Топ-100
Back

ⓘ పురస్కారాలు ..
                                               

1932 కమ్యూనల్ అవార్డు

1932 కమ్యూనల్ అవార్డు 16 ఆగస్టు 1932న బ్రిటీష్ ప్రధానమంత్రి రామ్సే మెక్ డొనాల్డ్ బ్రిటీష్ ఇండియాలో ఉన్నత కులాలు, నిమ్నకులాలు, ముస్లింలు, బౌద్ధులు, సిక్ఖులు, భారతీయ క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లు, దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు, ఎలక్టోరేట్లు ఏర్పరుస్తూ ప్రకటించారు. దీనిలో దామాషాను కూడా ఒక ప్రాతిపదికగా స్వీకరించారు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం విఫలమయ్యాకా బ్రిటీష్ ప్రభుత్వం దీన్ని రూపొందించింది. ప్రభుత్వం దీన్ని భారతదేశంలోని సమస్యలను తీర్చే చర్యగా పేర్కొనగా, జాతీయవాదులు, కాంగ్రెస్ వారు దీన్ని భారతీయులను విభజించే కుట్రగా ఖండించారు. ప్రధానంగా మహాత్మా గాంధీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకి ...

                                               

63వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

63వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2015లో విడుదలైన ఉత్తమ భారతీయ చిత్రాలను గౌరవించేందుకు భారత డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వార్షిక భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రదానం చేసే రానున్నవేడుక. 2016 మార్చి 28న పురస్కారాలు ప్రకటించగా, 2016 మే 3న వేడుకలు జరుగుతాయి.

                                               

65వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు భారతదేశంలో ప్రతిష్ఠాత్మకగా భావించే సినిమా అవార్డులు. ఇవి భారత ప్రభుత్వంచే ఏడాదికి ఒకసారి ప్రకటించబడి రాష్ట్రపతి చేతులమీదగా గ్రహీతలకు అందజేయబడతాయి. ముందటి సంవత్సరము దేశంలో విడుదలైన అన్ని భాషల చిత్రాలను ప్రత్యేక జ్యూరీ పరిశీలించి ముఖ్య విభాగాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు. అంతేకాకుండా వివిధ భాషలలోని ఉత్తమమైన చిత్రాలను కూడా ఎంపిక చేస్తారు. 2017 సంవత్సరపు 65వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలను 2018, ఏప్రిల్ 13న ప్రకటించారు. విజేతలకు మే 3న న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బహుమతుల ప్రదానం చేశారు.

                                               

ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర పురస్కారం

ఇందిరా ప్రియదర్శిని వృక్ష మిత్రా పురస్కారాలు లేదా ఐపివిఎం అవార్డులను భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అటవీ నిర్మూలన బంజర భూముల అభివృద్ధి రంగంలో మార్గదర్శక ఆదర్శప్రాయమైన కృషి చేసిన వ్యక్తులు సంస్థలకు ఇస్తుంది. ఏడు విభాగాలలోని వ్యక్తులు/సంస్థలకు రెండు లక్షల యాభై వేల నగదు పురస్కారం అందజేస్తారు. ఇది 1986 లో స్థాపించబడింది ఏటా ఇవ్వబడింది. ప్రారంభంలో ఐపివిఎం అవార్డులు 2006 వరకు పన్నెండు విభాగాలలో ఇవ్వబడ్డాయి. కాని 2012 పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఏడు వర్గాలు ఐపివిఎం అవార్డులకు ఆమోదించబడ్డాయి.

                                               

ఐఫా ఉత్సవం

ఐఫా ఉత్సవం ప్రతి సంవత్సరం దక్షిణ భరతదేశం చలనచిత్ర పరిశ్రమలో కృషి చేసిన వ్యక్తులకు, చిత్ర బృందాలకు పురస్కారాలు ఇస్తుంది. ఈ ఉత్సవాలు అంతర్జాతీయ విజ్ క్రాఫ్ట్ సమస్త నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాలు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు పురస్కారాలు ప్రధానం చేస్తుంది. 2016 లో ఈ వేడుకలు ప్రారంభించబడ్డాయి, 2015 నాటికి దక్షిణ భారత వరదలు ఈ కార్యక్రమాన్ని ఆలస్యం చేశాయి. ఈ రెండు వేర్వేరు రోజులలో వేర్వేరు విభాగాలలో అవార్డులు లభించాయి. మొదటి రోజున తమిళ్, మలయాళ పరిశ్రమ పరిశ్రమల నుండి వచ్చిన మంచి దక్షిణ భారత చిత్ర కళాకారులు గౌరవించారు, అదే సమయంలో తెలుగు, కన్నడ చలన చిత్ర పరిశ్రమల కళాకారులు & సాంకేతిక ని ...

