Топ-100
Back

ⓘ దేశాల జాబితా – తలసరి నామినల్ జి.డి.పి. క్రమంలో. వివిధ దేశాలలో తలసరి నామినల్ స్థూల దేశీయ ఆదాయం - List of countries by GDP per capita - ఈ జాబితాలో ఇవ్వబడింది. ఒక ..




దేశాల జాబితా – తలసరి నామినల్ జి.డి.పి. క్రమంలో
                                     

ⓘ దేశాల జాబితా – తలసరి నామినల్ జి.డి.పి. క్రమంలో

వివిధ దేశాలలో తలసరి నామినల్ స్థూల దేశీయ ఆదాయం - List of countries by GDP per capita - ఈ జాబితాలో ఇవ్వబడింది. ఒక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తువులు, సేవల మొత్తం ను స్థూల దేశీయ ఆదాయం లేదా జిడిపి అంటారు. జిడిపి రెండు విధాలుగా లెక్కించబడుతుంది. ఒకటి "నామినల్" విధానం. రెండవది "కొనుగోలు శక్తి సమం చేసే విధానం". ఏ విధంలోనైనా మొత్తం దేశీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది.

ఈ జాబితాలో "నామినల్" విధానంలో, ఒక్కొక్కక వ్యక్తికి, మిలియన్ అమెరికన్ డాలర్లలో, ఈ వివరాలు ఇవ్వబడ్డాయి.

క్రింద ఇవ్వబడినవాటిలో మొదటి జాబితాలో అంతర్జాతీయ ద్రవ్య నిధి International Monetary Fundలో సభ్యులైన 181 దేశాలకు 2006 జిడిపి అంచనాలు ఇవ్వబడ్డాయి.

అయితే ఈ విధమైన జాబితాలో ఇచ్చిన లెక్కలు వివిధ దేశాలలోని జీవన వ్యయం cost of living ను పరిగణనలోకి తీసుకోవి. కనుక ఆ దేశపు కరెన్సీ విదేశీ మారక ద్రవ్యం విలువ మారినప్పుడల్లా ఆయా గణనలు పెద్దయెత్తున మారవచ్చును. కనుక ఆయా దేశాల ర్యాంకులు మారవచ్చును. కాని ఆ దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలలో ఏమంత మార్పులు ఉండకపోవచ్చును. ఈ జాబితాలోని గణాంకాలను ఉపయోగించేప్పుడు ఈ విషయాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి.

అయితే కొనుగోలు శక్తి సమతుల్యం చేసి purchasing power parity, PPP గణించే జిడిపిలో ఈ విధమైన జీవన వ్యయం హెచ్చుతగ్గులు పరిగణింపబడుతాయి. ఆ విధమైన వివరాలు వేరే జాబితాలో ఇవ్వబడ్డాయి. అయితే అటువంటి లెక్కలలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఒకదేశం యొక్క ఆర్థిక ఉత్పత్తుల విలువ సరిగా గణించబడదు. అంతే గాకుండా ఆ విధానంలో అంచనాల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఏమైనా ఒక దేశం ఆర్థిక స్థితిని అంచనా వేసేటపుడు రెండు విధాల గణాంకాలను పరిగణించవలసి ఉంటుంది.

క్రింద ఇవ్వబడిన జాబితాలో అంతర్జాతీయ ద్రవ్య నిధి International Monetary Fundలో సభ్యులైన 181 దేశాలకు 2006 జిడిపి అంచనాలు ఇవ్వబడ్డాయి.