Топ-100
Back

ⓘ పండుగలు ..
                                               

అంతర్జాతీయ గాలిపటాల పండుగ - గుజరాత్

ప్రతి సంవత్సరం గుజరాత్లో రెండు వేలకు పైగా పండుగలను జరుపుకుంటారు. ఉత్తరాయణంలో జరుపుకునే అంతర్జాతీయ గాలిపటాల పండుగ అతిపెద్ద వేడుకగా భావించబడుతుంది. గాలిపటాల పండుగ వస్తుందన్న కొద్ది నెలల ముందే గుజరాత్‍లోని ఇళ్లలో గాలిపటాల తయారీ ప్రారంభమవుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఉత్తరాయణం అనగా శీతాకాలం నుంచి వేసవి కాలానికి ప్రారంభ రోజు. రైతులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే పంట కోతల కాలం, సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు, ఈ రోజును మకర సంక్రాంతి అంటారు. ఈ రోజు భారతదేశంలో ముఖ్యమైన పంట రోజులలో ఒకటిగా పరిగణించబడుతుంది. గుజరాత్ లోని చాలా నగరాలు ఈ గాలి పటాల పోటీని నిర్వహిస్తున్నాయి. గుజరాత్, ఇతర రాష్ట్రాల ప్రాంత ...

                                               

అక్షయ తృతీయ

అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు, తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి.

                                               

ఉగాది

ఉగస్య ఆది అనేదే ఉగాది. "ఉగ" అనగా నక్షత్ర గమనం - జన్మ - ఆయుష్షు అని అర్థాలు. వీటికి ఆది అనగా మొదలు ఉగాది. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం యుగం కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాది - వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. ఆర్.యస్.యస్. సంస్థాగత స్థాయిలో వారు అధికారి ...

                                               

కాముని పౌర్ణమి నాటి ఉత్సవాలు

గ్రామీణ ప్రజలకు కాముని పౌర్ణమి అనందదాయకమైన పండుగ. వెన్నెల రాత్రులలో గుంపులు గుంపులుగా పౌర్ణమి ఇంకామూడు రోజులుందనగానే ఈ వినోద కార్యక్రమాలు ప్రారంభ మౌతాయి. కాముని పున్నమి ఒక్క తెలంగాణా లోనే కాక భారత దేశమంతటా, ముఖ్యంగా ఉత్తర హిందూస్థానంలో హోళీ పండుగ రూపంలో జరుగుతుంది. వరుసా వావీ లేకుండా ఒకరి మీద మరొకరు వసంతాలు విరజిమ్ముకుంటూ, ఒడలు మరచి తన్యయత్వంలో ఈ వినోదాలను జరుపుకుంటారు. కులభేదాలు, వైషమ్యాలూ, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భేద భావం లేకుండా ఈ వినోదాలు ఎంతో అన్యోన్యంగా సాగుతాయి. ఆంధ్ర దేశంలో ఈ వసంతాలు ముఖ్యంగా వివాహానంతరం కంకణాలు విప్పే రోజున ఏంతో ఉల్లాసంగా జరుగుతాయి.

                                               

గురునానక్ జయంతి

గురు నానక్ జయంతి మొదటి సిక్కు గురువైన గురు నానక్ జన్మదినమును పండుగగా జరుపుకునే రోజు. ఈ పండుగను గురు నానక్ ప్రకాష్ ఉత్సవ్, గురు నానక్ దేవ్ జీ గుర్పురబ్ అని కూడా పిలుస్తారు. అత్యంత ఉన్నతమైన గురువులలో ఒకరైన గురు నానక్ దేవ్ సిక్కు మతం స్థాపకులు. సిక్కుమతం లో చాలా పవిత్రమైన పండుగలలో గురు నానక్ జయంతి ముఖ్యమైనది. సిక్కు మతంలో ఎక్కువగా జరుపుకునే ఉత్సవాలు 10 మంది గురువుల వార్షికోత్సవాలకు సంబంధించినవే్. ఈ గురువులు సిక్కుల నమ్మకాలను రూపొందించడానికిముఖ్య కారకులుు. గుర్పురాబ్ అని పిలువబడే వారి పుట్టినరోజులు ప్రార్థనలతో కూడిన వేడుకలు. సిక్కు మతం స్థాపకుడైన గురు నానక్ 1469 లో కార్తీక పౌర్ణమి రోజున జన్మిం ...

                                               

గృహ ప్రవేశం

గృహ ప్రవేశం కొత్త ఇల్లు లేదా గృహము కట్టుకున్న తరువాత అందులోకి ప్రవేశించే ముందు జరుపుకొనే పండుగ. హోమం, నవగ్రహాలకు శాంతి, సత్యన్నారాయణ స్వామి వ్రతం, బంధువులకు, స్నేహితులకు విందు, గోవుతో ముందుగా ఇల్లు తొక్కించడం మొదలైనవి దీనిలోని ముఖ్యమైన కార్యక్రమాలు.

                                               

పున్నమి చవితి

పున్నమి చవితిని కార్తీక బహుళ చవితి నాడు జరుపుకుంటారు. ఈ పండుగ రోజున చాలా మంది నాగుల చవితి రోజున చేసినట్టే చేస్తారు. దీనిని రెండవ నాగుల చవితి అంటుంటారు. దీని ముఖ్య ఉద్దేశం కార్తీక పున్నమి రోజు నాటికి ఇంటికి వచ్చిన కొత్త కోడళ్ళకు వారి పొలాలను చూపించటానికి వారిని పొలాలకు తీసుకువెళ్ళడం

                                               

మహోదయము

అర్ధోదయము - మహోదయము సముద్రంలో స్నానం చేయడానికి, సముద్ర తీరంలో శ్రాద్ధాదికం జరుపడానికి పవిత్రమైనవి. పుష్యమాసములో గాని, మాఘమాసములో గాని అమావాస్య - ఆదివారం - వ్యతీ పాతయోగం - శ్రవణ నక్షత్రం కలసివస్తే అది "అర్ధోదయం" అనబడుతుంది. వీనిలో ఒక్కటి అయినా తగ్గితే "మహోదయం" అనబడుతుంది. అనగా మహోదయం కంటే అర్ధోదయం ఎక్కువ విశిష్టం అని అర్థం.

శాంతా క్లాజ్
                                               

శాంతా క్లాజ్

శాంతా క్లాజ్ క్రైస్తవుల పర్వదినమైన క్రిస్టమస్కు మొదటిరోజు రాత్రి చిన్నారులకు పెద్దలకు కేకులను, ఆటబొమ్మలను బహుమతుల్ని అందించే ఒక పాత్ర. శాంతా క్లాజ్ అనే పదం డచ్ భాషలోని ఒక పదం నుండి వచ్చింది.