Топ-100
Back

ⓘ ఇస్లాం ..
                                               

ఈమాన్

ఈమాన్ లేదా ఇమాణ్ ఇస్లామీయ ధార్మిక శాస్త్రము ప్రకారం, ఇస్లామీయ తాత్విక, ఆధ్యాత్మిక రంగంలో విశ్వాసుని విశ్వాసమే ఈ ఈమాన్. ఈమాన్ యొక్క సీదా సాదా విశదీకరణ; ఇస్లామీయ మూల ఆరు విశ్వాసాలపై విశ్వాసం ఉంచడం, వీటినే "అర్కాన్-అల్-ఈమాన్" అనీ అంటారు. వీటిని విశ్వసించని యెడల ముస్లిం సంపూర్ణ ముస్లిం కాలేడు. ఈమాన్ అనే పదము ఖురాన్, హదీసులలో క్షుణ్ణంగానూ, విపులంగానూ విశదీకరింపబడినది. మరీముఖ్యంగా ప్రఖ్యాత జిబ్రయీల్ హదీసు లో వివరించబడినది. ఖురాన్ ప్రకారము, ఈమాన్ అనునది సత్ప్రవర్తన, సద్గుణాలు, మంచి నడవడికలు కలిగి వుండవలెను. అపుడే మోమిన్ విశ్వాసి జన్నత్ స్వర్గం లో ప్రవేశింపబడతాడు. హదీస్ ఎ జిబ్రయీల్ లో, ఈమాన్ ఇస్లా ...

                                               

రంజాన్ (నెల)

రమజాన్‌ మాసం ఖుర్‌ఆన్‌ అవతరించిన మాసం. నిగ్రహం, భక్తి, ధర్మనిష్ట, పాపభీతి, పరామర్శించడం, దయ, కరుణ, ప్రేమానురాగాలు, ఉపకారం, మేలు కోరడం, మానవ సేవ, దైవమార్గంలో స్థిరంగా ఉండటం, ఐక్యత, ఉత్సాహం అల్లాహ్, మహాప్రవక్తస గారితో అత్యంత సాన్నిహిత్యాన్ని పెంపొందించుకునే మాసం.ఈ మాసంలో ఉపవాసాలు విధిగా చేయబడ్డాయి. బదర్‌ యుద్ధం ఈ నెలలోనే జరిగింది. షబె ఖదర్‌ను ఉంచబడిరది. మక్కా విజయ సంఘటన కూడా ఈ నెలలోనే జరిగింది. ఈ నెలలోని ప్రతి పది రోజులకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడిరది. ఇంకా ఈ నెలలో జకాత్‌, దానధర్మాలు, ఫిత్రాలతో ధాతృత్వం వెల్లివిరుస్తోంది. కావున పవిత్ర రమజాన్‌ నెల ప్రార్థనల ఔన్నత్యాన్ని ఎంతో పెంచబడినది. ర ...

                                               

హూద్ ప్రవక్త

హూద్), ఒక ఇస్లామీయ ప్రవక్త. ఇతడి గురించి వర్ణణ ఖురాన్ లోని 11వ సూరాలో ఉంది. ఈ సూరా పేరు హూద్, ఇతని పేరున ఉంది. హూద్ ప్రవక్త, నూహ్, ప్రవక్త పరంపరకు చెందినవాడు. బైబిల్లో ఇతని పేరు "ఎబేర్"

                                               

అల్ బర్దాహ్ షరీఫ్

క़సీదా అల్ బర్దా షరీఫ్ అబూ అబ్దుల్లా మొహమ్మద్ ఇబ్న్ సాద్ అల్బసిరి అనే ఈజిప్టు కవి రాసిన కవిత్వం. ఈ కవి అరబ్ ప్రపంచంలో ప్రజాదరణ పొందిన కవి. క़సీదా అల్ బర్దా షరీఫ్ అరబ్బీలో వ్రాయబడిన కవిత. ఈ కవితను మొహమ్మద్ ప్రవక్తని కీర్తిస్తూ వ్రాసారు. ఈ కవిత అసలు శీర్షిక అల్-కవాకిబ్ అద్-దుర్ర్యా ఫీ మధ్ ఖయ్ర్ అల్-బరీయా. ఇది సున్నీ మొహమ్మదీయులలో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న గీతం. కవి స్వప్న సాక్షాత్కారంలో మొహమ్మద్ ప్రవక్త కనిపించి కవికి ఉన్న పక్షవాతాన్ని నయం చేసి ఒక వస్త్రంతో శరీరాన్నంతా కప్పాడు. అందుకు కృతజ్ఞతగా కవి ఈ కవితను వ్రాస్తాడు.

