Топ-100
Back

ⓘ లినక్సు ఏకీకరణ. లినక్సు అనేది కెర్నలు పేరు, లేదా ఇంకా చెప్పాలంటే ఒక ఆపరేటింగు సిస్టము పేరు, కానీ లినక్సులో చాలా రకాలు ఉన్నాయి, వీటిని పంపిణీ సంస్థలు నియంత్రిస్త ..




                                               

లినక్స్

లినక్స్ కెర్నల్ గురించిన సమాచారం కోసం లినక్సు కెర్నలు చూడండి. లినక్స్ ఒక కంప్యూటరు ఆపరేటింగు సిస్టము మరియూ దీని కెర్నల్ ఉచిత సాఫ్ట్వేరు నకు, ఓపెన్​సోర్సు సాఫ్ట్​వేరు నకు ప్రసిద్ధిగాంచిన ఒక ఉదాహరణ. మైక్రోసాఫ్ట్ విండోసు ఆపరేటింగు సిస్టము లేదా మ్యాక్ / మెకింటొష్ ఆపరేటింగ్ సిస్టముల వలే కాకుండా లినక్స్ సోర్సు కోడు ప్రజలకు బాహాటంగా లభించడమే కాక ఉచితంగా కూడా లభిస్తుంది. ఆసక్తి ఉన్నవారు దీనిని ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు చేయవచ్చు, తిరిగి పంచిపెట్టవచ్చు. లినక్స్ నిజానికి దాని కెర్నల్ యొక్క పేరు, కానీ సామాన్యంగా యునిక్స్ వంటి ఆపరేటింగు సిస్టము అయిన లినక్స్ ఆపరేటింగు సిస్టమును మొత్ ...

                                     

ⓘ లినక్సు ఏకీకరణ

లినక్సు అనేది కెర్నలు పేరు, లేదా ఇంకా చెప్పాలంటే ఒక ఆపరేటింగు సిస్టము పేరు, కానీ లినక్సులో చాలా రకాలు ఉన్నాయి, వీటిని పంపిణీ సంస్థలు నియంత్రిస్తుంటాయి. కొంతమంది ఇన్ని పంపిణీ వ్యవస్థలు అనవసరము అని వాదిస్తుంటారు, అదే సమయంలో మరి కొందరు మాత్రం ఇవి లినక్సు పెరుగుదలకు చాలా అవసరము అని వాదిస్తుంటారు. ఈ దిగువ ఈ రెండు వాదనలు పరిశీలించడం జరిగింది.

                                     

1. లినక్సు ఏకీకరణ వాదనలు

  • ఇన్ని పంపిణీసంస్థలు ఉండటం వల్ల లినక్సు సమాజం విభజనకు గురియవుతుంది.
  • అన్ని పంపిణీలు ఒకే పనిని మరలా మరలా చేస్తున్నాయి. ఇది చక్రాన్ని మరలా కనుగొనడం లాంటిది!
  • మాక్ లేదా విండోసు లా కాకుండా లినక్సు ఎన్నో రకాలుగా ఉన్నది, ఇది వినియోగదారులకు చాలా అయోమయంగా, తికమకగా ఉంది.
                                     

2. లినక్సు ఏకీకరణ వ్యతిరేఖ వాదనలు

  • పంపిణీ వ్యవస్థలులో కెర్నలు నిర్మాణపు సంఖ్యలు వివిధ రకాలు వాడుకలో ఉన్నాయి
  • పంపిణీ వ్యవస్థలు చిన్న చిన్న లినక్సు సమాజాలు ఏర్పాటు చేసి తద్వారా వ్యక్తులు చాలా చక్కగా తమను తాము గుర్తించుకుంటారు
  • పంపిణీ వ్యవస్థలు ఉండుటం వల్ల వినియోగదారుల ప్రాధాన్యతలకు లాభం కలుగుతుంది