Топ-100
Back

ⓘ వాణిజ్యశాస్త్రం. వాణిజ్య శాస్త్రం ను ఇంగ్లీషులో కామర్స్ అని అంటారు. వ్యాపారం లేదా వర్తకం లో జరిగే వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో నమోదు చేయటాన్ని వాణిజ్యం అంటారు. ..




                                               

మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల

మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల తమిళనాడు రాజధాని చెన్నైలోని ఒక ఆర్ట్స్, సైన్స్, లా కళాశాల. ఇది 1840 అక్టోబర్ 15వ తేదీన ప్రెసిడెన్సీ ప్రిపరేటరీ స్కూలుగా ప్రారంభమై తరువాతి కాలంలో హైస్కూలుగా, కళాశాలగా ఉన్నతీకరించబడింది. ఈ కళాశాల భారతదేశంలోని పురాతన ప్రభుత్వ కళాశాలలో ఒకటి. ఇది బ్రిటిష్ ప్రభుత్వం నెలకొల్పిన రెండు ప్రెసిడెన్సీ కళాశాలలో ఒకటి. రెండవది కోల్‌కాతా లోని ప్రెసిడెన్సీ కళాశాల.

                                               

పారిభాషిక పదకోశం

మహమ్మదీయ పరిపాలనా కాలములో వ్యవహారికమైన పార్శీ ఉరుదూ మాటలు కొన్ని విభాగములలోనూ ఆ తరువాత ఆంగ్లేయల పరిపాలనలో వున్నప్పుడు అనేక ఇంగ్లీషు మాటలు, పదాలు అనేక విభాగములలో తెలుగులో వాడుకలోకి వచ్చినవి. ఆ విధంగా వచ్చిన మాటలకు పదాలకు కాలక్రమేణా తెలుగులో పారిభాషిక పదాలు కూడా ఉద్భవించాయి. కానీ ఒకే భావముగల ఇంగ్లీషు మాటకు సూక్ష్మశబ్ధభేదముతోను, అర్ధభేదములతో స్థిరరూపములేని పారిభాషిక పదములు వాడుచూ సంస్కరించబడక పోవుటచే ఆయా మాటలు, పదాలు చాల కాలం దాకా తెలుగు నిఘంటువులలోకెక్కలేదని తెలియుచున్నది. మేధావులైన పండితులు అటువంటి పారిభాషిక పదాలను సేకరించి విమర్శించి సవరించి ఆయా పదజాలములను ప్రచురించిన తరువాతనే ఆయా మాటలు పద ...

వాణిజ్యశాస్త్రం
                                     

ⓘ వాణిజ్యశాస్త్రం

వాణిజ్య శాస్త్రం ను ఇంగ్లీషులో కామర్స్ అని అంటారు. వ్యాపారం లేదా వర్తకం లో జరిగే వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో నమోదు చేయటాన్ని వాణిజ్యం అంటారు. వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు గురించి తెలిపే శాస్త్రం. వాణిజ్య సంస్థ, కంపెనీ లేదా ఎంటర్ ప్రైజ్ అనగా వస్తువుల్ని ఉత్పత్తి చేయడానికి లేదా వినియోగదారులకు సేవల్నిఅందించడానికి ఏర్పడినట్టు చట్టపరంగా గుర్తింపు పొందిన సంస్థ. ఇలాంటి వ్యాపారాలు పెట్టుబడిదారి వ్యవస్థలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా ప్రైవేటు వ్యక్తులచే నడుపబడతాయి. వీటి ముఖ్యమైన ఉద్దేశం లాభాల్ని ఆర్జించడం, వాటి అధిపతుల్ని ధనవంతుల్ని చేయడం. సోషలిస్టు వ్యవస్థలో ప్రభుత్వ సంస్థలు లేదా పబ్లిక్ లేదా సహకార సంస్థలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం లేక వర్తకం చేసే వ్యక్తిని వ్యాపారస్తుడు లేక వర్తకుడు అంటారు. వ్యాపారస్తుడిని ఆంగ్లంలో బిజినెస్‍మెన్ అంటారు.