                                               

తల్బినా

తల్బినా బార్లీ పిండికి పాలు, తేనె కలిపి చేసే అరబ్బీ వంటకం. ఇస్లామీయ సాంప్రదాయంలో మహమ్మద్ ప్రవక్తచే ప్రాముఖ్యం పొందింది. రోగి విచారాన్ని పోగొట్టే ఒక వంటకం. అయిషా బంధువుల్లో ఎవరైనా చనిపోతే స్త్రీలు చూడటానికి వచ్చితిరిగి ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయేవారు. ఆమె దగ్గరి బంధువులు,స్నేహితులు మాత్రమే ఉండిపోయేవారు.అప్పుడామె ఒక కుండడు తల్బినా వండించేవారు.గోధుమలు మాంసంతో తయారుచేసిన తరీద్ ను తల్బినా పై పోసేవారు."ఇక తినండి.తల్బినా రోగి విచారాన్ని పోగొడుతుంది మనసును ప్రశాంతపరుస్తుందని దైవప్రవక్త చెప్పేవారని అయిషా చెప్పారు. శవం దగ్గర రోదిస్తూ శోషిల్లిన వారు,రోగులూ తల్బినా తినాలని అయిషా చెప్పేవారు. తల్బినా రో ...

                                               

తెలుగు కురాన్

తెలుగులో ప్రచురించబడిన కురాన్ అనువాదాలు: చిలుకూరి నారాయణ రావు - కురాను షరీఫ్ - మద్రాసు - 1925 ముహమ్మద్ అజీజుర్రహ్మాన్, అంతిమదైవగ్రంధం ఖుర్ ఆన్ హైదరాబాదు- 2009 హమీదుల్లా షరీఫ్ - దివ్య ఖుర్ ఆన్ - హైదరాబాదు - 1985 డాక్టర్ అబ్దుల్ రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా, సౌదీ అరేబియా -2008 అబుల్ ఇర్ఫాన్ - ఖురాన్ భావామృతం - హైదరాబాదు - 2004 యస్.ఎం.మలిక్ - ఖుర్ ఆన్ అవగాహనం - హైదరాబాదు - 2007 ముహమ్మద్ అబ్దుల్ గఫూర్ - కురానె మజీద్ - కర్నూలు - 1948 అబ్దుల్ జలీల్, పవిత్ర ఖుర్ ఆన్, దారుల్ ఫుర్ ఖాన్, విజయవాడ.862 పేజీలు 2010 షేక్ ఇబ్రాహీం నాసిర్ - అహమ్మదియ్యా కురాన్ - హైదరాబాదు - 1980 ముహమ్మదు ఖాసిం ఖాన్ - ఖురాన్ ష ...

                                               

మరియమ్

మరియమ్ ఇమ్రాన్, హన్నా బిన్తె ఫాఖూజ్ అనే దావూద్ వంశ దంపతులకు పుట్టి బైతుల్ ముఖద్దస్ మస్జిద్ కి దైవ సేవకై అప్పగించబడిన పవిత్రురాలు. జకరియా ప్రవక్త ఆమెకు సంరక్షకుడిగా ఉండి అల్లాహ్ వాక్యాలను ఉపదేశించాడు. అగోచర విషయాలు మరియమ్ కు అల్లాహ్ తెలియజేసినట్లు ఖురాన్ లోని ఆలె ఇమ్రాన్:42-47 లో ఉంది. ఈమెకు స్వర్గ ఫలాలు కాలంకానికాలంలో కూడా ఆహారంగావచ్చాయి. దేవుని వాక్శక్తి ద్వారా గర్భవతియై ఈసా ప్రవక్తను కన్నది. ఈమె పేరుతో ఖురాన్ లో 19 వ సూరా ఉంది.

                                               

ముస్లిం

ముస్లిం, కొన్నిసార్లు మొస్లెం, అనీ పలుకుతారు.ముస్లిం అనగా ఇస్లాం మతాన్ని అవలంబించేవాడు. ఇస్లాం మతం ఏకేశ్వరోపాసన ను అవలంబించే ఇబ్రాహీం మతము ను ఆధారంగా చేసుకుని ఖురాన్ గ్రంధములో చెప్పబడినటువంటి విషయాలను పాటిస్తూ జీవనం సాగించేవారు. ఖురాన్ ను ముస్లిం అల్లాహ్ వాక్కుగా ఇస్లామీయ ప్రవక్త అయిన ముహమ్మద్ ప్రవక్తపై అవతరించిందిగా భావిస్తారు. అలాగే ముహమ్మద్ ప్రవక్త ప్రవచానాలైన హదీసులను సాంప్రదాయిక విషయాలుగాను, కార్యాచరణాలు గాను భావించి ఆచరిస్తారు. "ముస్లిం" అనునది ఒక అరబ్బీ పదజాలం, దీని అర్థం "తనకు అల్లాహ్ ను సమర్పించువాడు". స్త్రీ అయితే "ముస్లిమాహ్" గా పిలువబడుతుంది.