Топ-100
Back

ⓘ జాబితాలు ..




                                               

గ్రామ రెవిన్యూ అధికారి

పూర్వం ఆంధ్రప్రాంతంలో కరణం మునసబు, తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీలు వారి సొంత గ్రామాల్లోనే ఉండి పాలన నడిపేవారు. 1985లో ఈ విధానాన్ని తొలగించి గ్రామ సహాయకులను నియమించారు. తరువాత 1990 లో గ్రామ పాలనాధికారి వ్యవస్థను ప్రవేశపెట్టారు. తరువాత 2002 లో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనిచేసే పంచాయితీ సెక్రటరీల విధానం అమలులోకి వచ్చింది. గ్రామ పంచాయితీల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో 2007 ఆగస్టు నుంచి గ్రామ రెవిన్యూ అధికారుల వీఆర్వోల విధానం అమలులోకి వచ్చింది.వీరు తహసీల్దారు అజమాయిషీలో పని చేస్తారు.