Топ-100
Back

ⓘ తెలుగు సంస్కృతి ..
                                               

గంగపండగ

గంగ పండగ చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున జరిగే పండగల్లో ఒకటి. ఈ పండగకు మూలం ప్రతి ఏట తిరుపతిలో అత్యంత వైభవంగా జరిగే గంగ జాతరే. ఈ జాతరకు పెద్ద చరిత్ర, ఆచారము, ఉన్నాయి. కాని జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో జరిగే గంగ పండగను జరుపుకుంటారు.

                                               

జాతర

హిందూ సంప్రదాయములో దేవతలను, దేవుళ్లను, పుణ్య స్త్రీలను, మహిమగల స్త్రీ, పురుషలను పూజించడం అనాదిగా వస్తూవుంది. ఏదైనా ఒక దేవతను గాని, దేవుని గాని కొన్ని నిర్ధిష్టమైన రోజులలో పూజించి పండగ చేయడాన్ని జాతర అంటారు. జాతర ని యాత్ర అని కూడా అంటారు. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామదేవత ఉన్మన భారతదేశములో లెక్కలేనన్ని జాతరలు జరుగుతూ ఉంటాయి.

                                               

తెలంగాణ జాతరలు

తెలంగాణ రాష్ట్రం లోని జాతరలన్ని జానపదుల జీవన విధానానికి, విశ్వాసాలకు, ధార్మిక జీవనానికి అద్దం పడుతాయి. తెలంగాణలోని పల్లెపల్లెలో జాతరలు జరుగుతుంటాయ. వాటిలో కొన్ని మాత్రమే ప్రముఖంగా కనిపిస్తాయి.

                                               

తెలుగుదనం

తెలుగువారి అచ్చతెలుగుదనం తెలుగు వారి వంటకాల్లోనే ఉట్టిపడుతూ ఉంటుంది. మనవంటకాల్లోనే మనప్రత్యేకత ఉందన్న విషయం దృఢంగా తెలియాలంటే తెలుగు వారి తినుబండారాలు తినడం చేతనవాలి. తెలుగు వారు గర్వించదగ్గ వంటకాలు ఏవని అడిగితే ఎవరైనా ఇడ్లీ, మసాలాదోసె వంటి అనేక వంటకాల పేర్లు చెబుతారు. కానీ తెలుగువారిని గుర్తించే వంటకం "దిబ్బరొట్టె". ఇప్పుడు ఈ దిబ్బరొట్టెని కొన్ని మార్పులు చేసి "ఊతప్పం" గా దక్షిణాదివారు మార్చారు. ఇప్పుడు తెలుగువాళ్ళకి ఊతప్పమే తెలుసు గానీ దిబ్బరొట్టె తెలియకుండా పోయింది. పెసరట్టు తెలుగు వాడి తినుబండారం. పెసరట్టులోనే తెలుగుదనం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. తెలుగు వాడు తప్ప మరొకడు వండలేనిది పెసర ...

                                               

సంక్రాంతి వంటలు

సంక్రాంతి పండుగ అనగానే గుర్తొచ్చేది కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, గొబ్బెమ్మలు. వీటితో పాటు ప్రధానంగా ప్రతి ఇంటా ఘుమఘుమలాడే పిండివంటలు. సంప్రదాయ పిండివంటలు నోరూరిస్తూ సంక్రాంతి ప్రత్యేకతను తెలియజేస్తుంటాయి. పూర్వీకులు నిర్ణయించిన సంప్రదాయక వంటలే అయినప్పటికీ వాటిలో పోషకాలు అత్యధికమని వైద్యనిపుణుల అభిప్రాయము. సంక్రాంతి పండగ శీతాకాలంలో వచ్చే అతి పెద్దపండగ. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ఇంటికి తెచ్చి పురులు కట్టుకుని రైతులు నిల్వ చేసుకుంటారు. శీతాకాలంలో తీసుకునే ఆహారమే అత్యధిక శక్తిని అందిస్తూ మనిషికి ఏడాదిపాటు శక్తిని ఇచ్చేందుకు సహకరిస్తుంది. అందుకే కొత్త బియ్యంతో చేసిన రకరకాల పిండివంటల ...

                                               

పూర్ణకుంభం

పూర్ణ కుంభం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నము. ఈ కుంభం లేదా కలశము అనేది సాధారణంగా నీటితో నింపబడిఉండి, పైభాగాన టెంకాయ ను కలిగి, చుట్టూ మామిడాకులచే అలంకరింపబడి వుంటుంది.

                                               

సమ్మక్క సారక్క జాతర

సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరు అవుతారని అంచనా. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా ...