Топ-100
Back

ⓘ భారతీయ నృత్యరీతులు ..
                                               

ఒడిస్సీ

ఒడిస్సీ భారతదేశపు శాస్త్రీయనృత్యాలలో ఒకటి. ఇది ఈశాన్య రాష్ట్రమైన ఒడిషాలో పుట్టినది. క్రీ.పూ. రెండో శతాబ్దంలో జైన రాజైన ఖారవేలుని పరిపాలనలో ఒడిస్సీ ఎక్కువగా పోషింపబడి అభివృద్ధి చెందినది. ఈ నాట్యం కూడా నాట్యశాస్త్ర సూత్రాలపై ఆధారపడి కూర్చబడింది. మొదట్లో దీనిని పూరి లోని జగన్నాధ స్వామివారి ఆలయంలో మహరిలుఅనే స్త్రీలు ప్రదర్శించేవారు. ఒడిస్సీ నృత్యం భారతీయ శిల్పానికి విలక్షణ శైలిగా ఉన్న మైలిక త్రిభంగ అనే భంగిమ చుట్టూ అల్లుకొని ఉంటుంది.

                                               

కూచిపూడి నృత్యం

కూచిపూడి నృత్యం, ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఒక భారతీయ నాట్యం. ఇది కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి గ్రామంలో ఆవిర్భవించింది. సా.శ.పూ. 2వ శతాబ్దంలో ఈ ప్రాంతము లోని బ్రాహ్మణులు ఈ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించటంతో దీనికి ఈ పేరు వచ్చింది. ఇది దక్షిణ భారతదేశం అంతటా పేరుగాంచింది.

                                               

గిద్దా

గిద్దా భారతదేశంలోని పంజాబ్ ప్రాంతంలో, పాకిస్తాన్ లోనూ ప్రసిద్ధి పొందిన జానపద నృత్యం. ఇది ప్రాచీన నృత్యమైన రింగ్ డ్యాన్స్ నుండి ఈ నృత్యం ఆవిర్భవించింది. ఈ నృత్యం బాంగ్రా కంటే కొంచెం శక్తివంతమైనది. ఈ నృత్యం రంగులతో కూడిన నృత్యం. ఈ నృత్యం భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోనూ, కేంద్రప్రాలిత ప్రాంతాలలోనూ విస్తరించింది. ముఖ్యమైన పండగలు, కార్యక్రమాలలో మహిళలు ఎక్కువగా ఈ నృత్యం నిర్వహిస్తారు. ఈ నృత్యం లయబద్దంగా చప్పట్లు, జానపద గీతాలను స్త్రీలు ఆలపిస్తారు. ఈ నృత్యం ఇతర రకాల సాంప్రదాయ పంజాబీ నృత్యాల వలె కాకుండా మారుతూ ఉంటుంది, దీనికి రెండు తలల బారెల్ డోల్ డ్రమ్ ప్రదర్శించాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా, ...

                                               

పంజాబీ జానపద నృత్యాలు

పంజాబీ నృత్యాలు పంజాబ్ లోని జానపద, మత నృత్యాల కలయిక. భారత్, పాకిస్థాన్ దేశాల్లోని పంజాబీ ప్రజల స్థానిక నృత్యాలు మిగిలిన వాటితో ప్రత్యేకంగా ఉంటాయి. పంజబీ నృత్య రీతుల్లో హుషారుగా చేసే నృత్యాలతో పాటు, నెమ్మదిగా చేసే రకాలు కూడాఉంటాయి. స్త్రీలకు, పురుషులకు విడివిడిగా ప్రత్యేక శైలులున్నాయి. కొన్ని నృత్యాలు ప్రాంతాలతో మారితే, కొన్ని మతపరమైన నృత్యాలు ఉండటం విశేషం. సాధారణంగా ప్రత్యేక సందర్భాల్లో పంజాబీలు నృత్యాలు చేస్తుంటారు. పంట చేతికొచ్చే సమయం వైశాఖి, పెళ్ళిళ్ళు, లోహ్రీ, జషన్-ఇ-బహరాన్ వసంత కాలపు పండుగ, విందులు పండగల్లోలో ఎక్కువగా నృత్యాలు చేస్తారు పంజాబీలు. పంజాబీ భార్యాభర్తలు జంటలుగా నృత్యాలు చే ...

                                               

బిర్జూ మహరాజ్

బిర్జూ మహరాజ్‌ గా పిలువబడే బిర్జూ మోహన్‌నాథ్ మిశ్రా, భారతీయ కథక్ నాట్య కళాకారుడు. ఇతడు లక్నో కాల్కా-బిందాదిన్ ఘరానా కు చెందినవాడు. బిర్జూ కథక్ కళాకారుల కుటుంబంలో పుట్టాడు. ఈయన తండ్రి అచ్చన్ మహరాజ్, మేనమామలు శంభూ మహరాజ్, లచ్చూ మహరాజ్ లు పేరొందిన కథక్ కళాకారులు. చిన్నతనం నుండి నాట్యంపైనే మక్కువ ఉన్నా, బిర్జూ హిందుస్తానీ గాత్రంలో కూడా ఆరితేరినవాడు. కథక్ నాట్యానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చాడు. ఇతడు దేశవిదేశాల్లో వేలాది నాట్య ప్రదర్శనలనిచ్చి, ఎందరో విద్యార్థులను నాట్య కళాకారులుగా తీర్చిదిద్దాడు.

                                               

బిహూ నృత్యం

బిహూ నృత్యం ఈశాన్య భారత దేశములో గల అస్సాం రాష్ట్రమునకు చెందిన జానపద నృత్య రీతి. ఈ వినోద నృత్యంలో నాట్యకారులు సంప్రదాయమైన అస్సామీ పట్టు, ముగా పట్టు దుస్తులు ధరిస్తారు. బిహూ పాటలకు అనుగుణంగా బిహూ నృత్యాన్ని చేస్తారు. బిహూ పాటలు అస్సామీ కొత్త సంవత్సరాన్ని అహ్వనించడం దగ్గర నుంచి రైతు జీవన శైలిని వర్ణించే వరకు వివిధమైన అంశాలను వివరిస్తాయి. బొహాగ్ బిహు వసంత ఋతువులో వచ్చే బిహు సమయంలో ఈ నాట్యన్నిచేస్తారు, హుసొరీ నాట్య కారుల గుంపు ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి నాట్యం చేసి, తరువాత ఇంటిల్లి పాదికి ఆశీర్వాదాలు ఇస్తారు. ఆ తర్వాత ఇంటిల్లి పాది హుసోరీ కి నమస్కారం చేసి దక్షిణ ఇస్తారు, దక్షిణలో ఒక గమొసా, పచ్చి ...