                                               

కందుకూరి పురస్కారం - 2017

రంగస్థలంలో కొన్నేళ్లుగా మంచి ప్రతిభ కనబరుస్తూ నాటకరంగ అభివృద్ధికి కృషిచేసిన వారిని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయా నాటకరంగ కళాకారులకు కందుకూరి వీరేశలింగం పేరు మీదుగా విశిష్ట పురస్కారం అందజేస్తుంది. 2018 సంవత్సరానికిగానూ రాష్ట్రస్థాయిలో ముగ్గురిని, జిల్లాస్థాయిలో జిల్లాకు ఐదుమంది కళాకారుల చొప్పున 13 జిల్లాలకు 65 మందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రస్థాయి పురస్కారానికి రూ. లక్ష రూపాయల నగుదు బహుమతి, ప్రశంసాపత్రం. జిల్లాస్థాయి పురస్కారానికి రూ. 10వేల నగుదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేయడం జరిగింది. వారికి 2017 ఏప్రిల్ 30న రాజమండ్రి లోని ఆనం కళాకేంద్రంలో కోడెల ...

                                               

కళా ప్రపూర్ణ

కళా ప్రపూర్ణ ఒక బిరుదు లేదా పురస్కారం. ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా సాహిత్య సాంస్కృతిక విషయాలలో విశేషమైన కృషి చేసిన వారికి ప్రదానం చేసే గౌరవ డాక్టరేట్.

                                               

కళారత్న పురస్కారాలు - 2015

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాదినాడు వివిధ కళలలో అత్యుత్తమ కృషి చేసిన వారికి అందించే కళారత్న పురస్కారం. 2015 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 32 మందికి పురస్కారాన్ని అందించింది.

                                               

కీర్తి పురస్కారం

శ్రీరాములు పొట్టి తెలుగు విశ్వవిద్యాలయం వారు వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారికి కొన్ని పురస్కారాలిచ్చి, వారి ప్రతిభను గుర్తిస్తుంది. దీనిలో భాగమే కీర్తి పురస్కారం. దీన్ని ఇంతకు ముందు వివిధ వ్యక్తులు తమ పేర్లతో పురస్కారాలను ప్రకటించమని, వారి పేర్లతో ‘స్మారక పురస్కారం’ గా ఇచ్చేవారు. దాన్ని తర్వాత కాలంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆ యా వ్యక్తలు పేర్లతోనే పురస్కారాన్ని ఇస్తూ, వాటికి కీర్తి పురస్కారంగా నామకరణం చేశారు.

                                               

జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతి

ఆంధ్రవిశ్వకళాపరిషత్ వారు ప్రతియేడాదీ బి.ఏ. స్పెషల్ తెలుగులో విశ్వవిద్యాలయంలో, దీనికి అనుబంధంగా ఉన్న అన్ని కళాశాలల్లోను ఒకేసారి ఉత్తీర్ణులైన విద్యార్ధులకు కళాప్రపూర్ణ జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతినిస్తారు.

                                               

పద్మ పురస్కార గ్రహీతల జాబితా - 2020

పద్మ పురస్కారం భారతదేశ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం. 2020వ సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన 141 మందికి 2020, జనవరి 26న పద్మ పురస్కారాలు అందజేయడం జరిగింది.

                                               

పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (2020-2029)

Official website "Awards & Medals". Ministry of Home Affairs India. 14 September 2015. Archived from the original on 7 October 2015. Retrieved 2020-09-06.

                                               

మూర్తిదేవి పురస్కారం

మూర్తిదేవి పురస్కారం సంవత్సరానికొకసారి భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ వారు ఇచ్చే పురస్కారం. ఇది సాహిత్యం ద్వారా భారతీయ తాత్వికతను, సంస్కృతిని పెంపొందించే రచనలకు ఇస్తారు. 2003 నుండి ఈ పురస్కారంలో భాగంగా ఒక లక్ష రూపాయల నగదు, ప్రమాణ పత్రం, సరస్వతీ దేవి విగ్రహం ఇంకా శాలువా అందిస్తున్నారు. 2011 నుండి నగదు బహుమానాన్ని రెండు లక్షలకి పెంచారు, 2013 లో ఈ బహుమతిని నాలుగు లక్షలు చేసారు.

సంగీత కళానిధి
                                               

సంగీత కళానిధి

సంగీత కళానిధి మద్రాసు సంగీత అకాడమీ ప్రతి సంవత్సరం ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులకు ఇచ్చే గౌరవ పురస్కారం. ఇది కర్ణాటక సంగీత విద్వాంసులకు ఇచ్చే ఒక అత్యున్నత పురస్కారం.

                                               

సర్

సర్ బ్రిటిష్ ప్రభుత్వం వారు ఇచ్చిన బిరుదు. ఆ కాలంలో ఈ బిరుదుపొందిన వారు తన పేరు ముందు "సర్" అని చేర్చుకొనేవారు. ఎందుకంటే ఇది ఒక ఉన్నతశ్రేణికి చెందినవారని గుర్తింపునిస్తుంది. ఆధునిక కాలంలో ఇది కొందరు పెద్దవారిని సంబోధించడానికి ఉపయోగించే గౌరవప్రథమైన పదంగా ప్రాచుర్యం పొంది ఆంగ్ల భాషలో భాగమైనది. ఉదా: డియర్ సర్. దీనికి స్త్రీలను సంబోధించే సమానమైన పదము మేడమ్.

సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారం
                                               

సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారం

సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, తన తండ్రి సుద్దాల హనుమంతు, తన తల్లి జానకమ్మల జ్ఞాపకార్థం సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారం 2010, అక్టోబరు 13న ప్రాంరంభమైంది.