Топ-100
Back

ⓘ హిందూ సాంప్రదాయాలు ..
                                               

అక్షతలు

అక్షతలు లేదా అక్షింతలు నీటితో తడిపిన బియ్యము. క్షతములు కానివి అక్షతలు అని అర్ధము. భగ్నముగాని బియ్యమును అక్షతలు అంటారు. నిండు గింజలైన అక్షతల వలె మీ జీవితము కూడా భగ్నము కాకుండా ఉండాలని నిండు నూరేళ్ళు జీవించాలని చెప్పడానికి సంకేతంగా అక్షతలను ఉపయోగిస్తాము. పెద్దలు పిన్నలను ఆశీర్వదించేటప్పుడు గాని, పూజాదికములందు గాని, వివాహోపనయనములందు గాని వాడుట హిందూ ఆచారము.

                                               

అగ్నిహోత్రం

అగ్నిహోత్రంలో భాగంగా ఎండిన ఆవు పేడా, ఎండిన అరటి మొక్కలు, పనస, వేప వంటి కొమ్మలని తీసుకొని వేద మంత్రోచ్ఛాటనలతో కర్పూర హారతితో వెలిగిస్తారు. అందులో నెయ్యిలో నానబెట్టిన బియ్యాన్ని వేస్తారు. ఈ ప్రక్రియను అగ్నిహోత్రము అంటారు. ఇలా గృహస్థుడు చేయించుకోవటం వల్ల కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని కొంతమంది విశ్వాసం. ఈ అగ్నిహోత్రము సూర్యోదయ సమయాన లేదా సూర్యాస్తమయ సమయాన చేయాలి. అగ్నిహోత్రం జరిగినంత సేపు అగ్నిహోత్రము వద్ద నిష్ఠగా మంత్రోచ్ఛాటన వింటూ కుటుంబ సభ్యలతా విధిగా ఉండాలి. అగ్నిహోత్రం పూర్తవ్వగానే వచ్చిన భస్మాన్ని నిత్యం పూస చేసే ముందు ధరించాలి. ఆ భస్మాన్ని ధరించడం మూలంగా ఏ ...

                                               

అతిరాత్రం

సప్త సోమయాగాలలో అగ్నిస్టోమం, అత్యగ్నిస్టోమం, ఉక్ధ్యం, షోడసి, వాజపేయం, ఆప్తోర్యామం, అతిరాత్రం ఉన్నాయి. ఈ సప్త సోమయాగాలలో అతి పవిత్రమైంది ‘అతిరాత్రం’ అని విజ్ఞులు చెబుతున్నారు. మనిషి జీవనానికి 48 సంస్కారాలను మన పూర్వీకులు ఏర్పాటు చేశారు. వీటిలో 39 వ సంస్కారమే అతిరాత్రం. ‘అతిరాత్రం’ ఉత్కృష్ట సోమయాగం కేరళలో ప్రసిద్ధమైంది.

                                               

అధ్యాస భాష్యము

శ్రీ ఆది శంకరాచార్యులు వారు అద్వైతం వేదాంతము అను గొప్ప మేడను అధ్యాస అను పునాది మీద కట్టిరి. ఈపునాదికి మొదట ఉప్పరపని చేసినవారు బౌద్ధులు. ప్రాజ్ఞలు ప్రజ్ఞానేత్రముతో పఠింపదగిన బ్రహ్మసుత్రములకు భాష్యము వ్రాయబోవుచు శ్రీయాచార్యులవారు అద్వైతమునకు పీఠికగా అధ్యాసభాష్యమును రచించిరి. ఈ పునాదిలోనే ఇసుకనే గీతాభాష్యమునందును వెదజల్లిరి. ఈ రేణువులే మధూవమగు వారి కవితా గానములో స రి గ మ ప ధ ని. ఇందులో ముఖ్యాంశములు: 1. బ్రహ్మము అనగా పరమేశ్వరుడు ఒకడే ఉన్నాడు, వేరేమి లేదు. 2. బ్రహ్మము నందు జగద్ భ్రాంతి కలుగును. 3 జగత్తులేనే లేదు.

                                               

అన్నప్రాశన

అన్నప్రాశన లేదా అన్నప్రాశనం పుట్టిన బిడ్డకు తొలిసారిగా అన్నం తినిపించే ఒక కార్యక్రమం. ఇది తెలుగువారి లోగిళ్ళలో కనిపించే ఒక కార్యక్రమం. ఈ సంస్కారం వలన శిశువుకు ఆయువు, ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయని ప్రజలు విశ్వసిస్తారు. www.sriramakoti.com

                                               

అభిషేకం

తెలుగు భాషలో అభిషేకము పదానికి వివిధ ప్రయోగాలున్నాయి. అభిషేకము నామవాచకంగా Installation by anointing, initiation, royal unction, bathing, anointing, inauguration. స్నానము, మునక, పట్టము కట్టడము అని అర్ధాలున్నాయి. ఉదా: దేవునికి అభిషేకము అయిన తరువాత after the idol was bathed. తైలాభిషేకము anointing with oil. చూర్ణాభిషేకము a particular rite of pouring turmeric powder over the head of an idol on the sixth day of the annual feast called బ్రహ్మోత్సవము. పట్టాభిషేకము coronation of a king. ఉదా: పట్టాభిషేకము చేయు to crown a king. రాజు ఆ కవికి స్వర్ణాభిషేకము చేసాడు the prince showered bounties upon the p ...

