Топ-100
Back

ⓘ వంటలు ..
                                               

అంకాపూర్ నాటుకోడి కూర

అంకాపూర్ నాటుకోడి కూర తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, ఆర్మూరు మండలం మండలం, అంకాపూర్ గ్రామంలో తయారుచేసే కోడికూర. అంకాపూర్ గ్రామం పేరుతో ప్రసిద్ధిచెందిన ఈ కోడికూర తెలంగాణ వంటకంగా పేరుగాంచింది.

                                               

అటుకులు

వరి ధాన్యాన్ని నానబెట్టి 24 గంటల తరువాత నీరు తీసివేసి, 60 - 70 సెల్సియస్ వద్ద వేయించవలెను. ఆ తరువాత రోటిలో వేసి రోకలితో దంచి చెరిగినచో అటుకులు సిద్దం. ఇవి ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. ప్రస్తుతం అటుకులు దంచడానికి యంత్రాలు ఉపయోగిస్తున్నారు. వీటిని పాలతో మిశ్రమం చేసుకోని తీసుకొనవచ్చు.

                                               

అప్పడం

అప్పడం ఒక భారతీయుల తిండి పేరు. దీన్ని భారతదేశం, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో అన్నంతో పాటు వడ్డిస్తారు. భారతదేశంలో అనేకమంది మహిళలు అప్పడాల వ్యాపారం ద్వారా ఉపాధి పొందుతున్నారు.

                                               

అరటికాయ బజ్జీ

వీటి తయారెకి కావలసిన పదార్ధాలు, అరటికాయలు, శనగపిండి, వాము, నూనె, ఉప్పు ముందుగా అరటికాయలను శుభ్రంగా కడిగి తొక్కలను చెక్కి చక్రాల్లాంటి ముక్కలుగా కోసి ఉంచుకోవాలి.ఆతరువాత ఒక గిన్నెలో సెనగపిండి వేసి నీరు పోసి తగినంత ఉప్పువేసి బాగా కలుపుకోవాలి. తరువాత పొయ్యిమీద మూకెడలో నూనెపోసి కాగిన తర్వాత అరటికాయలు చక్రాలు శనగపిండిలో వేసి పూర్తిగా మునిగేటట్టు మించి నూనెలో వేసి వేయించాలి బజ్జిలు బాగా వేగినతర్వాత చిల్లుల గరెటతో బజ్జీలను గిన్నెలో వేసుకోవాలి. బజ్జీలు బాగాలావుగా పొంగాలంటే పిండిలో కొంచెం వంట సోడా వేసి కలుపుకోవాలి.

                                               

అరిసె

అరిసెలు తెలుగువారి అత్యంత ప్రీతిపాత్రమైన పిండివంటలలో ఒకటి. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు అరిసెలు తప్పనిసరి. పిన్నా పెద్దలు మిక్కిలి ఇష్టంతో అరిసెలను ఆరగిస్తారు.

                                               

అల్లం పచ్చడి

అల్లం పచ్చడి ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు, నెల్లూరు ప్రాంతాలలో ఒక పేరుపొందిన పచ్చడి. దీన్ని ప్రధానంగా ఇడ్లీ, దోశ లాంటి అల్పాహారాలతో కలిపి భుజిస్తారు.

                                               

అట్టు

అట్టు n. Cake-day, a feast that falls on the new moon in the month of Aswija when women offer buns in payment of vows. అట్టు adj. Such, like this, like that అలాగంటి. అట్లేని if so.

ఉల్లికాడల పకోడి
                                               

ఉల్లికాడల పకోడి

ఉల్లివేర్లు కత్తిరించి తీసేసి మిగిలిన కాడల్ని శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి. ఒక పాత్రలో ఉల్లి తరుగు, వాము, ఉప్పు, శనగపిండి వేసి తగినంత నీటితో ముద్దలా కలుపుకోవాలి. పిండి కొద్దిసేపు నాననిచ్చి తర్వాత నూనెలో పకోడీల్లా వేసుకుని దోరగా వేగించుకోవాలి. ఇవి ఉల్లిఘాటు వల్ల కొత్త రుచితో బాగుంటాయి.

కజ్జికాయ
                                               

కజ్జికాయ

ఇదికూడా కొంతవరకూ పైమాదిరిగానే చేసి ఆఖరులో మాత్రం పంచదార పల్చని పాకంగా మార్చి వీటిని అందులో వేస్తారు. పాకం కారుతూ మెరుస్తూ ఉండే వెటిని తినేందుకు పాత్ర తప్పనిసరి.

                                               

కోడిమాంసం ఆవకాయ

ఈ పద్ధతిలో పెట్టే పచ్చళ్ళకు రుచి కోసం ఎక్కువగా నాటుకోడి మాంసం వాడుతారు. అయితే ముక్కలు మెత్తగా కావాలనుకొనే వాళ్ళు బ్రాయిలర్ వాడుతారు. ఈ పచ్చడి రెండు రకాల పద్ధతులలో పడుతుంటారు. అవి మంచి మాంసం తీసుకొని దానిని నూనెలో వేయిస్తూ ఉప్పు కారం కలుపుతూ దోరగా వేయించి పక్కన పెడతారు. ముందుగా సిద్ధం చేసుకొన్న మెంతులు, వెల్లుల్లి, ధనియాల కారం మొదలైనవి సన్నని మంటపై వేయించి దానిని ముందుగా వేయించిన మాంసం రెండూ తీసుకొని కలిపి సన్నని సెగపై మరికొంత సేపు వేపిస్తారు. తీసి చల్లార్చిన దానిని జాడీలలో నిలవౌంచుతారు.

