Топ-100
Back

ⓘ దేశాల జాబితా – భవిష్యత్తు తలసరి జిడిపి పిపిపి, అంచనాలు. ప్రపంచ దేశాల భవిష్యత్తు పిపిపి జిడిపి అంచనాలు ఈ జాబితాలో ఇవ్వబడ్డాయి. - List of countries by future GDP ..




                                     

ⓘ దేశాల జాబితా – భవిష్యత్తు తలసరి జిడిపి(పిపిపి) అంచనాలు

ప్రపంచ దేశాల భవిష్యత్తు పిపిపి జిడిపి అంచనాలు ఈ జాబితాలో ఇవ్వబడ్డాయి. - List of countries by future GDP per capita estimates -

స్థూల దేశీయ ఆదాయం జిడిపి లేదా GDP అంటే - ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల, సేవల విలువ. ఇది రెండి విధాలుగా గణించ బడుతుంది - నామినల్ విధానం, కొనుగోలు శక్తి సమతులన ఆధారం పిపిపి - purchasing power parity PPP. ఇక్కడ పిపిపి విధానంలో డాలర్ విలువలో తలసరి జిడిపి లెక్కించబడింది. పిపిపి విధానంలో ఆ దేశంలోని ప్రజల స్థితిగతులకు సంబంధించిన సూచికలు మరింత స్పష్టంగా తెలుస్తాయి. కాని పిపిపి విధానంలో జిడిపి లెక్కించే విషయంలో వివిధ అంచనాలకు ఆస్కారం ఎక్కువ. అదే నామినల్ విధానంలో అయితే అంచనాల ప్రభావం తక్కువ అవుతుంది, అంతే గాకుండా అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాలలో ఆ దేశం బలం మరింత స్పష్టంగా సూచించబడుతుంది.

ఇవి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సెప్టెంబరు 2006 అంచనాల ఆధారంగా లెక్కించబడినవి.

ఈ జాబితాలో 2006, 2007, 2008, 2009 సంవత్సరాలకు 171 ఐ.రా.స. సభ్య దేశాలు, తైవాన్, హాంగ్‌కాంగ్, నెదర్లాండ్స్ యాంటిలిస్ లకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వివరాల ఆధారంగా ర్యాంకులు ఇవ్వడమైనది. ఇరాక్, ఉత్తర కొరియా, సోమాలియా, అండొర్రా, శాన్ మారినో నగరం, మొనాకో, లైకెస్టీన్, మైక్రొనీషియా, పలావు, మార్షల్ దీవులు, నౌరూ, తువాలు, పోర్టోరికో, మకావొ లకు సరైన వివరాలు లభించనందున అవి ఈ జాబితాలో చేర్చబడలేదు.

అన్ని విలువలూ అంతర్జాతీయ డాలర్లలో ఇవ్వబడ్డాయి.