Топ-100
Back

ⓘ ప్రపంచం ..
                                               

అమెరికాస్

అమెరికాస్ లేదా అమెరికా అంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా కలిసిఉన్న భూభాగం. ఇది భూమి పశ్చిమార్ధ గోళంలో సింహభాగాన్ని ఆక్రమిస్తుంది. దీన్నే కొత్త ప్రపంచం అని కూడా పిలుస్తారు. అమెరికాస్ లో ఉన్న దీవులను కూడా కలుపుకుంటే భూమి మొత్తం ఉపరితలంలో 8 శాతాన్ని, నేల భాగంలో 28.4 శాతాన్ని ఆక్రమిస్తుంది. దీని స్థలాకృతిలో పశ్చిమ తీరం వెంబడి పొడవైన పర్వతాల శ్రేణి, తూర్పు వైపు అమెజాన్ నది, సెయింట్ లారెన్స్ నది, పెద్ద పెద్ద సరస్సుల, మిస్సిస్సిపి, లా ప్లేటా నదుల పరీవాహక ప్రాంతాలు ఉన్నాయి. అమెరికా ఉత్తరం నుంచి దక్షిణం దాకా 14000 కి.మీ విస్తరించి ఉన్నందున ఇక్కడి వాతావరణం, జీవావరణం వివిధ ప్రాంతాల్లో వైవిధ్యభరితంగా ...

                                               

ఐరోపా

సాంప్రదాయకంగా ఏడు ఖండాలు అని చెప్పుకొనేవాటిలో ఐరోపా ఒకటి. యురేషియా భూఖండము యొక్క పశ్చిమాత్య ద్వీపకల్పము. ఐరోపాకు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రము, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రము, దక్షిణాన మధ్యధరా సముద్రము, ఆగ్నేయాన కాకసస్ పర్వతాలు, నల్ల సముద్రం, నల్లసముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలుపుతున్న కాలువలు సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పు దిశన ఐరోపా, ఆసియా ఖండాలకు సరిహద్దులుగా ఉరల్ పర్వతాలు, ఉరల్ నది, కాస్పియన్ సముద్రం ఉన్నాయి. విస్తీర్ణాన్ని బట్టి ఐరోపా, 10.180.000 చదరపు కిలోమీటర్లు వైశాల్యముతో ప్రపంచములో రెండవ చిన్న ఖండము. ఇది 2% భూమి వైశాల్యము కలిగి ఉంది. ఐరోపా ఖండంలో దాదాపు 50 దాకా సర్వసత్తాక దేశా ...

                                               

కొత్త ప్రపంచం

భూమి పశ్చిమార్ధగోళంలోని ప్రాంతాన్ని, ప్రత్యేకించి ఉత్తర దక్షిణ అమెరికాలు, ఓషియానియానూ కలిపి కొత్త ప్రపంచం అని అంటారు. ఆఫ్రికా, ఐరోపా, ఆసియాలే ప్రపంచమని భావించిన పాత ప్రపంచపు జియోగ్రాఫర్ల సాంప్రదాయిక భౌగోళిక శాస్త్రవేత్తల పరిధిని విస్తరిస్తూ 16 వ శతాబ్దం ప్రారంభంలో కొత్త భూమిని కనుగొన్నారు. అప్పుడు దీన్ని కొత్త ప్రపంచం అని అన్నారు. తరువాత అమెరికా అని పిలిచారు. ఇటాలియన్ అన్వేషకుడు అమెరిగో వెస్పుచి ప్రచురించాడని భావిస్తున్న ముండస్ నోవస్ అనే కరపత్రం వెలువడిన తరువాత ఈ పదానికి ప్రాముఖ్యత లభించింది. అమెరికాలను "ప్రపంచంలోని నాల్గవ భాగం" అని కూడా పిలుస్తారు.

                                               

జీలాండియా

జీలాండియా శాస్త్రవేత్తలు పసిఫిక్ మహాసముద్రంలో న్యూజీలాండ్ కింది భాగంలో భారత ఉపఖండం పరిమాణంలో ఓ కొత్త ఖండాన్ని గుర్తించారు. 49 లక్షల కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ ఖండం ‘జీలాండియా’ కొత్త ఖండం ఎనిమిదవ ఖండం భూమిపై ఏడు ఖండాలు ఉన్నాయి ఇకపై ఆ సంఖ్య ఎనిమిది రూపాంతరం చెందుచున్నది అంటున్నారు శాస్త్రవేత్తలు.

