Топ-100
Back

ⓘ శాస్త్రవేత్త. ఒక క్రమ విధానంలో విజ్ఞానాన్ని అర్జించే కృషి చేసే వ్యక్తిని శాస్త్రవేత్త లేదా శాస్త్రజ్ఞుడు అని విస్తారమైన అర్ధంలో అనవచ్చును. లేదా వివిధ తాత్వికతలల ..




శాస్త్రవేత్త
                                     

ⓘ శాస్త్రవేత్త

ఒక క్రమ విధానంలో విజ్ఞానాన్ని అర్జించే కృషి చేసే వ్యక్తిని శాస్త్రవేత్త లేదా శాస్త్రజ్ఞుడు అని విస్తారమైన అర్ధంలో అనవచ్చును. లేదా వివిధ తాత్వికతలలో ఏదో ఒక విధానంతో గట్టి అనుబంధం ఉన్న వ్యక్తి కూడా శాస్త్రవేత్త అవుతాడు. కాని, సాధారణ పరిమిత వినియోగంలో శాస్త్రీయ విధానం అనుసరించి ఒక విషయాన్ని అధ్యయనం చేసే వ్యక్తి శాస్త్రవేత్త. అలాంటి వ్యక్తి ఏదో ఒక శాస్త్రంలో నిష్ణాతుడు అయి ఉండే అవకాశం ఉంది.

ఇది వరకు పాశ్చాత్య దేశాలలో "natural philosophers", "men of science" అనే పదాలను సుమారు ఒకే అర్ధంలో వాడేవారు.; వీరు విజ్ఞానం knowledgeతో అనుబంధం కలిగిన వ్యక్తులు. 1833లో William Whewell అనే వ్యక్తి "సైంటిస్ట్" scientist అనే పదాన్ని "ప్రకృతికి చెందిన జ్ఞానంలో నిష్ణాతులు" అనే అర్ధంలో వాడాడు. 20వ శతాబ్దంలో ఈ పదం సర్వసాధారణమైంది. 20వ శతాబ్దానికే శాస్త్రీయ విధానము, దృక్పధము, సంస్థలు విస్తరించడం వలన "శాస్త్రజ్ఞులు" సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపును పొందారు.

మానవ జీవితాన్ని ఆదిమ కాలంనుండి విజ్ఞానం Science, సాంకేతికత technology ఎంతో ప్రభావితం చేశాయి. నాగరికతలో ఈ రెండు విషయాల అభివృద్ధిలోను శాస్త్రవేత్తలు ముఖ్యమైన పాత్ర కలిగిఉన్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలలో రెండు ప్రధాన విభాగాలు గుర్తింపబడుతున్నాయి. 1 సైద్ధాంతిక శాస్త్రజ్ఞులు - వీరు లభించిన సమాచారాన్ని బట్టి కారణాలను తెలియజెబుతారు. వాటి ఆధారంగా తెలియని విషయాలను ఊహిస్తారు. 2 ప్రయోగ శాస్త్రజ్ఞులు - వీరు నమూనాల ద్వారా గాని, ఇతర విధానాల ద్వారా గాని, పరిశీలనల ద్వారా గాని కొలతలు లెక్కించి వాస్తవంగా ఏమి జరుగుతున్నదో నిర్ధారిస్తారు. అయితే ఈ రెండు రకాల శాస్త్రవేత్తలు రెండు వేరు వేరు సమూహాలు కావు. చాలా మంది అవీ ఇవీ కూడా చేస్తుంటారు. గణితం కూడా విజ్ఞానంతోనే పరిగణించడం జరుగుతుంది. గణితజ్ఞులు కూడా ఇతర శాస్త్రజ్ఞులలలాగానే సిద్ధాంతాలు చేస్తారు. ప్రయోగాలు జరుపుతారు.

శాస్త్రజ్ఞులు అనేక కారణాల వలన తమ రంగాలను ఎంచుకోవడం, ఆ రంగానికి చెందిన పనిలో నిమజ్ఞులు కావడం జరుగుతుంటుంది. చాలా మందికి "విజ్ఞానం" సముపార్జించడమే తెలుసుకోవడమే ధ్యేయం. ప్రకృతిలో జరిగే విషయాలు, వాటికి కారణాలు, వాటి ఫలితాలు ఇవి శాస్త్రజ్ఞులకు చాలా ఆసక్తి కలిగించే విషయాలు. ఇవే కాకుండా సమాజంలో లభించే గౌరవం, సాటి శాస్త్రజ్ఞులలో లభించే గుర్తింపు, తము కనుగొన్న విషయాలను సమాజ శ్రేయస్సు కోసం వినియోగించడంలో ఉండే ఆనందం కూడా వారికి ప్రోత్సాహకాలుగా పని చేస్తాయి. ధనార్జన కోసం శాస్త్రీయ పరిశోధనా రంగాన్ని ఎన్నుకోవడం పెద్దగా జరుగదు.

                                     

1. బయటి లింకులు

  • Alison Gopnik, "Finding Our Inner Scientist", Daedalus, Winter 2004.
  • Arthur Jack Meadows. The Victorian Scientist: The Growth of a Profession, 2004. ISBN 0-7123-0894-6.
  • For best results, add a little inspiration - The Telegraph about What Inspired You?, a survey of key thinkers in science, technology and medicine
  • Peer Review Journal Science on amateur scientists
  • Thomas Kuhn, The Structure of Scientific Revolutions, 1962.
  • Who was the greatest scientist ever? - Sapmura.com
  • World Social Forum Sciences et dDémocratie
  • The philosophy of the inductive sciences, founded upon their history 1847- Complete Text