                                               

దేవతలు

దేవతలు అంటే దివిలో నివసించేవాళ్ళు అని అర్థం. దేవతలు సృష్టి నిర్వహణ శక్తులు. వీరిలో అష్టదిక్పాలకులు, స్వర్గాధిపతి ఇంద్రుడు, అనేక ఇతరలు ఉన్నారు.

                                               

నిరుక్తము

ఆరు వేదాంగాలలో నిరుక్తము ఒకటి. వేదంలోని సంస్కృత పదాలకు అర్ధం తెలియచేస్తుంది. దీనికి కర్త యాస్కుడు. ఇందులో వేద మంత్రాలకు ఉపయోగం తెలియజేయడానికొఱకు, అంతగా ప్రసిద్ధము కాని పదాల అర్ధాలు బోధింపబడినాయి. వేదశబ్దవివరణ నిఘంటువు, శాకపూర్ణి నిరుక్తము అనేవి కూడా ఉన్నాయి. నిరుక్తంలో "పదకాండ", "అర్ధకాండ" అనే రెండు భాగాలున్నాయి.

బొట్టు
                                               

బొట్టు

హిందూమతంలో మాత్రమే బొట్టుపెట్టుకొనే ఆచారముంది. ప్రపంచంలో ఏ ఇతర మతాలలోనూ ఈ ఆచారం లేదు. బ్రహ్మదేవుడు నుదుట వ్రాసినగీత తప్పింప ఎవరికీ శక్యం కాదు. కాని ఎవ్వరు ముఖాన బొట్టు పెట్టుకుందురో వారు బ్రహ్మరాసిన రాతను చెరిపి మంచిరాత వ్రాసుకుంటారనే నమ్మకం కొందరిలో ఉంది.

                                               

మాస శివరాత్రి

ప్రతిరోజు రాత్రి శివుని పదకొండు సార్లు తలచుకొని నిద్రపోపాలని అలా శివుని తలస్తూ రాత్రులు నిద్రపోవడం వలన ప్రతి రాత్రి శివరాత్రి అని అంటారు. త్రయోదశి తిథి శివునికి సంబంధించిన తిథి అని అందువలన పరమ శివుని తిథి అని అంటారు. నెలకు రెండు సార్లు త్రయోదశి తిథి వస్తుంది. శుక్ల పక్షంలో ఒక త్రయోదశి, కృష్ణ పక్షంలో ఒక త్రయోదశి వస్తుంది. కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశీ తిథిని కృష్ణ పక్ష శివరాత్రి లేక మాస శివరాత్రి అంటారు. మాస శివరాత్రి నెలకు ఒకసారి వస్తుంది.

                                               

వన భోజనాలు

కార్తీకమాసములో బంధువులు, స్నేహితులతో కలసి చెట్ల నీడలో కలసి భోజనం చేయటాన్ని వన భోజనం అంటారు. ప్రకృతితో మన బంధాన్ని గుర్తుచేసుకునే రోజుగా చెప్పవచ్చు. జపానులో కూడా హనామి పేరుతో మార్చి చివరి వారంలో బంధువులు స్నేహితులతో కలసి ఇదే విధమైన వేడుక చేసుకుంటారు. ఇది జపానులో విశేషమైన ఆదరణ పొందిన వేడుకలలో ఇది ఒకటి.

వైష్ణవము
                                               

వైష్ణవము

హైందవ మత సంప్రదాయములో శ్రీమహావిష్ణువుని ప్రధాన అది దేవతగా ఆరాదించే శాఖను వైష్ణవము అంటారు. వైష్ణవం అనగా విష్ణు అని, వైష్ణవులు అంటె విష్ణు భక్తులు అని అర్థం.

                                               

శుక్ల పక్ష శివరాత్రి

ప్రతిరోజు రాత్రి శివుని పదకొండు సార్లు తలచుకొని నిద్రపోపాలని అలా శివుని తలస్తూ రాత్రులు నిద్రపోవడం వలన ప్రతి రాత్రి శివరాత్రి అని అంటారు. త్రయోదశి తిథి శివునికి సంబంధించిన తిథి అని అందువలన పరమ శివుని తిథి అని అంటారు. నెలకు రెండు సార్లు త్రయోదశి తిథి వస్తుంది. శుక్ల పక్షంలో ఒక త్రయోదశి, కృష్ణ పక్షంలో ఒక త్రయోదశి వస్తుంది. శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశీ తిథిని శుక్ల పక్ష శివరాత్రి అంటారు. శుక్ల పక్ష శివరాత్రి నెలకు ఒకసారి వస్తుంది.

                                               

శునశ్శేపుడు

ఇందులోని అంధ్ర ”శబ్దమును జూచియే ఆంధ్రులు, శాపగ్రస్తులై, వైదికథర్మభ్రష్ఠులై, నీచజాతులతో కలిసిపోయి, చౌర్యహింసాదులతో జీవించెడి అంధ్రజాతీయులు, తమకు మూలపురుషులుగా నెంచుకొనుచుండుట తమ ఆర్యసాంప్రదాయమును మరచుటవలననే యని ఎఱుంగవలెను.