                                               

దేశాల జాబితా - ఖండాల ప్రకారం

దేశాల జాబితా - ఖండాల ప్రకారం: ఇది ప్రపంచంలోని ఖండాల వారీగా వివిధ దేశాల జాబితా. ప్రతి దేశానికీ ఆ దేశం జాతీయ పతాకం, ఆదేశం పేరు, రాజధాని నగరం పేరు ఇవ్వబడ్డాయి. ఈ జాబితాలో చేర్చినవి. ఐ.రా.స. చేతా, చాలా మంది ఐ.రా.స. సభ్యుల చేతా గుర్తింపబడకపోయినా గాని చాలా దేశాలతో దాదాపు పూర్తి అంతర్జాతీయ సంబంధాలు కలిగి ఉన్నది. చైనా రిపబ్లిక్ తైవాన్. సభ్యులుగా కాకపోయినా గాని ఐ.రా.స. చేత గుర్తింపబడినవి.: వాటికన్ నగరం Vatican City. ఐక్య రాజ్య సమితిలో సభ్యులుగా ఉన్న దేశాలు. స్వాధిపత్య రాజ్యాలు Sovereign states-జాబితాలో స్వతంత్ర దేశాలు కానప్పటికీ చాలా ఐ.రా.స. సభ్య దేశాలచేత "స్వాధిపత్యానికి అర్హమైనవి" గా గుర్తింపబడిన ...

                                               

ముస్లిం బ్రదర్‌హుడ్

1928, మార్చిలో ఈజిప్ట్‌లోని ఇస్మాలియా అనే చోట రూపుదాల్చింది. పండితుడు, ఉపాధ్యాయుడు హసన్ అల్ బన్నా దీని స్థాపకుడు. సూయెజ్ కాలువ పనిలో ఉన్న ఆరుగురు శ్రామికులతో మొదలైన బ్రదర్‌హుడ్ ఎంతో వేగంగా విస్తరించి రెండో ప్రపంచయుద్ధం ముగిసేనాటికి రెండు లక్షల మంది సభ్యులను ఆకర్షించింది. 1948 నాటికి పలు దేశాలలో రెండువేల శాఖలతో, ఐదులక్షల మంది సభ్యులతో బలపడింది. బ్రదర్‌హుడ్ తన వ్యతిరేకులను నిర్మూలిస్తుందని మొదటి నుం చి ఆరోపణలు ఉన్నాయి. 1948 నాటి ఈజిప్ట్ అధ్యక్షుడు మహ్మద్ ఫాహిం అన్నూ క్రిషిపాషా హత్య వెనుక ఈ సంస్థ ప్రమేయం ఉం దని ఆరోపణలు ఉన్నాయి. ఆ సంవత్సరంలోనే ఇది నిషేధానికి గురైంది. ఈజిప్ట్ ప్రభుత్వంతో బ్రదర్ ...

ఉత్తర అమెరికా
                                               

ఉత్తర అమెరికా

ఉత్తర అమెరికా ఒక ఖండము, ఇది అమెరికాల ఉత్తరాన గలదు. ఇది దాదాపు మొత్తం పశ్చిమార్థగోళంలో గలదు. దీని తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం, ఉత్తరాన ఆర్క్‌టిక్ మహాసముద్రం, దక్షిణాన దక్షిణ అమెరికా గలవు. ఉత్తర అమెరికా 24, 709, 000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో సంపూర్ణ భూభాగంలో 4.8%, భూభాగంలోని నేలలో 16.5% ఆక్రమించుకుని ఆసియా, ఆఫ్రికాల తర్వాత మూడవ అతిపెద్ద ఖండముగా ఉంది. జనాభా లెక్కల రీత్యా ఆసియా, ఆఫ్రికా, ఐరోపాల తర్వాత నాలుగవ అతిపెద్ద ఖండముగా ఉంది.