Топ-100
Back

ⓘ దేశాల జాబితా – మిలిటరీ వ్యయం. వివిధ దేశాలలో మిలిటరీ వ్యయం ఈ జాబితాలో చూపబడింది. కొంత సమాచారం అమెరికా సంయుక్త రాష్ట్రాలు సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ వెలువరించి ..




దేశాల జాబితా – మిలిటరీ వ్యయం
                                     

ⓘ దేశాల జాబితా – మిలిటరీ వ్యయం

వివిధ దేశాలలో మిలిటరీ వ్యయం ఈ జాబితాలో చూపబడింది. కొంత సమాచారం అమెరికా సంయుక్త రాష్ట్రాలు సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ వెలువరించిన The World Factbook నుండి గ్రహించినది.

కొన్ని దేశాల సమాచారం ఆ పుస్తకంలో లేనందున ఆయా దేశాలను ఈ జాబితాలో ఉంచలేదు. కనుక మొత్తం ప్రపంచం మిలిటరీ వ్యయం ఇక్కడ ఇచ్చిన దానికంటే బాగా ఎక్కువ ఉండవచ్చును.

                                     

1. దేశాల వారీగా చార్టు

ఈ జాబితాలో ఉన్న సమాచారం ఆధారంగా పోలికలు చేయడంలో కొంత అనిశ్చితిని పరిగణించాలి. మిలిటరీ వివరాలు కొంతవరకు గోప్యంగా ఉంచబడుతాయి. అంతే గాకుండా కొన్ని ఖర్చులను ఒక దేశంలో మిలిటరీ వ్యయంగా లెక్కించ వచ్చును. మరో దేశంలో అవే ఖర్చులను వేరే వ్యయంగా పరిగణించవచ్చును.

                                     

2. స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ వారి వివరాలు

స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ Stockholm International Peace Research Institute వెలువరించిన గణాంకాల ప్రకారం 2005 సంవత్సరంలో అధికంగా మిలిటరీ వ్యయం చేసిన మొదటి 15 దేశాలు క్రింది జాబితాలో ఇవ్వబడ్డాయి. మిలిటరీ వ్యయాన్ని లెక్క గట్టడానికి ఈ జాబితాలోని వివరాలను పలు దేశాలు వినియోగిస్తాయి. 2005లో మొత్తం ప్రపంచంలో మిలిటరీ వ్యయం ఒక ట్రిలియన్ డాలర్లు. ఇందులో షుమారు సగభాగం అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఖర్చు పెట్టేదే.