గవ్వలు
                                               

గవ్వలు

గవ్వలు చెక్క దువ్వెన లాంటి సాధనంతో చేస్తారు. చిన్న అప్పడాల్లా చేసుకొన్న పిండిని దానిపై పెట్టి బొటనవేలి ఒత్తడం ద్వారా మడిచినట్టుచేసి వాటిని మరిగే నూనెలో వేస్తారు.

                                               

చికెన్ పచ్చడి

ముందుగా నూనె/నెయ్యిలో మాంసాన్ని గట్టి పడేంతవరకూ వేయించాలి, దొరగా వేగింతరువాత నూనె నుంచి వేయించిన చికెన్ ని వేరు చేయాలి. తరువాత వేయించిన చికెన్ కి తగినంత మసాలా మన అభిరుచికి తగ్గట్టుగా కలుపు కొని వాడుకొవచ్చు.

                                               

చెకోడీలు

ఒక కప్పు నీళ్ళు యెసరు పెట్టి అందులో నువ్వులు గాని వాము గాని వెయ్యాలి.కొంచము ఉప్పు, వాము యెసరులో వేసి, తర్వాత బియ్యప్పిండి యెసట్లో వేసి బాగా కలిపి కిందకు దించి ఆరిన తర్వాత చెకోడీలు వేయించుకోవాలి.

పాయసము
                                               

పాయసము

పాయసం బియ్యం లేదా సేమియాలతో చేయబడు ఒక వంటకం. పాలను బాగుగా కాచి వాటిలో ముందుగా సిద్దం చేయబడిన బియ్యం/సేమియా, జీడిపప్పు, యాలకులు, మెదలగునవి వేసి మరింత మరగబెట్టాలి. బియ్యం/సేమియా ఉడికే వరకూ మరగనిచ్చి ఆఖరులో తగినంత చక్కెర వెయ్యాలి. ఇలా పాయసం తయారగును. ఇది సామాన్యంగా, ప్రతి చిన్న సందర్భంలోనూ ప్రతి వారూ తయారు చేసుకొనే వంటకం. తొందరగా తయారవడం, ఎక్కువమంది స్వీకరించగలిగే వీలు ఉండటం ఈ వంటకం ప్రత్యేకతలు.

పూరీ
                                               

పూరీ

పూరీ గోధుమ పిండి లేదా మైదా పిండితో చేసే ఒక ఫలహారం. భారతదేశంలో పలు ప్రాంతములలో వీటిని ఉదయపు ఆల్ఫాహారముగా భుజిస్తారు. దక్షిణ భారతదేశములోని అన్ని హోటళ్ళలో తరచుగా కనిపించే అల్పాహారం పూరీ. దీనిని తయారు చేయడానికి పిండిని పలుచగా చపాతీల్లాగా రుద్ది నూనెలో వేయిస్తారు.

పొంగనాలు
                                               

పొంగనాలు

పొంగనాలు లేదా గుంత పొంగనాలు దక్షిణ భారతదేశం లో తినబడే ఒక అల్పాహారం. గుంటలుగా ఉండే పెనం లో పులిసిన దోసె పిండిని నూనెలో వేయించి తయారు చేస్తారు. తమిళం లో వీటిని పణియారం/కుళిప్పణియారం అని, కన్నడంలో పడ్డు అని వ్యవహరిస్తారు.

బోండా
                                               

బోండా

కారపు బోండా తయారుచేయడానికి బంగాళాదుంప ముద్దని బాగా వేయించి, పలుచని శెనగ పిండి ముద్దలో ముంచి నూనెలో వేయించాలి. బంగాళాదుంపలో ఇష్టమైన కూరగాయ ముక్కలు ఉడికించి కలుపుకోవచ్చును. కొంతమంది మధ్యలో బంగాళాదుంప ముద్దకు బదులు నిలువుగా కోసిన ఉడికించిన కోడిగుడ్డును ఉంచి శెనగపిండి ముద్దలో ముంచి వేయిస్తారు. వీటిని ఎగ్ బోండా అంటారు. కేరళ రాష్ట్రంలో బోండాలను తీపిగా తయారుచేస్తారు. మిగిలిన దేశమంతా కారపు బోండాలు తింటారు. కారపు బోండాలో మసాలా రకం మహారాష్ట్రలో బటాటా వడ అంటారు.

                                               

ముల్లంగి వేపుడు

ముక్కలు బాగా ఉడికి మెత్తబడ్డాక నూనె ఎక్కువగా ఉంటే వంపి కారం, జీలకర్రపొడి, ధనియాలపొడి వేసి కాసేపు వేయించి దించాలి. తర్వాత ముల్లంగి ముక్కల్ని ఉప్పు నీటిలో కడిగి శుభ్రం చేసుకోవాలి. ముందుగా ముల్లంగి దుంపలను పొట్టు తీసి సన్నగా తరుక్కోవాలి. తరువాత ఈ ముక్కలకు తగినంత ఉప్పు కలిపి వేయించాలి. బాణలిలో నూనె పోసి నూనె వేడయ్యాక, ముల్లంగి ముక్కలు వేసి తక్కువ మంటలో బాగా వేయించాలి. అంతే ముల్లంగి వేపుడు రెడీ. దీనిని పొడి పొడిగా ఉండే అన్నానికి సైడ్‌డిష్‌గా నంచుకుంటే రుచికరంగా ఉంటుంది.

                                               

రైస్ పకోడి

ఇప్పుడు కడాయిలో నూనె పోసి కాగాక పిండిని ముద్దలుగా చేసి నూనెలో వేసి వేయాలి. బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. వేడి వేడిగా తింటుంటే రైస్ పకోడీలు చాల బాగుంటాయి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అన్నాన్ని వేసి బాగా కలపాలి. ఒక గిన్నెలో శనగపిండి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి. పిండి కాస్త గట్టిగా ఉండేట్లుగా చూడాలి. ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి.