంబరు 24 తేదీన జన్మించింది. ఈమె తండ్రి మోతే నారాయణరావు. ఈమె పశ్చిమ గోదావరి జిల్లా శాఖకు సెక్రటరీగా పనిచేసింది. ఈమె మహిళలకు కుట్టుపని, టైపింగ్లో శిక్షణ కోసం ఒక కేంద్రాన్ని నడిపింది. ఈమె ఆకాశవాణి గుర్తించిన మొదటి తరగతి కళాకారిణి. ఈమె కర్ణాటక సంగీతాన్ని వినిపించేది. ఈమె ఏలూరు లోకసభ నియోజకవర్గం నుండి 2వ లోకసభకు భారత జాతీయ కాంగ్రెసు సభ్యురాలిగా 1957 సంవత్సరంలో ఎన్నికయ్యారు.