Топ-100
Back

ⓘ భాష ..




                                               

ఐఎస్ఒ 15919

ఐఎస్ఒ 15919 అనేది అంతర్జాతీయ రోమనీకరణ ప్రమాణాలలో ఒకటి. ఇది 2001 లో ప్రచురించబడిన దేవనాగరి, సంబంధిత బ్రాహ్మీ లిపుల లాటిన్ లిప్యంతరీకరణ ప్రమాణం. సాధారణంగా లాటిన్ లిపిలో అక్షరాల సంఖ్య బ్రాహ్మీ లిపులలో కన్నా తక్కువ. కాబట్టి బ్రాహ్మీ లిపుల అక్షరాలను లాటిన్ లిపి అక్షరాలతో సుచించాలంటే ఉన్న అక్షరాలకు కొన్ని అదనపు చిహ్నాలను చేర్చవలసి ఉంటుంది. అలా చేర్చిన ఒక ప్రమాణమే ఐఎస్ఒ 15919. ఈ అదనపు చిహ్నాలు సాధారణంగా ప్రధాన అక్షరం పైన లేదా కింద ఉంటాయి. వీటిని తెలుగు అక్షరాల యొక్క వత్తుల మాదిరిగా ఊహించుకోవచ్చు. వీటిని ఆంగ్ల భాషలో డయాక్రిటిక్స్ అంటారు.

                                               

జర్మన్ భాష

జర్మన్ భాష ప్రపంచ వ్యాప్తంగా 10.5 కోట్ల మందిచే మొదటి భాషగా మాట్లాడబడు ఒక భాష. ఈ భాష డచ్, ఆంగ్ల భాషలతో సారూప్యం కలిగి ఉంది. జర్మను భాష ఐరోపా సమాఖ్యలోని 23 అధికార భాషలలో ఒకటి. ఐరోపా సమాఖ్యలోని అత్యధికుల మాతృభాష కావడం వలన జర్మన్ లేక జర్మను భాష ప్రపంచ భాషలలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. ఐరోపా సమాఖ్యలో ఎక్కువగా మాట్లాడబడు భాషలలో జర్మను భాష ఆంగ్ల భాష తర్వాత రెండవ స్థానంలో ఉంది. జర్మనీలో 95% మంది, ఆస్ట్రియాలో 89% మంది, స్విట్జర్లాండ్లో 65% మంది ఈ భాషను మాతృభాషగా కలిగియున్నారు. పైపెచ్చు రమారమి 8 కోట్ల మంది ఈ భాషను పరభాషగా ప్రయోగిస్తున్నారు. ఐరోపా సమాఖ్య మాత్రమే కాక ఐరోపా ఖండం మొత్తాన్ని పరిశీలించ ...

                                               

ఫ్రెంచి భాష

ఫ్రెంచి భాష ప్రపంచ వ్యాప్తంగా 11.5 కోట్ల మందిచే మొదటి భాషగా మాట్లాడబడు ఒక భాష. రోమన్ సామ్రాజ్యం నాటి లాటిన్ భాష నుండి ఉద్భవించిన పలు భాషలలో ఫ్రెంచ్ లేదా ఫ్రెంచి భాష ఒకటి. ఫ్రాన్స్ దేశస్థుల మాతృభాష అయిన ఈ భాష 54 పై బడి దేశాలలో వాడుకలో ఉన్నప్పటికీ, ఫ్రాన్స్ బయట కెనడా, బెల్జియం, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, మొనాకో, ఆఫ్రికాలోని కొన్ని భాగాలలో బాగా వ్యాప్తి చెందింది. ఫ్రెంచి భాష 29 దేశాలలో అధికార భాష. అంతే కాక, ఈ భాష ఐక్య రాజ్య సమితిలోని అంగాలకు అధికార భాష. ఐరోపా సమాఖ్య లెక్కల ప్రకారం 27 సభ్యదేశాలలో 12.9 కోట్ల మంది 26% ఈ భాష మాట్లాడుతుండగా, వీరిలో 5.9 కోట్ల మందికి 12% ఇది మాతృభాష కాగా మిగిలిన 7 ...

                                               

బోధనా మాధ్యమం

బోధనా మాధ్యమం, లేదా బోధనా మాధ్యమాలు అనేవి బోధన కొరకు వాడే భాషలు. ఇది దేశం లేదా భూభాగం యొక్క అధికారిక భాష కావచ్చు, కాకపోవచ్చు. విద్యార్థుల మొదటి భాష అధికారిక భాషకు భిన్నంగా ఉంటే, అధికారిక భాష పూర్తి పాఠశాల విద్య లేదా కొంత భాగం కోసం బోధనా మాధ్యమంగా ఉపయోగించబడుతుంది. ద్విభాషా లేదా బహుభాషా విద్య ఒకటి కంటే ఎక్కువ భాషల బోధనను కలిగి ఉంటుంది. యునెస్కో "పిల్లల మాతృభాషలో విద్యను అందించడం నిజంగా కీలక సమస్య" అని భావించింది.

                                               

భాషా శాస్త్రం

భాషా శాస్త్రం అనగా భాష యొక్క పుట్టుకకు మూలమైన ధ్వని అర్ధాలను వివరించేది. శాస్త్రం అను మాటను ఆంగ్లములోని science పదమునకు తుల్యంగా వాడుతున్నాము. శాస్త్రంని రెండువిధములుగా విభజించవచ్చును. శుద్ధ శాస్త్రం pure science అనుభూతి లేదా అనుభవాల శాస్త్రం emphirical science ఈ రెండు అంశాల ఆధారంగా ఏ శాస్త్రం అయినా అది క్రమపద్ధతిని అనుసరించాల్సి ఉండాలి. ఏ శాస్త్రం అయినా అది నిరూపణలకు లొంగివుండాలి.

డచ్ భాష
                                               

డచ్ భాష

డచ్ భాష ఒక పశ్చిమ జర్మానిక్ భాష. 2.3 కోట్ల మంది డచ్ మాతృ భాషగా ఉపయోగిస్తారు. ఇంకో 50 లక్షల మంది రెండొవ భాషగా ఉపయోగిస్తారు. నెతెర్లాండ్స్‌ జనాభాలో ఎక్కువ మంది డచ్ భాష వాడుతారు. బెల్జియంలో 60% మంది డచ్ భాష వాడుతారు. ఆంగ్లం, జర్మన్ తరువాత డచ్ భాష అత్తిపెద్దగా ఉపయోగించే జర్మానిక్ భాష.